Telangana State Budget
-
Telangana: ఖజానా కటకట!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర బడ్జెట్లో రూ.100 ఆదాయం కింద ప్రతిపాదిస్తే, ఆర్థిక సంవత్సరంలో ఆరు నెలలు ముగిసే సమయానికి రూ.39.41 మాత్రమే వచ్చాయి. కానీ బడ్జెట్లో రూ.100 ఖర్చు కింద ప్రతిపాదించగా, ఇదే ఆరు నెలల్లో ఖర్చు పెట్టింది మాత్రం రూ.39.75. అంటే బడ్జెట్ ప్రతిపాదనలతో పోలిస్తే ఆదాయం కంటే ప్రభుత్వ ఖర్చే ఎక్కువగా ఉందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. పన్ను రాబడుల్లో మందగమనం, కేంద్రం నుంచి రావాల్సిన ఆర్థిక సాయం రాకపోవడం, పన్నేతర ఆదాయం భారీగా తగ్గడం లాంటి పరిణామాలతో ఆరు నెలల తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి డోలాయమానంలో పడిందని ఈ గణాంకాల ద్వారా అర్థమవుతోంది. ముఖ్యంగా గత ఏడాదితో పోలిస్తే అమ్మకపు పన్ను మినహా మిగిలిన పన్ను రాబడుల్లోనూ తగ్గుదల నమోదు కావడం గమనార్హం. వచ్చింది రూ.లక్ష కోట్లే 2024–25 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.2.74 లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30 నాటికి ఆరు నెలలు ముగిసే సమయానికి ఈ ప్రతిపాదనల్లో కేవలం 39.41 శాతం అంటే రూ.1.08 లక్షల కోట్లు మాత్రమే ఖజానాకు చేరింది. ఇందులో పన్ను రాబడులు కేవలం రూ.69 వేల కోట్లు మాత్రమే కావడం గమనార్హం. బడ్జెట్ ప్రతిపాదనలను బట్టి ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.1.64 లక్షల కోట్లు పన్ను రాబడుల రూపంలో సమకూరాలి. అంటే ఆరు నెలలకు అందులో సగం లెక్కన కనీసం రూ.82 వేల కోట్లు రావాల్సి ఉంది. కానీ ఏకంగా రూ.13 వేల కోట్లు తక్కువగా కేవలం రూ.69 వేల కోట్లు మాత్రమే పన్నుల రూపంలో సమకూరాయి. జీఎస్టీ కింద రూ. 24,732 కోట్లు, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా రూ.7,251 కోట్లు, అమ్మకపు పన్ను ద్వారా రూ.16,081 కోట్లు, ఎక్సైజ్ పద్దు కింద రూ.9,492 కోట్లు వచ్చాయి. ఇందులో అమ్మకపు పన్ను మినహా అన్ని శాఖల్లోనూ గత ఏడాది కంటే తగ్గుదల కనిపించింది. ఇక పన్నేతర ఆదాయం అయితే గత ఏడాదితో పోలిస్తే చాలా దూరంలో ఉంది. గత ఏడాది బడ్జెట్ ప్రతిపాదనల్లో సెప్టెంబర్ నాటికి 74 శాతం పన్నేతర ఆదాయం రాగా, ఈ ఏడాది బడ్జెట్ ప్రతిపాదనల్లో ఇప్పటివరకు కేవలం 11.65 శాతం అంటే రూ.4,101 కోట్లు మాత్రమే వచ్చాయి. ఇప్పటివరకు రూ.లక్ష కోట్లు రాగా, మరో రూ.1.70 లక్షల కోట్లు రావాల్సి ఉందని, కానీ పరిస్థితి ఇలా కొనసాగితే మరో రూ.లక్ష కోట్లు రావడం కూడా గగనమేనని ఆర్థిక శాఖ వర్గాలంటున్నాయి. 30 శాతానికి పైగా అప్పులే రెవెన్యూ రాబడులు పోను రాష్ట్ర ప్రభుత్వ ఖజానా అప్పుల మీదనే ఆధారపడి నడుస్తోందని గణాంకాలు చెబుతున్నాయి. ఇప్పటివరకు వచ్చిన రూ.1.08 లక్షల కోట్ల ఆదాయంలో అప్పులు రూ.32,536 కోట్లు ఉండటం గమనార్హం. అంటే మొత్తం వచ్చిన దాంట్లో 30 శాతానికి పైగా అప్పుల ద్వారానే సమకూరిందన్నమాట. ఈ ఏడాది బడ్జెట్లో ప్రతిపాదించిన మొత్తం అప్పుల్లో ఇప్పటికే 66 శాతం సమీకరించిన నేపథ్యంలో రానున్న ఆరు నెలల్లో అప్పుల సమీకరణకు కూడా అడ్డంకులు ఎదురయ్యే అవకాశాలు లేకపోలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎఫ్ఆర్బీఎం నిబంధనలకు అనుగుణంగా రుణాల సమీకరణ జరగాల్సిన నేపథ్యంలో రానున్న ఆరునెలల పాటు సొంత ఆదాయం పెంచుకోవడం పైనే ప్రభుత్వం దృష్టి సారించాల్సి ఉంటుందని, లేదంటే ఖజానాకు తిప్పలు తప్పవని ఆర్థిక శాఖ అంచనా వేస్తోంది. ఇక కేంద్రం నుంచి సాయం కూడా ఆశించిన మేర అందడం లేదని ఆరునెలల లెక్కలు చెపుతున్నాయి. గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద కేంద్రం రూ.21 వేల కోట్లకు పైగా ఇస్తుందని బడ్జెట్లో ప్రతిపాదించగా, ఆరు నెలల్లో కేవలం రూ.2,447 కోట్లు (11 శాతం) మాత్రమే వచ్చాయి. ఖర్చులు పైపైకి.. ఓ వైపు ఆదాయం తగ్గుతుండగా, మరోవైపు ఖర్చుల అనివార్యత రాష్ట్ర ఖజానాను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఈ ఏడాది రూ.2.54 లక్షల కోట్లు ఖర్చవుతుందని బడ్జెట్లో ప్రతిపాదించగా, ఇప్పటివరకు రూ.1.01 లక్షల కోట్లు (39.75 శాతం) ఖర్చయినట్లు ఆర్థిక శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇందులో రెవెన్యూ పద్దు కింద రూ.41,802 కోట్లు, అప్పులకు వడ్డీల కింద రూ.13,187 కోట్లు, ప్రభుత్వ ఉద్యోగుల జీతాల కోసం రూ.21,279 కోట్లు, పింఛన్ల కోసం రూ. 8,560 కోట్లు, సబ్సిడీల రూపంలో రూ.6,376 కోట్లు వ్యయం జరిగింది. ఇక మూలధన వ్యయం కింద మరో రూ.9,924 కోట్లు ఖర్చు పెట్టాల్సి వచ్చింది. అనివార్య ఖర్చులు పెరిగాయని అర్థమవుతోందని, ఈ ఏడాదిలో కొత్త పథకాల అమలుకు ఎలాంటి అవకాశం లేదని, ఉన్న పథకాలనే కనాకష్టంగా కొనసాగించాల్సి వస్తుందని ఆర్థిక నిపుణులు చెపుతున్నారు. రాబడి తగ్గి ఖర్చులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం మరింత పొదుపుగా వ్యవహరించడంతో పాటు వీలున్నంత త్వరగా రాబడి మార్గాలను పెంచుకునే ప్రయత్నాలను ప్రారంభించకపోతే ఆర్థిక ఒడిదుడుకులు తప్పవని హెచ్చరిస్తున్నారు. అదనపు రాబడులొచ్చే ప్రణాళికలు చూడండి – సీఎస్‌తో సీఎం, డిప్యూటీ సీఎం ప్రత్యేక భేటీ రాష్ట్ర ఆదాయ వనరులపై ఇటీవల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కలు ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. ఉద్యోగ సంఘాల జేఏసీలతో సమావేశం అనంతరం ఈ సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయ పరిస్థితులను బేరీజు వేసుకుని అదనంగా ఖజానాకు రాబడులు వచ్చేందుకు ఎలాంటి ప్రణాళికలు చేపడతారో వివరిస్తూ వీలున్నంత త్వరగా నివేదికలు ఇవ్వాలని సీఎస్‌ను సీఎం, డిప్యూటీ సీఎంలు ఆదేశించినట్టు సమాచారం. -
రైతుకు వెన్నుపోటు.. పథకాలకు తూట్లు: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజల ఆశలపై నీళ్లు చల్లిందని మాజీ ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు విమర్శించారు. బడ్జెట్లో ఏ ఒక్క వర్గానికి కూడా స్పష్టమైన హామీ లేదని, రైతులను పొగుడుతున్నట్టుగా పొగుడుతూనే ఈ ప్రభుత్వం వెన్నుపోటు పొడిచిందని ధ్వజమెత్తారు. గత ప్రభుత్వం ఇచ్చినట్టు కాకుండా రైతుబంధు, రైతుభరోసా వంటి పథకాల్లో అనేక ఆంక్షలు పెట్టబోతున్నట్టుగా చెప్పి రైతులను మోసం చేశారని, ఇది రైతు శత్రువు ప్రభుత్వం అని ఆయన వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రసంగం పూర్తయిన అనంతరం గురువారం మధ్యాహ్నం మీడియా పాయింట్ వద్ద కేసీఆర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి మీడియాతో మాట్లాడారు. పూర్తి వివరాలు ఆయన మాటల్లోనే.. ‘బడ్జెట్ ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం తన నైజాన్ని బయటపెట్టుకున్నది. గత ప్రభుత్వం రాష్ట్రంలోని అన్నివర్గాల సంక్షేమం, ఆర్థికాభివృద్ధిని కాంక్షించి అనేక పథకాలు ప్రవేశపెట్టింది. అదే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఒక్క పథకంపై స్పష్టత లేదు. గొర్రెల పథకం లేదు..దళితబంధు లేదు యాదవులకు ఇస్తున్న గొర్రెల పెంపకం పథకాన్ని మొత్తానికి మూసేసినట్టు అర్థమవుతుంది. ఇప్పటికే యాదవులు చెల్లించిన డిపాజిట్లు కూడా వాసప్ ఇస్తుంది ఈ ప్రభుత్వం. కొత్త విషయం ఏమీలేదు. అత్యంత బడుగువర్గాలకు మేలు చేస్తున్నట్టుగా చెబుతూనే గొంతు కోసింది. దళితవర్గాల కోసం గతంలో ప్రవేశపెట్టిన విప్లవాత్మకమైన దళితబంధు పథకం ప్రస్తావనే లేదు. ఇదీ చాలా దురదృష్టకరం. దళిత సమాజంపై ఈ ప్రభుత్వానికి ఉన్న నిర్లక్ష్యానికి, ఫ్యూడల్ విధానానికి ఇంతకంటే గొప్ప నిదర్శనం అవసరం లేదు. మత్స్యకారులకు భరోసా లేదు. ఏ ఒక్కవర్గానికి కూడా ఈ బడ్జెట్లో భరోసా లేదు. బడ్జెట్లో విశేషమేమిటంటే ఆర్థికమంత్రి భట్టి విక్రమార్క డబ్బుల గురించి చెప్పినప్పుడు ప్రతిమాటను ఒత్తిఒత్తి పలకడం తప్ప కొత్తగా ఏమీలేదు. ఏ ఒక్క కొత్త సంక్షేమ పథకం కూడా లేని పరిస్థితి వచ్చింది. మహిళల పట్ల కూడా స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉండే. కానీ దీనిని కూడా లక్ష కోట్ల రుణాలు అంటూ వీళ్లేదో ఇస్తున్నట్టు చెప్పారు. ఉన్న స్కీంను చెప్పారే తప్ప..కొత్తగా ఏమీలేదు. వెరసి ఇది పాతదే. దురదృష్టం ఏమిటంటే మేము కూడా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కనీసం ఆరుమాసాల సమయం ఇవ్వాలని అనుకున్నాం. నేను కూడా శాసనసభకు పెద్దగా రాలేదు. కానీ, ఈ రోజు బడ్జెట్ చూస్తే ఏ ఒక్క పాలసీకి ఫార్ములేషన్ జరగలేదు. రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏ ఒక్క విషయంలో కూడా ఈ అర్బక ప్రభుత్వం ఇప్పటికీ పాలసీ పార్ములేషన్ చేసేటట్టుగా కనిపిస్తలేదు. ఇది పూర్తిగా రైతు శత్రువు ప్రభుత్వం వ్యవసాయం విషయంలో మాకు స్పష్టమైన అవగాహన ఉండే. ఈ రాష్ట్రంలో వ్యవసాయ స్థిరీకరణ జరగాలని, మేం రెండు పంటలకు రైతుబంధు ఇచ్చాం. వీళ్లెమో ఎగ్గొడుతామని చెబుతున్నారు. రైతులకు ఇచ్చిన డబ్బును పాడు చేసినం..చెడగొట్టినం.. దుర్వినియోగం చేసినం అనే పద్ధతిలో దురదృష్టకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. అంటే ఇది పూర్తిగా రైతు శత్రువు ప్రభుత్వం అని తెలుస్తుంది. ధాన్యం కొనుగోలు చేయలేదు. విద్యుత్ సరఫరా చేయడం లేదు. నీళ్లు సరఫరా చేయడం లేదు. చాలా ఇబ్బందులు పెడుతున్నారు. ఇంకా రైతుబంధు, రైతుభరోసా ప్రస్తావనే లేదు. రైతుభరోసా ఎప్పుడు వేస్తారని మా ఎమ్మెల్యేలు అరిస్తే కనీసం సమాధానం చెప్పడం లేదు. కాబట్టి రైతులను ఈ ప్రభుత్వం వంచించింది. వృత్తి కార్మికులను వంచించింది’అని కేసీఆర్ అన్నారు. భవిష్యత్‌లో బ్రహ్మాండంగా చీల్చి చెండాడబోతాం ‘ఇండస్ట్రీయల్ పాలసీ ఏమిటి? ఏం లేదు వట్టిదే గ్యాస్..ట్రాష్. ఇదేదో స్టోరీ టెల్లింగ్‌లాగా ఉంది తప్ప ఏం లేదు. రాష్ట్రంలో వ్యవసాయ పాలసీ ఏమిటి? పారిశ్రామిక పాలసీ ఏమిటి ? ఐటీ పాలసీ ఏమిటి? ఇంకా ఇతర అనేక పాలసీలు.. పేదవర్గాలకు సంబంధించిన పాలసీ ఏమిటి? అనే ఏ ఒక్కదానిపై కూడా స్పష్టత లేదు. చిల్లరమల్లర ప్లాట్‌ఫామ్స్ స్పీచ్ లాగా ఉంది తప్ప అది బడ్జెట్ ప్రసంగంలా లేదు. రాజకీయ సభల్లో చెప్పినట్టుగా ఉంది తప్ప ఏ ఒక్క పాలసీని కూడా.. నిర్దిష్టంగా ఈ పనిని మేం ఇలా సాధిస్తాం.. మా గోల్స్, టార్గెట్స్ ఇవి అనే పద్ధతి కానీ, పద్దు కానీ లేదు. ఇది పేదల బడ్జెట్ కాదు.. రైతుల బడ్జెట్ కాదు.. ఎవరి బడ్జెటో రేపు మీకు విశ్లేషణలో తెలుస్తది. భవిష్యత్‌లో బ్రహ్మాండంగా చీల్చి చెండాడబోతాం’అని కేసీఆర్ తేల్చి చెప్పారు. -
రాష్ట్ర రుణ ప్రణాళిక 1.61లక్షల కోట్లు
సాక్షి, హైదరాబాద్: ఈ ఆర్థిక సంవత్సరం వార్షిక రుణ ప్రణాళిక రూ. 1,61,120 కోట్లుగా నిర్దేశించారు. ఇం దులో వ్యవసాయ రంగానికి రూ.75,141 కోట్లు కాగా, పంట రుణాల లక్ష్యం రూ. 53,222 కోట్లుగా ఉంది. అందులో వానాకాలంలో 60%, యాసంగిలో 40% కలిపి రైతులకు వీటిని పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టు కున్నారు. ఈ మేరకు సోమవారం జరిగిన రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి (ఎస్ఎల్బీసీ) సమావేశం నిర్ణయం తీసుకుంది. ఈ సమావేశం పాల్గొన్న వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి 2020–21 ఆర్థిక సంవత్సరానికి చెందిన రాష్ట్ర వార్షిక రుణ ప్రణాళికను విడుదల చేశారు. రుణ ప్రణాళిక ప్రకారం గతేడాది కంటే ఈసారి మొత్తం రుణాలు 10.62 శాతం పెరిగాయి. ఇక పంట రుణాల విషయానికొస్తే గత ఆర్థిక సంవత్సరంలో రూ. 48,740 కోట్లుగా ఉంది. ఈసారి రూ. 53,222 కోట్లుగా నిర్దేశించుకున్నారు. అంటే 9.20 శాతం పెరిగింది. వ్యవసాయ, అనుబంధ రంగాలకు ఇవ్వాల్సిన దీర్ఘకాలిక రుణాలు రూ. 12,061 కోట్లు చూపారు. గతేడాది కంటే 5.38 శాతం పెంచారు. వ్యవసాయ రంగంలో మౌలిక సదుపాయల కల్పన కోసం రూ. 2,422 కోట్లు కేటాయించారు. ఇది గతం కంటే 16.02 శాతం పెంచారు. వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ. 7,435 కోట్లు కేటాయించారు. రుణ ప్రణాళికలో గతేడాదితో చూస్తే మొత్తంగా వ్యవసాయ రంగానికి 9.54 శాతం రుణాలు పెంచారు. ప్రధానంగా పంటల ఉత్పత్తి, మార్కెటింగ్, వ్యవసాయ సంబంధ మౌలిక సదుపాయల కల్పన, నీటి వనరులు, ఉద్యాన, పట్టు పరిశ్రమలు, అటవీ సంపద, పడావు భూములను అభివృద్ధి చేయడంతో పాటు వ్యవసాయ అనుబంధ రంగాలపై దృష్టి సారించారు. గత ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించుకున్న పంట రుణాల్లో 76.13 శాతమే పంపిణీ చేశారు. ఎంఎస్ఎంఈకి 35,196 కోట్లు సూక్ష్మ , చిన్న తరహా పరిశ్రమలకు సంబంధించి (ఎంఎస్ఎంఈ) రూ. 35,196 కోట్ల రుణాల పంపిణీ లక్ష్యంగా ఉంది. విద్యా రుణాలు రూ. 2,165.73 కోట్లు , గృహ సంబంధిత రుణాలు రూ. 8,048 కోట్లు, ఇతర ప్రాధాన్య రంగాలకు రూ. 2,167 కోట్లు పంపిణీ చేయాలని ప్రణాళికలో లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆత్మనిర్బర్ కింద రుణాలు... కరోనా నేపథ్యంలో ఆత్మనిర్బర్ భారత్ అభయాన్ కింద కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా ఇప్పటికే కొన్ని రంగాలకు ప్రత్యేకంగా రుణాలు మంజూరు చేసినట్లు ఎస్ఎల్బీసీ తన నివేదికలో వెల్లడించింది. ఎంఎస్ఎంఈలకు రూ. 2,513 కోట్లు మంజూరు కాగా ఇప్పటికే రూ. 1,688 కోట్లు అత్యవసర రుణం కింద అర్హులకు ఇచ్చారు. అదే సమయంలో రూ. 231 కోట్లు అర్హులైన రైతులకు ఇచ్చినట్లు తెలిపారు. 68,190 స్వయం సహాయక సంఘాల సభ్యులకు రూ. 370 కోట్లు అదనంగా ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. అదే విధంగా స్ట్రీట్ వెండర్స్‌కు కూడా ప్రత్యేక రుణం ఇస్తున్నట్లు ఎస్ఎల్బీసీ వెల్లడించింది. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు, కార్యదర్శి రొనాల్డ్ రాస్, వ్యవసాయశాఖ కార్యదర్శి జనార్ధన్‌రెడ్డి, ఎస్ఎల్బీసీ అధ్యక్షులు, ఎస్బీఐ సీజీఎం ఓం ప్రకాశ్ మిశ్రా, నాబార్డు సీజీఎం కృష్ణారావు, ఇతర బ్యాంకుల అధికారులు పాల్గొన్నారు. -
బడ్జెట్లో కేసీఆర్ కొత్త వాదన
-
మాంద్యం ముప్పు.. మస్తుగా అప్పు
సాక్షి, హైదరాబాద్ : బడ్జెట్ ప్రతిపాదనలనుబట్టి చూస్తే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఆర్థిక మాంద్యం ముంచేసిందని అర్థమవుతోంది. పన్ను రాబడుల్లో తగ్గిన వృద్ధి రేటు, ఆదాయ వనరులపై తిరోగమన ప్రభావం కారణంగా ఈ ఏడాది బడ్జెట్ లెక్కలు తారుమారయ్యాయి. ఆరు నెలలకుగాను ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్‌కన్నా రూ. 36 వేల కోట్ల మేర బడ్జెట్ ప్రతిపాదనలు తగ్గిపోవడం రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి నిదర్శనంగా నిలుస్తోంది. వస్తుసేవల పన్ను (జీఎస్టీ) అమల్లోకి వచ్చిన నాటి నుంచి మొదటి ఏడాది మాత్రమే కేంద్రం నుంచి రాష్ట్రం పరిహారం తీసుకోగా ప్రస్తుత ఆర్థిక మాంద్య పరిస్థితుల్లో ఏప్రిల్ నుంచి జూలై వరకు దాదాపు రూ. 875 కోట్లను కేంద్రం నుంచి పరిహారం కింద తీసుకోవాల్సిన పరిస్థితులు నెలకొనడం ఆర్థిక మాంద్య ప్రభావాన్ని కళ్లకు కట్టినట్టు చూపుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ ప్రతిపాదనల్లో చూపిన రూ. 33 వేల కోట్లకుపైగా అప్పులు, సీఎం తన ప్రసంగంలో చెప్పినట్లు భూముల విక్రయాల ద్వారానే రాష్ట్ర మనుగడ ఆధారపడేలా కనిపిస్తోంది. మరోవైపు పన్ను రాబడిపై ప్రభుత్వం గంపెడాశలు పెట్టుకున్నా పురోగతి కనిపించే పరిస్థితి లేకపోవడంతోనే విధిలేని పరిస్థితుల్లో బడ్జెట్‌ను తగ్గించి చూపారని ఆర్థిక నిపుణులంటున్నారు. పన్ను అంచనాల్లోనూ తిరోగమనమే... ఈ ఏడాది బడ్జెట్ లెక్కలనుబట్టి చూస్తే పన్ను అంచనాలు కూడా తగ్గిపోయాయి. గతేడాది రెవెన్యూ ఆదాయం కింద రూ. 1.30 లక్షల కోట్లు చూపగా సవరించిన అంచనాల్లో అది రూ. 1.19 లక్షల కోట్లకు తగ్గింది. ఈ ఏడాది బడ్జెట్ అంచనాల్లోనే రూ. 1.13 లక్షల కోట్లను రెవెన్యూ రాబడుల కింద చూపడం గమనార్హం. ఈ ఏడాది పన్ను రాబడిలో కూడా పురోగతి ఉండదనే ఆలోచనతోనే బడ్జెట్‌ను కుదించారని అర్థమవుతోంది. గతేడాది సవరించిన అంచనాలతో పోలిస్తే అప్పులు రూ. 9 వేల కోట్లు తక్కువగా చూపగా మొత్తం బడ్జెట్ అంచనాలు రూ. 36 వేల కోట్ల మేర తగ్గిపోయాయి. అంటే పన్ను, పన్నేతర రాబడులు ఆ మేరకు తగ్గిపోవచ్చనే అంచనాతోపాటు అంతకన్నా ఎక్కువ అప్పులు కూడా లభించే పరిస్థితి లేకపోవడం, కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లు తగ్గుతాయనే అంచనాలతోనే బడ్జెట్‌ను తక్కువ చేసి చూపారని ఆర్థిక నిపుణులంటున్నారు. పన్ను రాబడులను పరిశీలిస్తే ఈసారి రూ. 69,328.57 కోట్ల మేర పన్నుల ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. గతేడాది అంచనాలతో పోలిస్తే ఇది రూ. 4 వేల కోట్లు తక్కువ. అయితే పన్నేతర రాబడులు భారీగా పెరుగుతాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. గతేడాది అంచనాల్లో పన్నేతర రాబడులను రూ. 8,973 కోట్లుగా చూపగా సవరించిన అంచనాలకు వచ్చేసరికి అది కాస్తా రూ. 6,347 కోట్లకే పరిమితమైంది. కానీ ఈసారి మాత్రం పన్నేతర రాబడుల కింద ఏకంగా రూ. 15 వేల కోట్లకుపైగా చూపడం గమనార్హం. కేంద్రం వాటా ఎక్కువే... పన్ను రాబడిలో కేంద్రం వాటా గతేడాదికన్నా ఎక్కువే వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. గతేడాది రూ. 17,906 కోట్ల మేర పన్నులు, డ్యూటీల రూపంలో కేంద్రం నుంచి వాటాగా రాగా, ఈసారి రూ. 19,718 కోట్లు వస్తాయని బడ్జెట్లో ప్రతిపాదించారు. అలాగే రాష్ట్ర పన్నుల కింద గతేడాదికన్నా రూ. 3 వేల కోట్లు ఎక్కువగా రూ. 69,328 కోట్లు, విక్రయాలు, వ్యాపార పన్నుల కింద రూ. 47,789 కోట్లు, ఎక్సైజ్‌శాఖ నుంచి రూ. 10,901 కోట్లు వస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఇందులో ఎక్సైజ్ మినహా ప్రతి రాబడిలోనూ గతేడాదికన్నా ఎక్కువగానే వస్తుందని ప్రతిపాదించారు. రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ ద్వారా గతేడాది రూ. 10,313 కోట్ల రాబడి నమోదవగా ఈసారి అది రూ. 10,901 కోట్లకు పెరుగుతుందని బడ్జెట్ లెక్కల్లో చూపారు. ఖర్చులూ తక్కువే... రాబడులు తక్కువగా ఉంటాయనే అంచనాల నేపథ్యంలో ఈసారి రెవెన్యూ ఖర్చులను కూడా తక్కువ చూపారు. గతేడాది రూ. 1.25 లక్షల కోట్ల నికర ఖర్చును అంచనాల్లో చూపగా ఈసారి అంచనాల్లో దాన్ని రూ. 1.11 లక్షల కోట్లకు తగ్గించారు. ఇక మూలధన వ్యయంలో భారీ తగ్గుదల కనిపిస్తోంది. గతేడాది అంచనాల్లో రూ. 33 వేల కోట్లకుపైగా మూలధన వ్యయాన్ని ప్రతిపాదిస్తే ఈసారి దాన్ని దాదాపు సగం... అంటే రూ. 17,274 కోట్లకు తగ్గించడం గమనార్హం. అయితే రుణాలు, అడ్వాన్సుల కింద చెల్లింపులు, తాత్కాలిక రుణ చెల్లింపులు, ఇతర రుణ చెల్లింపులను మాత్రం గతేడాదితో పోలిస్తే ఎక్కువగా చూపెట్టారు. లోటు బడ్జెట్ రూ. 24 వేల కోట్ల పైమాటే... ఈసారి ప్రతిపాదనల్లో రూ. 24,081 కోట్లను ద్రవ్యలోటుగా చూపారు. గతేడాది ప్రతిపాదనల్లో రూ. 29 వేల కోట్లకుపైగా ద్రవ్యలోటు ఉండగా ఏడాది ముగిసేసరికి అది రూ. 28,722 కోట్లకు తగ్గింది. అయితే ఈసారి అందులో రూ. 4,700 కోట్ల మేర లోటు తగ్గుతుందని ప్రభుత్వం అంచనా వేసి ఈ మేరకు బడ్జెట్ అంచనాల్లో ప్రతిపాదించింది. ఇక రెవెన్యూ మిగులు విషయానికి వస్తే రూ. 2,044 కోట్లను మిగులు బడ్జెట్‌గా చూపింది. అప్పులు, భూముల విక్రయాలే దిక్కు... బడ్జెట్ ప్రతిపాదనలు, సీఎం ప్రసంగాన్నిబట్టి చూస్తే ఈ ఏడాది అప్పులు, భూముల విక్రయాలపైనే రాష్ట్ర ప్రభుత్వం కాలం గడపాల్సి వస్తుందని అర్థమవుతోంది. తాజా బడ్జెట్ ప్రతిపాదనల ప్రకారం ఈసారి మొత్తం బడ్జెట్లో 20 శాతానికిపైగా ఎక్కువ మొత్తాన్ని రుణాల ద్వారా సమీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం రూ. 33,444 కోట్ల రుణాలను ప్రతిపాదించింది. గతేడాదితో పోలిస్తే ఇది తక్కువే అయినా ఆ మేరకు మొత్తం బడ్జెట్ కూడా తగ్గిపోవడంతో గతేడాది తరహాలోనే ఈసారి కూడా అప్పులను ప్రతిపాదించింది. అదేవిధంగా రూ. వేల కోట్ల విలువైన భూముల విక్రయాల ద్వారా అదనపు ఆదాయం తీసుకొచ్చి ప్రజల అవసరాలను తీరుస్తామని, ఏ శాఖలో ఇబ్బంది కలిగినా సర్దుబాటు చేస్తామని సీఎం బడ్జెట్ ప్రసంగంలోనే చెప్పడం గమనార్హం. దీంతో అప్పులు, భూముల విక్రయాలపైనే ఆధారపడి ఈ ఆర్థిక సంవత్సరం ముందుకెళ్తుందనే భావన ఆర్థిక వర్గాల్లో వ్యక్తమవుతోంది. రాష్ట్ర బడ్జెట్లో భారీ కోత.. ఓటాన్ అకౌంట్లో రూ. 1.82 లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రతిపాదించగా పూర్తి స్థాయి బడ్జెట్‌కు వచ్చేసరికి అది రూ.1.46,492.3 కోట్లకు తగ్గి పోయింది. అదే 2018– 19 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే అంచనాల బడ్జెట్‌లోరూ.28 వేల కోట్ల తగ్గుదల కనిపిస్తోంది. 2018– 19గాను రూ. 1.74 లక్షల కోట్ల అంచనాలను ప్రతిపాదించగా సవరించిన అంచనాల్లో అది రూ. 1.61 లక్షల కోట్లకు తగ్గింది. ఇప్పుడు ప్రతిపాదించిన రూ. 1.46 లక్షల కోట్ల ప్రతిపాదనలు కూడా సవరించిన అంచనాలకు వచ్చేసరికి ఎంత తగ్గుతుందో, పరిస్థితులు చక్కబడితే ఎంత పెరుగుతుందో అనే అంశం ఆసక్తికరం. బడ్జెట్ స్వరూపం(రూ. కోట్లలో) -
ఉపాధి కల్పన, నిరుద్యోగ భృతిపై ప్రస్తావన లేదు
-
తెలంగాణ బడ్జెట్ అంచనాలు ఇవే
సాక్షి, హైదరాబాద్: 2019–20 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ రాష్ట్ర పూర్తి స్థాయి వార్షిక బడ్జెట్‌ను రూ.1,46,492.3 కోట్ల అంచనాతో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు(కేసీఆర్) సోమవారం అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. రాష్ట్రానికి రూ.1,13,099.92 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేశారు. ఆదాయ వ్యయం రూ.1,11,055.84 కోట్లు, మూలధన వ్యయం రూ.17,274.67 కోట్లుగా చూపించారు. రెవెన్యూ మిగులు రూ.2,044.08 కోట్లుగా అంచనా వేశారు. ఆర్థిక లోటు రూ. 24,081.74 కోట్లుగా చూపించారు. (చదవండి: తెలంగాణ బడ్జెట్ హైలైట్స్) బడ్జెట్ అంచనాలు కేంద్ర పన్నులు, సుంకాల వచ్చే ఆదాయం రూ.19,718.57 కోట్లు రాష్ట్రం విధించే పన్నుల ద్వారా వచ్చే రాబడి రూ.69,328.57 కోట్లు పన్నులు కాకుండా వచ్చే ఆదాయం రూ.15,875.03 కోట్లు గ్రాంటుల కింద వచ్చే నిధులు రూ. 8,177.75 కోట్లు -
‘ప్రభుత్వ వైఫల్యాలకు బడ్జెట్ నిదర్శనం’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సోమవారం అసెంబ్లీ ప్రవేశపెట్టిన రాష్ట్ర వార్షిక బడ్జెట్‌పై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ నిరాశగా ఉందన్నారు. తొమ్మిది నెలల ప్రభుత్వ వైఫల్యాలకు ఈ బడ్జెట్‌ను నిదర్శమన్నారు. బడ్జెట్లో నిరుద్యోగులకు ఉపాధి కల్పన, నిరుద్యోగ భృతిపై ప్రస్తావన లేకపోవడం చాలా బాధాకరమన్నారు. 2019-20 సంవత్సరానికి రూ.1, 46,492.3 కోట్లతో రాష్ట్ర బడ్జెట్‌ను సీఎం కేసీఆర్ ప్రతిపాదించిన విషయం తెలిసిందే. దీనిపై అసెంబ్లీ వద్ద మీడియా పాయింట్లో జీవన్ రెడ్డి మాట్లాడారు. ‘తెలంగాణ బడ్జెట్ ఆశ్చర్యాన్ని కలిగించింది. రుణమాఫీపై బడ్జెట్లో స్పష్టత ఇవ్వలేదు. నిరుద్యోగుల ఉపాధికల్పన, నిరుద్యోగ భృతిపై బడ్జెట్లో ప్రస్తావించకపోవటం బాధాకరం. కేసీఆర్ తన వైఫల్యాలను కేంద్రంపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కమీషన్ల బాగోతం బయటకు వస్తోందనే.. కాళేశ్వరానికి జాతీయ హోదా అడగడం లేదు. ఆరోగ్యశ్రీ అమలు చేస్తూనే... కేంద్ర పథకం ఆయుష్మాన్ భారత్ నిధులను తీసుకోవాలి’ అని అన్నారు. చదవండి: తెలంగాణ బడ్జెట్ హైలైట్స్ ఐఆర్, పీఆర్సీ పై బడ్జెట్ ప్రస్తావనలేదు: ఎమ్మెల్సీ నర్సీరెడ్డి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ నిరాశగా ఉంది. ఆర్ధిక అంచనాలను అంచనా వేయడంలో ప్రభుత్వ విఫలమయ్యింది. 5 నెలల కింద ప్రవేశపెట్టిన లక్ష 80 వేల కోట్ల బడ్జెట్ ఇప్పుడు ఎందుకు తగ్గింది. రైతుబంధు డబ్బులు ఎప్పుడు ఇస్తారు. రాష్ట్రంలో 59 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. ఉద్యోగులకు ఐఆర్, పీఆర్సీపై బడ్జెట్ ప్రస్తావనలేదు. ఆర్థిక మాంద్యంను తట్టు కునే విధంగా బడ్జెట్ రూపొందించాలి. నిరాశాజనకంగా బడ్జెట్ ఉంది: ఎమ్మెల్సీ రామచందర్ రావు రూ.36 వేలకోట్ల లోటు బడ్జెట్‌పై చర్చ జరగాలి. బడ్జెట్ నిరాశాజనకంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కొన్ని పథకాలను పూర్తి చేయలేక కేంద్ర ప్రభుత్వంపై నెపం నెడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తప్పును ఒప్పుకునే ప్రయత్నం చేయడం లేదు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాన్ని కేంద్రంపై నెట్టి తప్పించుకునే ప్రయత్నం చేస్తోంది. -
అవినీతి రహిత పాలన
-
దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తెలంగాణ
-
రైతు బంధుపై కేసీఆర్ వివరణ
సాక్షి, హైదరాబాద్: దేశంలో నెలకొన్న ఆర్థిక మాంద్యం ప్రభావం తెలంగాణపై పడిందని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు(కేసీఆర్) వెల్లడించారు. దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అగ్రగామి ఉందని అన్నారు. 2019–20 పూర్తి స్థాయి వార్షిక బడ్జెట్‌ను శాసనసభలో ఆయన ప్రవేశపెట్టారు. ఆర్థిక మాంద్యం ఉన్నా సంక్షేమ పథకాలు కొనసాగుతాయని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత మూలధన వ్యయం పెరిగిందని, తమ ప్రభుత్వ విధానాలతో మూల ధన వ్యయం పెరుగుతూ వస్తోందని తెలిపారు. జీడీపీ వృద్ధి రేటు 4.5 నుంచి 10.2 శాతానికి పెరిగిందన్నారు. ఐదేళ్లలో తెలంగాణ సంపద రెట్టింపు అయిందన్నారు. ఐటీ రంగంలో 11.5 శాతం, వ్యవసాయంలో 8.1 శాతం వృద్ధి నమోదయినట్టు చెప్పారు. ఐటీ ఎగుమతుల విలువ 100 శాతానికిపైగా పెరిగిందని, పారిశ్రామిక రంగంలో అదనంగా అభివృద్ధి సాధించామన్నారు. గత ఏడాదిన్నర దేశం తీవ్రమైన ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొంటోందని, ఈ ఏడాది తొలి త్రైమాసికంలో 5 శాతం అభివృద్ధి మాత్రమే నమోదైందని కేసీఆర్ తెలిపారు. ఆర్థిక మాంద్యం ఉందన్న విషయాన్ని గణాంకాలు ధ్రువీకరిస్తున్నాయని, దేశవ్యాప్తంగా వాహనాల ఉత్పత్తి 33 శాతం తగ్గిందన్నారు. వాహనాల కొనుగోలులో 10.6 శాతం తగ్గుదల కనిపిస్తోందని, విమానయాన రంగంపైనా ఆర్థిక మాంద్యం ప్రభావం ఉందని వెల్లడించారు. గూడ్స్ రైళ్ల బుకింగ్ కూడా తగ్గిందన్నారు. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా రూపాయి పతనమైందని, డాలర్‌తో రూపాయి మారకం విలువ 72.40కు పడిపోయిందన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి వచ్చినందుకు చింతిస్తున్నానని అన్నారు. మోటార్ వాహనాలు, ఎక్సైజ్ పాటు అన్ని రంగాల్లో ఆదాయం తగ్గుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. పన్నేతర వ్యయం 29 శాతం తగ్గిందన్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల్లో కేంద్రం కోత పెట్టిందని వాపోయారు. ఇతర రాష్ట్రాల్లో పరిస్థితి తెలంగాణ కంటే దారుణంగా ఉందని వెల్లడించారు. రైతు బంధు పథకం యథాతథంగా కొనసాగుతుందని కేసీఆర్ స్పష్టత నిచ్చారు. (చదవండి: తెలంగాణ బడ్జెట్ హైలైట్స్) -
లైవ్ అప్డేట్స్: తెలంగాణ బడ్జెట్ హైలైట్స్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు (కేసీఆర్) శాసనసభలో ప్రవేశపెట్టారు. 2019-20 సంవత్సరానికి రూ. 1, 46,492.3 కోట్లతో రాష్ట్ర బడ్జెట్‌ను సీఎం కేసీఆర్ ప్రతిపాదించారు. ఇందులో రెవెన్యూ వ్యయం రూ. 1,11,055 కోట్లు కాగా, మూలధన వ్యయం రూ. 17,274.67 కోట్లు.. బడ్జెట్ అంచనాల్లో మిగులు రూ. 2,044.08 కోట్లుగా సీఎం కేసీఆర్ చూపించారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు గత ఫిబ్రవరిలో రూ.లక్షా 82 వేల కోట్ల అంచనాలతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సెప్టెంబర్ 30తో కాలపరిమితి ముగియబోతున్న నేపథ్యంలో 2019–20కు సంబంధించిన పూర్తిస్థాయి వార్షిక చిట్టాపద్దును కేసీఆర్ సభ ముందు ఉంచారు. వాస్తవిక దృక్పథంతో ఈసారి బడ్జెట్‌ను రూపొందించామని, రాష్ట్ర బడ్జెట్‌పై దేశవ్యాప్తంగా నెలకొన్న తీవ్ర ఆర్థిక మాంద్యం ప్రభావం పడిందని సీఎం వివరించారు. దాదాపు 40 నిమిషాల పాటు సీఎం కేసీఆర్ బడ్జెట్ ప్రసంగాన్ని చదివి వినిపించారు. బడ్జెట్ ప్రసంగం ముగిసిన వెంటనే సభను 14వ తేదీ(శనివారం)కి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రెకటించారు. తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్ హైలైట్స్.. లైవ్ అప్డేట్స్ ఇవి.. ఆయుష్మాన్ భారత్ కంటే ఆరోగ్య శ్రీతోనే మేలు ఆరోగ్య శ్రీ కోసం ఏడాదికి రూ. 1,336 కోట్లు కేటాయింపు ఆరోగ్యశ్రీ ద్వారా 85 లక్షల 34వేల కుటుంబాలకు ప్రయోజనం ఆయుష్మాన్ భారత్ ద్వారా కేవలం 26లక్షల కుటుంబాలకు మాత్రమే మేలు పునర్విభజన చట్టం ప్రకారం వెనుకబడిన ప్రాంతాలకు రావాల్సిన రూ. 450 కోట్లను కేంద్రం ఇవ్వలేదు 43 రెవెన్యూ డివిజన్లను 69కి పెంచుకున్నాం 459 మండలాలను 584 మండలాలుగా చేసుకున్నాం గతంలో 68 మున్సిపాలిటీలు ఉంటే వాటి సంఖ్య 142కు పెంచుకున్నాం కొత్తగా ఏడు మున్సిపల్ కార్పొరేషన్లను ఏర్పాటు చేసుకొని.. 13కి పెంచుకున్నాం రెవెన్యూ డివిజన్లలో 28 డీఎల్పీవోల సంఖ్యను 68కి పెంచాం పోలీసు వ్యవస్థ పునర్వ్యవస్థీకరణ రాష్ట్రంలో శాంతి భద్రతల పర్యవేక్షణకు మరింత పటిష్టమైన చర్యలు శాంతిభద్రతలను పటిష్టం చేసేందుకు పోలీసు వ్యవస్థను పునర్వ్యవస్థీకరించాం కొత్తగా ఏడు పోలీసు కమిషనరెట్లను ఏర్పాటుచేసి.. వాటి సంఖ్యను 9కి పెంచాం పోలీసు సబ్ డివిజన్ల సంఖ్యను 163కి పెంచాం పోలీసు సర్కిళ్ల సంఖ్యను 668 నుంచి 717కి పెంచాం పోలీసు స్టేషన్ల సంఖ్యను 814కి పెంచాం అవినీతి రహిత పాలన తెలంగాణలో అవినీతి రహిత పాలన అందిస్తున్నాం కాలం చెల్లిన చట్టాల స్థానంలో కొత్త చట్టాలు తెచ్చాం అవినీతికి ఆస్కారం లేకుండా పారదర్శకంగా ప్రభుత్వ సేవలు అందిస్తున్నాం పంచాయతీరాజ్ శాఖ బలోపేతానికి ఖాళీలను భర్తీ చేస్తాం స్థానిక సంస్థలకు నిధుల కొరత రాకుండా కట్టుదిట్టమైన విధానం గ్రామపంచాయతీలకు కేంద్రం ఇచ్చే నిధులకు సమానంగా రాష్ట్రం నుంచి నిధులు ఇస్తున్నాం గ్రామపంచాయతీలకు ప్రతినెలా రూ. 339 కోట్లు అందించాలని నిర్ణయం ఆర్థిక లోటు రూ. 24,081.74 కోట్లు 2019-20 సంవత్సరానికి రూ. 1, 46,492.3 కోట్లతో రాష్ట్ర బడ్జెట్ రెవెన్యూ వ్యయం రూ. 1,11,055 కోట్లు మూలధన వ్యయం రూ. 17,274.67 కోట్లు బడ్జెట్ అంచనాల్లో మిగులు రూ. 2,044.08 కోట్లు రాష్ట్ర ఆర్థిక లోటు రూ. 24,081.74 కోట్లు రైతుబంధు, రైతుబీమా నిరంతరం రైతుబంధు, రైతుబీమా పథకాలు నిరంతరం కొనసాగుతాయి పంట రుణ మాఫీ కోసం రూ.6వేల కోట్లు కేటాయిస్తున్నాం రైతుబంధు కోసం 12వేల కోట్లు కేటాయింపు రైతుబీమా ప్రీమియం చెల్లింపు కోసం రూ.1,137కోట్లు కేటాయింపు రైతులకు ఇచ్చే ఉచిత విద్యుత్ కోసం ఇప్పటివరకు రూ. 20,925 కోట్లు ఖర్చు ఐదేళ్లలో అభివృద్ధి, సంక్షేమానికి 5.37 లక్షల కోట్ల ఖర్చు ఉదయ్ పథకం ద్వారా రుణభారం రూ. 9,695 కోట్లు ప్రభుత్వమే భరిస్తుంది విద్యుత్ సంస్థలకు సింగరేణి చెల్లించాల్సిన బకాయిలు రూ. 5,772 కోట్లు ప్రభుత్వమే చెల్లించింది గ్రామపంచాయతీలకు రూ. 2,714 కోట్లు కేటాయింపు పురపాలక సంఘాలకు రూ. 1,764 కోట్లు కేటాయింపు కొత్త పంచాయతీరాజ్, మున్సిపల్ చట్టాల ద్వారా గ్రామాలు, పట్టణాల్లో ఉన్నతస్థాయి సేవలు గ్రామాలు, పట్టణాల ప్రగతి కోసం ఈ నెల 6 నుంచి 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ఆసరా పెన్షన్ల కోసం రూ. 9,402 ఓట్లు కేటాయింపు కొత్త జోనల్ వ్యవస్థతో స్థానికులకు 95శాతం ఉద్యోగాలు త్వరలోనే 57 ఏళ్లు నిండిన వారందరికీ వృద్ధాప్య పెన్షన్ బీడీ కార్మికుల పీఎఫ్ కటాఫ్ డేట్‌ను ప్రభుత్వం తొలగించింది ఇంగ్లిష్ మీడియం రెసిడెన్షియల్ పాఠశాలలను యథాతథంగా కొనసాగింపు అభివృద్ధి, సంక్షేమం కోసం ఈ ఐదేళ్లలో రూ. 5,37,373 కోట్లు ఖర్చు చేశాం కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు కోసం అందినవి కేవలం రూ. 31,802 కోట్లు మాత్రమే బకాయిలు చెల్లించాకే కొత్త పనులు ఆర్థిక మాంద్యం వల్ల ఆదాయం తగ్గింది ఆదాయం తగ్గినా పరిస్థితుల్లో మార్పు వస్తుందని ఆశాభావం వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా బడ్జెట్ రూపకల్పన రానున్న రోజుల్లో పరిస్థితి మెరుగుపడి ఆదాయం పెరుగుతుందని అంచనా బకాయిలు చెల్లించాకే కొత్త పనులు చేపట్టాలని విధాన నిర్ణయం పరిమితులకు లోబడి ప్రభుత్వ మార్గనిర్దేశాల ప్రకారం ఖర్చు నిధుల ఖర్చుపై మంత్రులు, కార్యదర్శులకు ఆర్థిక శాఖ నుంచి స్పష్టమైన సూచనలు తెలంగాణపైనా ఆర్థిక సంక్షోభ ప్రభావం భీకరమైన జీవన విధ్వంసం నుంచి తెలంగాణ కుదుటపడింది తీవ్రమైన ఆర్థిక మాంద్యం దేశంలోని అన్ని రంగాలపై ప్రభావం చూపుతోంది దేశవ్యాప్తంగా వాహనాల ఉత్పత్తి 33శాతం తగ్గింది వాహనాల అమ్మకాలు 10.65శాతం తగ్గాయి రూపాయి మారకం విలువ దారుణంగా పడిపోయింది దేశంలో నెలకొన్న ఆర్థిక సంక్షోభ ప్రభావం తెలంగాణపై కూడా పడింది తెలంగాణకు జీఎస్టీ పరిహారం తీసుకోవాల్సిన అవసరం రాలేదు జూన్ నెలలో తీసుకున్న జీఎస్టీ పరిహారం ఏప్రిల్, మే నెలల కంటే నాలుగు రెట్లు ఎక్కువ గతంలో ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అంచనాలకు నేటికీ చాలా వ్యత్యాసముంది కేంద్రానికి పన్నుల ద్వారా వచ్చే ఆదాయంలో 1.36శాతం వృద్ధి మాత్రమే సాధ్యమైంది. ఈ ఆర్థిక సంవత్సరం 6.61శాతం వృద్ధి మాత్రమే సాధ్యమైంది మొత్తంగా పన్నేతర ఆదాయం 29శాతం తగ్గింది ఐదేళ్లలో తెలంగాణ సంపద రెట్టింపు తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రం ఆర్థికంగా దృఢంగా మారింది 2013-14లో జీఎస్డీపీ విలువ 4,51,581 కోట్లు ఉండగా.. ప్రస్తుతం రెట్టింపయింది రాష్ట్ర జీఎస్డీపీ (రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తి) వృద్ధిరేటు 4.5శాతం నుంచి 10.2శాతానికి పెరిగింది ఐదేళ్లలో తెలంగాణ సంపద రెట్టింపు అయింది వివిధ ఆర్థిక సంస్థలిచ్చిన నిధులను మూలధన వ్యయంగా ఖర్చు చేశాం నిధులను ఖర్చు చేసే విషయంలో ప్రభుత్వం నిబద్ధతతో ఉంది గత ఐదేళ్లలో పెట్టుబడి వ్యయం ఆరురెట్లు పెరిగింది సమర్థవంతమైన ఆర్థిక విధానం వల్ల అన్ని రంగాలకు నిరంతర విద్యుత్ సరఫరా అందిస్తున్నాం వ్యవసాయ రంగానికి 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇస్తున్నాం రాష్ట్ర రైతాంగం కోసం రైతుబంధు, రైతు బీమా పథకాలను అమలు చేస్తున్నాం రాష్ట్రంలో 6.3శాతం అదనపు వృద్ధి రేటను సాధించాం వ్యవసాయ రంగంలో 2018-19నాటికి 8.1శాతం వృద్ధిరేటును నమోదుచేశాం ఐటీ రంగంలో 2018-19 నాటికి 11.05శాతం వృద్ధిరేటు సాధించాం 2018-19నాటికి లక్షా 10 వేల కోట్ల ఐటీ ఎగుమతులు నమోదయ్యాయి మిషన్ కాకతీయ ద్వారా వేలాది చెరువులను పునరుద్ధరించాం వందలాది గురుకులాల్లో లక్షలాది విద్యార్థులకు కార్పొరేట్ విద్య అందుతోంది దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తెలంగాణ 2014 జూన్‌లో నూతన రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది ఐదేళ్ల స్వల్ప వ్యవధిలోనే రాష్ట్రం అద్భుతమైన ప్రగతిని సాధించింది దేశంలోనే తెలంగాణ అగ్రగామి రాష్ట్రంగా నిలిచింది వినూత్నమైన పథకాలను తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తోంది రాష్ట్రం ఏర్పడినప్పుడు నిర్దిష్టమైన ప్రతిపాదికలు ఏమీ లేవు తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రం ఆర్థికంగా దృఢంగా మారింది 2013-14లో జీఎస్డీపీ విలువ 4,51,581 కోట్లు.. రాష్ట్ర జీఎస్డీపీ వృద్ధిరేటు 4.5శాతం నుంచి 10.2శాతానికి పెరిగింది ఐదేళ్లలో తెలంగాణ సంపద రెట్టింపు అయింది వివిధ ఆర్థిక సంస్థలిచ్చిన నిధులను మూలధన వ్యయంగా ఖర్చు చేశాం రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం.. ప్రముఖ కవి కాళోజీ జయంతి సందర్భంగా అసెంబ్లీ లాంజ్‌లో కాళోజీ చిత్రపటానికి నివాళులర్పించిన సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, సీఎం కేసీఆర్, మంత్రులు, ఎమ్మెల్యేలు బడ్జెట్ ప్రతులను సభాపతికి అందజేసిన ఆర్థిక మంత్రి హరీశ్‌రావు -
నేడే తెలంగాణ రాష్ట్ర బడ్జెట్
-
నేడే తెలంగాణ రాష్ట్ర బడ్జెట్
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను సోమవారం శాసనసభలో ప్రవేశపెట్టనున్నారు. దాదాపు రూ.లక్షా 65 వేల కోట్ల అంచనాలతో పూర్తిస్థాయి రాష్ట్ర బడ్జెట్ ప్రతిపాదనలను ప్రభుత్వం సిద్ధం చేసిందని తెలిసింది. సీఎం కె.చంద్రశేఖర్‌రావు నేతృత్వంలో ఆదివారం రాత్రి ప్రగతిభవన్‌లో సమావేశ మైన రాష్ట్ర మంత్రివర్గం కొత్త బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. దీంతోపాటే వికారాబాద్ జిల్లాను చార్మినార్ జోన్లో కలుపుతూ నిర్ణయం తీసుకుంది. సీఎం కేసీఆర్ సోమవారం ఉదయం 11.30 గంటలకు శాసనసభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టి ప్రసంగించనున్నారు. ఇటు ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు శాసనమండలిలో బడ్జెట్‌ను ప్రవేశపెట్ట నున్నారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు గత ఫిబ్రవరిలో రూ.లక్షా 82 వేల కోట్ల అంచనాలతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టగా, సెప్టెంబర్ 30తో కాలపరిమితి ముగియబోతోంది. ఈ నేపథ్యంలో 2019–20కు సంబంధించిన పూర్తి స్థాయి వార్షిక బడ్జెట్‌ను సోమవారం ప్రవేశపెడుతున్నారు. ఆర్థిక మాంద్యం నేపథ్యంలో.. దేశవ్యాప్తంగా తీవ్ర ఆర్థిక మాంద్యం నెలకొన్న నేపథ్యంలో వాస్తవిక దృక్పథంతో బడ్జెట్ రూపకల్పన జరుపుతున్నట్లు ఇప్పటికే సీఎం కేసీఆర్ ప్రకటిం చారు. ఆర్థిక మాంద్యం దేశంలోని అన్ని రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపుతోందని, ప్రజల్లో వస్తు, సేవల కొనుగోళ్ల శక్తి క్షీణించి వివిధ రకాల పన్నుల రూపంలో రాష్ట్రాలకు రావాల్సిన ఆదాయం పడిపోయిందని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు పేర్కొ న్నాయి. ఇతర రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణ పరిస్థితి మెరుగ్గానే ఉన్నా, ఇకపై కొంత జాగ్రత్తలు తీసుకోక తప్పదని రాష్ట్రప్రభుత్వం అభిప్రాయానికి వచ్చింది. ఈ నేపథ్యంలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌తో పోల్చితే పూర్తి స్థాయి బడ్జెట్లో నిధుల కేటాయింపుల్లో కోతలు తప్పవని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌తో పోల్చితే పూర్తి స్థాయి బడ్జెట్‌ను 8 నుంచి 12 శాతం వరకు కుదించే అవకాశాలున్నాయి. బడ్జెట్ అంకెల్లో చూస్తే రూ.14 వేల కోట్ల నుంచి రూ.22 వేల కోట్ల వరకు కేటాయింపుల్లో కోతపడవచ్చని తెలిసింది. ఎప్పటిలాగే బడ్జెట్లో వ్యవసాయం, సంక్షేమ రంగాలకు పెద్ద పీట వేయనుండగా, నీటిపారుదల రంగానికి కొంత వరకు నిధులను కత్తిరించనున్నారని చర్చ జరుగుతోంది. సీఎంకు విప్ల కృతజ్ఞతలు కొత్తగా నియమితులైన అసెంబ్లీ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్, మండలి చీఫ్ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు, ఇతర విప్‌లు ఆదివారం రాత్రి ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్‌ను కలసి కృతజ్ఞతలు తెలిపారు. అసెంబ్లీ, మండలిలో విప్ల బాధ్యతలను సీఎం వారికి వివరించారు. -
తెలంగాణ శాసన సభ నిరవధిక వాయిదా
-
ఇదీ బడ్జెట్ సమావేశాల రికార్డు
⇒ తక్కువ వ్యవధిలో..ఎక్కువ పద్దులపై చర్చ ⇒ రెండు వారాల్లోనే ముగిసిన సమావేశాలు ⇒ మొత్తం 72 గంటల 33 నిమిషాలపాటు చర్చలు ⇒ అయిదు బిల్లులకు ఆమోదం.. సభ నిరవధిక వాయిదా ⇒ బడ్జెట్.. పద్దులపై చర్చా సమయం సాక్షి, హైదరాబాద్: గతంలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు కేవలం 13 రోజుల్లోనే ముగిశాయి. చివరి రోజైన సోమవారం ద్రవ్య వినిమయ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. సభ ప్రారంభం కాగానే ద్రవ్య వినిమయ బిల్లు, కాగ్ నివేదికలను ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ సభలో ప్రవేశపెట్టారు. సుదీర్ఘ చర్చ జరిగిన అనంతరం సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ మదుసూధనాచారి ప్రకటించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఏపీ అసెంబ్లీ రూల్స్ ప్రకారం బడ్జెట్ సమావేశాలు కనీసం 24 రోజులు నిర్వహించాలనే నిబంధన ఉండేది. సాధారణ చర్చకు 6 రోజులు, డిమాండ్లపై ఓటింగ్‌కు 18 రోజులు కేటాయించాల్సి ఉంది. తెలంగాణ అసెంబ్లీ రూల్స్‌లో ఈ నిబంధనను సవరించారు. బీఏసీతో సంప్రదింపుల మేరకు బడ్జెట్ సమావేశాలు ఎన్ని రోజులుండాలనేది స్పీకర్ నిర్ణయానికి అప్పగించారు. అందుకే ఈసారి బడ్జెట్ సమావేశాలు రికార్డు స్థాయిలో 2 వారాల్లోనే ముగిశాయి. మొత్తం 13 రోజుల పాటు జరిగిన సమావేశాల్లో 72.33 గంటల పాటు చర్చ జరిగింది. మొత్తం 65 మంది సభ్యులు సభలో మాట్లాడారు. 168 ప్రశ్నలు, 192 అనుబంధ ప్రశ్నలకు సభలో సమాధానమిచ్చారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుతో పాటు మంత్రులు 29 గంటల 09 నిమిషాల పాటు మాట్లాడారు. సభలో టీఆర్ఎస్ 11.14 గంటలు, కాంగ్రెస్ 15.14 గంటలు, ఎంఐఎం 5.07 గంటలు, బీజేపీ 6.32 గంటలు, టీడీపీ 2.57 గంటలు, సీపీఐ 6 నిమిషాలు, సీపీఎం 1.48 గంటల పాటు మాట్లాడినట్లుగా రికార్డయింది. నాలుగ్గంటలు మాట్లాడిన సీఎం: మొత్తం సమావేశాల్లో సీఎం కేసీఆర్ 4.12 గంటలు మాట్లాడగా ప్రతిపక్ష నేత జానారెడ్డి 3.15 గంటలు, ఎంఐఎం నేత అక్బరుద్దీన్ 2.08 గంటలు, బీజేపీ నేత కిషన్‌రెడ్డి 2.34 గంటలు మాట్లాడారు. ఈనెల 23వ తేదీన రికార్డు స్థాయిలో ఉదయం పది గంటలకు మొదలైన సభ రాత్రి 10.36 గంటల వరకు సుదీర్ఘంగా కొనసాగింది. ఈ సమావేశాల్లో అయిదు బిల్లులు ఆమోదం పొందాయి. కీలకమైన ఎస్సీ ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి బిల్లుతో పాటు భూదాన్ చట్ట సవరణ బిల్లు, ప్రజాప్రతినిధుల జీతాలు, అలవెన్సుల చట్ట సవరణ బిల్లు, ద్రవ్య వినిమయ బిల్లులు ఆమోదం పొందాయి. తొలి రోజున గవర్నర్ నరసింహన్ ప్రసంగంతో ప్రారంభమైన సమావేశాలు చివరి రోజున 2015–16 ఆర్థిక సంవత్సరపు కాగ్ ఆడిట్ నివేదికల సమర్పణతో ముగిశాయి. గవర్నర్ ప్రసం గిస్తుండగా సభలో అనుచితంగా వ్యవహరించారనే కారణంగా టీడీపీ సభ్యులు రేవంత్‌రెడ్డి, సండ్ర వెంకట వీరయ్యను సమావేశాలు ముగిసేంత వరకు బహిష్కరించారు. పద్దుల పైనే ఎక్కువ చర్చ బడ్జెట్‌పై సాధారణ చర్చను ప్రధాన ప్రతిపక్ష నేత ప్రారంభించటం ఆనవాయితీ. ఆరోజు ప్రతిపక్ష నేత జానారెడ్డి సభలో లేకపోవటంతో బీజేపీ చర్చను ప్రారంభించింది. సభలో అధికార, ప్రతిపక్ష పార్టీలు హుందాగా వ్యవహరించటంతో అర్థవంతమైన చర్చలకు ఎక్కువ సమయం దొరికింది. మొత్తం సెషన్లో కేవలం 27 నిమిషాల సభా సమయం దుర్వినియోగమైంది. గతంతో పోలిస్తే బడ్జెట్‌పై సాధారణ చర్చ కంటే పద్దులపై ఎక్కువగా చర్చించేందుకు అధికార, విపక్ష సభ్యులు ఆసక్తి కనబరిచారు. బడ్జెట్లో ప్రకటించిన వాటితో పాటు విపక్ష సభ్యుల సూచనల మేరకు విద్యార్థుల మెస్‌చార్జీల పెంపు, హోం గార్డులను రెగ్యులరైజ్ చేస్తామని చివరి రోజున సీఎం ప్రకటించటం గమనార్హం. ‘ సమావేశాలు ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటాయి. పద్దులపై ఇంత గొప్పగా ఎన్నడూ చర్చ జరగ లేదు. మా పార్టీ సభ్యులతో పాటు విపక్ష సభ్యులు సైతం సందర్భో చితంగా హూందాగా వ్యవహరించారు...’అని హరీశ్ వ్యాఖ్యానించారు. -
బడ్జెట్లో వినూత్న సంక్షేమ కార్యక్రమాలు
మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ వెల్లడి గొర్రెల కాపరులు, ఫిషరీస్ అభివృద్ధిపై కేబినెట్ సబ్ కమిటీ తొలిసారిగా భేటీ సాక్షి, హైదరాబాద్: ఎప్పుడూ లేని విధంగా యాదవులు, కురుమలు, మత్స్యకార్మికుల సంక్షేమంపై అసెంబ్లీ, సచివాలయం, సబ్ కమిటీలో చర్చించడం గొప్ప విషయమని కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్, రాష్ట్ర పశుసంవర్థక, మత్స్య, పాడి పరిశ్రమ అభివృద్ధి శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గురువారం సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం నియమించిన కేబినెట్ సబ్ కమిటీ తొలిసారి సమావేశమైందని, మరో 2 లేదా 3 సమావేశాలు నిర్వహించిన అనంతరం ఆయా వర్గాల అభివృద్ధిపై నివేదికను ముఖ్యమంత్రికి సమర్పిస్తామన్నారు. ఈ కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో మంత్రులు ఈటల రాజేందర్, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, జోగు రామన్న, జగదీశ్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావు, జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారని అన్నారు. ముదిరాజ్‌లు, గంగపుత్రులు, బెస్తలు, తెలుగువారు, యాదవులు, కురుమలు తదితర ఉపకులాల సామాజిక సంక్షేమం కోసం బడ్జెట్లో వినూత్న కార్యక్రమాలు ప్రవేశ పెట్టే నిమిత్తం ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కేబినెట్ సబ్ కమిటీ సమావేశాన్ని నిర్వహించామ న్నారు. ఆయా కుటుంబాలకు సంబంధించిన వ్యక్తులు సొసైటీలో పేర్లు నమోదు చేసుకో వాలని, త్వరలోనే అధి కారులు ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరించే విధంగా చర్యలు తీసుకుం టున్నామన్నారు. రాబోయే బడ్జెట్‌కు పలు మార్గదర్శకాలు, పలు ప్రతిపాదనలు పంపామన్నారు. పావలా వడ్డీకే గొర్రెల కాపర్లకు రుణాలు: 1996లో గొర్రెకాపర్ల సొసైటీ ఏర్పాటైందని, ఎన్సీడీసీ నుంచి రుణం పొందటానికి రాష్ట్ర ప్రభుత్వం వ్యక్తిగత పూచీ ఇవ్వనందున రుణం రాలేదన్నారు. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకు వెళ్లగా వారు అంగీకరించడంతో రూ. 400 కోట్ల రుణం లభిం చిందన్నారు. దీనిపై 10.75% వడ్డీ ఉందని.. దీనిని పావలా వడ్డీకే అందించేలా నిర్ణయం తీసుకున్నారన్నారు. పశువైద్యం కోసం 100 మొబైల్ వ్యాన్లను ఏప్రిల్ నుంచి ప్రారంభిం చనున్నట్లు తెలిపారు. చేపలకు సంబంధించి దళారీ వ్యవస్థపై కఠిన చర్యలు ఉంటాయన్నారు. చేపల మార్కెట్ గురించి ప్రణాళికను రూపొందిస్తున్నామని తెలిపారు. గంగ పుత్రుల కు తొలి, ఇతరులకు రెండో ప్రాధాన్యమన్న సీఎం హామీపై ఈసారి బడ్జెట్లో పదిరెట్లు పెంచామని స్పందించారు. -
మార్చిలో రాష్ట్ర బడ్జెట్
సూచనప్రాయంగా వెల్లడించిన సీఎం కేసీఆర్ మూస పద్ధతికి భిన్నంగా కేటాయింపులు ఆ మేరకు ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులకు ఆదేశం కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ వేగవంతం చేయాలని సూచన సాక్షి, హైదరాబాద్: మార్చిలో రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సూచనప్రాయంగా వెల్లడించారు. వచ్చేనెలలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్న నేపథ్యంలో అన్ని శాఖల మంత్రులు, అధికారులు తగిన ప్రతిపాదనలు తయారు చేయాలని ఆదేశించారు. మూస పద్ధతిలో కాకుండా అవసరమైన పనులకు బడ్జెట్ కేటాయింపులు జరిగేలా ప్రతిపాదనలు ఉండాలని చెప్పారు. నిరర్థక వ్యయాన్ని తగ్గించేందుకు శాఖల వారీగా సిఫారసులు కూడా రూపొందించాలని చెప్పారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ వేగంగా అమలు జరగాలని అధికారులను ఆదేశించారు. శాఖల వారీగా వివరాలు తెప్పించుకున్న వెంటనే క్రమబద్ధీకరణ చేయాలని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ఈ పని జరగాలని ఆదేశించారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు పెంచాలన్న నిర్ణయాన్ని కూడా వెంటనే అమలు చేయాలని చెప్పారు. శుక్రవారం క్యాంపు కార్యాలయంలో సీఎం పలు అంశాలపై సీఎంవో అధికారులతో సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్‌లో ప్రస్తుతం ఉన్న ఉస్మానియా, గాంధీ, కింగ్ కోఠి ఆసుపత్రులకు అదనంగా మరో రెండు పెద్ద ప్రభుత్వ ఆసుపత్రులు నిర్మించాలని సీఎం నిర్ణయించారు. వీటి నిర్మాణానికి అనువైన స్థలాలు ఎంపిక చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సిటీలోని అయిదు ఆసుపత్రుల్లోనూ అంతర్జాతీయ స్థాయి వైద్య సేవలు అందించాలని, అందుకు అనుగుణ మైన పరికరాలు సమకూర్చాలని చెప్పారు. ఇందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, ఈ బడ్జెట్లోనే నిధులు కేటాయిస్తామని వెల్లడించారు. బొగ్గు గని కార్మికులకు మెరుగైన వైద్యం అందేందుకు వీలుగా కోల్‌బెల్ట్‌లో కూడా సూపర్ స్పెషాలిటీ స్థాయి ఆసుపత్రి నిర్మించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. వరంగల్ ఎంజీఎంతో పాటు ఇతర ప్రాంతీయ వైద్యశాలలను కూడా మెరుగుపర్చాలని అధికారులను ఆదేశించారు. సీఎంకు ‘ఇంటెలిజెన్స్’ కృతజ్ఞతలు పోలీస్ శాఖలో ఇంటెలిజెన్స్, సెక్యూరిటీ, సీఐడీ విభాగాల్లో పనిచేసే ఉద్యోగులకు మూల వేతనంపై 25 శాతం స్పెషల్ అలవెన్స్ ప్రకటించడంపై ఆయా శాఖల అధికారులు, ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్‌రెడ్డి నాయకత్వంలో ఇంటెలిజెన్స్, సెక్యూరిటీ అధికారులు సీఎంను కలిశారు. స్పెషల్ అలవెన్స్ ప్రకటించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. -
బడ్జెట్‌పై అంచనా తప్పలేదు
ఆదాయం రాబట్టుకోడానికి సర్వశక్తులు ఒడ్డుతాం: కేసీఆర్ ⇒ బడ్జెట్ లెక్కలపై వివరణ.. గత ఏడాది రూ. 34,500 కోట్ల ఆదాయం తగ్గింది ⇒ భూములను అమ్మితీరుతాం.. ఎఫ్ఆర్బీఎం పరిధిలోకి రాని రుణాలు తీసుకుంటాం ⇒ రూ. 4 వేల కోట్ల పన్ను బకాయిల వసూలు.. కరెంట్ చార్జీలు పెంచక తప్పదు సాక్షి, హైదరాబాద్: రాష్ర్ట బడ్జెట్‌పై ప్రభుత్వ అంచనాలేవీ తప్పుగా లేవని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మంగళవారం అసెంబ్లీలోవివరణ ఇచ్చారు. ‘ఆదాయం రాబట్టుకునేం దుకు సర్వశక్తులు ఒడ్డుతాం.వస్తే ఖర్చు చేస్తాం. లేదంటే శాసనసభకు లెక్కలు అప్పజెబుతాం. ఇందులో అనవసరమైన గొప్పలకు పోయేదేమీ లేదు. ప్రజలు పన్నులు చెల్లిస్తేనే కదా.. ప్రభుత్వానికి ఆదాయం వచ్చేది’ అని కేసీఆర్ అన్నారు. వ్యవసాయానికి ఉచితంగా కరెంటు ఇస్తున్నామని పేర్కొంటూనే మిగతా వర్గాలపై కొంత మేరకు విద్యుత్ చార్జీల భారం తప్పదని వెల్లడించారు. బడ్జెట్‌పై చర్చలో భాగంగా సీఎల్పీనేత జానారెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం ఊహాజనిత బడ్జెట్‌ను రూపొందించిందని, అసాధ్యమైన ఆదాయ అంచనాలు, ప్రణాళిక వ్యయాన్ని చూపించారని విమర్శిం చిన సంగతి తెలిసిందే. అలాగే కేంద్రం నుంచి స్పెషల్ ప్యాకేజీ, గ్రాంట్లు, ఎఫ్ఆర్బీఎం ప్రకా రం అప్పుల పరిమితి, భూముల అమ్మకం వంటి ఆదాయాలను ఊహించి చెప్పారని జానా ధ్వజమెత్తడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమాధానమిచ్చారు. అన్నీ పక్కాగా లెక్కలేసుకున్నాం.. పదినెలల్లో రాష్ట్రానికి రూ.60 వేల కోట్ల ఆదా యం వచ్చిందని, అంతమేరకు ఖర్చు కూడా చేసినట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. కేంద్ర ప్రాయోజిత పథకాల్లో అనూహ్యంగా40 శాతం కోత పడటంతో రూ.28 వేల కోట్లు రాలేదన్నా రు. భూముల అమ్మకం ద్వారా రూ. 6,500 కోట్లు అంచనా వేసుకుంటే.. ఒక్క గుంట భూమిని కూడా అమ్మ లేదని, అమ్మే ప్రయత్నం కూడా చేయలేదని పేర్కొన్నారు. చౌకగా అమ్మి దుబారా చేయడం కంటే భూముల విలువ ఎక్కువగా ఉన్నప్పుడే అమ్మాలన్న ఆలోచనతో దీన్ని పెండింగ్‌లో పెట్టామన్నారు. దీంతో రూ. 34,500 కోట్ల ఆదాయం తగ్గిందన్నారు. కొన్ని బడ్జెట్లో చెప్పుకునేవి ఉంటాయని.. మరికొన్ని బడ్జెట్ పరిధిలో లేని అం శాలు ఉంటాయని వ్యాఖ్యానించారు. ఎన్టీపీసీతోపాటు రాష్ట్రంలో నిర్మించబోయే విద్యుత్ ప్రాజెక్టులకు రూ.79 వేల కోట్లు ఖర్చవుతుం దని.. ఆర్ఎఫ్సీ, పీఎఫ్‌సీల ద్వారా రూ.15 వేల కోట్ల రుణం సమకూరుతుందన్నారు. వాటర్‌గ్రిడ్‌కు దాదాపు రూ.32 వేల కోట్లు ఖర్చవుతుందని.. అందులో రూ.10 వేల కోట్లు హడ్కో రుణం, రూ.3 వేల కోట్లు నాబార్డు రుణం అందుతున్నారు. రూ.10 వేల కోట్ల రుణం ఇచ్చేందుకు ఓ ప్రైవేట్ కంపెనీ సిద్ధంగా ఉందని.. ఐసీఐసీఐ, జిందాల్, ఎల్ఐసీ కంపెనీలు కూడా కన్సార్షియంగా ఏర్పడి పెట్టుబడులకు ముందుకు వస్తున్నాయని పేర్కొన్నారు. ఇవన్నీ ఎఫ్ఆర్బీఎం చట్టం పరిధిలోకి వచ్చేవి కాదన్నారు. ఎఫ్ఆర్బీఎం ప్రకారం అప్పులు, పెరిగిన పన్నుల వాటా, తగ్గిన ప్రాయోజిత పథకాలు, సొంత పన్నులు, పన్నేతర ఆదా యం.. అన్నీ లెక్కలేసుకుంటే రూ. 96 వేల కోట్లకు చేరుతుందని, మరో రూ.19 వేల కోట్లు ఎలా వస్తాయనే ఆలోచన కూడా ప్రభుత్వం చేసిందని కేసీఆర్ వివరించారు. గతంలో ప్రభుత్వాలు రికవరీ చేయలేకపోయిన కమర్షియల్ ట్యాక్స్ రూ. 4 వేల కోట్లు ఉందని, సుప్రీం కోర్టులో మంచి న్యాయవాదులను ఆశ్రయించి పన్ను బకాయిలను రికవరీ చేస్తామని చెప్పారు. అలాగే హైదరాబాద్‌లో 10 వేల ఎకరాలు అన్యాక్రాంతమయ్యాయని, క్రమబద్ధీకరణ పరిధిలోకి రాని భూములను స్వాధీనం చేసుకుంటామన్నారు. రాజధానిలో ‘రియల్’ భూమ్ ఇంకా పుంజుకుంటుందని, రిసోర్స్ మ్యాపింగ్ చేసి.. అన్యాక్రాంతమయ్యే భూములను అమ్మకానికి పెడతామన్నారు. ఈ సమయంలో ప్రతిపక్షాలు గొంతెత్తడంతో.. ‘పక్కాగా అమ్మి తీరుతాం. ఇది మీరు చూపించిన దారి కాదా?’ అని సీఎం బదులిచ్చారు. -
'రాజకీయ వ్యభిచారం చేస్తున్నారు'
-
'రాజకీయ వ్యభిచారం చేస్తున్నారు'
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం మొదటి బడ్జెట్ ఫ్యామిలి బడ్జెట్ అయితే... రాబోయేది దొరల బడ్జెట్ అని టీ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. శుక్రవారం హైదరాబాద్‌తో రేవంత్‌రెడ్డి సాక్షి మీడియాకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.... గవర్నర్ ప్రసంగంతోనే ప్రభుత్వంపై నిరసన తెలుపుతామని స్పష్టం చేశారు. బడ్జెట్ కంటే ముందు సమస్యలపై ప్రభుత్వ విధానాన్ని పరిశీలించాలన్నారు. ఆదాయం, ఆలోచన లేకుండానే రూ. లక్ష కోట్ల బడ్జెట్ అంటున్నారని విమర్శించారు. పార్టీ మారినవారిపై అనర్హత వేటు వేయకుండా రాజకీయ వ్యభిచారం చేస్తున్నారంటూ కేసీర్ ప్రభుత్వంలోని పెద్దలపై రేవంత్‌రెడ్డి విరుచుకుపడ్డారు. -
దాపరికం వద్దు
బడ్జెట్లో వాస్తవాలే ప్రతిబింబించాలి ఉన్నతాధికారులతో సమీక్షలో కేసీఆర్ దిశానిర్దేశం మూడు రంగాలకు పెద్దపీట వేస్తూ సమగ్రంగా రూపకల్పన పేదలు-సంక్షేమం, వ్యవసాయం, పరిశ్రమలు-పెట్టుబడులపై దృష్టి కేంద్ర విధానాలకు అనుగుణంగా రాష్ర్టంలో చర్యలు సుపరిపాలన దిశగా పది కార్యక్రమాలు ఆదివారం కూడా షాపులు, కార్మికులకు వీక్లీ ఆఫ్ తప్పనిసరి నెలలో రెండు రోజులు స్వచ్ఛ భారత్ ఏటా జూలై తొలివారంలో హరితహారం కార్యక్రమం ఫిబ్రవరి చివర్లో మిషన్ కాకతీయ వారోత్సవాలు పకడ్బందీగా గృహ నిర్మాణ పథకం అమలు సాక్షి, హైదరాబాద్: వచ్చే ఆర్థిక సంవత్సరానికి సమగ్ర బడ్జెట్‌ను రూపొందించాలని అధికారులను సీఎం కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. వాస్తవాల ఆధారంగా మంచీచెడులను ప్రజలకు విడమరిచి చెప్పాలని, ఎలాంటి దాపరికం అవసరం లేదని స్పష్టంచేశారు. పేదలు-సంక్షేమం, వ్యవసాయం, పరిశ్రమలు-పెట్టుబడులు-మౌలిక వసతులు.. ఈ మూడు రంగాల అభివృద్ధికి అవసరమయ్యే విధానాల రూపకల్పన జరగాలని పేర్కొన్నారు. అందుకు అనుగుణంగానే బడ్జెట్ ప్రతిపాదనలు, ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే అప్పుడున్న అవగాహన, పరిమిత వనరులు, అవకాశాల మేరకు తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టినట్లు చెప్పారు. అది ప్రభుత్వ లక్ష్యాలను ప్రతిబింబించిందన్నారు. హైదరాబాద్‌లోని క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులతో ముఖ్యమంత్రి గురువారం సమావేశమయ్యారు. ఈ భేటీలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, డీజీపీ అనురాగ్ శర్మ తదితరులు కూడా పాల్గొన్నారు. కేంద్రంలో కొత్త ఒరవడి కేంద్రంలో కొత్తగా వచ్చిన ప్రభుత్వం కూడా దేశాన్ని నూతన పంథాలో నడపడానికి ప్రణాళికలు రూపొందిస్తోందని సీఎం అన్నారు. గతంలో సీఎంగా పని చేసిన వ్యక్తే ప్రధానిగా ఉండటం రాష్ట్రాలకు సానుకూల అంశమని విశ్లేషించారు. కేంద్ర పథకాలను కుదిస్తున్నారని, రాష్ట్రాలకు కేంద్రం ఇచ్చే నిధుల విధానంలో కూడా సమూల మార్పులు రానున్నాయని, ఇంకా అనేక కొత్త ఆలోచనలకు కేంద్రం శ్రీకారం చుడుతోందని చెప్పారు. కేంద్ర విధానాలకు అనుగుణంగా రాష్ట్రంలో కార్యక్రమాలను రూపొందించుకోవాలని అధికారులకు కేసీఆర్ సూచించారు. పరిణామక్రమంలో చాలా మార్పులు జరుగుతాయని, అందులో భాగంగానే మోదీ సర్కారు నీతి ఆయోగ్‌ను ప్రవేశపెట్టిందని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ప్రైవేటు రంగాన్ని విస్మరించే పరిస్థితి లేదనిఅభిప్రాయపడ్డారు. మారిన పరిస్థితులకు అనుగుణంగా తెలంగాణ పునర్నిర్మాణానికి పాటుపడాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. రాష్ర్టంలో పనిచేస్తున్న అధికారులకు గొప్ప పని సంస్కృతి ఉందని సీఎం కితాబిచ్చారు. సమయ పరిమితులు పెట్టుకోకుండా పొద్దు పోయేంతవరకు పని చేస్తూ సేవలు అందిస్తున్నారని అభినందించారు. కేవలం తమ శాఖలకు బాధ్యులుగా కాకుండా ప్రభుత్వాన్ని నడిపే సారథులుగా వ్యవహరించాలని సూచించారు. తరుచు చర్చలు నిర్వహించి మంచి విధానాలు రూపొందించాలన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కార్యక్రమాలన్నింటిపై అధికారుల వద్ద సమగ్రమైన సమాచారం సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు. తనతో పాటు మంత్రులు, అధికారులు కలిసికట్టుగా పనిచేస్తేనే అనుకున్న లక్ష్యాలను సాధిస్తామన్నారు. సుపరిపాలన అందిద్దాం తెలంగాణ పునర్నిర్మాణంలో అధికారులు కీలక భూమిక పోషించాలని పిలుపునిచ్చిన ముఖ్యమంత్రి.. సుపరిపాలన దిశగా పది కార్యక్రమాలను ఆచరణలో పెట్టాలని సూచించారు. రాష్ర్టవ్యాప్తంగా స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని అమలు చేయాలన్నారు. ప్రతి నెలా ఒకటి, మూడో శనివారాల్లో దీన్ని చేపట్టాలని, అన్ని విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, ఆసుపత్రులు, ఇతర కార్యక్షేత్రాల్లో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునేలా చూడాలని పేర్కొన్నారు. విద్యాసంస్థల్లో టాయిలెట్ల నిర్మాణం చేపట్టాలని ఆదేశించారు. వ్యాపార వాణిజ్య కేంద్రాలు ఆదివారం కూడా తెరిచి ఉంచుకునే వెసులుబాటు కల్పించాలని, అవసరమైతే అందుకు అనుగుణంగా చట్ట సవరణ చేసేందుకు కార్మిక శాఖ ప్రతిపాదనలు పంపాలని సూచించారు. వారమంతా పనిచేసే ఉద్యోగులు ఆదివారం షాపింగ్ చేయడానికి వీలుండటం లేదని, అందుకే ఈ దిశగా చర్య తీసుకోవాలని చెప్పారు. అలాగే వ్యాపార, వాణిజ్య సంస్థల్లో పనిచేసే వారు నిర్ణీత సమయం కన్నా ఎక్కువ గంటలు పని చేయించకుండా చూడాలని, వీక్లీ ఆఫ్ విధానాన్ని కచ్చితంగా అమలయ్యేలా చూడాలని పేర్కొన్నారు. ఏటా జూలై తొలివారంలో హరితహారం వారోత్సవాలు నిర్వహించాలన్నారు. మండల, మున్సిపల్ సమావేశాలకు అటవీ శాఖ అధికారులను కూడా ఆహ్వానించి సమీక్ష జరపాలన్నారు. రాష్ర్టవ్యాప్తంగా మూడేళ్లలో 230 కోట్ల మొక్కలు నాటాలన్నారు. ఇక ఏటా ఫిబ్రవరి చివరి వారంలో మిషన్ కాకతీయ వారోత్సవాలు జరపాలని, ప్రజల భాగస్వామ్యంతో చెరువులను పునరుద్ధరించాలని కేసీఆర్ పేర్కొన్నారు. ఈ వేసవిలోనే హుస్సేన్‌సాగర్ శుద్ధి కార్యక్రమాన్ని చేపట్టాలని , ఎస్సీఎస్టీల సమగ్రాభివృద్ధికి శాఖలవారీగా ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని, బీసీల్లోని సంచార జాతులు, అగ్రవర్ణాల్లోని పేదలకు కూడా ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. గృహనిర్మాణ పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని, గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీలు విద్యుత్ బకాయిలను వెంటనే చెల్లించేలా చొరవ చూపాలని అధికారులకు సూచించారు. పరిశ్రమలకు సరిపడేంత కరెంట్ అనుకూలమైన భౌగోళిక వాతావరణ పరిస్థితులు, తగినంత భూమి ఉండటం వల్ల పెట్టుబడులకు రాష్ర్టం ఆకర్షణీయంగా ఉందని కేసీఆర్ వివరించారు. ప్రపంచంలోనే ఎక్కడా లేని గొప్ప పారిశ్రామిక విధానాన్ని ప్రవేశపెట్టామన్నారు. సింగిల్ విండో విధానం, ఒకే చోట అన్ని అనుమతులను 15 రోజుల్లో పొందడం, టీఎస్ఐపాస్ చట్టం, పారిశ్రామిక అనుమతులకు సీఎంవోలో ప్రత్యేక విభాగం తదితర చర్యలతో రాష్ట్రానికి ఇబ్బడిముబ్బడిగా పరిశ్రమలు వస్తాయన్నారు. ప్రస్తుతం కరెంటు విషయంలో ఇబ్బంది ఉందని, ఈ సమస్యను అధిగమించేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నామని వివరించారు. 2018 చివరి నాటికి రాష్ట్రంలో 23 వేల మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి వస్తుందని చెప్పారు. ఈ ఏడాది చివరిలోగా 6679 మెగావాట్ల కరెంట్ అందుబాటులోకి వస్తుందని, దాంతో కరెంటు కష్టాలు చాలా వ రకు తీరుతాయన్నారు. పరిశ్రమలకు చాలినంత విద్యుత్ అందిస్తామని చెప్పారు. -
కొత్త రాష్ట్రంలో ఆర్థిక ఆంక్షలు షురూ!
* 70 శాతంపైగా వ్యయం చేసిన శాఖలకు నిధుల చెల్లింపులు బంద్ * జనవరి ఒకటి నుంచి అమల్లోకి ఆంక్షలు * రూ.1,850 కోట్ల మేరకు పెండింగ్ బిల్లులు * ముందస్తు జాగ్రత్తతో నాలుగో త్రైమాసికం నిధులు నిలిపివేత.. * ఎఫ్ఆర్బీఎం సడలింపు అంశంపై సన్నగిల్లుతున్న ఆశలు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ఆమోదంపొందిన నెల రోజుల్లోనే ఆర్థిక ఆంక్షలు విధించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. నాల్గవ త్రైమాసికం ప్రారంభం నుంచే వాటిని అమలు చేసేందుకు రంగం సిద్ధం చేసింది. బడ్జెట్లో ప్రతిపాదించిన మొ త్తం నుంచి 70 శాతం మించి నిధులు ఖర్చు చేసిన సంస్థలపై ఈ ఆంక్షలు అమలు చేయనున్నారు. రాబోయే మాసాల్లో అధిక మొత్తంలో నిధులు కావాల్సిన నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా వీటిని అమలు చేయనున్నారు. భారీగా బడ్జెట్ ప్రతిపాదించినా.. ఆ మేరకు ఆదాయం సమకూర్చుకునే అవకాశాలు కనిపించని నేపథ్యంలో ఇప్పటి నుంచే ఆంక్షల అమలుకు చర్యలు చేపట్టారు. జాతీయ స్థూల ఉత్పత్తిలో మూడుశాతం మేరకు రుణాలు తీసుకునే వెసులుబాటు ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అంతకంటే అధికంగా 4.79 శాతం మేర రుణాలు తీసుకునే విధంగా బడ్జెట్లో పొందుపరిచిన విషయం విదితమే. దీనిపై కేంద్రం ఇప్పటి వరకూ సానుకూలంగా స్పందించకపోవడంతో 4 వేల కోట్ల రూపాయల మేరకు రుణం తెచ్చుకోవడానికి వీలుకానట్లే. దీంతో ఆ మేరకు సర్దబాటు చేయ డం తలకుమించిన భారమవుతోందని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. ఏడాది కాలంలో ఖాజానాకు రావాల్సిన ఈ ఆదాయంలో రూ.500 కోట్ల మేర తగ్గిందని అంచనా వేశారు. దీనికితోడు సీఎం కేసీఆర్ వివిధ బహిరంగసభల్లో ప్రకటిస్తున్న వరాల వల్ల కూడా ఖజానాపై భారం పడే అవకాశం ఉన్న నేపథ్యంలో జనవరి నుంచి ప్రారంభమయ్యే నాల్గో త్రైమాసికంలో నిధులపై ఆంక్షలు విధించనున్నారు. ఇప్పటికే రూ. 4,600 కోట్ల రుణం : ఎఫ్ఆర్బీ ఎంకు లోబడి రాష్ట్రానికి దాదాపు రూ. 8,600 కోట్ల మేర రుణం తెచ్చుకునే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే ప్రభుత్వం రూ. 4,600 కోట్ల రుణం తెచ్చుకుంది. జనవరిలో రూ.800 కోట్లు, ఫిబ్రవరిలో రూ.800 కోట్ల రుణం తెచ్చుకునేలా ప్రణాళికలు సి ద్ధంచేసింది. మార్చి చివరలో బిల్లులు మొత్తం చెల్లిం చాల్సి రావడంతో ఆ నెలలో రుణమొత్తాన్ని తీసుకోవాలని అధికారులు భావిస్తున్నారు. నిధుల ఆంక్షలు ప్రధానంగా ప్రణాళిక వ్యయంపైనే పడుతుందని అధికారవర్గాలు వివరించాయి. ప్రస్తుతం జరిగిన పనులకు సంబంధించి సుమారు రూ.1,850 కోట్ల మేరకు బిల్లులు చెల్లించాల్సి ఉన్నట్లు తెలిసింది. -
18న కలెక్టరేట్ల ముట్టడి:ఆర్.కృష్ణయ్య
ముషీరాబాద్: తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో బీసీల బడ్జెట్‌ను 2 వేల కోట్ల నుంచి 20 వేల కోట్లకు పెంచాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దీనిపై ఈ నెల 18వ తేదీన అన్ని జిల్లా కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను, కరపత్రాన్ని శనివారం విద్యానగర్‌లోని బీసీ భవన్లో ఆవిష్కరించారు. రూ.10 వేల కోట్లతో బీసీ ప్లాన్ అమలు చేయాలని, కల్యాణ లక్ష్మిని బీసీలకు వర్తింపచేయాలని కృష్ణయ్య డిమాండ్ చేశారు. ప్రభుత్వ చర్యలను నిరసిస్తూ ఈ నెల 18న తలపెట్టిన కలెక్టరేట్ల ముట్టడిని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలోబీసీ సంఘాల నేతలు జాజుల శ్రీనివాస్‌గౌడ్, జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జకృష్ణ, విద్యార్థి సంఘం అధ్యక్షుడు ర్యాగ రమేష్, బీసీ ఫెడరేషన్ అధ్యక్షుడు ఎస్.దుర్గయ్యగౌడ్, ఎన్.భూపేష్సాగర్, ఎం.పృథ్విరాజ్‌గౌడ్, జి.శ్రీకాంత్‌గౌడ్, బత్తినరాజు, సంతోష్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు. -
తొలి బడ్జెట్లో మనకే ప్రాధాన్యం
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: సీఎం కేసీఆర్ చెప్పినట్లుగానే ప్రాణహితకు ప్రాణం పోశారు. రూ.1,820 కోట్లు ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టుకు కేటాయించారు. విశ్వవిఖ్యాత సంస్థలు నిమ్జ్, ఫారెస్ట్రీ కళాశాలను జిల్లాకు మంజూరు చేసి ప్రపంచ పటంలో మెతుకుసీమకు గుర్తింపు తెచ్చారు. ఈ ప్రాంత బిడ్డల ఆశలు.. ఆకాంక్షలకు తగ్గట్టుగానే బడ్జెట్లో తొలి ప్రాధాన్యత ఇచ్చారు. ఇక నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు కూడా జిల్లా నుంచే ప్రాతినిథ్యం వహిస్తుండడంతో సాగు, తాగునీటికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. గ్రీన్హౌస్ వ్యవసాయం కోసం కేటాయించిన రూ.250 కోట్లతో దాదాపు 70 శాతం నిధులు మెదక్ జిల్లాలోనే ఖర్చు పెట్టే విధంగా బడ్జెట్‌ను రూపొందించారు. కేవలం 10 నెలల కోసం రూపొందించిన రూ.లక్ష కోట్ల రాష్ట్ర ఆర్థిక బడ్జెట్లో మెదక్ జిల్లాకే సింహభాగం నిధులు కేటాయించారు. రైతుల కోసం ఇప్పటికే రూ.78 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ, రూ.500 కోట్లు రైతు రుణాలను ప్రభుత్వం అందించింది. మొత్తానికి తొలిపద్దుతోనే మోడువారిన యువత మోముల్లో... బీడు బారిన భూముల్లో కేసీఆర్ కొత్త చిగురులు తొడిగారు. నిమ్జ్‌తో జిల్లాకు ఖ్యాతి... యువతకు ఉపాధి జహీరాబాద్ నియోజకవర్గంలో 12,365 ఎకరాల్లో నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ ఏర్పాటుకు అనుమతించారు. దీని ద్వారా రూ.40 వేల కోట్ల వరకు పెట్టుబడులు వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. దీని ద్వారా 3 లక్షల మంది యువతకు ప్రత్యక్షంగా, 4.5 లక్షల మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందని ప్రభుత్వం బడ్జెట్లో పేర్కొంది. నిమ్జ్ కోసం అధికారులు ఇప్పటికే జహీరాబాద్ నియోజకవర్గంలోని న్యాల్కల్, ఝరాసంగం మండలాల్లోని 18 గ్రామాల్లో సర్వే నిర్వహించి 12,635 ఎకరాల భూమిని గుర్తించి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించారు. ఇందులో 4 వేల ఎకరాల ప్రభుత్వ, అసైన్డ్భూమి ఉంది. మిగిలిన భూమిని రైతుల వద్ద నుంచి సేకరించాల్సి ఉంది. దీనిని పూర్తి చేసేందుకు ఆరు సంవత్సరాల సమయం పడుతుందని భావిస్తున్నారు. ఫారెస్ట్ట్రీ కళాశాలకు రూ.10 కోట్లు గజ్వేల్ నియోజకవర్గంలోని ములుగు మండల కేంద్రంలోని రాజీవ్హ్రదారి పక్కన ఫారెస్ట్రీ కళాశాల ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని అధికారులు ఇప్పటికే గుర్తించారు. ఇక్కడ అందుబాటులో ఉన్న వెయ్యి ఎకరాల్లో 500 ఎకరాలు హార్టికల్చర్ యూనివర్శిటీ, మరో 450 ఎకరాల్లో అటవీశాఖ కళాశాల, పరిశోధనా కేంద్రాన్ని నిర్మించాలనినిర్ణయించారు. అదేవిధంగా ముందు భాగంలో ఉన్న 175 ఎకరాల్లో ఆయా సంస్థలకు చెందిన పరిపాలనా భవనాలను నిర్మించడానికి సూత్రప్రాయంగా నిర్ణయించారు. వీటిని నిర్మాణాలకు గానూ కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.200 కోట్ల నిధులను మంజూరు చేసింది. కొత్తగా నిర్మించబోతున్న ఫారెస్ట్ కాలేజ్ ఆఫ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ దక్షిణ భారత దేశంలోనే రెండోది. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో ఫారెస్ట్రీ కళాశాలకు రూ.10 కోట్లు కేటాయించారు. 22 వేల మందికి ఊరట ఆటోలు, ట్రాక్టర్ల మీద రవాణ పన్ను మినహాయించడంతో జిల్లాలో 22 వేల మందికి ఊరట లభించింది. ఆటో డ్రైవర్లు రవాణా పన్ను కట్టలేక ఆటోలు వదిలేసుకున్న సంఘటనలు జిల్లాలో అనేకం ఉన్నాయి. ప్రస్తుతం జిల్లాలో మొత్తం 14,000 ఆటోలు, 6,000 ట్రాక్టర్లు, 530 లైట్ గూడ్స్ వెహికల్స్, 1,985 వ్యవసాయ ట్రాయిలర్లు ఉన్నాయి. ఇప్పటి వరకు ఆటో మీద రూ.1,760, ట్రాక్టర్ల మీద రూ.1,260 ఉమ్మడి రాష్ర్టంలో ప్రభుత్వం రవాణ పన్ను విధించింది. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్టుగా కేసీఆర్ రవాణా పన్ను మినహాయించడంతో రాష్ర్ట ప్రభుత్వానికి జిల్లా నుంచి రూ 1.50 కోట్ల భారం పడుతుంది. ప్రాణహితకు ప్రాణం...సింగూరుకు ఊతం పడావు పడిన ప్రాణహిత- చేవేళ్లకు ముఖ్యమంత్రి కేసీఆర్ మళ్లీ ప్రాణం పోశారు. ప్రాజెక్టు నిర్మాణ పనుల కోసం ఏకంగా రూ.1,820 కోట్లు కేటాయించారు. ప్రాజెక్టు డిజైన్లోనూ మార్పులు చేశారు. 2007లో జిల్లాలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రాణహితకు శంకుస్థాపన చేశారు. 2008లో పనులను ప్రారంభించారు. 2014-15 వరకు ప్రాజెక్టును జిల్లాలో పూర్తి చేయాలని లక్ష్యం పెట్టారు. సిద్దిపేట డివిజన్ పరిధిలో 14.45 వేల ఎకరాల భూమి సేకరించాలని నిర్దేశిత లక్ష్యాన్ని ఎంచుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కేవలం 859 ఎకరాలు మాత్రమే సేకరించారు. జిల్లాలో 5 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో చేపడుతున్న ప్రాణహిత ప్రాజెక్టు పనులు చిన్నకోడూరు, సిద్దిపేట, తొగుట, కొండపాక, గజ్వేల్, వర్గల్, ములుగు మండలాల్లో కొనసాగుతున్నాయి. గజ్వేల్ మండలం దాతర్పల్లి, తొగుట మండలం వేములగట్లో కాల్వ పనులు సాగుతున్నాయి. నష్టపరిహార విషయంలో రైతుల నుంచి తీవ్ర ప్రతిఘటనలు ఎదురుకాగా ఈ ఏడేళ్ల కాలంలో 40 శాతం పనులు కూడా సాగలేదు. దీంతో ఎకరాకు సగటున రూ. 3.80 లక్షలను చెల్లించేందుకు తాజాగా కేసీఆర్ ప్రభుత్వం సిద్ధమైంది. సింగూరు ప్రాజెక్టుకు రూ.13 కోట్లు, ఘనపురం ప్రాజెక్టు ఫతేనహర్, మహబూబ్‌నహర్ కాల్వల ఆధునీకీకరణ కోసం రూ.2 కోట్లు, నల్లవాగు నిర్మాణం కోసం రూ.30 లక్షలు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. చెరువులకు, వ్యవసాయానికి పెద్ద పీట వాణిజ్య పంటల ప్రోత్సాహంలోనూ జిల్లాకే పెద్దపీట వేశారు. రూ.250 కోట్లతో దాదాపు 1000 ఎకరాల్లో చేపట్టబోయే గ్రీన్హౌస్ వ్యవసాయంలో ఎక్కువ వాటా జిల్లాకే దక్కింది. హైదరాబాద్‌కు సమీపంలో ఉన్న గజ్వేల్, సిద్దిపేట నియోజకవర్గాల్లోని పలు మండలాల్లో 500లకు పైగా ఎకరాల్లో గ్రీన్హౌస్ వ్యవసాయాన్ని ప్రోత్సహించనున్నారు. దాదాపు 300 నుంచి 400 మంది రైతులు దీని ద్వారా లబ్ధి పొందుతారు. రూ 2.50 కోట్లతో మూగ జీవ అభివృద్ధి పథకంలో జిల్లాకు భాగస్వామ్యం కల్పించారు. రూ 40 లక్షలతో ఉల్లి నిల్వచేసే గోదాంలను ఏర్పాటు చేస్తారు. చిన్ననీటి వనరులైన చెరువులు కుంటల ద్వారా వ్యవసాయానికి సాగు నీళ్లు అందించనున్నారు. జిల్లాలో మొత్తం 9,970 నీటి వనరులుండగా, వీటిలో 20 శాతం చెరువుల, కుంటల అభివృద్ధి, మరమ్మతు పనులను చేపడతారు. జిల్లాలో మొదటి దశ కింద 1,588 చెరువులు, కుంటల అభివృద్ధి, మరమ్మతు పనులు చేపతారు. సిద్దిపేట నియోజకవర్గంలో 175, దుబ్బాకలో 275, గజ్వేల్‌లో 239, అందోలులో 124, సంగారెడ్డిలో 107, పటాన్చెరులో 92, జహీరాబాద్‌లో 25 చెరువుల మరమ్మతు పనులు చేపట్టనున్నారు. నర్సాపూర్, మెదక్, నారాయణఖేడ్ నియోజకవర్గాల్లో 551 చెరువుల మరమ్మతు పనులు చేపట్టే విధంగా బడ్జెట్ నిధులు కేటాయించారు. -
‘టి’ బడ్జెట్లో క్రీడలకు పెద్దపీట: లవ్ అగర్వాల్
ఎల్బీ స్టేడియం: తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో క్రీడలకు పెద్దపీట వేయనున్నట్లు క్రీడలు, యువజన సర్వీసుల శాఖ ముఖ్య కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. శుక్రవారం సచివాలయంలో తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ (టీఎస్ఏ) అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. బడ్జెట్లో క్రీడలకు కేటాయింపులు, పలు ప్రతిపాదనలపై ఆయన ఈ సందర్భంగా చర్చించారు. రాష్ట్రంలో అమలవుతున్న క్రీడ పథకాలు, నూతనంగా నిర్మించనున్న స్పోర్ట్స్ హాస్టళ్లు, ఆధునిక క్రీడా సామాగ్రి కొనుగోలుకు కావాల్సిన బడ్జెట్ సిద్ధం చేయాలని అధికారులను లవ్ అగర్వాల్ ఆదేశించారు. వచ్చే రాష్ట్ర బడ్జెట్లో హైదరాబాద్‌లో వాటర్ స్పోర్ట్స్ కోసం ఆధునిక వాటర్ బోట్స్, షూటింగ్ రే ంజ్లో కొత్త ఆయుధాల కోసం సంబంధిత అధికారులు ప్రతిపాదనలు పంపాలని ఆయన సూచించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు స్వప్నమైన ‘బంగారు తెలంగాణ’లో భాగంగా రాష్ట్రంలో అత్యున్నత ప్రమాణాలతో, అధునాతన సదుపాయాలతో తెలంగాణ క్రీడా విశ్వవిద్యాలయం ఏర్పాటుకు అవసరమైన ప్రతిపాదనలు కూడా సిద్ధం చేయాలని లవ్ అగర్వాల్ క్రీడాధికారులను ఆదేశించారు. మన ఊరు-మన ప్రణాళికనూ రూపొందించాలన్నారు. ఇందులో భాగంగా జిల్లాల్లో మెరుగైన మౌలిక సదుపాయాలు, రాణించిన క్రీడాకారులకు నగదు ప్రోత్సాహకాలు ఇవ్వడం, కొత్తగా కోచ్‌లు, ఉద్యోగుల నియామకాలు, క్రీడాసంఘాలకు నిధుల కేటాయింపులో ప్రాధాన్యత ఇస్తామని ఆయన చెప్పారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు పక్కదారి పట్టకుండా సమర్థంగా అమలు చేయాలని సూచించారు.