కాల్పులు జరిపాడు.. గన్ తో కాల్చుకున్నాడు | accused suicide after killing of 2 journalists | Sakshi
Sakshi News home page

కాల్పులు జరిపాడు.. గన్ తో కాల్చుకున్నాడు

Published Wed, Aug 26 2015 10:00 PM | Last Updated on Thu, Oct 4 2018 8:38 PM

కాల్పులు జరిపాడు.. గన్ తో కాల్చుకున్నాడు - Sakshi

కాల్పులు జరిపాడు.. గన్ తో కాల్చుకున్నాడు

వర్జీనియా: లైవ్ రిపోర్ట్ చేస్తున్న ఇద్దరు టీవీ జర్నలిస్టులపై కాల్పులు జరిపిన అగంతకుడు అనంతరం తనను తాను కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన వర్జీనియాలో బుధవారం చోటుచేసుకుంది. టీవీ జర్నలిస్టులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపి వారి చావుకు కారకుడైన నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా తప్పించుకోవడానికి వీలు లేకపోవడంతో అతడు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.

ఈ ఘటన వివరాలు.. డబ్ల్యూడీబీజే 7 అనే టీవీ ఛానెల్ కు చెందిన మహిళా రిపోర్టర్ ఆలిసన్ పార్కర్, వీడియో జర్నలిస్టు ఆడమ్ వార్డ్లు మౌంటేన్లేక్కు సమీపంలోగల బ్రిడ్జ్వాటర్ ప్లాజాలో మార్నింగ్ షో లైవ్ ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఇంతలోనే ఆ బిల్డింగ్ లోకి చొరబడ్డ సాయుధుడు.. రిపోర్టర్, కెమెరామెన్లను విచక్షణారహితంగా కాల్చిచంపాడు.

సాయుధుడి దృష్టినుంచి తప్పించుకునే క్రమంలో ఆడమ్.. కెమెరాను జారవిడవడంతో ఇద్దరిపైనా కాల్పులు జరిగిన దృశ్యాలు కెమెరాలో రికార్డ్ కావడంతోపాటు ప్రత్యక్ష ప్రసారమయ్యాయి. అయితే దుండగుడు ప్లాజా బిల్డింగ్ లోనే దాక్కున్నాడు. దీంతో చుట్టుపక్కల స్కూళ్లు, కాలేజీలు సహా వ్యాపార సముదాయాలు తెరవొద్దని పోలీసులు ఆదేశాలు జారీచేశారు. దుండగుడ్ని పట్టుకునేందుకు ఆపరేషన్ నిర్వహిస్తుండగా నిందితుడు తనను కాల్చుకుని మృతిచెందాడని పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement