ఏపీ ఆర్చరీ మాజీ సెక్రటరీ ఉమేశ్ చంద్ర మృతి | Andhra pradesh archery secretary umesh chandra died | Sakshi
Sakshi News home page

ఏపీ ఆర్చరీ మాజీ సెక్రటరీ ఉమేశ్ చంద్ర మృతి

Published Sun, Feb 2 2014 12:21 AM | Last Updated on Sat, Sep 2 2017 3:15 AM

Andhra pradesh archery secretary umesh chandra died

ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: ఆంధ్రప్రదేశ్ ఆర్చరీ అసోసియేషన్ మాజీ కార్యదర్శి ఉమేశ్ చంద్ర సక్సేనా (78) శనివారం సాయంత్రం మృతి చెందారు. ఏపీ సంఘానికి ప్రధాన కార్యదర్శిగాను, భారత ఆర్చరీ అసోసియేషన్ సంయుక్త కార్యదర్శిగాను ఆయన పని చేశారు. సక్సేనా హయాంలో రాష్ట్రంలో పలు జాతీయ ఆర్చరీ పోటీలు నిర్వహించారు. ఉమేశ్ చంద్ర మృతి పట్ల రాష్ట్ర ఆర్చరీ సంఘం అధ్యక్షుడు అనిల్ కామినేని తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
 
 ఈనెల 8 నుంచి ఫుట్‌బాల్ టోర్నీ
 సికింద్రాబాద్ ఓల్డ్ బొల్లారం యూత్ ఫుట్‌బాల్ క్లబ్ ఆధ్వర్యంలో 7-ఏ సైడ్ ఓపెన్ ఫుట్‌బాల్ టోర్నీ జరగనుంది. ఈ నెల 8 నుంచి ఓల్డ్ అల్వాల్ ప్లే గ్రౌండ్‌లో పోటీలు జరుగుతాయి. ఈ పోటీల్లో పాల్గొనాలనే ఆసక్తి గల జట్లు ఈ నెల 6లోగా తమ ఎంట్రీలను పంపించాలి. ఇతర వివరాలకు ఆర్గనైజింగ్ సెక్రటరీ జాన్ విక్టర్ (77025-36075)ను సంప్రదించవచ్చు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement