బరాబన్కీ(యూపీ): కట్టుకున్న భార్య, కన్న కొడుకును ఓ కసాయి అత్యంత కిరాతకంగా కిరోసిన్ పోసి నిప్పంటించాడు. ఈ సంఘటనలో 10 నెలల వయసున్న శిశువు మృతి చెందగా, భార్య కాలిన గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పోందుతోంది. వివాహేతర సంబంధాన్ని నిలదీసినందుకు ఈ ఘాతుకానికి పాల్పడినట్టు సమాచారం.
పోలీసులు తెలిపిన వివరాలు...రాంపూర్ గ్రామానికి చెందిన పీకూ యాదవ్కు రింకూతో వివాహమైంది. వీరిద్దరికి ఓ కుమారుడు కూడా ఉన్నాడు. వివాహేతర సంబంధం విషయంమై పీకూ యాదవ్ను రింకూ నిలదీసింది. దీంతో కోపోద్రిక్తుడైన పీకూ యాదవ్ భార్యతోపాటూ 10 నెలల కుమారుడిపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. అయితే బాబు అక్కడిక్కడే మృతి చెందగా, తీవ్రగాయలతో రింకూ ఆస్పత్రిలో చికిత్స పోందుతుంది. బాబు, రింకూను కాపాడడానికి యత్నించిన నిందితుడి తల్లి, సోదరుడికి కూడా నిప్పు అంటుకోవడంతో వారిని కూడా ఆస్పత్రిలో చేర్పించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
10 నెలల శిశువుకు నిప్పంటించిన తండ్రి
Published Wed, Jan 27 2016 3:17 PM | Last Updated on Wed, Apr 3 2019 8:07 PM
Advertisement
Advertisement