సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా చెస్ సంఘం (ఆర్‌ఆర్‌డీసీఏ) నిర్వహించిన సబ్ జూనియర్ చెస్ సెలక్షన్ కమ్ టోర్నీలో టాక్టికా చెస్ అకాడమీకి చెందిన చేతన, పోతిరెడ్డి నితీశ్ విజేతలుగా నిలిచారు. ఆదివారం ముగిసిన ఈ టోర్నీలో చేతన బాలికల విభాగంలో, నితీశ్ బాలుర విభాగంలో గెలిచారు.
వీరితో పాటు బాలబాలికల విభాగంలో నలుగురు చొప్పున క్రీడాకారులు రంగారెడ్డి జిల్లా జట్లకు ఎంపికయ్యారు. ఈ జట్లు ఏపీ స్టేట్ సబ్ జూనియర్ చెస్ టోర్నీలో పాల్గొంటాయి. ఈ టోర్నీ మే 12 నుంచి 14 వరకు విశాఖపట్నంలో జరుగనుంది. సబ్-జూనియర్ బాలికల జట్టు: చేతన, పూజాంజలి, శ్రీలేఖ, సంజన; బాలురు: నితీశ్, హరిచరణ్ సాయి, నీరజ్ అనిరుధ్, ఆర్యగోపాల్.
రంగారెడ్డి చెస్ చాంప్స్ చేతన, నితీశ్
Published Mon, Apr 21 2014 12:13 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement
Advertisement