ఎల్బీ స్టేడియం: తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌లో క్రీడలకు పెద్దపీట వేయనున్నట్లు క్రీడలు, యువజన సర్వీసుల శాఖ ముఖ్య కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. శుక్రవారం సచివాలయంలో తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ (టీఎస్‌ఏ) అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. బడ్జెట్‌లో క్రీడలకు కేటాయింపులు, పలు ప్రతిపాదనలపై ఆయన ఈ సందర్భంగా చర్చించారు.
రాష్ట్రంలో అమలవుతున్న క్రీడ పథకాలు, నూతనంగా నిర్మించనున్న స్పోర్ట్స్ హాస్టళ్లు, ఆధునిక క్రీడా సామాగ్రి కొనుగోలుకు కావాల్సిన బడ్జెట్ సిద్ధం చేయాలని అధికారులను లవ్ అగర్వాల్ ఆదేశించారు. వచ్చే రాష్ట్ర బడ్జెట్‌లో హైదరాబాద్‌లో వాటర్ స్పోర్ట్స్ కోసం ఆధునిక వాటర్ బోట్స్, షూటింగ్ రే ంజ్‌లో కొత్త ఆయుధాల కోసం సంబంధిత అధికారులు ప్రతిపాదనలు పంపాలని ఆయన సూచించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు స్వప్నమైన ‘బంగారు తెలంగాణ’లో భాగంగా రాష్ట్రంలో అత్యున్నత ప్రమాణాలతో, అధునాతన సదుపాయాలతో తెలంగాణ క్రీడా విశ్వవిద్యాలయం ఏర్పాటుకు అవసరమైన ప్రతిపాదనలు కూడా సిద్ధం చేయాలని లవ్ అగర్వాల్ క్రీడాధికారులను ఆదేశించారు. మన ఊరు-మన ప్రణాళికనూ రూపొందించాలన్నారు.
ఇందులో భాగంగా జిల్లాల్లో మెరుగైన మౌలిక సదుపాయాలు, రాణించిన క్రీడాకారులకు నగదు ప్రోత్సాహకాలు ఇవ్వడం, కొత్తగా కోచ్‌లు, ఉద్యోగుల నియామకాలు, క్రీడాసంఘాలకు నిధుల కేటాయింపులో ప్రాధాన్యత ఇస్తామని ఆయన చెప్పారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు పక్కదారి పట్టకుండా సమర్థంగా అమలు చేయాలని సూచించారు.
‘టి’ బడ్జెట్‌లో క్రీడలకు పెద్దపీట: లవ్ అగర్వాల్
Published Fri, Aug 1 2014 11:41 PM | Last Updated on Sat, Sep 2 2017 11:14 AM
Advertisement
Advertisement