
సాక్షి, న్యూఢిల్లీ: డిజిటల్ చెల్లింపుల దిగ్గజం పేటీఎంను గూగుల్ తన ప్లేస్టోర్ నుంచి తొలగించింది. సెక్యూరిటీ నిబంధనలను ఉల్లంఘించినందుకే పేటీఎం యాప్‌ను ప్లేస్టోర్ నుంచి తొలగించినట్టు గూగుల్ స్పష్టం చేసింది. దీనిపై గూగుల్ గతంలోనే పేటీఎంకు నోటీసులు జారీ చేసింది. క్యాసినోస్, గ్యాంబ్లింగ్ మనీ ప్రమోషన్లు తమ నిబంధనలకు విరుద్ధమని గూగుల్ పేర్కొంది. పేటీఎం పదేపదే ఈ నిబంధనలను అతిక్రమించిందని గూగుల్ వెల్లడించింది. ఇక పేటీఎం మనీ, పేటీఎం మాల్, పేటీఎం బిజినెస్ యాప్‌లు మాత్రం ప్లేస్టోర్‌లో యథావిథిగా అందుబాటులో ఉండగా పేటీఎం యాప్ కనిపించలేదు. ఇక కొద్దిరోజులు ప్లేస్టోర్‌లో తమ యాప్ తాత్కాలికంగా అందుబాటులో ఉండదని పేటీఎం వివరణ ఇచ్చింది. అందరి డబ్బులు సురక్షితమేనని హామీ ఇచ్చింది. త్వరలోనే పేటీఎం యాప్ యథావిథిగా పనిచేస్తుందని పేర్కొంది.
చదవండి : ‘క్యాంప్ గూగుల్’ విజేతగా గుంటూరు విద్యార్థి
Comments
Please login to add a commentAdd a comment