సాక్షి, హైదరాబాద్: కూచ్ బెహర్ అండర్-19 క్రికెట్ టోర్నమెంట్‌లో హైదరాబాద్ తొలిరోజు భారీ స్కోరు సాధించింది. ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ‘అసోసియేట్ అండ్ అఫిలియేట్’ జట్టుతో సోమవారం ప్రారంభమైన మ్యాచ్‌లో హైదరాబాద్ 90 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 327 పరుగులు చేసింది.
వినీత్ రెడ్డి (217 బంతుల్లో 143 బ్యాటింగ్; 16 ఫోర్లు, 1 సిక్సర్), నితీశ్ రెడ్డి (269 బంతుల్లో 171 బ్యాటింగ్; 22 ఫోర్లు) అజేయ సెంచరీలతో విజృంభించారు. బౌండరీలతో ప్రత్యర్థి జట్టు బౌలర్లను ఆటాడుకున్నారు. వీరిద్దరూ అజేయంగా 327 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. రాజీవ్‌గాంధీ స్టేడియంలో నాలుగు రోజుల మ్యాచ్‌లో తొలి వికెట్‌కు ఇదే అతిపెద్ద భాగస్వామ్యం కావడం విశేషం.