హైదరాబాద్ ఎగ్జిబిషన్ క్రీడలు
ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: హైదరాబాద్ ఎగ్జిబిషన్ సొసైటీ విద్యా సంస్థల క్రీడల్లో పురుషుల విభాగంలో సర్దార్ పటేల్ (ఎస్‌పీ) కాలేజి జట్టు వాలీబాల్, బాస్కెట్‌బాల్ టీమ్ టైటిల్స్‌ను సాధించింది. హైదరాబాద్ ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలో విక్టరీ ప్లే గ్రౌండ్‌లో ఈ పోటీలు జరిగాయి. విజేతలకు జేఎన్‌టీయూ రిజిస్ట్రార్ డాక్టర్ ఎన్.వి.రమణరావు ట్రోఫీలను అందజేశారు. ఫైనల్స్ ఫలితాలు ఇలా ఉన్నాయి.
ఫైనల్స్ ఫలితాలు:
పురుషుల విభాగం: వాలీబాల్: 1.ఎస్‌పీ కాలేజి, 2.శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కాలేజి (సూర్యాపేట).
బాస్కెట్‌బాల్: 1.ఎస్‌పీ కాలేజి, 2.ఎస్‌ఎల్‌ఎన్‌ఎస్ కాలేజి (భువనగిరి).
చెస్: 1.ఎస్‌పీ కాలేజి, 2.శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కాలేజి (సూర్యాపేట).
క్యారమ్ డబుల్స్: 1.జి.అంజన్ కుమార్-జె.స్వామి జోడి (ఎస్‌పీ కాలేజి). 2.పి.సాయి కుమార్- టి.సంతోష్ జోడి (ఎస్‌ఎల్‌ఎన్‌ఎస్ కాలేజి).
మహిళల విభాగం: టెన్నికాయిట్ (డబుల్స్): 1. రమ్య-షాలిని (కస్తూర్బా గాంధీ కాలేజి), 2. ఎస్.కె.హిజారత్-ఎస్.భాగ్యలక్షి్ష్మ జోడి (ఎస్‌ఎల్‌ఎన్‌ఎస్ కాలేజి).
చెస్:1. కస్తూర్బా గాంధీ కాలేజి 2. వనిత మహా విద్యాలయం.
క్యారమ్ డబుల్స్: 1.ఎం.శిరీష-ఎస్. సరిత జోడి (కస్తూర్బా గాంధీ కాలేజి), 2.దీపిక-బి.ఆలేఖ్య జోడి (వనిత మహా విద్యాలయం).
ఎస్‌పీ కాలేజి డబుల్ ధమాకా
Published Mon, Feb 17 2014 12:02 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement
Advertisement