'రాజకీయ వ్యభిచారం చేస్తున్నారు'
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం మొదటి బడ్జెట్ ఫ్యామిలి బడ్జెట్ అయితే... రాబోయేది దొరల బడ్జెట్ అని టీ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. శుక్రవారం హైదరాబాద్తో రేవంత్రెడ్డి సాక్షి మీడియాకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.... గవర్నర్ ప్రసంగంతోనే ప్రభుత్వంపై నిరసన తెలుపుతామని స్పష్టం చేశారు.
బడ్జెట్ కంటే ముందు సమస్యలపై ప్రభుత్వ విధానాన్ని పరిశీలించాలన్నారు. ఆదాయం, ఆలోచన లేకుండానే రూ. లక్ష కోట్ల బడ్జెట్ అంటున్నారని విమర్శించారు. పార్టీ మారినవారిపై అనర్హత వేటు వేయకుండా రాజకీయ వ్యభిచారం చేస్తున్నారంటూ కేసీర్ ప్రభుత్వంలోని పెద్దలపై రేవంత్రెడ్డి విరుచుకుపడ్డారు.