సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ ఫిడే రేటింగ్ చెస్ టోర్నమెంట్‌కు నగరం ఆతిథ్యమివ్వనుంది. ఈ నెల 29 నుంచి ఈ టోర్నమెంట్ జరగనుంది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల చెస్ సంఘాలు సంయుక్తంగా ఈ టోర్నీని నిర్వహించనున్నాయి. ఆలిండియా చెస్ సమాఖ్య సౌజన్యంతో 1500లోపు రేటింగ్ టోర్నమెంట్‌ను ఎల్బీస్టేడియంలో ఈ నెల 29 నుంచి జూలై 1 వరకు నిర్వహిస్తారు.
టోర్నీ మొత్తం ప్రైజ్‌మనీ రూ. 2 లక్షలు. మొత్తం 50 మందికి నగదు బహుమతులు అందజేస్తారు. ఇందులో పాల్గొనాలనుకునే చెస్ క్రీడాకారులు ఈ నెల 15వ తేదీలోపు తమ ఎంట్రీలను పంపాలి. మరిన్ని వివరాలకు జాతీయ చెస్ ఆర్బిటర్, టోర్నీ ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీకృష్ణను 9247143456, 9246141111 ఫోన్‌నంబర్లలో సంప్రదించాలి.
29న అంతర్జాతీయ ఫిడే చెస్
Published Sun, Jun 8 2014 1:38 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement
Advertisement