పీవీ సింధుకు అర్జున అవార్డు
న్యూఢిల్లీ: క్రీడాకారులకు అత్యుత్తమ పురస్కారాలను మంగళవారం కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. పంజాబ్ రాష్ట్రానికి చెందిన ప్రముఖ షూటర్ రంజన్ సోధీకి క్రీడా రంగంలో అత్యున్నతమైనదిగా భావించే రాజీవ్ ఖేల్ రత్న అవార్డు దక్కింది.
క్రికెట్‌లో రాణిస్తున్న భారత మిడిల్ ఆర్డర్ ఆటగాడు, ఇటీవలి కాలంలో జింబాబ్వేతో ఆ దేశంలో జరిగిన ఐదు మ్యాచ్ ల సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన జట్టుకు కెప్టెన్సీ వహించిన విరాట్ కోహ్లికి అర్జున పురస్కారం లభించింది. బ్యాడ్మింటన్‌లో సంచలనాలు సృష్టిస్తూ, సుదీర్ఘ కాలం తర్వాత మన దేశానికి ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ పోటీలలో కాంస్య పతకాన్ని అందించిన మన రాష్ట్ర క్రీడాకారిణి పి.వి సింధును కూడా అర్జున అవార్డుకు ఎంపిక చేశారు. పుల్లెల గోపీచంద్ తర్వాత ప్రపంచ బ్యాడ్మింటన్‌లో కాంస్య పతకం సాధించిన సింగిల్స్ ప్లేయర్ పి.వి. సింధు మాత్రమేనన్న సంగతి తెలిసిందే.