ఫైనల్లో భవన్స్, వెస్లీ జట్లు | vesly, bhavans enter final in under 19 cricket tourny | Sakshi
Sakshi News home page

ఫైనల్లో భవన్స్, వెస్లీ జట్లు

Published Fri, Sep 23 2016 11:37 AM | Last Updated on Mon, Sep 4 2017 2:40 PM

vesly, bhavans enter final in under 19 cricket tourny

ఎడ్డీ ఐబారా క్రికెట్ టోర్నమెంట్  

సాక్షి, హైదరాబాద్: ఎడ్డీ ఐబారా అండర్-19 క్రికెట్ టోర్నమెంట్‌లో భవన్‌‌స జూనియర్ కాలేజ్, వెస్లీ బాలుర జూనియర్ కాలేజ్ జట్లు ఫైనల్లోకి ప్రవేశించాయి. గురువారం జరిగిన సెమీఫైనల్స్ మ్యాచ్‌లకు వర్షం ఆటంకం కలిగించడంతో టాస్ ఆధారంగా విజేతలను నిర్ణయించారు. విజనరీ కాలేజ్, భవన్‌‌స జట్ల మధ్య జరిగిన తొలి సెమీస్ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన విజనరీ కాలేజ్ 46.1 ఓవర్లలో 116 పరుగులకు ఆలౌటైంది.

 

ఆ తర్వాత వర్షం కారణంగా భవన్‌‌స ఇన్నింగ్‌‌ జరుగలేదు. వెస్లీ కాలేజ్, సెయింట్ జాన్స్ చర్చ్ కాలేజ్‌ల మధ్య జరిగిన  రెండో సెమీస్‌లోనూ వెస్లీ కాలేజ్ 42 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. మారుతి (72) అర్ధసెంచరీ చేశాడు. సెయింట్ జాన్స్ చర్చ్ బౌలర్లలో అజయ్ దేవ్ 4, హితేశ్ 3 వికెట్లు తీశారు. తర్వాత వర్షం కారణంగా సెరుుంట్ జాన్‌‌స ఇన్నింగ్‌‌సను రద్దుచేశారు. టాస్ పద్ధతిలో వెస్లీ జట్టు ఫైనల్‌కు అర్హత సాధించింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement