ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్ రాష్ట్ర ఓపెన్ ప్రైజ్ మనీ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ఈనెల 28 నుంచి 30 దాకా లింగంపల్లిలోని పీజేఆర్- జీహెచ్‌ఎంసీ ఇండోర్ స్టేడియంలో జరుగుతుంది. మెదక్ జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్(ఎండీబీఏ) ఆధ్వర్యంలో అండర్-10,13,15 బాలబాలికల సింగిల్స్, డబుల్స్ అంశాల్లో ఈ పోటీలను నిర్వహిస్తారు. ఆసక్తి గల వారు తమ ఎంట్రీలను ఈనెల 25లోగా పంపించాలి. ఇతర వివరాలకు ఎండీబీఏ సెక్రటరీ పి.సి.ఎస్.రావు(98498-02616)ను సంప్రదించాలి.
వచ్చేనెల 2న టీ స్టేట్ రన్...
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని జూన్ 2వ తేది సోమవారం ఉదయం 29వ విక్టరీ ప్లేగ్రౌండ్ నుంచి ‘టి’ రన్ నిర్వహించనున్నారు. తెలంగాణ స్పోర్ట్స్ ఫెడరేషన్(టీఎస్‌ఎఫ్) ఆధ్వర్యంలో జరిగే ఈ రన్ కోఠి నుంచి అమర వీరుల స్థూపం వరకు జరుగనుంది. ఈ రన్‌లో క్రీడాకారులు, విద్యార్థులు, ఉద్యోగులు, తెలంగాణ వాదులు అధిక సంఖ్యలో పాల్గొనాలని టీఎస్‌ఎఫ్ ప్రధాన కార్యదర్శి డి. రూపేశ్ కోరారు. వివరాలకు 90320-05518లో సంప్రదించవచ్చు.
28 నుంచి రాష్ట్ర ఓపెన్ బ్యాడ్మింటన్
Published Fri, May 16 2014 12:03 AM | Last Updated on Sat, Sep 2 2017 7:23 AM
Advertisement
Advertisement