green turtle
-
అరుదైన రెండు తలల తాబేలు ఇదే!
వర్జీనియా : అమెరికాలోని వర్జీనియాలో అరుదైన రెండు తలల ఆకుపచ్చ తాబేలు వెలుగులోకి వచ్చింది. వర్జీనియాలోని అటవీ ప్రాంతంలో ఓ వ్యక్తి దీన్ని గుర్తించాడు. ప్రస్తుతం ఈ రెండు తలల తాబేలు ‘ది వర్జీనియా లివింగ్ మ్యూజియం’లో విశ్రమిస్తోంది. ‘పోలీసెఫాలీ’ అనే కండీషన్ కారణంగా రెండు తలలు ఏర్పడతాయని మ్యూజియం అధికారులు చెబుతున్నారు. ఇలాంటి కండీషన్ క్షీరదాల్లో అత్యంత అరుదుగా.. తాబేళ్లు, ఇతర సరీసృపాలలో అరుదుగా సంభవిస్తుందని వెల్లడించారు. కొన్నికొన్ని సార్లు తాబేలులో రెండు తలలు పక్కపక్కనే ఉండటం జరుగుతుందని, మరికొన్ని సార్లు తలలు శరీరానికి చివర్ల వ్యతిరేక దిశగా ఉంటాయిని పేర్కొన్నారు. రెండు తలల జీవులు స్వేచ్ఛగా జీవించటం అన్నది కష్టసాధ్యమైన పనని తెలిపారు. అంతేకాకుండా ఈ తాబేలుకు సంబంధించిన ఓ వీడియోను తమ ఫేస్బుక్ ఖాతాలో విడుదల చేశారు. ‘‘ క్వారన్స్ట్రీమ్’’ పేరిట ఈ వీడియో గత శుక్రవారం విడుదలైంది. చదవండి : ఇంట్లో ప్రత్యక్షమైన రెండు తలల పాము -
ఆ తాబేళ్లు చనిపోవడానికి కారణం అదే
మెక్సికో :వాతావరణంలో చోటు చేసుకున్న మార్పు కారణంగా దాదాపు 300 అరుదైన ఆకుపచ్చ తాబేళ్లు చనిపోయిన ఘటన గురువారం మెక్సికో నగరంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తాబేళ్లు కొన్నివేళ సంవత్సరాలు బతుకుతాయన్న సంగతి మనందరికి తెలిసిన విషయమే. అయితే ప్రపంచంలోనే అరుదైన జాతుల్లో ఆకుపచ్చ తాబేళ్లు ఒకటి.1.5 మీటర్ల పొడవు పెరిగే అరుదైన ఆకుపచ్చ తాబేళ్లు సాధారణంగా మెక్సికో, ఆస్ట్రేలియా లాంటి దేశాలలో కనిపిస్తుంటాయి. ఇవి ఎక్కువగా సముద్ర అడుగుభాగంలోనే ఉంటూ జీవిస్తుంటాయి. కాగా గత కొన్ని రోజులుగా మెక్సికోలోని ఒక్సాకా సముద్రం తీరంలో వాతావరణ మార్పులు చోటుచేసుకోవడంతో రెడ్ టైడల్ మైక్రోఆల్గే విపరీతంగా పెరిగిపోయింది. రెడ్ టైడల్ ఆల్గే సముద్రంలో ఉండే సాల్ప్ అనే చిన్న చిన్న చేపలను తినేస్తుంటుంది. ఇది తాబేళ్లకు చాలా విషపూరితం, గత కొన్ని రోజులుగా మైక్రో ఆల్గేను తింటున్న ఆకుపచ్చ తాబేళ్లు ఒక్కొక్కటిగా మృత్యువాత పడుతున్నాయి. అయితే అరుదుగా కనిపించే ఆకుపచ్చ తాబేళ్లు ఇలా చనిపోవడంపై పర్యావరణ ప్రేమికులు ఆందోళన చెందుతున్నారు. ' ఇప్పటివరకు మైక్రోఆల్గే బారీన పడి 297 తాబేళ్లు చనిపోయాయి. అయితే 27 తాబేళ్లను మాత్రం మైక్రోఆల్గే నుంచి కాపాడి తాబేళ్ల సంరక్షణ కేంద్రానికి తరలించాము. వాతావరణ పరిస్థితులు మెరుగుపడేవరకు అక్కడే పెంచుతామని ' పర్యావరణ అధికారులు వెల్లడించారు. -
తాబేలు పొట్టలో 915 నాణేలు
-
తాబేలు పొట్టలో 915 నాణేలు
బ్యాంకాక్: సముద్రపు తాబేలు పొట్టలో 915 నాణేలు బయటపడ్డాయి. బ్యాంకాక్‌లోని శ్రీరకా కన్జర్వేషన్ సెంటర్లో తాబేలు నివసించే ట్యాంక్‌లో సందర్శకులు వందల సంఖ్యలో కాయిన్లు విసేరేసేవారు. వాటిలో కొన్నింటిని అందులో నివాసముండే ఒమ్సిన్ అనే సముద్రపు పచ్చతాబేలు మింగేసింది. కాలక్రమేణా ఎక్కువ సంఖ్యలో నాణేలను మింగడంతో ఈదలేని పరిస్ధితికి చేరుకుంది. ఒమ్సిన్ అవస్ధను గుర్తించిన కన్జర్వేషన్ సెంటర్ నిర్వాహకులు డాక్టర్ వద్దకు తీసుకువెళ్లారు. అత్యవసర శస్త్రచికిత్స చేసి తాబేలు పొట్టలోని నాణేలు బయటకు తీయకపోతే దాని ప్రాణాలకు ప్రమాదమని డాక్టర్లు తెలిపారు. దీంతో ఒమ్సిన్కి ఆపరేషన్ నిర్వహించగా.. దాని పొట్టలో చుట్టబడిపోయిన 5 కేజీల నాణేల బాల్ ఉంది. దాదాపు ఏడు గంటలపాటు శ్రమించి తాబేలును వైద్యులు రక్షించారు. ప్రపంచంలో తొలిసారి ఇలాంటి ఆపరేషన్‌ను నిర్వహించినట్లు వైద్యులు తెలిపారు. ఒమ్సిన్ పూర్తిగా కోలుకోవడానికి ఒక నెల సమయం పడుతుందని భావిస్తున్నట్లు చెప్పారు. ఆ తర్వాత మరో ఆర్నెల్ల పాటు ఫిజికల్ థెరపీ అవసరమని తెలిపారు.