రాంచీ: కరోనా కష్టకాలంలో రోజుకు ఒక్క పేద కరోనా బాధితుడికైనా ఉచితంగా చికిత్స అందించాలని ఐదురూపాయల డాక్టర్ పద్మశ్రీ, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అన్నారు. దేశంలో సెకండ్ వేవ్ కరోనా చాపకింద నీరులా చుట్టేస్తోంది. మరోవైపు దేశంలో రోజు మూడు నుంచి 4 లక్షల కరోనా కేసులు నమోదు కావడంతో పాటూ వేల సంఖ్యలో కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే వీరిలో ఎక్కువ మంది చికిత్స అందక, ఆక్సీజన్ సిలిండర్లు అందుబాటులో ఇబ్బందులు పడుతున్నారు. ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటే బిల్లు భరించలేమని కొంతమంది కరోనా బాధితులు ఇంట‍్లోనే తగు జాగ్రత్తలు పాటిస్తున్నారు. కానీ ఆరోగ్యం మరింత క్షీణించిన బాధితులు మాత్రం ఏం చేయలేని పరిస్థితుల్లో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో ప్రతిరోజు ఒక్క పేదవాడికైనా ఉచితంగా చికిత్స అందించాలని డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ కోరారు. మనదేశంలో ఐదురూపాయలకు ఏం కొంటాం. కనీసం టీ కూడా తాగలేం. కానీ జార్ఖండ్‌కు చెందిన డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ కరోనా కష్టకాలంలో కోవిడ్ సోకిన పేదవారికి కేవలం రూ.5లకే చికిత్స అందిస్తూ వారి ప్రాణాల్ని కాపాడుతున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మీరు డాక్టర్ అయితే మీ సంపాదన ఎంతవరకు సరిపోతుందో ఆలోచించాలి. కరుణ, దాతృత్వం వైద్య వృత్తిలో ఓ భాగం. కాబట్టి ప్రతిరోజూ ఒక్క కరోనా బాధితుడికైనా ఉచితంగా అందించాలన్నారు. తనకు గుండె, ప్రోస‍్టేట్ సంబంధిత సమస్యలున్నాయి.
ఆస్పత్రి నిర్వహణ, తన మెడిసిన్‌కు ఖర్చు రోజుకు రూ.200 కేటాయించాల్సి ఉంటుందని తెలిపారు. అందుకే ఫీజు రూ.50 పెంచాల్సి వచ్చింది. తన మెడిసిన్ ఖర్చుల కోసం రోగుల నుంచి వసూలు చేయలేనన్నారు. అది కూడా ఇవ్వలేని వాళ్లకు ఉచితంగా వైద్యం చేస్తున్నానని పేర్కొన్నారు. మిగతా వైద్యులు కూడా ప్రతిరోజు ఒక్క పేదవాడికి వైద్యం చేసి, వాళ్లకు చేతనంత సాయం అందించాలన్నారు. ప్రస్తుతం ఆయన రోజుకు 20మంది బాధితులకు చికిత్స అందిస్తూ ప్రాణదాతగా ప్రశంసలు పొందుతున్నారు.
చదవండి: మానవత్వం చాటిన అధికారి
Comments
Please login to add a commentAdd a comment