Shotgun World Cup
-
షాట్‌గన్‌లో అంకుర్‌కు స్వర్ణం
అకాపుల్కో(మెక్సికో): భారత షూటర్ అంకుర్ మిట్టల్ ఏఎస్ఎస్ఎఫ్ షాట్‌గన్ ప్రపంచకప్ డబుల్ ట్రాప్‌లో స్వర్ణపతకాన్ని కైవసం చేసుకున్నాడు. ఫైనల్లో 75 పాయింట్లు సాధించిన అంకుర్ అగ్రస్థానంలో నిలిచాడు. అంకుర్‌కు గట్టి పోటీ ఇచ్చిన జేమ్స్ విల్లెట్( ఆస్ట్రేలియా) 73 పాయింట్లతో రజతాన్ని, యింగ్(చైనా) కాంస్య పతకాన్ని సాధించారు. అంతకు ముందు జరిగిన క్వాలిఫయింగ్ రెండో రౌం డ్లో అతను 138 పాయింట్లు స్కోర్ చేసి ఫైనల్‌కు అర్హత సాధించాడు. గత నెల ఢిల్లీలో జరిగిన ప్రపంచకప్ పోటీల్లో విల్లెట్ స్వర్ణం, అంకుర్ రజతం సాధించడం విశేషం. -
ప్రపంచకప్ షాట్‌గన్ టోర్నీకి కైనాన్, రష్మీ
న్యూఢిల్లీ: అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య (ఐఎస్ఎస్ఎఫ్) షాట్‌గన్ ప్రపంచకప్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ షూటర్స్ కైనాన్ షెనాయ్, రష్మీ రాథోడ్ భారత్‌కు ప్రాతినిధ్యం వహించనున్నారు. ఈనెల 10 నుంచి 14 వరకు జరిగే ఈ టోర్నీలో గురువారం జరిగే పురుషుల ట్రాప్ ఈవెంట్లో కైనాన్... ఆదివారం జరిగే మహిళల స్కీట్ ఈవెంట్లో రష్మీ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. పురుషుల ‘డబుల్ ట్రాప్’ ఈవెంట్లో రంజన్‌సింగ్ సోధి, మహ్మద్ అసబ్, అంకుర్ మిట్టల్ పోటీపడతారు.