సోధికి ఖేల్త్న్ర, కోహ్లికి అర్జున
- ఘనంగా క్రీడా అవార్డుల ప్రదానం
- రాష్ర్టపతి చేతులమీదుగా అందజేత
న్యూఢిల్లీ: ఆయా క్రీడల్లో తమ అత్యుత్తమ ప్రదర్శనతో దేశానికి వన్నె తెచ్చిన ఆటగాళ్లను కేంద్ర ప్రభుత్వం అవార్డులతో సత్కరించింది. రాష్ట్రపతి భవన్‌లో శనివారం అట్టహాసంగా ఈ కార్యక్రమం జరిగింది. రాష్ర్టపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా ప్రతిష్టాత్మక రాజీవ్ గాంధీ ఖేల్త్న్రను షూటర్ రంజన్ సింగ్ సోధి అందుకున్నాడు.
వరుసగా మూడోసారి కూడా ఈ అవార్డు ఓ షూటర్‌కే దక్కడం విశేషం. వరుసగా రెండు ప్రపంచకప్‌ల్లో స్వర్ణాలు నెగ్గిన ఏకైక భారత షూటర్‌గా రికార్డులకెక్కిన సోధికి ఈ అవార్డు కింద రూ.7.5 లక్షల నగదు, పతకం, మెమొంటో అందజేశారు. ఇక భారత క్రికెట్ భవిష్యత్ కెప్టెన్‌గా పిలువబడుతున్న విరాట్ కోహ్లి అర్జున అవార్డును అందుకున్నాడు. ఈ సమయంలో అక్కడున్న వారు పెద్ద ఎత్తున హర్షధ్వానాలు చేశారు. కోహ్లితో పాటు మరో 13 మంది కూడా అర్జున అవార్డులు అందుకున్నారు. అర్జున దక్కించుకున్న వారికి రూ.5 లక్షల చొప్పున నగదు, మెమొంటో, విగ్రహం అందజేశారు.
అవార్డీల జాబితా
రాజీవ్ గాంధీ ఖేల్త్న్ర: రంజన్ సింగ్ సోధి
అర్జున అవార్డు: విరాట్ కోహ్లి (క్రికెట్), పీవీ సింధు (బ్యాడ్మింటన్), జ్యోత్స్న చినప్ప (స్క్వాష్), కవితా చాహల్ (బాక్సింగ్), సాబా అంజుమ్ (హాకీ), నేహా రాఠి (రెజ్లింగ్), రాజ్‌కుమారి రాథోడ్ (షూటింగ్), చెక్రవోలు సువురో (ఆర్చరీ), మౌమా దాస్ (టేబుల్ టెన్నిస్), రూపేశ్ షా (బిలియర్డ్స్ అండ్ స్నూకర్), అభిజిత్ గుప్తా (చెస్), గగన్ జీత్ భుల్లార్ (గోల్ఫ్), ధర్మేందర్ దలాల్ (రెజ్లింగ్), అమిత్ కుమార్ సరోహ (పారా అథ్లెటిక్స్).
ద్రోణాచార్య అవార్డు: పూర్ణిమ మహతో (ఆర్చరీ), మహావీర్ సింగ్ (బాక్సింగ్), నరీందర్ సింగ్ సైనీ (హాకీ), రాజ్ సింగ్ (రెజ్లింగ్), కేపీ థామస్ (అథ్లెటిక్స్).
ధ్యాన్‌చంద్ అవార్డు: మేరీ డి సౌజా సెక్వేరియా (అథ్లెటిక్స్), సయ్యద్ అలీ (హాకీ), అనిల్ మాన్ (రెజ్లింగ్), గిరిరాజ్ సింగ్ (పారా స్పోర్ట్స్).
రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కార్: పుల్లెల గోపీచంద్ - నిమ్మగడ్డ ఫౌండేషన్ అకాడమీ ఆఫ్ బ్యాడ్మింటన్, హైదరాబాద్.