
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ- రాధిక మర్చంట్ నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ముంబైలో గురువారం జరిగిన ఎంగేజ్‌మెంట్ ఫంక్షన్‌కు బాలీవుడ్ నుంచి దీపికా పదుకొణె, రణ్‌వీర్ సింగ్ పాల్గొన్నారు. తాజాగా ఈ వేడుకలో పాల్గొన్న బాలీవుడ్ జంట ధరించిన దుస్తులపై నెట్టింట చర్చ నడుస్తోంది. రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకొణె సంప్రదాయ దుస్తులు ధరించి హాజరు కాగా.. దీపికా చీరలో అద్భుతంగా కనిపించగా.. రణ్‌వీర్ షేర్వాణీ ధరించి తళుక్కున మెరిశారు.
దీపికా ధరించిన సిందూరి తాషి చీర దాదాపు రూ. 1.50 లక్షలుగా ధర ఉన్నట్లు తెలుస్తోంది. బంగారం, ఎరుపు కలయికతో రూపొందించిన ఈ చీరను షాలీనా నథాని అనే స్టైలిస్ట్ తయారు చేశారు. రణ్‌వీర్ సింగ్ షేర్వాణీ ధరించడంతో ఈ జంట మరింత ఆకర్షణగా నిలిచారు. ఈ వేడుకలో వీరితో పాటు సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్, సారా అలీ ఖాన్, వరుణ్ ధావన్, మనీష్ మల్హోత్రా, అర్జున్ కపూర్, బోనీ కపూర్, ఐశ్వర్య రాయ్, ఆరాధ్య, కత్రినా కైఫ్, జాన్వీ కపూర్, ఖుషి కపూర్, అనన్య పాండే సహా పలువురు బాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు.