
సాక్షి, చిత్తూరు: అర్ధరాత్రి సమయంలో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా సజీవ దహనమైన ఘటన చిత్తూరు జిల్లా బోయకొండ సమీపంలోని భవాని నగర్‌లో చోటుచేసుకుంది. భవానీ నగర్‌కి చెందిన శ్రీరాములు కుమారుడు శివ(35). ఇతను అమ్మవారి దర్శనానికి వచ్చే వారికి సౌకర్యాలు కల్పిస్తూ భక్తులు ఇచ్చే డబ్బుతో కాలం గడుపుతున్నాడు.
వారం రోజుల క్రితం శివ భార్య అనిత పిల్లలతో కలిసి తిరుపతికి వెళ్లింది. అతని ఇంట్లో నుంచి మంగళవారం రాత్రి పెద్ద ఎత్తున అరుపులు రావడంతో స్థానికులు అక్కడికి చేరుకున్నారు. బయట తాళం వేసే ఉండడంతో తలుపులు తీసెలోపు శివ నిర్జీవంగా పడి ఉన్నాడని వారు చెబుతున్నారు. స్థానికుల సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. శివను ఎవరైనా కొట్టి ఇంట్లో వేసి నిప్పుపెట్టారా, ఇంకేమైనా జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment