
పద్మశ్రీ అందుకున్న విరాట్ కోహ్లీ
ఢిల్లీ: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు. గురువారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో పద్మ పురస్కారాల ప్రదానోత్సవం అట్టహాసంగా జరిగాయి. ఈ వేడుకల్లో బీజేపీ సీనియర్ నేత మురళి మనోహర్ జోషి పద్మ విభూషన్ అవార్డు అందుకున్నారు.
వివిధ రంగాల్లో విశేష సేవలందించడంతో పాటు అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన పలువురు ప్రముఖులకు గణతంత్ర దినోత్సవం రోజున కేంద్రప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించిన విషయం తెలిసిందే. పద్మశ్రీ పురస్కారాన్ని అందుకోవడంపై కోహ్లీ ట్విట్ చేశాడు. రాష్ట్రపతి చేతుల మీదగా ఈ అవార్డు అందుకోవడం సంతోషంగా ఉందని, తన జీవితంలో మరిచిపోలేని రోజని, దేవుడు చాలా దయమయుడని అతడు ట్విట్‌లో పేర్కొన్నాడు.
What an absolute honor and a memorable day to receive the Padma Shri award from the President of India. God's been kind. 😇😇😇
— Virat Kohli (@imVkohli) 30 March 2017
Jai Hind 🇮🇳 pic.twitter.com/zh3EUkrTFl
కాగా విరాట్ కోహ్లి సహా ఎనిమిది మందికి నాలుగో అత్యున్నత పౌర పురస్కారం ‘పద్మశ్రీ’లను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ జాబితాలో ఒలింపిక్స్, పారాలింపిక్స్ పతక విజేతలు సాక్షి మలిక్, మరియప్పన్ తంగవేలు, దీపా మలిక్తో పాటు శేఖర్ నాయక్, వికాస్ గౌడ, దీపా కర్మాకర్, శ్రీజేశ్ ఉన్నారు.