సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: సీఎం కేసీఆర్ చెప్పినట్లుగానే ప్రాణహితకు ప్రాణం పోశారు. రూ.1,820 కోట్లు ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టుకు కేటాయించారు. విశ్వవిఖ్యాత సంస్థలు నిమ్జ్, ఫారెస్ట్రీ కళాశాలను జిల్లాకు మంజూరు చేసి ప్రపంచ పటంలో మెతుకుసీమకు గుర్తింపు తెచ్చారు. ఈ ప్రాంత బిడ్డల ఆశలు.. ఆకాంక్షలకు తగ్గట్టుగానే బడ్జెట్‌లో తొలి ప్రాధాన్యత ఇచ్చారు.
ఇక నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు కూడా జిల్లా నుంచే ప్రాతినిథ్యం వహిస్తుండడంతో సాగు, తాగునీటికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. గ్రీన్‌హౌస్ వ్యవసాయం కోసం కేటాయించిన రూ.250 కోట్లతో దాదాపు 70 శాతం నిధులు మెదక్ జిల్లాలోనే ఖర్చు పెట్టే విధంగా బడ్జెట్‌ను రూపొందించారు. కేవలం 10 నెలల కోసం రూపొందించిన రూ.లక్ష కోట్ల రాష్ట్ర ఆర్థిక బడ్జెట్‌లో మెదక్ జిల్లాకే సింహభాగం నిధులు కేటాయించారు. రైతుల కోసం ఇప్పటికే రూ.78 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ, రూ.500 కోట్లు రైతు రుణాలను ప్రభుత్వం అందించింది. మొత్తానికి తొలిపద్దుతోనే మోడువారిన యువత మోముల్లో... బీడు బారిన భూముల్లో కేసీఆర్ కొత్త చిగురులు తొడిగారు.
నిమ్జ్‌తో జిల్లాకు ఖ్యాతి... యువతకు ఉపాధి
జహీరాబాద్ నియోజకవర్గంలో 12,365 ఎకరాల్లో నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ ఏర్పాటుకు అనుమతించారు. దీని ద్వారా రూ.40 వేల కోట్ల వరకు పెట్టుబడులు వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. దీని ద్వారా 3 లక్షల మంది యువతకు ప్రత్యక్షంగా, 4.5 లక్షల మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందని ప్రభుత్వం బడ్జెట్‌లో పేర్కొంది. నిమ్జ్ కోసం అధికారులు ఇప్పటికే జహీరాబాద్ నియోజకవర్గంలోని న్యాల్‌కల్, ఝరాసంగం మండలాల్లోని 18 గ్రామాల్లో సర్వే నిర్వహించి 12,635 ఎకరాల భూమిని గుర్తించి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించారు.
ఇందులో 4 వేల ఎకరాల ప్రభుత్వ, అసైన్డ్‌భూమి ఉంది. మిగిలిన భూమిని రైతుల వద్ద నుంచి సేకరించాల్సి ఉంది. దీనిని పూర్తి చేసేందుకు ఆరు సంవత్సరాల సమయం పడుతుందని భావిస్తున్నారు.
ఫారెస్ట్ట్రీ కళాశాలకు రూ.10 కోట్లు
గజ్వేల్ నియోజకవర్గంలోని ములుగు మండల కేంద్రంలోని రాజీవ్హ్రదారి పక్కన ఫారెస్ట్రీ కళాశాల ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని అధికారులు ఇప్పటికే గుర్తించారు. ఇక్కడ అందుబాటులో ఉన్న వెయ్యి ఎకరాల్లో 500 ఎకరాలు హార్టికల్చర్ యూనివర్శిటీ, మరో 450 ఎకరాల్లో అటవీశాఖ కళాశాల, పరిశోధనా కేంద్రాన్ని నిర్మించాలనినిర్ణయించారు. అదేవిధంగా ముందు భాగంలో ఉన్న 175 ఎకరాల్లో ఆయా సంస్థలకు చెందిన పరిపాలనా భవనాలను నిర్మించడానికి సూత్రప్రాయంగా నిర్ణయించారు. వీటిని నిర్మాణాలకు గానూ కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.200 కోట్ల నిధులను మంజూరు చేసింది. కొత్తగా నిర్మించబోతున్న ఫారెస్ట్ కాలేజ్ ఆఫ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ దక్షిణ భారత దేశంలోనే రెండోది. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌లో ఫారెస్ట్రీ కళాశాలకు రూ.10 కోట్లు కేటాయించారు.
22 వేల మందికి ఊరట
ఆటోలు, ట్రాక్టర్ల మీద రవాణ పన్ను మినహాయించడంతో జిల్లాలో 22 వేల మందికి ఊరట లభించింది. ఆటో డ్రైవర్లు రవాణా పన్ను కట్టలేక ఆటోలు వదిలేసుకున్న సంఘటనలు జిల్లాలో అనేకం ఉన్నాయి. ప్రస్తుతం జిల్లాలో మొత్తం 14,000 ఆటోలు, 6,000 ట్రాక్టర్లు, 530 లైట్ గూడ్స్ వెహికల్స్, 1,985 వ్యవసాయ ట్రాయిలర్లు ఉన్నాయి. ఇప్పటి వరకు ఆటో మీద రూ.1,760, ట్రాక్టర్ల మీద రూ.1,260 ఉమ్మడి రాష్ర్టంలో ప్రభుత్వం రవాణ పన్ను విధించింది. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్టుగా కేసీఆర్ రవాణా పన్ను మినహాయించడంతో రాష్ర్ట ప్రభుత్వానికి జిల్లా నుంచి రూ 1.50 కోట్ల భారం పడుతుంది.
ప్రాణహితకు ప్రాణం...సింగూరుకు ఊతం
పడావు పడిన ప్రాణహిత- చేవేళ్లకు ముఖ్యమంత్రి కేసీఆర్ మళ్లీ ప్రాణం పోశారు. ప్రాజెక్టు నిర్మాణ పనుల కోసం ఏకంగా రూ.1,820 కోట్లు కేటాయించారు. ప్రాజెక్టు డిజైన్‌లోనూ మార్పులు చేశారు. 2007లో జిల్లాలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రాణహితకు శంకుస్థాపన చేశారు. 2008లో పనులను ప్రారంభించారు.
2014-15 వరకు ప్రాజెక్టును జిల్లాలో పూర్తి చేయాలని లక్ష్యం పెట్టారు. సిద్దిపేట డివిజన్ పరిధిలో 14.45 వేల ఎకరాల భూమి సేకరించాలని నిర్దేశిత లక్ష్యాన్ని ఎంచుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కేవలం 859 ఎకరాలు మాత్రమే సేకరించారు. జిల్లాలో 5 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో చేపడుతున్న ప్రాణహిత ప్రాజెక్టు పనులు చిన్నకోడూరు, సిద్దిపేట, తొగుట, కొండపాక, గజ్వేల్, వర్గల్, ములుగు మండలాల్లో కొనసాగుతున్నాయి.
గజ్వేల్ మండలం దాతర్‌పల్లి, తొగుట మండలం వేములగట్‌లో కాల్వ పనులు సాగుతున్నాయి. నష్టపరిహార విషయంలో రైతుల నుంచి తీవ్ర ప్రతిఘటనలు ఎదురుకాగా ఈ ఏడేళ్ల కాలంలో 40 శాతం పనులు కూడా సాగలేదు. దీంతో ఎకరాకు సగటున రూ. 3.80 లక్షలను చెల్లించేందుకు తాజాగా కేసీఆర్ ప్రభుత్వం సిద్ధమైంది. సింగూరు ప్రాజెక్టుకు రూ.13 కోట్లు, ఘనపురం ప్రాజెక్టు ఫతేనహర్, మహబూబ్‌నహర్ కాల్వల ఆధునీకీకరణ కోసం రూ.2 కోట్లు, నల్లవాగు నిర్మాణం కోసం రూ.30 లక్షలు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది.
చెరువులకు, వ్యవసాయానికి పెద్ద పీట
వాణిజ్య పంటల ప్రోత్సాహంలోనూ జిల్లాకే పెద్దపీట వేశారు. రూ.250 కోట్లతో దాదాపు 1000 ఎకరాల్లో చేపట్టబోయే గ్రీన్‌హౌస్ వ్యవసాయంలో ఎక్కువ వాటా జిల్లాకే దక్కింది. హైదరాబాద్‌కు సమీపంలో ఉన్న గజ్వేల్, సిద్దిపేట నియోజకవర్గాల్లోని పలు మండలాల్లో 500లకు పైగా ఎకరాల్లో గ్రీన్‌హౌస్ వ్యవసాయాన్ని ప్రోత్సహించనున్నారు.
దాదాపు 300 నుంచి 400 మంది రైతులు దీని ద్వారా లబ్ధి పొందుతారు. రూ 2.50 కోట్లతో మూగ జీవ అభివృద్ధి పథకంలో జిల్లాకు భాగస్వామ్యం కల్పించారు. రూ 40 లక్షలతో ఉల్లి నిల్వచేసే గోదాంలను ఏర్పాటు చేస్తారు. చిన్ననీటి వనరులైన చెరువులు కుంటల ద్వారా వ్యవసాయానికి సాగు నీళ్లు అందించనున్నారు. జిల్లాలో మొత్తం 9,970 నీటి వనరులుండగా, వీటిలో 20 శాతం చెరువుల, కుంటల అభివృద్ధి, మరమ్మతు పనులను చేపడతారు.
జిల్లాలో మొదటి దశ కింద 1,588 చెరువులు, కుంటల అభివృద్ధి, మరమ్మతు పనులు చేపతారు. సిద్దిపేట నియోజకవర్గంలో 175, దుబ్బాకలో 275, గజ్వేల్‌లో 239, అందోలులో 124, సంగారెడ్డిలో 107, పటాన్‌చెరులో 92, జహీరాబాద్‌లో 25 చెరువుల మరమ్మతు పనులు చేపట్టనున్నారు. నర్సాపూర్, మెదక్, నారాయణఖేడ్ నియోజకవర్గాల్లో 551 చెరువుల మరమ్మతు పనులు చేపట్టే విధంగా బడ్జెట్ నిధులు కేటాయించారు.
తొలి బడ్జెట్‌లో మనకే ప్రాధాన్యం
Published Thu, Nov 6 2014 1:05 AM | Last Updated on Sat, Sep 2 2017 3:55 PM
Advertisement