పలువురు నగరవాసులకు ‘పద్మాలు’
Published Sat, Jan 25 2014 10:58 PM | Last Updated on Sat, Sep 2 2017 3:00 AM
న్యూఢిల్లీ: జాతికి విశిష్ట సేవలు అందించిన వారికి ప్రకటించే పద్మభూషణ్, పద్మవిభూషణ్ అవార్డులు ఈసారి పలువురు ఢిల్లీవాసులకు దక్కాయి. ప్రజావ్యవహారాల విభాగంలో న్యాయమూర్తి దల్వీర్ భండారి, సైన్స్, ఇంజనీరింగ్ విభాగంలో డాక్టర్ తిరుమలాచారి రామసామి, డాక్టర్ వినోద్ ప్రకాశ్ శర్మ, సాహిత్య, విద్య విభాగంలో మృత్యుంజయ్ ఆచార్య, పౌరసేవల విభాగంలో విజయేంద్రనాథ్ కౌల్, వైద్యవిభాగంలో డాక్టర్ నీలమ్ క్లేర్‌కు పద్మభూషణ్ పురస్కారాలు దక్కాయి.
పద్మశ్రీ పురస్కారాలు
ప్రముఖ శిల్పి ప్రొఫెసర్ బీహారీ దాస్, ఒడిస్సీ నృత్య విభాగంలో గీతా మహాలిక్, చిత్రకళాకారుడు పరేశ్ మైటీ, సామాజిక సేవకుడు జేఎల్ కౌల్, సైన్స్, ఇంజనీరింగ్ నిపుణుడు బ్రహ్మసింగ్, రామస్వామి అయ్యర్, ప్రముఖ అంకాలజిస్టు లలిత్‌కుమార్, ఎముకల వైద్యుడు డాక్టర్ అశోక్ రాజ్‌గోపాల్, దంతవైద్యులు ప్రొఫెసర్ డాక్టర్ మహేశ్ వర్మ, డాక్టర్ తితియాల్, కంటి వైద్యుడు డాక్టర్ నితీశ్ నాయక్, హృద్రోగాల నిపుణుడు డాక్టర్ సుబ్రత్ కుమార్ ఆచార్య, గ్యాస్ట్రోఎంటరాలజీ నిపుణుడు ప్రొఫెసర్ అశోక్ చక్రధర్, సాహితీకారులు కేకేఈ దారువాలా, మనోరమ జఫా, రెహానా ఖటూన్, దినేశ్ సింగ్, అంజుమ్ చోప్రా, ప్రముఖ క్రికెటర్ లవ్‌రాజ్ సింగ్, పర్వతారోహణ క్రీడాకారుడు ధర్మశక్తు పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికయ్యారు.
Advertisement