Madhubani
-
మార్కెట్లో పెళ్లి కొడుకుల విక్రయం.. ఎక్కడో కాదు మన దేశంలోనే!
పట్నా: పెళ్లైన కొత్తలో మూవీలో హైటెక్ మ్యారేజ్ బ్యూరో పేరుతో సునీల్ పెళ్లికొడుకులను విక్రయానికి పెడతాడు. మార్కెట్లో కూరగాయలు కొనుగోలు చేసినట్లు పెళ్లి కొడుకులను కొనుగోలు చేయటం వింటే వింతగా ఉంది కదా?. అయితే.. అలాంటి మార్కెట్ ఒకటి నిజ జీవితంలో ఉందని మీకు తెలుసా? బిహార్‌లోని మధుబని జిల్లాలో ప్రతిఏటా పెళ్లికొడుకుల మార్కెట్ నిర్వహిస్తారు. స్థానిక మార్కెట్ ప్రాంతంలోని చెట్ల కిందే ప్రతిఏటా 9 రోజుల పాటు ఈ పెళ్లి కొడుకుల విక్రయాలు నిర్వహిస్తారు. ఈ సంప్రదాయం సుమారు 700 ఏళ్ల నుంచి వస్తున్నట్లు అక్కడి వారు చెబుతున్నారు. స్థానికులు ఈ పద్ధతిని సౌరత్ సభా అని పిలుస్తారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న మైతిల్ బ్రాహ్మిన్ సమాజానికి చెందిన వారు తమ కుమార్తెలను తీసుకుని ఈ మార్కెట్‌కు వస్తారు. వారికి నచ్చిన వారిని ఎంపిక చేసుకునేందుకు అవకాశం కల్పిస్తారు. ఈ మార్కెట్లో వేల మంది పెళ్లి కొడుకులు వారి కుటుంబ సభ్యులతో వస్తారు. సంప్రదాయ ధోతి, కుర్తా లేదా షీన్స్, టీషర్ట్ ధరిస్తారు. వారి ఆస్తులు, విద్యా అర్హతలను బట్టి వారికి రేటు నిర్ణయిస్తారు. పెళ్లి కొడుకును కొనుగోలు చేసే ముందు అతడి అర్హతలు, కుటుంబ నేపథ్యాన్ని పరిశీలిస్తారు ఆడపిల్లల కుటుంబ సభ్యులు. అలాగే జన్మదినం, పాఠశాల ధ్రువపత్రాల వంటివి అడుగుతారు. వరుడిని వధువు ఎంపిక చేసుకున్న తర్వాత ఇరువురి కుటుంబాలు మిగతా కార్యక్రమాలు చేపడతాయి. వివాహాన్ని ఆడపిల్ల కుటుంబమే నిర్వహిస్తుంది. కర్నాత్ వంశపాలన కాలం నుంచి ఈ సంప్రదాయం వస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. విభిన్న గోత్రాల ప్రజల మధ్య పెళ్లిళ్లు చేసేందుకు రాజా హరిసింగ్ దీనిని ప్రారంభించినట్లు వెల్లడించారు. మరోవైపు.. వివాహాలు కట్నం లేకుండా చేయటమే దీని లక్ష్యంగా మరికొందరు తెలిపారు. Groom market’ In this unique 700-year-old tradition, the aspiring husbands stand in public display, Village famous for its ” annual “groom market” in India’s Bihar state -in Madhubani district Dowry though illegal in India, is prevalent and has a high social acceptance pic.twitter.com/G5428fE2Kz — Elmi Farah Boodhari (@BoodhariFarah) August 4, 2022 ఇదీ చదవండి: కట్నం ఉండదు.. ఉత్కృష్టమైన సంస్కృతికి వారసులు, వారధులు -
నెమలి పింఛం, పిల్లనగ్రోవితో అలంకారంలో కృష్ణుడు.. వన్నె తగ్గని సౌందర్యం!
నెమలి పింఛం, పిల్లనగ్రోవితో అలంకారంలో కృష్ణుడు ఆధ్యాత్మికతనే కాదు వన్నె తగ్గని సౌందర్యాన్ని చూపుతాడు ఆ కళను ఫ్యాషన్ ప్రియులు తమ డిజైనర్ డ్రెస్సుల మీదకు తీసుకొచ్చి మరింత చూడముచ్చటగా తీర్చుతున్నారు. వాటిని ఎంపిక చేసుకున్నవారు అంతే ఆనందంగా తమ కళాత్మక హృదయాన్ని చాటుతున్నారు. కలంకారీ, మధుబని, పటచిత్ర.. మన దేశంలోని కళారూపాలన్నింటిలోనూ కృష్ణ సౌందర్యం మన కళ్లకు కడుతూనే ఉంటుంది. సంప్రదాయ చీరలు, కుర్తీలు, దుపట్టాల మీద మనకు ఈ సొగసైన కళ కొత్త కాంతులతో రూపుకడుతూనే ఉంది. బాల్యంలో చేసిన అల్లరి పనులు, రాధాకృష్ణుల ప్రణయ ఘట్టం, గోవుల కాపరిగా, యశోదా తనయుడిగా .. దుస్తుల మీద కొలువుదీరిన మురళీధరుడు ఫ్యాషన్ ప్రియులకు ఆరాధ్యుడయ్యాడు. కృష్ణుడి అలంకారంలో భాగమైన నెమలి పింఛం, పిల్లన గ్రోవి, శ్యామవర్ణం.. యువత మదిని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అందుకే, స్త్రీ పురుషులిద్దరి వెస్ట్రన్ డ్రెస్సుల మీదా ఈ అలంకారాలు పెయింటింగ్‌గా అమరుతున్నాయి. ఎంబ్రాయిడరీగా అలరారుతున్నాయి. ఆభరణాలుగా మెరుస్తున్నాయి. బ్యాగుల అలంకరణలో ముఖ్య భూమిక అవుతున్నాయి. ఫ్యాషన్ వేదికల మీదా వినూత్న హంగులతో నడయాడుతున్నాయి. చదవండి: Saiee Manjrekar: ఈ హీరోయిన్ ధరించిన అనార్కలీ సెట్ ధర 46 వేలు! జరియా లేబుల్ వేల్యూ అదే! -
కళ: అమెరికాలో పుష్పవిలాసం
కొన్ని చిత్రాలు ‘ఆహా’ అనిపిస్తాయి. కొన్ని చిత్రాలు ‘అద్భుతం’ అనిపిస్తాయి. కొన్ని చిత్రాలు మాత్రం ‘ఆహా అద్భుతం’ అనిపిస్తూనే ఆలోచించేలా చేస్తాయి. పుష్ప చిత్రాలు ఈ కోవకు చెందినవే... కొన్ని చిత్రాలు ‘ఆహా’ అనిపిస్తాయి. కొన్ని చిత్రాలు ‘అద్భుతం’ అనిపిస్తాయి. కొన్ని చిత్రాలు మాత్రం ‘ఆహా అద్భుతం’ అనిపిస్తూనే ఆలోచించేలా చేస్తాయి. పుష్ప చిత్రాలు ఈ కోవకు చెందినవే... మాన్హాటన్ (యూఎస్) 86 స్ట్రీట్‌లోని బస్‌షెల్టర్‌లో కనిపించిన ఒక చిత్రం అందరినీ ఆకట్టుకుంటుంది. సంప్రదాయ కళాప్రేమికులు, ఆధునిక కళాప్రేమికులు... ఇద్దరూ ఇష్టపడే చిత్రం అది. ‘జాయ్ ఆఫ్ లివింగ్’ అనే ఆ చిత్రాన్ని గీసింది మన ఇండియన్ ఆర్టిస్ట్ పుష్పకుమారి. గత రెండు సంవత్సరాల కరోనా కల్లోల చీకటిని వస్తువుగా తీసుకొని, ఆశావాద దృక్పథాన్ని ప్రతిఫలించేలా గీసిన చిత్రం అది. అమెరికాకు చెందిన ‘పబ్లిక్ ఆర్ట్ ఫండ్’ అనే నాన్–ప్రాఫిట్ ఆర్గనైజేషన్ న్యూయార్క్, బోస్టన్, షికాగోలలో పుష్పకుమారి చిత్రప్రదర్శన ఏర్పాటు చేసింది. ఈ చిత్రాలను సాధారణ కళాప్రేమికుల నుంచి చేయి తిరిగిన చిత్రకారుల వరకు ప్రశంసిస్తున్నారు. పేరులోనే ‘కళ’ ధ్వనించే మధుబని (బిహార్) జిల్లాలోని రంతి అనే గ్రామంలో పుట్టింది పుష్ప కుమారి. రంతి అనేది ఊరు అనడం కంటే ‘ఊరంత బడి’ అనడం సమంజసం. ఎటు చూసినా ఆబాలగోపాలం చేతిలో మధుబని మధుర కళావిన్యాసాలే! పుష్ప అమ్మమ్మ మహాసుందరిదేవి మధుబని ఆర్ట్‌ను అంతర్జాతీయస్థాయికి తీసుకువెళ్లిన తొలితరం కళాకారుల్లో ఒకరు. అమ్మమ్మ ఒడిలో ఆర్ట్పాఠాలు నేర్చుకుంది పుష్ప. పదమూడేళ్ల వయసులోనే కుంచె పట్టిన పుష్ప కాలంతో పాటు తన కళను మెరుగు పరుచుకుంటూ వస్తోంది. మొదట్లో అందరూ గీసినట్లే తాను గీసేది. తరువాత కాలంలో మాత్రం తనదైన ప్రత్యేకత గురించి ఆలోచించింది. ‘సింబాలిజం’ను సంప్రదాయ కళలోకి తీసుకురావడం ఒకింత కష్టమైన పని. అయితే ఆ కష్టం పుష్ప చిత్రాలలో కనిపించదు. దీనికి కారణం సింబాలిజంను సృజనాత్మకంగా మధుబనిలోకి తీసుకురావడమే. అమ్మమ్మ కుంచె నుంచి అందమైన చిత్రాలను నేర్చుకోవడమే కాదు, ఆమె నోటి నుంచి పురాణాలు, జానపద కథలు ఎన్నో విన్నది పుష్ప. అవేమీ వృథా పోలేదు. తన కళకు ఇంధనంగా పనికి వచ్చాయి. పుష్ప కళాప్రపంచంలో కేవలం కళ మాత్రమే కనిపించదు. సమాజం కూడా కనిపిస్తుంది. స్థూలంగా చెప్పాలంటే సంప్రదాయ కళ అనే పునాది మీద తనదైన దృశ్యభాషను సృష్టించుకుంది పుష్ప. సామాజిక,రాజకీయ సమస్యలు, జెండర్ సమస్యలు, పర్యావరణ సంబంధిత అంశాలను కేంద్రంగా చేసుకొని చిత్రాలు గీస్తుంది పుష్ప. నాగరికత అనే పేరుతో భూమాతను ఎంత హింస పెడుతున్నామో ‘ఎర్త్–2’ చిత్రంలో కనిపిస్తుంది. ఇటీవల కరోనా వైరస్‌ను దృష్టిలో పెట్టుకొని గీసిన చిత్రాలకు మంచి స్పందన లభించింది. ‘నేను గీసే ప్రతి చిత్రానికి తనదైన భావవ్యక్తీకరణ ఉండేలా చూసుకుంటాను’ అంటుంది పుష్ప. బోల్డ్ స్ట్రైకింగ్ ఫిగర్స్ గీయడంలో దిట్ట అనిపించుకున్న పుష్ప చిత్రాలలో రంగుల ఆర్భాటం కనిపించదు. సాదాసీదా ఇంక్బాటిల్నే ఆమె ఎక్కువగా ఇష్టపడుతుంది. ‘చిత్రాలు మౌనంగా కనిపిస్తాయి. కాని ఆ మౌనంతోనే అవి మనతో మాట్లాడేలా చేయడం ఆర్టిస్ట్ విశిష్ఠత’ అని చెబుతారు విశ్లేషకులు. పుష్పకుమారి గీసిన చిత్రాలను చూస్తే... అవి మౌనంగా మాట్లాడే చిత్రాలు అనే విషయం కొద్దిసేపట్లోనే తెలిసిపోతుంది. -
Bihar: ఆర్టిస్టు అవుతావా అని హేళన.. ఇప్పుడు లక్షల్లో సంపాదన.. అంతేనా!
చిన్నప్పటి నుంచి డాక్టర్ కావాలని కలలు కనేది సిన్నీ సోషియా. కానీ కుటుంబ ఆర్థిక పరిస్థితులు అనుకూలించక పోవడంతో డాక్టర్ కావాలనే కోరిక కలగానే మిగిలిపోయింది. అయినా నిరాశపడకుండా ఫైన్ ఆర్ట్స్ చదివింది. మధుబని పెయింటింగ్స్‌తో మంచి ఆర్టిస్టుగా గుర్తింపు తెచ్చుకుంది. బిహార్‌కు చెందిన ఓ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన సోషియాకు ముగ్గురు అక్కచెల్లెళ్లు. చిన్నప్పటి నుంచే ఎంతో చురుకుగా ఉండే సోషియా డాక్టర్ కావాలనుకుంది. కానీ కుటుంబ ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రం కావడంతో మెడిసిన్ చదవలేకపోయింది. దీంతో ఏం చేయాలా అని ఆలోచిస్తున్న సమయంలో స్నేహితురాలి సలహా మేరకు ఫైన్ ఆర్ట్స్ కోర్సులో చేరింది సోషియా. కానీ తన దగ్గర కోర్సు ఫీజు కట్టడానికి సరిపడినన్ని డబ్బులు లేవు. అయినా నిరాశపడలేదు సోషియా. తనకు బాగా వచ్చిన విద్య మెహందీ పెట్టడం. దానిని ఉపయోగించే పాకెట్ మనీ సంపాదించుకోవాలనుకుంది. పెళ్లికూతుళ్లకు మెహందీ డిజైన్లు వేస్తూ వచ్చిన డబ్బులను కాలేజీ ఖర్చులకు వాడుకునేది. ఇలా కష్టపడి ఆర్ట్స్ కోర్సు చేస్తోన్న సోషియాను చుట్టుపక్కల వాళ్లు ‘‘ఆర్టిస్ట్ అవుతావా? మెహందీ డిజైనర్ అవుతావా?’’ అని అవహేళన చేస్తుండేవారు. అవేవీ పట్టించుకోకుండా కోర్సు పూర్తిచేసి ఆర్టిస్ట్‌గా మారింది. తనకు వచ్చిన కళకు మెహందీ పెట్టే నైపుణ్యం తోడు కావడంతో అతికొద్దికాలంలో సోషియా మంచి ఆర్టిస్ట్‌గా మారింది. ఒక్కపక్క హెన్నా డిజైన్లు, వాల్ పెయింటింగ్స్, ఫ్యాబ్రిక్ పెయింటింగ్స్, రైళ్ల బోగీలపై మధుబని పెయింటింగ్స్ వేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. దీంతో అనేక ప్రాజెక్టులు చేసే అవకాశం లభించింది. బెగుసరాయ్‌లో ఒకటి, పాట్నాలో రెండు స్టూడియోలను నిర్వహిస్తూ లక్షల్లో సంపాదించడమేగాక దాదాపు ఇరవై అయిదు మంది ఆర్టిస్టులకు ఉపాధి కల్పిస్తోంది. సోషియా పెయింటింగ్‌లకు ఢిల్లీ నుంచి న్యూయార్క్ వరకు డిమాండ్ ఉండడం విశేషం. జీవితంలో ప్రతి ఒక్కరికీ కల ఉంటుంది. కలను నిజం చేసుకునే క్రమంలో అవాంతరాలు ఎదురు కావడం సహజం. అలాంటి సందర్భాల్లో కొన్నిసార్లు అనుకున్నది సాధించలేం. ఇటువంటి సమయంలో అంతా మన మంచికే జరిగిందనుకుని ముందుకు సాగాలి. అప్పుడే మనలో దాగిన మరో ప్రతిభ వెలుగులోకి వస్తుంది. అప్పుడు సరికొత్త నైపుణ్యంతో అనుకున్నదానికంటే మరింత ఉన్నత స్థాయికి ఎదగవచ్చు అన్నమాటకు సోషియా జీవితం ఉదాహరణగా నిలుస్తోంది. -
బాలీవుడ్ నటి సన్నీలియోన్ పాటపై దుమారం
-
మూడు రోజుల్లో ఆ వీడియోని తీసేయాలి!... సన్నీ లియోన్‌కి హోం మంత్రి వార్నింగ్!
ఇటీవల కాలంలో కొన్ని పాటలు తమ మనోభావాలు దెబ్బతీసేలా తీస్తున్నారంటూ చాలామంది కేసులు వేసి కోర్టులకెక్కడం జరుగుతోంది. ఈ మధ్య సమంత ఐటెం సాంగ్ గురించి కూడా అటువంటి విమర్శలే వచ్చాయి. అచ్చం అదే రీతీలో సన్నీ లియోన్ నటించిన "మధుబన్ మే రాధికా నాచే" ఆల్బమ్‌పై విమర్శలు వస్తున్నాయి. మొన్నటి వరకు పూజారులు ఆగ్రహం వ్యక్తం చేస్తే ఇప్పుడూ మధ్యప్రదేశ్ హోం మంత్రి సన్నీకి వార్నింగ్ ఇచ్చారు. అసలు విషయంలోకెళ్లితే....ఇటీవల సన్నీ హాట్‌గా నటించిన "మధుబన్ మే రాధికా నాచే" వీడియో ఆల్బమ్ విడుదలైన దగ్గర నుంచి సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ మేరకు మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా కూడా సన్నీ నటించిన ఆ మ్యూజిక్ ఆల్బమ్‌ని తీసేయడానికి 72 గంటలు సమయం ఇస్తున్నానంటూ సన్నీని, గాయకుడు సాకిబ్ తోషిని హెచ్చరించారు. ఈ క్రమంలో హోం మంత్రి నరోత్తమ్ మాట్లాడుతూ... "ఆ ఆల్బమ్ హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉంది. మేము రాధను పూజిస్తాం. సాకిబ్ తోషి తన మతానికి సంబంధించిన పాటలను ఈ విధంగా స్వరపరుచుకోవచ్చు కదా. ఇలాంటి పాటలు మమ్మల్ని బాధపెడతాయి. మూడు రోజుల్లో ఆ వీడియో తీయకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం" అని హెచ్చరించారు. అంతేకాదు డిజైనర్ సబ్యసాచి పై చర్యలు తీసుకుంటాం అని అన్నారు. పైగా ఈ ఆల్బమ్‌ని నిషేధించాలంటూ హిందు పూజారులు కూడా మండిపడిన సంగతి తెలిసిందే. ఈ మేరకు యుపిలోని బృందావన్‌కు చెందిన సంత్ నావల్ గిరి మహారాజ్ కూడా ఈ వీడియోని ప్రభుత్వం నిషేధించకపోతే కోర్టుకు వెళ్తాం అంటూ హెచ్చరించారు. నిజానికి "మధుబన్ మే రాధికా నాచే" పాటను 1960లో కోహినూర్ చిత్రం కోసం మహమ్మద్ రఫీ పాడారు. అయితే ఈ పాట రాధ, కృష్ణుల ప్రేమకు సంబంధించినది. అటువంటి పాటను సన్నీతో అశ్లీలంగా నృత్యం చేయించి తీయడంతోనే వివాదస్పదంగా మారింది. -
కళా‘కాండా’లు
బీహార్ రాష్ట్రంలోని మధుబని జిల్లాకు వెళ్తే... ఓ అద్భుత దృశ్యం కనిపిస్తుంది. అక్కడ ఉన్న ప్రతి చెట్టూ రంగురంగుల చిత్రాలతో వింత శోభతో కనిపిస్తూ ఉంటుంది. చెట్ల మీద చిత్రాలు ఉండటమేంటా అని వింతగా అనిపిస్తుంది కొత్త వాళ్లకు. కానీ అక్కడివాళ్లకు మాత్రం అది అత్యంత సుపరిచితమైన విషయం. పర్యావరణం పరిరక్షణ గురించి తీవ్రంగా కలత చెందిన ఓ వ్యక్తి మనసులో కలిగిన ఆలోచనకి ఫలితం! మధుబనిలో శష్ఠినాథ్ ఝా అనే పెద్దాయన గ్రామవికాస్ పేరుతో ఓ సంస్థను నడుపుతున్నారు. మానవ తప్పిదాల కారణంగా ప్రకృతిలో వస్తున్న మార్పుల గురించి తీవ్రంగా ఆలోచించారు ఝా. వంటచెరకు కోసం, ఇతరత్రా పనుల కోసం చెట్లను పెద్ద సంఖ్యలో నరికేయడం వల్ల బీహార్‌లో పచ్చదనం అంతకంతకూ తరిగిపోతోంది. అది గమనించిన ఆయన మనసు కలత చెందింది. పచ్చగా అలరారే తమ మధుబని జిల్లా కూడా మోడువారిపోతుందేమోనన్న భయం పట్టుకుందాయనకి. అందుకే వృక్షసంపదను కాపాడుకోవడానికి, తద్వారా పర్యావరణాన్ని పరిరక్షించుకోవడానికి ఓ అద్భుతమైన ఆలోచన చేశారు ఝా. దాని ఫలితమే చెట్లమీద దేవతల బొమ్మలు! మధుబని జిల్లాలో విద్యావంతులు తక్కువే. వారికి పర్యావరణ పరిరక్షణ పట్ల అవగాహన లేకపోవచ్చు కానీ, మనసుల నిండా భక్తి నిండి ఉందని ఝాకి తెలుసు. అందుకే ప్రతి చెట్టు మీదా దేవతల చిత్రాలను చిత్రించే పని మొదలు పెట్టారు. అలాగైతే ఎవరూ చెట్లు మీద గొడ్డలి వేయరని ఆయన నమ్మకం. అందుకే కొందరు ఔత్సాహిక చిత్రకారులతో కలిసి ఎండకు, వానకు చెరగని విధంగా చెట్ల మీద బొమ్మలు వేయిస్తున్నారు ఝా. ఇప్పటికే మధుబనిలో చాలావరకూ వేయడం పూర్తయ్యింది. మొత్తం బీహార్‌లోని చెట్లని పూర్తి చేసి దేశమంతా కూడా ఈ కార్యక్రమాన్ని విస్తరించాలని అనుకుంటున్నారు ఝా. ఒక చెట్టు మీద చిత్రాలు వేయడానికి రెండు నుంచి మూడు వేల దాకా ఖర్చవుతోందట. అయినా కూడా వెనకడుగు వేయడం లేదాయన. ‘ప్రకృతి బాగుంటే మనం బాగుంటాం’ అనేది ఆయన విశ్వాసం. ఆ విశ్వాసం, ఆయన పట్టుదలే పర్యావరణానికి శ్రీరామరక్ష!