Ronjan Sodhi
-
సోధికి దక్కని ‘కామన్వెల్త్ బెర్త్’
న్యూఢిల్లీ: ఆసియా క్రీడల స్వర్ణ పతక విజేత, భారత అగ్రశ్రేణి ‘డబుల్ ట్రాప్’ షూటర్ రంజన్ సోధి ఈ ఏడాది జులైలో గ్లాస్గోలో జరగనున్న కామన్వెల్త్ క్రీడలకు దూరం కానున్నాడు. షాట్గన్లోని ఆరు ఈవెంట్లలో పాల్గొనే 10 మంది షూటర్లను భారత జాతీయ రైఫిల్ సంఘం (ఎన్ఆర్ఏఐ) శనివారం ఎంపిక చేసింది. ఇందులో సోధికి స్థానం కల్పించలేదు. ఏప్రిల్‌లో అల్మాటీలో జరిగిన ఐఎస్ఎస్ఎఫ్ షాట్‌గన్ ప్రపంచ కప్‌లో స్కోర్ల ఆధారంగా ఎన్ఆర్ఏఐ ఈ ఎంపికను నిర్వహించింది. అభినవ్ బింద్రా సారథ్యం వహించనున్న భారత షూటర్ల బృందంలో లండన్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత గగన్ నారంగ్‌తోపాటు విజయ్ కుమార్, ప్రపంచకప్ తాజా విజేత మానవ్‌జిత్ సింగ్ సంధూ, హీనా సిద్ధూ తదితరులకు చోటు దక్కింది. హైదరాబాద్‌కు చెందిన గగన్ నారంగ్ 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్, 50 మీటర్ల రైఫిల్ ప్రోన్ విభాగాల్లో పోటీపడనున్నాడు. 2010లో న్యూఢిల్లీలో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో భారత షూటర్లు 14 స్వర్ణాలు, 11 రజతాలు, 5 కాంస్యాలు సాధించారు. -
ప్రపంచకప్ షాట్‌గన్ టోర్నీకి కైనాన్, రష్మీ
న్యూఢిల్లీ: అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య (ఐఎస్ఎస్ఎఫ్) షాట్‌గన్ ప్రపంచకప్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ షూటర్స్ కైనాన్ షెనాయ్, రష్మీ రాథోడ్ భారత్‌కు ప్రాతినిధ్యం వహించనున్నారు. ఈనెల 10 నుంచి 14 వరకు జరిగే ఈ టోర్నీలో గురువారం జరిగే పురుషుల ట్రాప్ ఈవెంట్లో కైనాన్... ఆదివారం జరిగే మహిళల స్కీట్ ఈవెంట్లో రష్మీ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. పురుషుల ‘డబుల్ ట్రాప్’ ఈవెంట్లో రంజన్‌సింగ్ సోధి, మహ్మద్ అసబ్, అంకుర్ మిట్టల్ పోటీపడతారు. -
సోధికి ఖేల్త్న్ర, కోహ్లికి అర్జున
ఘనంగా క్రీడా అవార్డుల ప్రదానం రాష్ర్టపతి చేతులమీదుగా అందజేత న్యూఢిల్లీ: ఆయా క్రీడల్లో తమ అత్యుత్తమ ప్రదర్శనతో దేశానికి వన్నె తెచ్చిన ఆటగాళ్లను కేంద్ర ప్రభుత్వం అవార్డులతో సత్కరించింది. రాష్ట్రపతి భవన్లో శనివారం అట్టహాసంగా ఈ కార్యక్రమం జరిగింది. రాష్ర్టపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా ప్రతిష్టాత్మక రాజీవ్ గాంధీ ఖేల్త్న్రను షూటర్ రంజన్ సింగ్ సోధి అందుకున్నాడు. వరుసగా మూడోసారి కూడా ఈ అవార్డు ఓ షూటర్‌కే దక్కడం విశేషం. వరుసగా రెండు ప్రపంచకప్‌ల్లో స్వర్ణాలు నెగ్గిన ఏకైక భారత షూటర్‌గా రికార్డులకెక్కిన సోధికి ఈ అవార్డు కింద రూ.7.5 లక్షల నగదు, పతకం, మెమొంటో అందజేశారు. ఇక భారత క్రికెట్ భవిష్యత్ కెప్టెన్‌గా పిలువబడుతున్న విరాట్ కోహ్లి అర్జున అవార్డును అందుకున్నాడు. ఈ సమయంలో అక్కడున్న వారు పెద్ద ఎత్తున హర్షధ్వానాలు చేశారు. కోహ్లితో పాటు మరో 13 మంది కూడా అర్జున అవార్డులు అందుకున్నారు. అర్జున దక్కించుకున్న వారికి రూ.5 లక్షల చొప్పున నగదు, మెమొంటో, విగ్రహం అందజేశారు. అవార్డీల జాబితా రాజీవ్ గాంధీ ఖేల్త్న్ర: రంజన్ సింగ్ సోధి అర్జున అవార్డు: విరాట్ కోహ్లి (క్రికెట్), పీవీ సింధు (బ్యాడ్మింటన్), జ్యోత్స్న చినప్ప (స్క్వాష్), కవితా చాహల్ (బాక్సింగ్), సాబా అంజుమ్ (హాకీ), నేహా రాఠి (రెజ్లింగ్), రాజ్‌కుమారి రాథోడ్ (షూటింగ్), చెక్రవోలు సువురో (ఆర్చరీ), మౌమా దాస్ (టేబుల్ టెన్నిస్), రూపేశ్ షా (బిలియర్డ్స్ అండ్ స్నూకర్), అభిజిత్ గుప్తా (చెస్), గగన్ జీత్ భుల్లార్ (గోల్ఫ్), ధర్మేందర్ దలాల్ (రెజ్లింగ్), అమిత్ కుమార్ సరోహ (పారా అథ్లెటిక్స్). ద్రోణాచార్య అవార్డు: పూర్ణిమ మహతో (ఆర్చరీ), మహావీర్ సింగ్ (బాక్సింగ్), నరీందర్ సింగ్ సైనీ (హాకీ), రాజ్ సింగ్ (రెజ్లింగ్), కేపీ థామస్ (అథ్లెటిక్స్). ధ్యాన్‌చంద్ అవార్డు: మేరీ డి సౌజా సెక్వేరియా (అథ్లెటిక్స్), సయ్యద్ అలీ (హాకీ), అనిల్ మాన్ (రెజ్లింగ్), గిరిరాజ్ సింగ్ (పారా స్పోర్ట్స్). రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కార్: పుల్లెల గోపీచంద్ - నిమ్మగడ్డ ఫౌండేషన్ అకాడమీ ఆఫ్ బ్యాడ్మింటన్, హైదరాబాద్. -
పూనియా కూడా సిఫారసు చేయమంది!
న్యూఢిల్లీ: రాజీవ్ ఖేల్త్న్ర అవార్డు వివాదం మరో మలుపు తిరిగింది. అంజలీ భగవత్ ఆఖరి నిమిషంలో చేసిన మార్పులతోనే రంజన్ సోధి పేరు ఖరారైందని విమర్శలు రావడంతో ఇప్పుడు ఈ మాజీ షూటర్ నోరు విప్పింది. అవార్డు రాలేదంటూ తనపై విరుచుకు పడుతున్న కృష్ణ పూనియానే దోషి అని ఆమె తేల్చింది. ‘ఖేల్త్న్ర ఎంపిక కోసం కమిటీ సమావేశానికి ఒక రోజు ముందు స్వయంగా పూనియా నాకు ఫోన్ చేసింది. ఈ జాబితాలో తన పేరును కూడా సిఫారసు చేయాలని విజ్ఞప్తి చేసింది. ఇప్పుడు జాబితా మార్చానంటూ నన్ను విమర్శించడం ఆమె చవకబారు ప్రచారానికి నిదర్శనం’ అని ఘాటుగా వ్యాఖ్యానించింది. నాకా అవసరం లేదు: పూనియా అంజలి వ్యాఖ్యలను పూనియా తిప్పికొట్టింది. అవార్డు కోసం తాను పైరవీ చేయడం లేదని, కేవలం తనకు జరిగిన అన్యాయంపై గొంతు వినిపిస్తున్నానని చెప్పింది. ‘నిజంగా నేను పైరవీ చేయాలనుంటే మా రాష్ట్రానికి చెందిన కేంద్ర క్రీడా మంత్రి ద్వారా జాబితా ప్రకటించక ముందే చేసేదానిని. 2003లో అంజలీ భగవత్ లాబీయింగ్ చేసే ఖేల్త్న్ర నెగ్గిందా నా ప్రదర్శననే నమ్ముకున్న నేను అవార్డును రాజకీయం చేయడం లేదు’ అని పూనియా ప్రశ్నించింది. మరో వైపు జాబితా పూర్తిగా సిద్ధమైనా అర్జున అవార్డులను క్రీడా శాఖ ఇప్పటికీ అధికారికంగా ప్రకటించలేదు. ఫైలు మంత్రి వద్దే ఉందని, ఎప్పుడు ప్రకటించాలో ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఒక అధికారి వెల్లడించారు. -
పీవీ సింధుకు అర్జున అవార్డు
న్యూఢిల్లీ: క్రీడాకారులకు అత్యుత్తమ పురస్కారాలను మంగళవారం కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. పంజాబ్ రాష్ట్రానికి చెందిన ప్రముఖ షూటర్ రంజన్ సోధీకి క్రీడా రంగంలో అత్యున్నతమైనదిగా భావించే రాజీవ్ ఖేల్ రత్న అవార్డు దక్కింది. క్రికెట్లో రాణిస్తున్న భారత మిడిల్ ఆర్డర్ ఆటగాడు, ఇటీవలి కాలంలో జింబాబ్వేతో ఆ దేశంలో జరిగిన ఐదు మ్యాచ్ ల సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన జట్టుకు కెప్టెన్సీ వహించిన విరాట్ కోహ్లికి అర్జున పురస్కారం లభించింది. బ్యాడ్మింటన్‌లో సంచలనాలు సృష్టిస్తూ, సుదీర్ఘ కాలం తర్వాత మన దేశానికి ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ పోటీలలో కాంస్య పతకాన్ని అందించిన మన రాష్ట్ర క్రీడాకారిణి పి.వి సింధును కూడా అర్జున అవార్డుకు ఎంపిక చేశారు. పుల్లెల గోపీచంద్ తర్వాత ప్రపంచ బ్యాడ్మింటన్‌లో కాంస్య పతకం సాధించిన సింగిల్స్ ప్లేయర్ పి.వి. సింధు మాత్రమేనన్న సంగతి తెలిసిందే.