ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: తెలంగాణ ఉద్యోగుల సంఘం (టీయూఎస్) మహిళా విభాగం ఆధ్వర్యంలో టేబుల్‌టెన్నిస్ ప్లేయర్ నైనా జైశ్వాల్, కరాటే క్రీడాకారిణి సయీదా ఫాలక్‌లను సన్మానించారు. మహిళా దినోత్సవం (మార్చి 8) సందర్భంగా నిర్వహించిన సదస్సులో అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్న క్రీడాకారిణులను శుక్రవారం ఘనంగా సత్కరించారు. ఇక్కడి ఎల్బీ స్టేడియంలోని ఒలింపిక్ భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో టీయూఎస్ మహిళా అధ్యక్షురాలు టి.నిర్మల, కన్వీనర్ కనకతారలతో పాటు పలువురు ఉద్యోగినులు పాల్గొన్నారు.
ఆ ఇద్దరు క్రీడాకారిణులతో పాటు కూచిపూడి కళాకారిణి సుహితనూ సన్మానించారు. తెలంగాణ పునర్నిర్మాణంలో మహిళల భాగస్వామ్యానికి ప్రభుత్వాలు ప్రణాళికలు రూపొందించాలని, ఉద్యోగినుల రక్షణ కోసం ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలని ఈ సదస్సులో తీర్మానాలు చేశారు. ఈ కార్యక్రమంలో టీయూఎస్ అధ్యక్షుడు సి.విఠల్, కోశాధికారి పి.పవన్ కుమార్ గౌడ్, వి.నిర్మల, సునీత, గీతారాణి, కాలేరు సురేష్ తదితరులు పాల్గొన్నారు.
నైనా, సయీదాలకు సన్మానం
Published Sat, Mar 8 2014 12:09 AM | Last Updated on Sat, Sep 2 2017 4:27 AM
Advertisement
Advertisement