
రెండు తలల ఆకుపచ్చ తాబేలు
వర్జీనియా : అమెరికాలోని వర్జీనియాలో అరుదైన రెండు తలల ఆకుపచ్చ తాబేలు వెలుగులోకి వచ్చింది. వర్జీనియాలోని అటవీ ప్రాంతంలో ఓ వ్యక్తి దీన్ని గుర్తించాడు. ప్రస్తుతం ఈ రెండు తలల తాబేలు ‘ది వర్జీనియా లివింగ్ మ్యూజియం’లో విశ్రమిస్తోంది. ‘పోలీసెఫాలీ’ అనే కండీషన్ కారణంగా రెండు తలలు ఏర్పడతాయని మ్యూజియం అధికారులు చెబుతున్నారు. ఇలాంటి కండీషన్ క్షీరదాల్లో అత్యంత అరుదుగా.. తాబేళ్లు, ఇతర సరీసృపాలలో అరుదుగా సంభవిస్తుందని వెల్లడించారు.
కొన్నికొన్ని సార్లు తాబేలులో రెండు తలలు పక్కపక్కనే ఉండటం జరుగుతుందని, మరికొన్ని సార్లు తలలు శరీరానికి చివర్ల వ్యతిరేక దిశగా ఉంటాయిని పేర్కొన్నారు. రెండు తలల జీవులు స్వేచ్ఛగా జీవించటం అన్నది కష్టసాధ్యమైన పనని తెలిపారు. అంతేకాకుండా ఈ తాబేలుకు సంబంధించిన ఓ వీడియోను తమ ఫేస్‌బుక్ ఖాతాలో విడుదల చేశారు. ‘‘ క్వారన్‌స్ట్రీమ్’’ పేరిట ఈ వీడియో గత శుక్రవారం విడుదలైంది.
Comments
Please login to add a commentAdd a comment