19 నుంచి జాతీయ స్కూల్స్ ఆర్చరీ టోర్నీ | 19 from the National Schools Archery Tournament | Sakshi
Sakshi News home page

19 నుంచి జాతీయ స్కూల్స్ ఆర్చరీ టోర్నీ

Published Thu, Jan 16 2014 11:59 PM | Last Updated on Sat, Sep 2 2017 2:40 AM

జాతీయ స్కూల్ ఆర్చరీ చాంపియన్‌షిప్ ఈనెల 19 నుంచి 23 వరకు గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో నిర్వహించనున్నారు.

ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: జాతీయ స్కూల్ ఆర్చరీ చాంపియన్‌షిప్ ఈనెల 19 నుంచి 23 వరకు గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో నిర్వహించనున్నారు. రంగారెడ్డి జిల్లా స్కూల్ గేమ్స్ సమాఖ్య (ఆర్‌ఆర్‌డీఎస్‌జీఎఫ్) ఆధ్వర్యంలో అండర్-14, 17 బాలబాలికల విభాగాల్లో జరిగే ఈ పోటీలకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి.

 దేశవ్యాప్తంగా 22 రాష్ట్రాల నుంచి దాదాపు 500 మంది క్రీడాకారులు, 200 మంది క్రీడాధికారులు పాల్గొంటారని ఆర్‌ఆర్‌డీఎస్‌జీఎఫ్ నిర్వహణ కార్యదర్శి ఎం.చంద్రశేఖర్‌రెడ్డి న్యూస్‌లైన్‌కు తెలిపారు. క్రీడాకారులకు అసౌకర్యం కలిగించకుండా రంగారెడ్డి జిల్లా యంత్రాంగం, జిల్లా విద్యాశాఖ అధికారుల సహకారంతో ఇప్పటికే పలు ఏర్పాట్లు చేసినట్లు ఆయన చెప్పారు.

 ఈ టోర్నీని సమర్థవంతంగా నిర్వహించేందుకు విజయవాడలోని ఆర్చరీ అకాడమీ నుంచి క్రీడా సామగ్రిని తెప్పిస్తున్నట్లు ఆయన తెలియజేశారు. ఈ టోర్నీ నిర్వహణకు జాతీయ స్కూల్ గేమ్స్ సమాఖ్య (ఎస్‌జీఎఫ్‌ఐ) తరఫున ఆర్చరీ అఫీషియల్స్‌తోపాటు రాష్ట్రంలోని ఆర్చరీ కోచ్‌ల సేవలను వినియోగించకోనున్నట్లు చెప్పారు. గచ్చిబౌలి  సమీపంలోని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్స్‌లో క్రీడాకారుల వసతి సౌకర్యాన్ని కల్పించినట్లు చంద్రశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement