లైవ్ ప్రోగ్రామ్లో ఇద్దరు జర్నలిస్టుల కాల్చివేత | Two broadcast journalists shot dead during live interview | Sakshi
Sakshi News home page

లైవ్ ప్రోగ్రామ్లో ఇద్దరు జర్నలిస్టుల కాల్చివేత

Published Wed, Aug 26 2015 7:22 PM | Last Updated on Sat, Aug 25 2018 5:39 PM

దుండగుడి కాల్పుల్లో మృతి చెందిన మహిళా రిపోర్టర్ ఆలిసన్ పార్కర్, వీడియో జర్నలిస్టు ఆడమ్ వార్డ్ - Sakshi

దుండగుడి కాల్పుల్లో మృతి చెందిన మహిళా రిపోర్టర్ ఆలిసన్ పార్కర్, వీడియో జర్నలిస్టు ఆడమ్ వార్డ్

అమెరికాలో దారుణం జరిగింది. లైవ్ రిపోర్ట్ ఇస్తున్న ఇద్దరు టీవీ జర్నలిస్టులను ఓ ఆగంతకుడు కాల్చిచంపాడు. కెమెరా కిందపడిపోవడంతో కాల్పుల దృశ్యాలు ప్రత్యక్ష ప్రసారమయ్యాయి. వర్జీనియా రాష్ట్రంలోని బెడ్ఫోర్డ్ కౌంటీలో బుధవారం సాయంత్రం (స్థానిక కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 6:45 నిమిషాలకు)  ఈ సంఘటన జరిగింది.

డబ్ల్యూడీబీజే 7 అనే టీవీ ఛానెల్ కు చెందిన మహిళా రిపోర్టర్ ఆలిసన్ పార్కర్, వీడియో జర్నలిస్టు ఆడమ్ వార్డ్లు మౌంటేన్లేక్కు సమీపంలోగల బ్రిడ్జ్వాటర్ ప్లాజాలో మార్నింగ్ షో లైవ్ ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఇంతలోనే ఆ బిల్డింగ్ లోకి చొరబడ్డ సాయుధుడు.. రిపోర్టర్, కెమెరామెన్లను విచక్షణారహితంగా కాల్చిచంపాడు. సాయుధుడి దృష్టినుంచి తప్పించుకునే క్రమంలో ఆడమ్.. కెమెరాను జారవిడవడంతో ఇద్దరిపైనా కాల్పులు జరిగిన దృశ్యాలు కెమెరాలో రికార్డ్ కావడంతోపాటు ప్రత్యక్ష ప్రసారమయ్యాయి.

దుండగుడు ఇంకా ప్లాజా బిల్డింగ్ లోనే దాక్కున్నాడు. దీంతో చుట్టుపక్కల స్కూళ్లు, కాలేజీలు సహా వ్యాపార సముదాయాలు తెరవొద్దని పోలీసులు ఆదేశాలు జారీచేశారు. ప్రస్తుతం దుండగుడ్ని పట్టుకునేందుకు ఆపరేషన్ నిర్వహిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement