
డెహ్రాడూన్ : యోగా నేర్చుకోవటానికి వచ్చిన ఓ జపాన్ మహిళపై లైగింక వేధింపులకు పాల్పడి జైలు పాలయ్యారు ముగ్గురు యోగా గురువులు. ఈ సంఘటన ఉత్తరాఖండ్‌లోని రిషీకేశ్‌లో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. జపాన్‌కు చెందిన మహిళ రిషీకేశ్‌లో ఉంటూ అక్కడి ఆమ్‌బాగ్ ఏరియాలోని యోగా స్కూల్లో యోగా నేర్చుకుంటోంది. యోగా స్కూల్లో పనిచేస్తున్న ముగ్గురు గురువులు హరిక్రిష్ణ, చంద్రకాంత్, సోమ్‌రాజ్‌లు ఆమెపై కన్నేశారు. తరచు ఆమెను లైంగికంగా వేధించేవారు. తమతో శృంగారంలో పాల్గొనాలని ఒత్తిడి తెచ్చేవారు. దీంతో విసుగు చెందిన సదరు మహిళ పోలీసులను ఆశ్రయించింది. శనివారం ముని కీ రేతి పోలీస్ స్టేషన్‌లో వారిపై ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను ఆదివారం నాడు వారి స్వగృహాలలో అదుపులోకి తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment