సీసీఎల్-4 చాంప్ కర్ణాటక
ఫైనల్లో కేరళ స్ట్రయికర్స్‌పై గెలుపు
సాక్షి, హైదరాబాద్ : డిఫెండింగ్ చాంపియన్ కర్ణాటక బుల్‌డోజర్స్ సెలబ్రిటీ క్రికెట్ లీగ్ (సీసీఎల్) టైటిల్‌ను నిలబెట్టుకుంది. ఎల్బీ స్టేడియంలో ఆదివారం జరిగిన ఫైనల్లో కర్ణాటక జట్టు 36 పరుగుల తేడాతో కేరళ స్ట్రయికర్స్‌ను చిత్తు చేసి నాలుగో సీజన్ విజేతగా నిలిచింది.
తొలుత బ్యాటింగ్‌కు దిగిన కర్ణాటక.. రాజీవ్ అద్భుత సెంచరీ (42 బంతుల్లో 112 నాటౌట్, 12 ఫోర్లు, 7 సిక్సర్లు), ధృవ్ శర్మ అర్ధ సెంచరీ (41 బంతుల్లో 56, 6 ఫోర్లు)లతో రాణించడంతో 211 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆ తర్వాత బరిలోకి దిగిన కేరళ స్ట్రయికర్స్ 8 వికెట్లు కోల్పోయి 175 పరుగులు మాత్రమే చేయగలిగింది. నందకుమార్ అర్ధ సెంచరీ (47 బంతుల్లో 78, 8 ఫోర్లు, 4 సిక్సర్లు)తో రాణించాడు. రాజీవ్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.