అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య (ఐఎస్‌ఎస్‌ఎఫ్) షాట్‌గన్ ప్రపంచకప్ టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్ షూటర్స్ కైనాన్ షెనాయ్, రష్మీ రాథోడ్ భారత్‌కు ప్రాతినిధ్యం వహించనున్నారు.
న్యూఢిల్లీ: అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య (ఐఎస్‌ఎస్‌ఎఫ్) షాట్‌గన్ ప్రపంచకప్ టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్ షూటర్స్ కైనాన్ షెనాయ్, రష్మీ రాథోడ్ భారత్‌కు ప్రాతినిధ్యం వహించనున్నారు.
ఈనెల 10 నుంచి 14 వరకు జరిగే ఈ టోర్నీలో గురువారం జరిగే పురుషుల ట్రాప్ ఈవెంట్‌లో కైనాన్... ఆదివారం జరిగే మహిళల స్కీట్ ఈవెంట్‌లో రష్మీ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. పురుషుల ‘డబుల్ ట్రాప్’ ఈవెంట్‌లో రంజన్‌సింగ్ సోధి, మహ్మద్ అసబ్, అంకుర్ మిట్టల్ పోటీపడతారు.