ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: ఓయూ ఇంటర్ కాలేజి క్రాస్ కంట్రీ చాంపియన్‌షిప్‌లో మహిళల టీమ్ టైటిల్‌ను నిరుటి విజేత కస్తూర్బా గాంధీ కాలేజి జట్టు నిలబెట్టుకుంది. విల్లా మేరీ కాలేజి జట్టుకు రెండో స్థానం లభించగా, సెయింట్ పాయిస్ కాలేజి జట్టుకు మూడో స్థానం దక్కింది. పురుషుల టీమ్ టైటిల్‌ను అవంతి కాలేజి జట్టు కైవసం చేసుకుంది. భవాన్స్ కాలేజి జట్టు రెండో స్థానం పొందగా, ఏవీ కాలేజి జట్టుకు మూడో స్థానం లభించింది.
ఉస్మానియా యూనివర్సిటీ గ్రౌండ్స్‌లో ఆదివారం ఈ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల విజేతలకు అవంతి కాలేజి ప్రిన్సిపల్ ప్రొఫెసర్ టి.మోహన్ సింగ్ ట్రోఫీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఓయూ ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ డెరైక్టర్ ప్రొఫెసర్ సత్యనారాయణ, ప్రొఫెసర్ ఎల్.బి.లక్ష్మీకాంత్ రాథోడ్, డాక్టర్ రాజేష్ కుమార్, ఇంటర్ కాలేజి టోర్నీ ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ బి.సునీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఫైనల్స్ ఫలితాలు:
పురుషుల విభాగం: 12 కి.మీ.: 1.ఎస్.దినేష్ కుమార్ (అవంతి కాలేజి), 2. సి.హెచ్. బుచ్చయ్య (జీసీపీఈ), 3.సయ్యద్ అహ్మద్ (అవంతి కాలేజి), 4.డి.లింగం (ిసిల్వర్ జూబ్లీ కాలేజి), 5. ఎ.రాకేష్ (ఏవీ కాలేజి), 6.వై.మారుతి (నిజామ్ కాలేజి), 7. ఎన్.మధు (రైల్వే కాలేజి) 8. సూర్య ప్రకాష్ (గవర్నమెంట్ కాలేజి), 9. నరేందర్ సింగ్ (అవంతి కాలేజి).
మహిళల విభాగం: 6 కి.మీ.: 1.వైష్ణవి (కస్తూర్బా గాంధీ కాలేజి), 2. షబ్నం ( విల్లా మేరీ కాలేజి), 3.గంగా జమున (కస్తూర్బా కాలేజి).
చాంప్స్ అవంతి, కస్తూర్బా
Published Sun, Sep 1 2013 11:45 PM | Last Updated on Fri, Sep 1 2017 10:21 PM
Advertisement
Advertisement