సెమీస్‌లో నవభారత్ హాకీ క్లబ్ | Nava bharat hockey club entered in semi final | Sakshi
Sakshi News home page

సెమీస్‌లో నవభారత్ హాకీ క్లబ్

Published Fri, May 23 2014 12:07 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

Nava bharat hockey club entered in semi final

ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: హెచ్‌హెచ్ ఇన్విటేషన్ హాకీ టోర్నమెంట్‌లో చింతల్‌బస్తీకి చెందిన నవభారత్ హాకీ క్లబ్(ఏ), రసూల్‌పురా ప్లేగ్రౌండ్(ఏ) జట్లు సెమీఫైనల్లోకి చేరాయి. హైదరాబాద్ హాకీ(హెచ్‌హెచ్) ఆధ్వర్యంలో జింఖానా హాకీ మైదానంలో గురువారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో నవభారత్ క్లబ్ జట్టు 7-0తో రసూల్‌పురా ప్లేగ్రౌండ్(బీ) జట్టుపై ఘన విజయం సాధించింది.
 
 నవభారత్ క్లబ్ జట్టు ఆటగాడు రాహుల్ రాజ్ హ్యాట్రిక్ గోల్స్ నమోదు చేశాడు. మహేందర్ రెండు గోల్స్ చేయగా, అరవింద్, హరీష్‌లు ఒక్కో గోల్ చేశారు. రెండో క్వార్టర్ ఫైనల్లో రసూల్‌పురా ప్లేగ్రౌండ్ (ఏ) జట్టు 6-0తో నవభారత్ క్లబ్ (బీ) జట్టుపై గెలిచింది. రసూల్‌పురా పీజీ (ఏ) జట్టులో సంపత్ మూడు గోల్స్ చేయగా, వివేక్ రెండు, దుర్గ ఒక గోల్ చొప్పున చేశారు. మూడో క్వార్టర్ ఫైనల్లో క్రాస్ వింగ్ జట్టు నుంచి ఇన్‌కమ్ ట్యాక్స్ జట్టుకు వాకోవర్ లభించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement