హైదరాబాద్ పేరును పరిశీలిస్తున్నారు | hyderabad name investigating in under-17 world cup foot ball tournment | Sakshi
Sakshi News home page

హైదరాబాద్ పేరును పరిశీలిస్తున్నారు

Published Wed, Dec 25 2013 12:05 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

hyderabad name investigating in under-17 world cup foot ball tournment

ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: 2017లో భారత్‌లో జరిగే అండర్-17 ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నీ వేదికల్లో భాగంగా హైదరాబాద్ పేరును కూడా పరిశీలిస్తామని జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య అధ్యక్షుడు ప్రఫుల్ పటేల్ చెప్పారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ఫుట్‌బాల్ అసోసియేషన్(ఏపీఎఫ్‌ఏ) ఆయనకు విజ్ఞప్తి చేసింది.
 
 న్యూఢిల్లీలో ఇటీవల జరిగిన ఆలిండియా ఫుట్‌బాల్ సమాఖ్య సర్వసభ్య సమావేశంలో దాదాపు ఎనిమిదేళ్ల విరామానంతరం రాష్ట్రం తరఫున తొలిసారిగా ఏపీఎఫ్‌ఏ ప్రధాన కార్యదర్శి ఫల్గుణ పాల్గొన్నారు. తమ కోరికపై ప్రఫుల్ కుమార్ హామీ ఇచ్చినట్లు ఆయన ‘న్యూస్‌లైన్’తో తెలిపారు. ఇప్పటికే పలు అంతర్జాతీయ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లను హైదరాబాద్‌లో సమర్థవంతంగా నిర్వహించినట్లు ఆయన గుర్తు చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement