యువరాజ్, గోపీచంద్కు పద్మ అవార్డులు
హైదరాబాద్: భారత బ్యాడ్మింటన్ దిగ్గజం పుల్లెల గోపీచంద్, టీమిండియా ఆల్రౌండర్ యువరాజ్ సింగ్కు పద్మ అవార్డులు వరించాయి. గోపీచంద్ కు పద్మభూషణ్, యువరాజ్ కు పద్మశ్రీ అవార్డులతో కేంద్ర ప్రభుత్వం సన్మానించనుంది. ప్రపంచ బ్యాడ్మింటన్ రంగంలో భారత్ పురోభివృద్దికి విశేష కృషి చేసిన జాతీయ కోచ్ గోపీచంద్, ప్రాణాంతక కేన్సర్ను జయించి భారత క్రికెట్లోకి పునరాగమనం చేసిన యువరాజ్ ఆదర్శంగా నిలిచారు.
భారత క్రికెట్ జట్టులో యువరాజ్ది కీలక పాత్ర. గత వన్డే ప్రపంచ కప్లో ఆల్రౌండ్ ప్రదర్శనతో చెలరేగిన యువీ 'మ్యాన్ ఆఫ్ ద సిరీస్'గా నిలిచి భారత్ ప్రపంచ చాంపియన్గా నిలవడానికి దోహదపడ్డాడు. అనంతరం కేన్సర్ బారిన పడి జట్టుకు దూరమయ్యాడు. అమెరికాలో చికిత్స చేయించుకున్న అనంతరం పునరాగమనం చేశాడు. ఇక తెలుగుతేజం గోపీచంద్ భారత బ్యాడ్మింటన్కు విశేష సేవలు అందించాడు. కోచ్గా సైనా నెహ్వాల్, పీవీ సింధు తదితర స్టార్ షట్లర్లను తయారు చేశాడు.