
వాషింగ్టన్ : అమెరికాలో దారుణం జరిగింది. భారతీయ సంతతి మహిళను, ఆమె కుమారుడు అనుమానాస్పద స్థితిలో హత్యకు గురయ్యారు. ఎవరో గుర్తు తెలియని దుండగులు వారిపై కాల్పులు జరిపి హత్య చేశారు. వాషింగ్టన్‌లోని వర్జీనియా సబర్బ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం ఆ ఇద్దరు మాలా మన్వానీ (65), రిషి మన్వానీ (32)అనే భారతీయ అమెరికన్‌లు.
ఈ ఘటనకు సంబంధించి ఓ యువకుడిని విచారిస్తున్నారు. తల్లి కొడుకులు మాత్రమే ఆ ఇంట్లో ఉంటున్నారని, జాతి విద్వేష హత్య అని తాము అనుకోవడం లేదని పోలీసులు చెప్పారు. 'అధికారులు వారి నివాసాన్ని తనిఖీలు చేశారు. ఇంటి లోపలే మృతదేహాలు పడి ఉన్నాయి. శరీరంపై బుల్లెట్ గాయాలు ఉన్నాయి. దోషులను కచ్చితంగా పట్టుకొని తీరతాం. ఈ ఘటన ద్వారా పబ్లిక్ అంతగా భయపడాల్సిందేమి లేదు' అని అధికారులు తెలిపారు.