కదిలిన హవాలా డొంక! | HDFC Complaint in Financial Intelligence Unit | Sakshi
Sakshi News home page

కదిలిన హవాలా డొంక!

Published Sat, Aug 12 2017 1:56 AM | Last Updated on Wed, Apr 3 2019 5:51 PM

కదిలిన హవాలా డొంక! - Sakshi

కదిలిన హవాలా డొంక!

‘బిల్‌ ఆఫ్‌ ఎంట్రీ’ ఆధారంగా దర్యాప్తు
- ఫైనాన్షియల్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌లో హెచ్‌డీఎఫ్‌సీ ఫిర్యాదు
రంగంలోకి దిగిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌
గత నెలలో ముగ్గురు నిందితుల అరెస్టు 
‘పీటీ వారెంట్‌’పై విచారించిన చందానగర్‌ పోలీసులు
నిందితుల వాంగ్మూలం ఆధారంగా మరో ఇద్దరి అరెస్టు
 
సాక్షి, హైదరాబాద్‌: ‘బిల్‌ ఆఫ్‌ ఎంట్రీ’తీగ లాగితే సిటీ కేంద్రంగా సాగుతున్న హవాలా వ్యాపారం డొంక కదిలింది. కరెంట్‌ ఖాతాల ద్వారా విదేశాలకు నగదు పంపిన వ్యాపారులు దీనిని దాఖలు చేయకపోవడంతో అనుమానం వచ్చిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు అధికారులు ఫైనాన్షియల్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌– ఇండియాలో ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా దర్యాప్తు చేపట్టిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ), చందానగర్‌ పోలీసులు మొత్తం ఐదు గురు నిందితులను అరెస్టు చేసినట్లు సైబరాబాద్‌ అధికారులు శుక్రవారం ప్రకటించారు.

వీరందరూ హైదరాబాద్‌కు చెందిన వ్యాపారులే కావడం గమనార్హం. చైనా, హాంకాంగ్‌ నుంచి నగరానికి భారీ స్థాయిలో సిగరెట్లు, ఎలక్ట్రానిక్‌ వస్తువులు దిగుమతి అవుతు న్నాయి. అయితే వ్యాపారులు సరుకు విలు వను సగానికి తగ్గించి రికార్డుల్లో చూపిస్తు న్నారు. ఈ మొత్తానికే పన్నులు చెల్లిస్తూ మిగిలిన మొత్తాన్ని బ్యాంకు ఖాతాల ద్వారానే హవాలా రూపంలో విదేశాల్లో ఉన్న సరఫరా దారులకు పంపుతున్నారు. ఇందుకు బోగస్‌ ఇన్వాయిస్‌లు, కరెంట్‌ ఖాతాలకు వినియో గిస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. 
 
విదేశాల్లో సూత్రధారి...
హాంకాంగ్‌లో ఉంటున్న వ్యాపారి పవన్‌ అగ ర్వాల్‌ ఈ దందాకు సూత్రధారిగా వ్యవహ రిస్తున్నాడు. నగరంలోని కిషన్‌గంజ్‌ ప్రాంతా నికి చెందిన కాస్మోటిక్స్‌ వ్యాపారి మహేం ద్రకుమార్‌ ఖత్రి అతడికి హవాలా ఏజెంట్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇతడికి పరిచయస్తులైన బీ పురోహిత్, జూరారాం పురోహిత్, బాబూ లాల్‌ హరిసింగ్‌ రాజ్‌ పురోహిత్‌లకు రుణాలు ఇప్పిస్తానంటూ వారి నుంచి గుర్తింపుకార్డులు, పాన్‌కార్డులు, ఓటర్‌ ఐడీలు తీసుకున్నాడు.

వీటి ఆధారంగా మహరాజ్‌గంజ్‌ చిరునామాతో శ్రీనివాస ట్రేడింగ్‌ కంపెనీ, జీఎస్‌ ట్రేడర్స్, కోఠి బ్యాంక్‌ స్ట్రీట్‌ చిరునామాతో వినాయక ఎంటర్‌ప్రైజెస్‌ పేరుతో బోగస్‌ ఖాతాలు తెరి చాడు. వైశ్యా బ్యాంకు ఉద్యోగి సీహెచ్‌ దుర్గా ప్రసాద్‌కు రూ.2 లక్షలు చెల్లించి ఈ మూడు సంస్థలకు సంబంధించిన ట్రేడ్‌ లైసెన్సులు తీసుకున్నాడు. అంబర్‌పేటకు చెందిన ధరణి సాయికిరణ్‌ సహకారంతో వివిధ చిరునా మాలతో బోగస్‌ రెంటల్‌ అగ్రిమెంట్లు, స్టాంపు పేపర్లు సేకరించి పని పూర్తి చేశాడు. ఈ ట్రేడ్‌ లైసెన్సుల ఆధారంగా ఖత్రి చందానగర్‌లోని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు బ్రాంచ్‌ను సంప్రదిం చాడు. రిలేషన్‌ షిప్‌ మేనేజర్‌ చక్రవరం రఘుపతిరాజుకు ఈ పత్రాలు దాఖలు చేసిన ఖత్రి.. మూడు కరెంట్‌ ఖాతాలు తెరిచాడు. ఈ వ్యవహారం మొత్తం 2014లోనే జరిగింది. 
 
సరుకు లేకపోవడంతో లేని ‘ఎంట్రీ’...
విదేశాల నుంచి దిగుమతి చేసుకునే సరుకును పరిశీలించే కస్టమ్స్‌ అధికారులు దాని విలువకు సరిపడా పన్ను విధించి వసూలు చేస్తారు. ఆపై ఈ బిల్‌ ఆఫ్‌ ఎంట్రీని వ్యాపారికి అందిస్తారు. అయితే ఖత్రి చేయించిన నగదు బదిలీలు హవాలా రూపంలో పంపిన డబ్బునకు సంబం ధించినవి కావడంతో దీనికి సంబంధించిన సరుకు రావడం, బిల్‌ ఆఫ్‌ ఎంట్రీ లభించడం అనేది ఉండదు. దీంతో నిర్ణీత సమయంలో బ్యాంకు అధికారులకు బిల్‌ ఆఫ్‌ ఎంట్రీలు దాఖలు కాలేదు. అప్రమత్తమైన బ్యాంకు అధి కారులు.. క్షేత్రస్థాయి పర్యటన చేయగా రికార్డు ల్లో ఉన్నవి బోగస్‌ చిరునామాలుగా తేలింది.
 
2015లోనే ఎస్‌టీఆర్‌ నమోదు...
ఈ తతంగం మొత్తం 2015లో జరిగింది. శ్రీనివాస ట్రేడింగ్‌ కంపెనీ, జీఎస్‌ ట్రేడర్స్, వినాయక ఎంటర్‌ప్రైజెస్‌ చేసిన విదేశీ లావా దేవీలను అనుమానం వ్యక్తం చేస్తూ హెచ్‌డీ ఎఫ్‌సీ అధికారులు ఫైనాన్షియల్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌ (ఎఫ్‌యూఐ)–ఇండియాను ఆశ్ర యించారు. 2015 నవంబర్‌ 4న ఎఫ్‌యూఐలో సస్పీషియస్‌ ట్రాన్సాక్షన్‌ రిపోర్ట్‌ (ఎస్‌టీఆర్‌) నమోదు చేశారు. ఈ లావాదేవీలన్నీ విదే శాలతో జరిగినవి కావడంతో ఇందులో మనీ ల్యాండరింగ్‌ ఉండి ఉంటుందని అనుమానిం చిన ఈడీ రంగంలోకి దిగింది. దర్యాప్తు చేప ట్టిన ఈడీ అధికారులు ప్రాథమిక ఆధారాలు సేకరించి ఈ ఏడాది జూన్‌ 23న ఖత్రి, వినోద్, ఆనంద్‌కుమార్‌ను అరెస్టు చేశారు.

మరోపక్క బోగస్‌ పత్రాలతో తమ శాఖలో బ్యాంకు ఖాతా లను తెరిచారంటూ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు మేనేజర్‌ కె.శైలజ.. చందానగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసు కున్న పోలీసులు అప్పటికే ఈడీ అరెస్టు చేసిన ముగ్గురినీ పీటీ వారెంట్‌పై తమ కేసులో అరెస్టు చేశారు. న్యాయస్థానం అనుమతితో వీరిని కస్టడీలోకి తీసుకుని విచారించిన తర్వాత ఈ నెల 1న దుర్గాప్రసాద్, సాయికిరణ్‌లను కటక టాల్లోకి పంపారు. ఈ వ్యవహారాన్ని సీరియ స్‌గా తీసుకున్న ఈడీ అధికారులు లోతుగా ఆరా తీస్తున్నారు. 
 
మరో ఇద్దరి సహకారంతో ‘బదిలీ’
బోగస్‌ కరెంట్‌ ఖాతాలు సిద్ధం చేసిన ఖత్రి వీటిలోకి ఆర్టీజీఎస్‌ ద్వారా నగదు బదిలీ చేయించడానికి వినోద్‌ ఓఝా, రాణిగం జ్‌కు చెందిన స్టీలు వ్యాపారి ఆనంద్‌ కుమార్‌ బిద్రకర్‌ను సంప్రదించాడు. తాను తెరిచిన బోగస్‌ ఖాతాల్లోకి నగదు బదిలీ చేసేందుకు వీరితో ఒప్పందం కుదుర్చుకు న్నాడు. వీరి సాయంతో ఖత్రి బోగస్‌ బ్యాంకు ఖాతాల ద్వారా 40 రోజుల్లో రూ.31.6 కోట్ల నగదును విదేశీ ఖాతాల్లోకి మళ్లిం చాడు. హాంగ్‌కాంగ్‌లో ఉన్న పవన్‌ అగ ర్వాల్‌ నుంచి ఎల్‌ఈడీ లైట్లు, ఇతర ఉప కరణాలు దిగుమతి చేసుకున్నట్లు నకిలీ ఇన్వాయిస్‌లు పొందిన ఖత్రి వీటి ఆధారంగా నగదు బదిలీల ప్రక్రియ పూర్తి చేశాడు. ఈ తరహాలో విదేశాలకు నగదు బదిలీ చేసిన కరెంట్‌ ఖాతాదారులకు సంబంధించి ఫెమా చట్టం ప్రకారం... నగదు బదిలీ జరిగిన 180 రోజుల్లోపు ఖాతాదారులు బ్యాంకునకు బిల్‌ ఆఫ్‌ ఎంట్రీని దాఖలు చేయాల్సి ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement