
శాన్‌ఫ్రాన్సిస్కో: వార్షిక వడ్డీ రేటు 36 శాతం అంతకంటే ఎక్కువగా ఉన్న ప్రిడేటరీ లోన్ యాప్స్‌ను గూగుల్ తొలగించింది. వీటిని వినియోగదారుల భద్రత రీత్యా తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఏడాది మొదట్లో తీసుకొచ్చిన ఎక్స్‌పాండెడ్ ఫైనాన్షియల్ పాలసీ కింద వీటిని తొలగించినట్లు గూగుల్ అధికార ప్రతినిధి తెలిపారు. అయితే, ఈ చర్య చట్టబద్ధంగా నడుపుతున్న వారిపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆన్‌లైన్ లెండర్స్ అలియన్స్ సీఈఓ మేరీ జాక్సన్ తెలిపారు. (చదవండి: గూగుల్ ప్లే స్టోర్‌లో డేంజరస్ యాప్స్ హల్‌చల్)
Comments
Please login to add a commentAdd a comment