ఏవీ కాలేజిపై లయోలా అకాడమీ జయభేరి | AV college on to Loyola Academy | Sakshi
Sakshi News home page

ఏవీ కాలేజిపై లయోలా అకాడమీ జయభేరి

Published Wed, Oct 2 2013 12:02 AM | Last Updated on Fri, Sep 1 2017 11:14 PM

AV college on to Loyola Academy

ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: ఓయూ ఇంటర్ కాలేజి పురుషుల హ్యాండ్‌బాల్ టోర్నీలో లయోలా అకాడమీ, భవాన్స్ కాలేజి జట్లు ఫైనల్లోకి దూసుకెళ్లాయి. ఎల్బీ స్టేడియంలోని హ్యాండ్‌బాల్ మైదానంలో మంగళవారం జరిగిన సెమీస్‌లో లయోలా అకాడమీ జట్టు 15-12తో ఆంధ్రా విద్యాలయం (ఏవీ)పై విజయం సాధించింది.
 
  తొలి అర్ధభాగం ముగిసే సరికి లయోలా అకాడమీ జట్టు 9-7తో ఆధిక్యాన్ని సాధించింది. తర్వాత అదే ఊపును కొనసాగించి మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. రెండో సెమీఫైనల్లో భవాన్స్ కాలేజి 21-7తో అవంతి కాలేజి జట్టుపై గెలిచింది. ఈ టోర్నీలో బెస్ట్ ప్లేయర్స్‌గా అవార్డులను భాస్కర్ (ఓయూ సైన్స్ కాలేజి), మహావీర్ సింగ్(హెచ్‌ఎంవీ), ప్రమోద్(భద్రుకా కాలేజి),  హరీష్(గవర్నమెంట్ సిటీ కాలేజి), అశోక్(అవంతి కాలేజి), రాజ్ కుమార్(ఏవీ కాలేజి) టోర్నీ ఆర్గనైజింగ్ సెక్రటరీ కన్నారెడ్డి నుంచి అందుకున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement