విద్యాబాలన్‌కి పద్మశ్రీనా? - శ్రీప్రియ
విద్యాబాలన్‌కి పద్మశ్రీనా? - శ్రీప్రియ
Published Mon, Jan 27 2014 10:58 PM | Last Updated on Sat, Sep 2 2017 3:04 AM
సీనియర్ నటి, దర్శకురాలు శ్రీప్రియకు కోపం వచ్చింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ‘పద్మ’ అవార్డుల గురించి శ్రీప్రియ తన ట్విట్టర్‌లో కొంచెం ఘాటుగానే స్పందించారు. సీనియర్ తారలను మర్చిపోవడం బాధాకరం అన్నారామె. విజయనిర్మలకు నటిగా ఎంతో గుర్తింపు ఉందని, అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించి, గిన్నిస్ రికార్డ్ కూడా సాధించిన ఆమెకు ఇంకా ‘పద్మ’ పురస్కారం రాకపోవడం ఏంటి? అని ప్రశ్నించారు శ్రీప్రియ.
అలాగే, నాటి తరం తారల్లో లక్ష్మి గురించి కూడా ప్రత్యేకంగా ప్రస్తావించాలని, భారతీయ భాషల్లో పలు చిత్రాల్లో నటించిన ఆమెను గుర్తించకపోవడం ఏంటి? అని ఘాటుగా స్పందించారు. కమల్‌హాసన్‌కి పద్మభూషణ్ రావడం ఆనందించదగ్గ విషయం అని, ఆయనకా అర్హత ఉందని పేర్కొన్నారామె. కానీ, ఎన్ని సినిమాలు చేసి ఉంటుందని విద్యాబాలన్‌కి పద్మ పురస్కారం కట్టబెట్టారో తనకు తెలియడం లేదని శ్రీప్రియ పేర్కొన్నారు. సీనియర్ తారలకు తగిన గుర్తింపు లభించడంలేదనే బాధతో ఈ కామెంట్లు చేశానని ఆమె స్పష్టం చేశారు.
Advertisement
Advertisement