University of Horticulture
-
పండు ఈగకు ‘వలపు వల!’
సాక్షి, అమరావతి బ్యూరో: పులిని బంధించడానికి బోను ఏర్పాటు చేస్తారు. అందులో మాంసాన్ని ఎరగా వేస్తారు. ఆ మాంసాన్ని తినడానికి వచ్చిన పులి బోనులో చిక్కుతుంది. ఇప్పుడు మామిడిని దెబ్బతీస్తున్న పండు ఈగల నియంత్రణకు సరికొత్త ఎరను ప్రయోగిస్తున్నారు. ఈ ఎరతో రైతులు సత్ఫలితాలు పొందుతున్నారు. ఏమిటా ఎర? ఏమా కథ? మామిడికాయ పక్వానికి వచ్చాక లోపలికి పండు ఈగ ప్రవేశిస్తుంది. లోపల తల్లి ఈగ పిల్లలను పెట్టి కాయ పండాక రసాన్ని పీల్చేస్తుంది. ఇలాంటి కాయల కొనుగోలుకు వ్యాపారులు, ఎగుమతిదార్లు ముందుకురాక రైతులు నష్టపోతున్నారు. కోతకొచ్చే దశలో సగటున నాలుగో వంతు మామిడిని ఈ పండు ఈగ దెబ్బతీస్తోంది. ఏళ్ల తరబడి వేధిస్తున్న ఈ సమస్యపై డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయంలోని నూజివీడు మామిడి పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు ‘ఫ్రూట్ ఫ్లై లూర్’ పేరిట ఓ ఎరను అందుబాటులోకి తెచ్చారు. ఆడ ఈగ సంపర్కానికి సన్నద్ధమయ్యే సమయంలో ఒక రకమైన వాసన విడుదల చేస్తుంది. ఆ వాసనకు ఆకర్షించిన మగ ఈగ.. ఆడ ఈగ వెంటపడుతుంది. క్రిమిసంహారకమందు, రసాయనాలతో రూపొందించిన ఈ లూర్ ఆడ ఈగ సంపర్కానికి ముందు విడుదల చేసే వాసనను పోలి ఉంటుంది. ఈ లూర్ (ఎర)ను ఒక ట్రాప్ బాక్సులో ఉంచి మామిడి చెట్టుకు కడతారు. ఆ బాక్సులో ఆడ ఈగలున్నాయని భ్రమించి మగ పండు ఈగలు ట్రాప్ బాక్సులోకి వెళ్లి ఆ క్రిమిసంహారక ద్రవంలో చిక్కుకుని చనిపోతాయి. సహజంగా ఆడ పండు ఈగలకంటే మగ ఈగల సంతతే అధికంగా ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని శాస్త్రవేత్తలు సంతాన ఉత్పత్తికి కారణమయ్యే మగ పండు ఈగలను నియంత్రించేందుకు ఈ లూర్‌ను గత మార్చి నెల నుంచి విస్తృతంగా అందుబాటులోకి తెచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా పదివేల లూర్‌లను ఉద్యానశాఖ ద్వారా పంపిణీ చేశారు. ఒకసారి ట్రాప్ బాక్స్‌లో వేసిన లూర్ నెలరోజుల పాటు ప్రభావం చూపుతుంది. ఇక ఆడ పండు ఈగల నియంత్రణకు కూడా ఈ శాస్త్రవేత్తలు మరో ద్రావణాన్ని సూచిస్తున్నారు. పులిసిన కల్లు, బెల్లం, మలాథియాన్‌తో తయారు చేసిన ద్రావణాన్ని మామిడి తోటలో ఉంచితే ఆడ పండు ఈగలు దాన్ని ఆకర్షించి చనిపోతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ధర కూడా స్వల్పమే.. ఇక ఈ లూర్ ధర కూడా రైతుకు అందుబాటులోనే ఉంది. లూర్ రూ.40, ట్రాప్ బాక్స్ రూ.100 చొప్పున రైతులకు అందజేస్తున్నారు. ఒక ఎకరం తోటకు నాలుగైదు ఏర్పాటు చేస్తే సరిపోతుంది. ఇలా ఒక ఎకరం మామిడి తోటకు వీటి ఖర్చు గరిష్టంగా రూ.700కు మించదు. ఎకరం తోటలో సగటున 4 టన్నుల దిగుబడి వస్తుంది. ఇందులో కనీసం ఒక టన్ను పండు ఈగ బారిన పడుతుంది. అంటే రైతుకు ఎకరానికి దాదాపు రూ.10 వేలు నష్టం వాటిల్లుతుంది. లూర్కు రూ.700 వెచ్చిస్తే రైతుకు కనీసం రూ.9 వేలు ఆదా అవుతుంది. రాష్ట్రంలో 3.74 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో మామిడి ఉంది. ఏటా 40 లక్షల టన్నుల దిగుబడి వస్తుంది. ఇందులో కనీసం 10 లక్షల టన్నుల మామిడిని పండు ఈగ దెబ్బతీస్తోందని అంచనా. ఇలా ఏటా రాష్ట్రంలో పండు ఈగ సుమారు రూ.1,000 కోట్ల విలువైన మామిడి పంటను నాశనం చేస్తోంది. పండు ఈగతో ఏటా నష్టపోతున్న రైతు ఈ స్వల్ప ఖర్చుతో నివారణ మార్గం లభించడంతో లూర్‌పై ఆసక్తి పెంచుకుంటున్నారని నూజివీడు ఉద్యానశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసులు ‘సాక్షి’కి చెప్పారు. రైతులకు అవగాహన కల్పిస్తున్నాం పండు ఈగతో నష్టపోకుండా అందుబాటులోకి తెచ్చిన ఫ్రూట్ ఫ్లై లూర్‌పై మామిడి రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. ఈ ఈగ బారిన పడ్డ మామిడిని ఎగుమతిదార్లు తీసుకోక ఆశించినంతగా ఎగుమతులు జరగడం లేదు. ఎగుమతులు పెంచడంతోపాటు రైతులకు పండు ఈగ బెడద తగ్గించే ఉద్దేశంతో ఫ్రూట్ ఫ్లై లూర్‌ను విస్తృతం చేస్తున్నాం. ఈ ఏడాది తొలిసారిగా రాష్ట్రంలో 10 వేలకు పైగా లూర్‌లను అందించాం. – బీకేఎం లక్ష్మి, సీనియర్ సైంటిస్ట్, హెడ్, మామిడి పరిశోధన స్థానం, నూజివీడు లూర్‌తో సత్ఫలితాలు.. ఏళ్ల తరబడి పండు ఈగ బెడదను ఎదుర్కొంటున్నాం. ఏటా నాలుగో వంతు పంటను పండు ఈగ దెబ్బతీస్తోంది. ఇన్నాళ్లు వీటి నివారణకు మంటలు వేయడం, టైర్లు కాల్చడం వంటివి చేసేవాళ్లం. అయినా ఆశించిన ఫలితం ఉండేది కాదు. ఇప్పుడు లూర్‌తో పండు ఈగల నివారణ సాధ్యమవుతోంది. నేను 5 ఎకరాల్లో 30 ఫ్రూట్ ఫ్లై లూర్‌లను ఏర్పాటు చేశాను. సత్ఫలితాలివ్వడంతో పండు ఈగ బెడద తప్పింది. – చెలికాని మురళీకృష్ణారావు, రైతు, కోటపాడు, కృష్ణాజిల్లా చదవండి: ఏపీ: 400 మంది ప్రాణాలను కాపాడిన పోలీసులు ఏలూరు: కార్పొరేషన్ ఎలక్షన్ కౌంటింగ్‌కు హైకోర్టు అనుమతి -
ఉద్యాన వర్సిటీలో 72 పోస్టుల భర్తీకి అనుమతి
ఆర్థిక శాఖ ఉత్తర్వులు.. టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీ సాక్షి, హైదరాబాద్: శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన వర్సిటీలో 72 బోధన, బోధనేతర పోస్టుల భర్తీకి అనుమతిస్తూ ఆర్థిక శాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. టీఎస్పీఎస్సీ ద్వారా వీటిని భర్తీ చేసేందుకు అంగీకరించింది. ప్రొఫెసర్/ప్రిన్సిపల్ సైంటిస్ట్ పోస్టు ఒకటి, అసోసియేట్ ప్రొఫెసర్/సీనియర్ సైంటిస్ట్ పోస్టులు 19, అసిస్టెంట్ ప్రొఫెసర్/సైంటిస్ట్ పోస్టులు 28, టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు 2 ఉన్నాయి. స్టోర్ కీపర్ పోస్టులు 5, కేర్ టేకర్ పోస్టులు 4, వ్యవసాయ విస్తరణాధికారుల పోస్టులు 13 ఉన్నాయి. పోస్టుల భర్తీకి అవసరమైన చర్యలు చేపట్టాల్సిందిగా పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను ఆర్థిక శాఖ ఆదేశించింది. జోన్లు, రోస్టర్ పాయింట్లు, రిజర్వేషన్లలను సక్రమంగా పాటించాలని పేర్కొంది. భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేయాలని సూచించింది. -
‘ములుగు’ వర్సిటీకి రూ.1831 కోట్లు
వ్యవసాయ శాఖ మంత్రి పోచారం వెల్లడి గజ్వేల్: మెదక్ జిల్లా ములుగులో నిర్మించనున్న హార్టికల్చర్ యూనివర్సిటీకి రూ. 1831 కోట్లు వెచ్చించనున్నట్లు వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. ఆదివారం ములుగులో వర్సిటీ ఏర్పాటు కోసం భూములను పరిశీలించారు. ఈ నెల 7న సీఎం కేసీఆర్, కేంద్ర మంత్రులు.. వర్సిటీకి శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో మంత్రి ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వర్సిటీ నిర్మాణానికి కేంద్రం గత యేడాది రూ. 10 కోట్లు, ఈ యేడు రూ.75 కోట్లు విడుదల చేసిందన్నారు. నిధులు సరిపోవని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రికి విజ్ఞప్తి చేయడంతో మరో రూ.200 కోట్ల విడుదలకు అంగీకరించారని చెప్పారు. వర్సిటీకి ఇప్పటి వరకు 112 ఎకరాలను సేకరించామని తెలిపారు. తెలంగాణ కోసం పనిచేసిన త్యాగధనుల పేరుతో వర్సిటీలకు నామకరణం చేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కొత్తగా 8 కోల్డ్‌స్టోరేజీలను ఏర్పాటుకు నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు. ఒక్కో కోల్డ్స్టోరేజీకి రూ.8 కోట్లు వెచ్చిస్తామన్నారు. సీఎం డ్రిప్ పథకానికి అదనంగా మరో రూ.వెయ్యి కోట్లు కేటాయించినట్లు స్పష్టం చేశారు. -
ఉత్తుత్తి మాటలే!
ఇందులో ఒక్కటంటే ఒక్కటి కూడా ఆచరణ దిశగా అడుగు ముందుకు పడుతున్న సూచనలు కనిపించడంలేదు. పెపైచ్చు సిద్ధమైన విమానాశ్రయూన్ని కూడా ప్రారంభించకుండా రాజకీయ వివక్ష ప్రదర్శిస్తున్నారు. వైఎస్ హయూంలో ఐదేళ్లు మినహా దశాబ్దాలుగా జిల్లా అభివృద్ధి విషయంలో వివక్ష కనిపిస్తూనే ఉంది. జిల్లాకు మరోమారు ‘చంద్ర’గ్రహణం పట్టింది. పారిశ్రామిక ప్రగతికి అవసరమైన మౌళిక సదుపాయాలు అందుబాటులో ఉన్నా నిష్ర్పయోజనమే అవుతోంది. గత ఆరు నెలల చంద్రబాబు పాలన తీరును విశ్లేషిస్తే ఇది కాదనలేని వాస్తవం. గత ఆరు నెలల్లో వివిధ సందర్భాల్లో సీఎం చంద్రబాబు జిల్లాకు ప్రకటించిన వరాలివి ⇒ జిల్లా సమగ్రాభివృద్ధి కోసం విశేషంగా కృషి ⇒ జిల్లాలో ఉక్కు పరిశ్రమ నెలకొల్పుతాం.. ⇒ పండ్ల రైతుల కోసం మెగా ఫుడ్‌పార్క్ ఏర్పాటు ⇒ రాజంపేటలో హార్టికల్చర్ యూనివర్శిటీ ఏర్పాటు... ⇒ చేనేతల కోసం మైలవరంలో టెక్స్టైల్స్ పార్క్.. ⇒ ప్రొద్దుటూరులో అఫెరల్ పార్క్.. ⇒ జిల్లాలో పిలిగ్రిమ్ టూరిస్టు సర్క్యూట్.. ⇒ సాగునీటి ప్రాజెక్టులు పూర్తి.. ⇒ కడప-చైన్నై నాలుగు లైన్లు రహదారి విస్తరణ.. ⇒ ఏపిఐఐసీ భూముల్లో పరిశ్రమలు నెలకొల్పుతాం.. సాక్షి ప్రతినిధి,కడప: పరిశ్రమల కోసం ఎదురుచూపులు.. ఉపాధి అవకాశాలను పెంచితే ఫ్యాక్షన్‌ను లేకుండా చేయవచ్చనే లక్ష్యంతో జిల్లాలో పరిశ్రమల స్థాపనకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ సిద్ధమయ్యారు. కడప సమీపంలో ఏపీఐసీసీ ద్వారా భూములు సేకరించి కొప్పర్తి మెగా ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేశారు. 6464.5 ఎకరాలు భూమిని సిద్ధంగా ఉంచారు. ఆ తర్వాత వచ్చిన రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వాలు ఈ విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శించారు. అదేబాటలో ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం నడుస్తున్నట్లుంది. రాష్ట్ర విభజన అనంతరం అన్ని జిల్లాల్లో అటు పారిశ్రామికంగానో, ఇటు వైద్యం, అత్యున్నత విద్య పరంగానో అభివృద్ధికి ప్రతిపాదనలు, చర్యలు కన్పించాయి. ఒక్క వైఎస్సార్ జిల్లాకు మాత్రమే అలాంటి జాబితాలో చోటు దక్కడం లేదని జిల్లా వాసులు మదనపడుతున్నారు. సాగునీటి పథకాలు ఎక్కడ వేసినా గొంగళి అక్కడే అన్నట్లుగా ఉండిపోయాయి. సమీక్షలు మినహా ఎలాంటి పురోగతి లేకపోయింది. తుదకు వరదనీరు శ్రీశైలం జలాశయం నుంచి సముద్రం పాలైంది, అరుునా వైఎస్సార్ జిల్లాలోని జలాశయాలకు మళ్లించలేని దుస్థితిలో పాలకులు ఉండిపోయారనే విమర్శలు బలంగా ఉన్నాయి. అడుగడుగునా రాజకీయ వివ క్షే.... వైఎస్సార్ జిల్లా పట్ల అడుగడుగునా రాజకీయ వివక్ష కన్పిస్తోంది. తుదకు ముఖ్యమంత్రి పర్యటనలోనూ అదేధోరణి అవలంబించారన్న విమర్శలు ఉన్నారుు. ఆరునెలల కాలంలో ప్రతి జిల్లాలో మూడుసార్లు పర్యటించారు. జిల్లాకు మాత్రం జన్మభూమి- మాఊరులో భాగంగా తప్పని పరిస్థితుల్లో ఒక్కమారు హాజరయ్యారు. రాజకీయ వివక్షలో భాగంగానే తుదకు విమానాశ్రమం సైతం ప్రారంభోత్సవానికి నోచుకోలేదు. జిల్లా పారిశ్రామిక వృద్ధితో పాటు విద్య, వైద్య రంగాల్లో పురోగతిని సాధించడంతో జిల్లా కేంద్రానికి విమాన సౌకర్యం అనివార్యమైంది. రిమ్స్, వైవీయూ నెలకొన్న నేపధ్యంలో ప్రముఖులు రాకపోకలు, యర్రగుంట్ల సమీపంలో సిమెంట్ ఫ్యాక్టరీల యాజమాన్యాలు, ప్రజాప్రతినిధులు, ఉద్యోగులతో పాటు ఇతర వ్యాపారులకు కూడా కడప నుంచి దేశంలోని పలు ప్రాంతాల్లో వ్యాపారలావాదేవీల కోసం తరచూ వెళ్లేవారందరికీ కడప ఏయిర్పోర్టు సౌలభ్యంగా ఉంటుంది. విమానాశ్రయం నుంచి ‘కనెక్టింగ్ ఫ్లైట్స్’ నడుస్తాయనే ఆలోచనకు దూరం చేశారనే విశ్లేషలు భావిస్తున్నారు. గత నెల 8న రైల్వేకోడూరు మండలం ఓబనపల్లెలో పర్యటించినప్పుడూ సీఎం బాబు జిల్లాకు వరాల జల్లులు కురిపించారు. అసెంబ్లీలో రాజధాని ప్రకటన చేసిన రోజు సైతం ఆదేరీతిలో హామీలు ఇచ్చారు. ఒక్కటంటే ఒక్కటి కూడా ఆచరణలో ఆదేశాలు జారీ కాలేదు. తుదకు రూ.20వేల కోట్లుతో ఉక్కు పరిశ్రమను సెయిల్ నేతృత్వంలో ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఆమేరకు జిఓఎం(గ్రూప్స్ ఆప్ మినిష్టర్స్) నోట్లో ప్రకటించారు. అయినప్పటికీ ప్రభుత్వం నుంచి ఆశించిన ప్రయత్నం కన్పించలేదు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఆరునెలలు పాలనలో జిల్లాకు ఒరిగింది ఏమి లేదని విశ్లేషకులు పేర్కొంటున్నారు. పూర్వపు వివక్షత మరోమారు స్పష్టంగా కన్పిస్తోందనేది మాత్రం కాదనలేని సత్యం. -
తొలి బడ్జెట్లో మనకే ప్రాధాన్యం
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: సీఎం కేసీఆర్ చెప్పినట్లుగానే ప్రాణహితకు ప్రాణం పోశారు. రూ.1,820 కోట్లు ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టుకు కేటాయించారు. విశ్వవిఖ్యాత సంస్థలు నిమ్జ్, ఫారెస్ట్రీ కళాశాలను జిల్లాకు మంజూరు చేసి ప్రపంచ పటంలో మెతుకుసీమకు గుర్తింపు తెచ్చారు. ఈ ప్రాంత బిడ్డల ఆశలు.. ఆకాంక్షలకు తగ్గట్టుగానే బడ్జెట్లో తొలి ప్రాధాన్యత ఇచ్చారు. ఇక నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు కూడా జిల్లా నుంచే ప్రాతినిథ్యం వహిస్తుండడంతో సాగు, తాగునీటికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. గ్రీన్హౌస్ వ్యవసాయం కోసం కేటాయించిన రూ.250 కోట్లతో దాదాపు 70 శాతం నిధులు మెదక్ జిల్లాలోనే ఖర్చు పెట్టే విధంగా బడ్జెట్‌ను రూపొందించారు. కేవలం 10 నెలల కోసం రూపొందించిన రూ.లక్ష కోట్ల రాష్ట్ర ఆర్థిక బడ్జెట్లో మెదక్ జిల్లాకే సింహభాగం నిధులు కేటాయించారు. రైతుల కోసం ఇప్పటికే రూ.78 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ, రూ.500 కోట్లు రైతు రుణాలను ప్రభుత్వం అందించింది. మొత్తానికి తొలిపద్దుతోనే మోడువారిన యువత మోముల్లో... బీడు బారిన భూముల్లో కేసీఆర్ కొత్త చిగురులు తొడిగారు. నిమ్జ్‌తో జిల్లాకు ఖ్యాతి... యువతకు ఉపాధి జహీరాబాద్ నియోజకవర్గంలో 12,365 ఎకరాల్లో నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ ఏర్పాటుకు అనుమతించారు. దీని ద్వారా రూ.40 వేల కోట్ల వరకు పెట్టుబడులు వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. దీని ద్వారా 3 లక్షల మంది యువతకు ప్రత్యక్షంగా, 4.5 లక్షల మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందని ప్రభుత్వం బడ్జెట్లో పేర్కొంది. నిమ్జ్ కోసం అధికారులు ఇప్పటికే జహీరాబాద్ నియోజకవర్గంలోని న్యాల్కల్, ఝరాసంగం మండలాల్లోని 18 గ్రామాల్లో సర్వే నిర్వహించి 12,635 ఎకరాల భూమిని గుర్తించి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించారు. ఇందులో 4 వేల ఎకరాల ప్రభుత్వ, అసైన్డ్భూమి ఉంది. మిగిలిన భూమిని రైతుల వద్ద నుంచి సేకరించాల్సి ఉంది. దీనిని పూర్తి చేసేందుకు ఆరు సంవత్సరాల సమయం పడుతుందని భావిస్తున్నారు. ఫారెస్ట్ట్రీ కళాశాలకు రూ.10 కోట్లు గజ్వేల్ నియోజకవర్గంలోని ములుగు మండల కేంద్రంలోని రాజీవ్హ్రదారి పక్కన ఫారెస్ట్రీ కళాశాల ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని అధికారులు ఇప్పటికే గుర్తించారు. ఇక్కడ అందుబాటులో ఉన్న వెయ్యి ఎకరాల్లో 500 ఎకరాలు హార్టికల్చర్ యూనివర్శిటీ, మరో 450 ఎకరాల్లో అటవీశాఖ కళాశాల, పరిశోధనా కేంద్రాన్ని నిర్మించాలనినిర్ణయించారు. అదేవిధంగా ముందు భాగంలో ఉన్న 175 ఎకరాల్లో ఆయా సంస్థలకు చెందిన పరిపాలనా భవనాలను నిర్మించడానికి సూత్రప్రాయంగా నిర్ణయించారు. వీటిని నిర్మాణాలకు గానూ కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.200 కోట్ల నిధులను మంజూరు చేసింది. కొత్తగా నిర్మించబోతున్న ఫారెస్ట్ కాలేజ్ ఆఫ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ దక్షిణ భారత దేశంలోనే రెండోది. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో ఫారెస్ట్రీ కళాశాలకు రూ.10 కోట్లు కేటాయించారు. 22 వేల మందికి ఊరట ఆటోలు, ట్రాక్టర్ల మీద రవాణ పన్ను మినహాయించడంతో జిల్లాలో 22 వేల మందికి ఊరట లభించింది. ఆటో డ్రైవర్లు రవాణా పన్ను కట్టలేక ఆటోలు వదిలేసుకున్న సంఘటనలు జిల్లాలో అనేకం ఉన్నాయి. ప్రస్తుతం జిల్లాలో మొత్తం 14,000 ఆటోలు, 6,000 ట్రాక్టర్లు, 530 లైట్ గూడ్స్ వెహికల్స్, 1,985 వ్యవసాయ ట్రాయిలర్లు ఉన్నాయి. ఇప్పటి వరకు ఆటో మీద రూ.1,760, ట్రాక్టర్ల మీద రూ.1,260 ఉమ్మడి రాష్ర్టంలో ప్రభుత్వం రవాణ పన్ను విధించింది. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్టుగా కేసీఆర్ రవాణా పన్ను మినహాయించడంతో రాష్ర్ట ప్రభుత్వానికి జిల్లా నుంచి రూ 1.50 కోట్ల భారం పడుతుంది. ప్రాణహితకు ప్రాణం...సింగూరుకు ఊతం పడావు పడిన ప్రాణహిత- చేవేళ్లకు ముఖ్యమంత్రి కేసీఆర్ మళ్లీ ప్రాణం పోశారు. ప్రాజెక్టు నిర్మాణ పనుల కోసం ఏకంగా రూ.1,820 కోట్లు కేటాయించారు. ప్రాజెక్టు డిజైన్లోనూ మార్పులు చేశారు. 2007లో జిల్లాలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రాణహితకు శంకుస్థాపన చేశారు. 2008లో పనులను ప్రారంభించారు. 2014-15 వరకు ప్రాజెక్టును జిల్లాలో పూర్తి చేయాలని లక్ష్యం పెట్టారు. సిద్దిపేట డివిజన్ పరిధిలో 14.45 వేల ఎకరాల భూమి సేకరించాలని నిర్దేశిత లక్ష్యాన్ని ఎంచుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కేవలం 859 ఎకరాలు మాత్రమే సేకరించారు. జిల్లాలో 5 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో చేపడుతున్న ప్రాణహిత ప్రాజెక్టు పనులు చిన్నకోడూరు, సిద్దిపేట, తొగుట, కొండపాక, గజ్వేల్, వర్గల్, ములుగు మండలాల్లో కొనసాగుతున్నాయి. గజ్వేల్ మండలం దాతర్పల్లి, తొగుట మండలం వేములగట్లో కాల్వ పనులు సాగుతున్నాయి. నష్టపరిహార విషయంలో రైతుల నుంచి తీవ్ర ప్రతిఘటనలు ఎదురుకాగా ఈ ఏడేళ్ల కాలంలో 40 శాతం పనులు కూడా సాగలేదు. దీంతో ఎకరాకు సగటున రూ. 3.80 లక్షలను చెల్లించేందుకు తాజాగా కేసీఆర్ ప్రభుత్వం సిద్ధమైంది. సింగూరు ప్రాజెక్టుకు రూ.13 కోట్లు, ఘనపురం ప్రాజెక్టు ఫతేనహర్, మహబూబ్‌నహర్ కాల్వల ఆధునీకీకరణ కోసం రూ.2 కోట్లు, నల్లవాగు నిర్మాణం కోసం రూ.30 లక్షలు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. చెరువులకు, వ్యవసాయానికి పెద్ద పీట వాణిజ్య పంటల ప్రోత్సాహంలోనూ జిల్లాకే పెద్దపీట వేశారు. రూ.250 కోట్లతో దాదాపు 1000 ఎకరాల్లో చేపట్టబోయే గ్రీన్హౌస్ వ్యవసాయంలో ఎక్కువ వాటా జిల్లాకే దక్కింది. హైదరాబాద్‌కు సమీపంలో ఉన్న గజ్వేల్, సిద్దిపేట నియోజకవర్గాల్లోని పలు మండలాల్లో 500లకు పైగా ఎకరాల్లో గ్రీన్హౌస్ వ్యవసాయాన్ని ప్రోత్సహించనున్నారు. దాదాపు 300 నుంచి 400 మంది రైతులు దీని ద్వారా లబ్ధి పొందుతారు. రూ 2.50 కోట్లతో మూగ జీవ అభివృద్ధి పథకంలో జిల్లాకు భాగస్వామ్యం కల్పించారు. రూ 40 లక్షలతో ఉల్లి నిల్వచేసే గోదాంలను ఏర్పాటు చేస్తారు. చిన్ననీటి వనరులైన చెరువులు కుంటల ద్వారా వ్యవసాయానికి సాగు నీళ్లు అందించనున్నారు. జిల్లాలో మొత్తం 9,970 నీటి వనరులుండగా, వీటిలో 20 శాతం చెరువుల, కుంటల అభివృద్ధి, మరమ్మతు పనులను చేపడతారు. జిల్లాలో మొదటి దశ కింద 1,588 చెరువులు, కుంటల అభివృద్ధి, మరమ్మతు పనులు చేపతారు. సిద్దిపేట నియోజకవర్గంలో 175, దుబ్బాకలో 275, గజ్వేల్‌లో 239, అందోలులో 124, సంగారెడ్డిలో 107, పటాన్చెరులో 92, జహీరాబాద్‌లో 25 చెరువుల మరమ్మతు పనులు చేపట్టనున్నారు. నర్సాపూర్, మెదక్, నారాయణఖేడ్ నియోజకవర్గాల్లో 551 చెరువుల మరమ్మతు పనులు చేపట్టే విధంగా బడ్జెట్ నిధులు కేటాయించారు. -
తెలంగాణకు ‘హరితహారం’
పథకాన్ని ప్రకటించిన సీఎం అడవులు లేకపోవడం వల్లే కరవుకాటకాలు వ్యవసాయ వర్సిటీకి అనుబంధంగా ఫారెస్టు కాలేజీ హైదరాబాద్: తెలంగాణకు ‘ హరితహారం’ అనే పథకానికి రూపకల్పన చేస్తున్నట్టు ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖరరావు వెల్లడించారు. రాష్ట్రంలో మొక్కల పెంపకం, ఫారెస్టు కాలేజీ, హార్టికల్చర్ యూనివర్సిటీ ఏర్పాటు తదితర అంశాలపై శనివారం ఆయన సచివాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. తెలంగాణలో గ్రీన్ కవర్ ఎక్కువ ఉండేందుకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందన్నారు. అందుకే హరిత హారం పథకాన్ని రూపొందిస్తున్నామన్నారు. కరువు కాటకాలకు, వర్షాభావ పరిస్థితులకు చాలినంత అడవి లేకపోవడమే కారణమన్న అవగాహన ప్రజల్లో రావాలని సీఎం కోరారు.తెలంగాణలో అడవులకు సంబంధించిన విద్యను అందించడం కోసం ఫారెస్టు కాలేజీని నెలకొల్పుతామని సీఎం ప్రకటించారు. తమిళనాడులోని మెట్టుపాలెం వద్ద ఫారెస్టు కాలేజీ ఉందనీ... అందులో చదివిన చాలామంది విద్యార్థులు ఐఎఫ్ఎస్కు ఎంపికయ్యారని సీఎం తెలిపారు. అలాంటి ఫారెస్టు కాలేజీని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఏర్పాటు చేస్తామన్నారు. మెదక్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో అందుకు అనువైన స్థలాన్ని ఇప్పటికే పరిశీలించినట్టు చెప్పారు.ఈవర్సిటీకి అనువైన స్థలాన్ని కూడా ఎంపిక చేయాలని సూచించారు. -
గజ్వేల్ లో హార్టికల్చర్ యూనివర్సిటీ
* అటవీ పరిశోధన సంస్థకూ ఏర్పాట్లు * ములుగు అటవీ భూముల పరిశీలన * త్వరలో శంకుస్థాపన : సీఎం కేసీఆర్ వెల్లడి సాక్షి, గజ్వేల్: మెదక్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో వెయ్యికోట్లతో హార్టికల్చర్ యూనివర్సిటీ, ఫారెస్ట్రీ కళాశాల, పరిశోధనా సంస్థను ఏర్పాటు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు వెల్లడించారు. ములుగు మండలంలోని అటవీ ప్రాంతాన్ని శుక్రవారం సాయంత్రం ఆయన సందర్శించారు. పరిశోధన కేంద్రానికి చెందిన భూములు వివరాలను తెలుసుకున్నారు. అందుబాటులో ఉన్న వెయ్యి ఎకరాల్లో 500 ఎకరాలు హార్టికల్చర్ యూనివర్సిటీ, మరో 450 ఎకరాల్లో అటవీశాఖ కళాశాల, పరిశోధనా కేంద్రాన్ని నిర్మిస్తామన్నారు. ముందుభాగంలో 175 ఎకరాల్లో ఆయా సంస్థల పరిపాలనా భవనాలను నిర్మిస్తామని సీఎం వెల్లడించారు. వీటి నిర్మాణాలకు కేంద్ర ప్రభుత్వం రూ.200 కోట్ల నిధులను మంజూరు చేసిందని తెలిపారు. త్వరలోనే ఈ పనులకు కేంద్రమంత్రితో కలిసి శంకుస్థాపన చేయనున్నట్లు ఆయన చెప్పారు. ఏర్పాట్లు వెంటనే చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. హార్టికల్చర్ యూనివర్సిటీ ద్వారా విస్తృతమైన పరిశోధనలు జరిగి...వాటి ఫలితాలతో ఈప్రాంతంలో ఉద్యాన పంటల అభివృద్ధికి అవకాశం ఉంటుందన్నారు. గజ్వేల్ ప్రస్తుతం గణనీయమైన కూరగాయల సాగుతో ‘వెజిటబుల్ హబ్’గా ఆవిర్భవించినందున ఈ సంస్థల ఏర్పాటుతో భారీ ప్రయోజనం కలగనుందన్నారు. హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని యూనివర్సిటీకి దీటుగా ఈ హార్టికల్చర్ యూనివర్సిటీ మారనుందన్నారు. ఉపాధి అవకాశాలు కూడా భారీగా లభిస్తాయని తెలిపారు. కొత్తగా నిర్మిస్తున్న ఫారెస్ట్ కాలేజీ ఆఫ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ కూడా దక్షిణ భారత దేశంలోనే రెండో సంస్థగా ఖ్యాతి గడిస్తుందన్నారు. తమిళనాడులోని కోయంబత్తూర్ సమీపంలో మెట్టుపాళ్యంలోని సంస్థ ప్రతిఏటా దేశానికి ఎంతోమంది ఐఎఫ్ఎస్లను అందిస్తుండగా... ఈ సంస్థ కూడా అదేస్థాయి ప్రమాణాలను కలిగివుంటుందన్నారు. గజ్వేల్ నియోజకవర్గంలో ఐటీసీ లాంటి సంస్థలు కూడా పరిశ్రమలను ఏర్పాటు చేయడానికి ముందుకు వస్తున్నాయన్నారు. పరిశ్రమల స్థాపనలో నిర్లక్ష్యం వహిస్తున్న సంస్థల భూములను స్వాధీనం చేసుకుంటామన్నారు. కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జి కలెక్టర్ శరత్, ఐఎఫ్ఎస్ అధికారి ప్రియాంక నర్గీస్, ఎస్పీ శేముషీ బాజ్‌పాయ్, అటవీశాఖ అధికారి సోనీబాల, గజ్వేల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ(గాడా) ఓఎస్డీ హన్మంతరావు, టీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి మడుపు భూంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సీఎంగా.. తొలిసారి
నేడు కేసీఆర్ పర్యటన ► కరీంనగర్ నుంచే శ్రీకారం ►అభివృద్ధి పనులకు ముహూర్తం ►నేడు జిల్లాలో కేసీఆర్ పర్యటన ►రుణమాఫీ కోసం ఎదురుచూపులు ►జిల్లా ప్రణాళికకు రూ.10వేల కోట్లు ►నిధులు లేక నీరసించిన ప్రాజెక్టులు ►జిల్లాపై వరాల జల్లు కురిపిస్తారా..! సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తనకు అచ్చొచ్చిన జిల్లాలో అడుగు పెడుతున్నారు. సీఎం హోదాలో తొలిసారిగా మంగళవారం కరీంనగర్లో పర్యటించనున్నారు. నవ తెలంగాణ నిర్మాణంలో భాగంగా చేపట్టే అభివృద్ధి పనులకు ఇక్కడే పునాదిరాయి వేస్తారు. పార్టీ ఆవిర్భావం నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు... తొలి ప్రభుత్వం పాలనాపగ్గాలు చేపట్టే వరకు అడుగడుగునా కేసీఆర్ ఇదే జిల్లాను నమ్ముకున్నారు. మూడుసార్లు ఇక్కణ్నుంచే ఎంపీగా గెలిచిన కేసీఆర్ ఇటీవలి సార్వత్రిక ఎన్నికల ప్రచారాన్ని జిల్లా నుంచే ప్రారంభించారు. ఇందులో ఘన విజయం సాధించి తెలంగాణ తొలి ప్రభుత్వ పగ్గాలు చేపట్టారు. ఉద్యమంతో పాటు రాజకీయంగా తనకు కలిసొచ్చిన జిల్లా కావటంతో అదే సెంటిమెంట్‌ను ఆయన కొనసాగిస్తున్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టాక జిల్లాల పర్యటనకు బయల్దేరటం ఇదే తొలిసారి. తన తొలి పర్యటన కావటంతో సీఎం జిల్లాపై వరాలు కురిపిస్తారని ప్రజలు ఎదురుచూస్తున్నారు. పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులు.. ఎన్నెన్నో అభివృద్ధి పనులకు కదలిక వస్తుందని.. ఆయనేం మాట ఇస్తారో అని ఆశగా చూస్తున్నారు. మెగా టెక్స్‌టైల్‌పై కోటి ఆశలు మరమగ్గాల పరిశ్రమకు నిలయమైన సిరిసిల్లలో మెగా టెక్స్టైల్ క్లస్టర్ ఏర్పాటుపై ఆశలు చిగురిస్తున్నాయి. ఇక్కడ దాదాపు 38 వేల మరమగ్గాలతో ఏటా రూ.350 కోట్లకు పైగా విలువైన వస్త్రోత్పత్తి జరుగుతోంది. రాష్ట్రంలోనే తొలి టెక్స్టైల్ పార్కు ఇక్కడే వెలిసింది. దీనికి సమీపంలోనే మెగా టెక్స్టైల్ క్లస్టర్ ఏర్పాటు చేసేం దుకు అవసరమైన స్థలం, వనరులు కూడా ఉన్నా యి. దీంతో వస్త్రశుద్ధి కర్మాగారాలు, సైజింగ్ పరిశ్రమలు, అద్దకం పరిశ్రమలతో పాటు అత్యాధునిక మరమగ్గాల పరిశ్రమలు, సాంకేతిక సలహాలను అందించే ప్రత్యేక పరిశ్రమలు ఇక్కడి కార్మికులకు అందుబాటులోకి వస్తాయి. హార్టికల్చర్ యూనివర్సిటీ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన హార్టికల్చర్ యూనివర్సిటీ... ప్రతిష్టాత్మకమైన ఐఐఎం ఏర్పాటుకు అనువైన స్థలాల కోసం జిల్లాలో సర్వే చేపట్టారు. దీంతో ఈ రెండు ప్రతిష్టాత్మక సంస్థలు ఎప్పుడెప్పుడు వస్తాయా.. అని ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో వ్యవసాయ పరిశోధన కేంద్రం, అగ్రికల్చర్ కాలేజీ, వ్యవసాయ పాలిటెక్నిక్ కాలేజీ, చల్గల్ వ్యవసాయ ప్రదర్శన క్షేత్రాలున్నాయి. వీటికి సమీపంలో యూనివర్సిటీ నెలకొల్పితే జిల్లా అగ్రికల్చర్ హబ్‌గా వెలుగొందే అవకాశముంది. కేంద్రం పరిశీలనలో ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ విద్యాసంస్థ ఏర్పాటు చేస్తే సిరిసిల్ల ప్రాంతం అభివృద్ధికి నోచుకోనుంది. రుణాలపైనే ఆశ.. వర్షాభావంతో ఖరీఫ్ సీజన్ కష్టకాలాన్ని తలపిస్తోంది. సాగువిస్తీర్ణం తగ్గిపోయింది. కేబినేట్లో తీసుకున్న నిర్ణయాల మేరకు రుణమాఫీ రైతులను ఊరిస్తోంది. జిల్లా పరిధిలో మొత్తంగా రూ.2984 కోట్లు మాఫీ చేసేందుకు సర్కారు తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తమవుతోంది. జిల్లాలో 5.05 లక్షల మందికి మేలు చేసే ఈ పథకాన్ని సకాలంలో అమలు చేస్తే.. బ్యాంకులు కొత్త రుణాలు పంపిణీ చేస్తాయని అన్నదాతలు ఆశగా ఎదురుచూస్తున్నారు. రూ.10 వేల కోట్లు ? ప్రజల భాగస్వామ్యంతో వినూత్నంగా రూపొందించిన మన గ్రామం.. మన మండలం.. మన జిల్లా ప్రణాళికలు తుది దశకు చేరుకున్నాయి. ప్రాధాన్య క్రమంలో గుర్తించిన పనులకు రూ.10 వేల కోట్లు అంచనా వ్యయమవుతుందని లెక్క తేలింది. బడ్జెట్లో ఈ ప్రణాళికలకు పెద్ద వాటా దక్కితే పల్లె పల్లెనా ప్రజలు కోరుకున్న తక్షణ సామాజిక అవసరాలు నెరవేరుతాయి. పరిశ్రమలపై ఆశలు అస్ట్రేలియాకు చెందిన కంపెనీ కరీంనగర్, మెదక్ జిల్లాలో ఇనుము, ఉక్కు కర్మాగారాల ఏర్పాటుకు ముందుకు రావటం కొత్త ఆశలు చిగురింపజేస్తోంది. కరీంనగర్లో ఇనుప ఖనిజం, ఉక్కు కర్మాగారాల ఏర్పాటుకు గొల్లపల్లి మండలంలో ఇనుప ఖనిజపు గుళికల తయారీ, ఉక్కు పరిశ్రమల ఏర్పాటుకు అస్ట్రేలియా కంపెనీ ప్రతిపాదనలు సమర్పించింది. దీనిపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాల్సి ఉంది. ఎల్లంపల్లి ఎదురుచూపులు కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో 2.50 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించేందుకు గోదావరిపై తలపెట్టిన ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మాణం దాదాపుగా పూర్తయింది. 20.175 టీఎంసీల నీటిని నిల్వ చేసేందుకు గోదావరి నదికి అడ్డంగా ఇక్కడ బ్యారేజీ నిర్మించారు. నాలుగేళ్లలోనే పూర్తి కావాల్సిన ఈ ప్రాజెక్టుకు ఇప్పటికే తొమ్మిదేళ్ల కాలం పట్టింది. రూ.3356 కోట్లు ఖర్చు చేసినప్పటికీ నిర్వాసితులకు పునారావాస కాలనీలు, పరిహారపు సమస్యలు ఇప్పటికీ వెంటాడుతున్నాయి. ‘మానేరు’కు ప్రాణహితం ప్రాణహిత-చేవెళ్ల సుజల స్రవంతి మెగా ప్రాజెక్టు... మిడ్ మానేరు ప్రాజెక్టులపై కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. నియోజకవర్గానికి లక్ష ఎకరాల సాగునీటిని అందించే ప్రణాళికలో భాగంగా ఈ పనులకు ప్రభుత్వం ప్రాధాన్యతగా ఎంచుకోవటం గమనార్హం. మిడ్‌మానేరు వరకు ప్రాణహిత ప్రాజెక్టు పనులను వేగంగా పూర్తి చేయాలని నిర్ణయించటంతో.. జిల్లాలో దాదాపు 80 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందనుంది. మిడ్‌మానేరు రిజర్వాయర్‌లో నీటిని నిల్వ చేస్తే.. సిరిసిల్ల, హుస్నాబాద్ నియోజకవర్గాల పరిధిలోని 10 మండలాలు, 157 గ్రామాలకు సాగునీరు, తాగునీటి సమస్య తీరిపోనుంది. యూజీడీ కథ కంచికేనా..? కరీంనగర్ నగర ప్రజలకు ప్రత్యక్షంగా నరకం చూపించిన అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులు అర్ధాతరంగా నిలిచిపోయాయి. ఏడేళ్లుగా రోడ్లను తవ్వి ఎక్కడికక్కడే వదిలేశారు. రూ.76.5 కోట్లతో చేపట్టిన ఈ పనుల్లో ఇప్పటికే రూ.55 కోట్లు చెల్లించారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం, అధికారుల అలసత్వంతో ఈ పనులు ఆగిపోయాయి. సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ (ఎస్టీపీ) సివిల్ పనులు పూర్తయినా, ఎలక్ట్రికల్ మెకానిక్ ఫిట్టింగ్‌ల ఊసేలేదు. ఏడాదిగా కాంట్రాక్టర్ పనులు నిలిపేయడంతో.. ఈ పని రద్దు చేసినట్లేనా.. మళ్లీ రోడ్లు తవ్వి తోడే పని మొదలవుతుందా.. అనే ఆందోళన ప్రజలను పట్టి పీడిస్తోంది. వలస బతుకులకేదీ భరోసా? బతుకు దెరువుకు జిల్లా నుంచి వేలాది మంది విదేశాలకు తరలి వెళుతున్నారు. రోజుకో సంక్షోభంతో గల్ఫ్ దేశాలకు వెళ్లిన 3.5 లక్షల మంది వలస కార్మికుల ఉపాధి గాలిలో దీపంలా మారింది. అప్పులు తీర్చలేక.. తిరిగి రాలేక ఎంతో మంది తల్లడిల్లుతున్నారు. గల్ఫ్ బాధిత కుటుంబాలన్నీ తమకు భరోసా కావాలని.. తమ గోడు పట్టించుకోవాలని ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తున్నాయి. గల్ఫ్ బాధితులను ఆదుకునేందుకు కేరళ తరహాలో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తామన్న హామీని ప్రభుత్వం నిలబెట్టుకోవాల్సిన అవసరముంది. ‘కేసీఆర్’ ప్రోగ్రాంకు శ్రీకారం కరీంనగర్ సిటీ రెనోవేషన్ (కేసీఆర్) పేరిట స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ వినూత్న కార్యక్రమానికి రూపకల్పన చేశారు. ప్రజల నుంచి వచ్చే విరాళాలతో నగరపాలక సంస్థ భాగస్వామ్యంతో నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దాలనే ఆలోచనకు కేసీఆర్ పేరు పెట్టారు. ఈ కార్యక్రమాన్ని కూడా కేసీఆర్ చేతుల మీదుగానే ప్రారంభించనున్నారు. దీనికోసం ఐదేళ్ల ప్రణాళికలను రూపొందించారు. లక్ష మొక్కల పెంపం జిల్లాకేంద్రంలో లక్ష మొక్కల పెంపకం కార్యక్రమానికి సీఎం చేతుల మీదుగా శ్రీకారం చుట్టనున్నారు. నగరంలోని ప్రధాన రోడ్లకు ఇరువైపుల లక్ష మొక్కలు నాటేందుకు రెండేళ్ల క్రితం పూనుకున్నారు. ఎన్టీపీసీ, కేశోరామ్ సిమెంట్ కంపెనీ ట్రీగార్డులు అందించేందుకు ముందుకు వచ్చాయి. కానీ.. కేవలం రెండు వేల మొక్కులే నాటి చేతులు దులుపుకున్నారు. వాటిని సైతం సంరక్షించలేకపోయారు. మళ్లీ అదే లక్ష మొక్కల కార్యక్రమానికి సీఎం చేతుల మీదుల మీదుగా ప్రారంభించనున్నారు. ఈసారైనా శ్రద్ధ చూపి పచ్చదనం కోసం పనిచేస్తారని ఆశిద్దాం. ఆ మూడు ప్రాజెక్టులు అంతేనా..? హుస్నాబాద్ మెట్ట ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసే తోటపల్లి, గండిపల్లి, గౌరవెల్లి ప్రాజెక్టుల పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. చిగురుమామిడి మండలం ఓగుళాపూర్లో 1.71 టీఎంసీలతో నిర్మించే తోటపల్లి ప్రాజెక్టు పనులు ఇంతవరకు ప్రారంభం కాలేదు. హుస్నాబాద్ మండలం గౌరవెల్లి వద్ద 1.4.1 టీఎంసీల సామర్థ్యంతో నిర్మాణం చేపట్టిన గౌరవెల్లి జలాశయం పనులు సగంలోనే నిలిచిపోయి రెండేళ్లవుతోంది. ఇదే మండలం గండిపల్లిలో 0.0518 టీఎంసీతో నిర్మించే రిజర్వాయర్ పనులు సైతం నత్తనడకనే సాగుతున్నాయి. ఓగుళాపూర్ రిజర్వాయర్‌నుంచి 38 కిలోమీటర్ల మేర కాల్వ నిర్మాణం పనులుచేపట్టాల్సి ఉండగా.. ఇందులో 12 కిలోమీటర్లు సొరంగమార్గం నిర్మించాల్సి ఉంది. ఈ సొరంగమార్గం ఇప్పటివరకు 70 శాతం పూర్తయింది. భూసేకరణ, నిర్వాసుతులకు పరిహారం, నిధుల కొరత పనులకు అడ్డంకిగా మారింది. ఎన్నికల సమయంలో ఈ ఏడాది ఏప్రిల్ 17న హుస్నాబాద్‌లో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న కేసీఆర్ నియోకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరందిస్తామని హామీ ఇచ్చారు. ఈ మూడు జలాశయాలను పూర్తి చేస్తే 1.69 లక్షల ఎకరాలకు సాగునీరందుతుంది. -
కేంద్ర వ్యవసాయ వర్సిటీ ఉత్తదే!
రాష్ట్ర మంత్రికి తేల్చి చెప్పిన కేంద్ర వ్యవసాయ మంత్రి హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రీయ వ్యవసాయ విశ్వ విద్యాలయం వస్తోందని ఇప్పటివరకు జరిగిన ప్రచారం, పాలకులు చేసిన హడావుడి అంతా ఉత్తదేనని స్పష్టమైంది. యూనివర్సిటీ అక్కడ, ఇక్కడ అంటూ స్థల పరిశీలనలు, క్షేత్ర స్థాయి నివేదికలంటూ చేసిందంతా కేవలం హంగామా మాత్రమేనని వెల్లడైంది. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయమే ఏర్పాటు కాబోతుందని తేలింది. ఇంత గందరగోళం ఎందుకు జరిగిందనే దానిపై అధికార వర్గాలు చెబుతున్న దాని ప్రకారం... ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ, తెలంగాణలో ఉద్యానవన విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేయనున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ తన బడ్జెట్లో ప్రకటించారు. ఇందుకోసం తొలి విడతగా 200 కోట్ల రూపాయలను కూడా ప్రతిపాదించారు. దీంతో పాలకులు రాష్ట్రానికి మరో వ్యవసాయ విశ్వవిద్యాలయం వస్తుందనుకున్నారు. దీని ఏర్పాటుపై మల్లగుల్లాలు పడ్డారు. చివరకు గుంటూరు జిల్లా లాంఫారంలో పెట్టబోతున్నట్టు వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రకటించారు. ఈలోగా కేంద్రం తన బడ్జెట్ కేటాయింపుల్లో ఆంధ్రాలో వ్యవసాయ విశ్వవిద్యాలయానికి 50 కోట్లు కేటాయించింది. ఈ నిధుల వ్యవహారమై స్పష్టత లేకపోవడంతో అధికారులు సందిగ్ధంలో పడ్డారు. మంత్రి దృష్టికీ విషయాన్ని తీసుకువచ్చారు. రాష్ట్ర వ్యవసాయ సమస్యలపై కేంద్ర వ్యవసాయ మంత్రి రాథామోహన్సింగ్తో భేటీ అయినప్పుడు చర్చిద్దామని మంత్రి చెప్పిన మీదట అధికారులు ఇటీవల ఢిల్లీలో సంబంధిత శాఖాధికారులను వివరణ కోరారు. ప్రస్తుతం హైదరాబాద్ శివార్లలోని రాజేంద్రనగర్‌లో ఉన్న వ్యవసాయ విశ్వవిద్యాలయం రెండు కానుందని, ఆంధ్రప్రదేశ్‌లో దాని భవనాల నిర్మాణానికే రూ.50 కోట్లు కేటాయించామని తెలిపారు. కేంద్ర బడ్జెట్లో పేర్కొన్న అంశాన్ని తమరు తప్పుగా అర్థం చేసుకున్నట్టున్నారని చావు కబురు చల్లగా చెప్పారు. దీంతో రాష్ర్ట మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అవాక్కయ్యారు. -
ప్రణాళిక ఘనం
కరీంనగర్ సిటీ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జిల్లా ప్రణాళికకు జెడ్పీటీసీ సభ్యుల నుంచి ప్రతిపాదనలు వెల్లువెత్తాయి. ‘మన ఊరు-మన ప్రణాళిక’లో చివరిదశ అయిన ‘మన జిల్లా-మన ప్రణాళిక’ అంశంపై శుక్రవారం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం జెడ్పీ హాల్లో చైర్పర్సన్ తుల ఉమ అధ్యక్షతన జరిగింది. మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ‘జయ జయహే తెలంగాణ’ ప్రార్థనా గీతాన్ని ఆలపించడంతో సభ ప్రారంభమైంది. ఆ తరువాత మెదక్ జిల్లా మాసాయిపేటలో రైల్వే ప్రమాదంలో మృత్యువాతపడ్డ విద్యార్థులకు, తెలంగాణ అమరులకు సభ మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించింది. అనంతరం తుల ఉమ సమావేశాన్ని ప్రారంభిస్తూ.. జిల్లా ప్రణాళికకు సభ్యులు ప్రాధాన్యతా క్రమంలో ప్రతిపాదనలు చెప్పాలని కోరారు. రెండు, అంతకన్నా ఎక్కువ మండలాలను అనుసంధానం చే సే రోడ్లు, గొలుసుకట్టు చెరువుల నిర్మాణం, నీటిపారుదల, మొక్కలు నాటడం తదితర అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ముందుగా జెడ్పీ సీఈఓ సదానందం కార్యక్రమ ఉద్దేశం చెబుతూ గ్రామ ప్రణాళికలో మూడు, మండల ప్రణాళికలో పది పనులు గుర్తించగా, జిల్లా ప్రణాళికలో 20 పనులు ప్రాధాన్యతా క్రమంలో గుర్తించి ప్రభుత్వానికి పంపించాలన్నారు. ఇప్పటివరకు కేవలం 26 మండలాల నుంచే ప్రతిపాదనలు వచ్చాయని, అందులోనూ కొన్ని అసమగ్రంగా ఉన్నాయన్నారు. కొంతమంది ఒక్క మండలానికే రూ.200-300 కోట్లు ఖర్చయ్యే ప్రతిపాదనలు పంపించారని, అది వీలు కాదని తెలిపారు. ప్రాధాన్యతా అంశాల వారీగా ప్రతిపాదనలు అందించాలని కోరారు. ప్రాధాన్యాంశాలివీ.. ‘మన జిల్లా-మనప్రణాళిక’ సమావేశంలో జిల్లాకు సంబంధించిన ప్రాధాన్యతా అంశాలను సమావేశంలో గుర్తించారు. జిల్లా ప్రణాళికలో ఇరవై పనులు గుర్తించాలనే నిబంధనల మేరకు ప్రాధాన్యత క్రమంలో ఇరవై పనులను రూపొందించేందుకు అధికారులు కసరత్తు మొదలు పెట్టారు. ఇప్పటికే అధికారులు, సభ్యులు చేసిన ప్రతిపాదనలు క్రోఢీకరించి, ఎమ్మెల్యేలు, ఎంపీల సవరణలు తీసుకొని తుది ప్రణాళికను ప్రభుత్వానికి పంపించాలని మంత్రి ఈటెల రాజేందర్ ఇన్చార్జి కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్‌ను ఆదేశించారు. మండలాలకు లింక్‌రోడ్లు, గొలుసుకట్టు చెరువులు, మొక్కల పెంపకంతో పాటు విద్యుత్ అంశాన్ని ప్రణాళికలో చేరుస్తున్నట్లు మంత్రిప్రకటించారు. రామగుండం ఎరువుల కర్మాగారం పునరుద్ధరణ, భారీ నీటిపారుదల కింద మిడ్‌మానేరు, ఎల్లంపల్లి, వరదకాలువ అంశాలు, చిన్ననీటిపారుదల కింద జిల్లాలోని అన్ని వాగుల మీద రీజనరేటెడ్, నీటి వినియోగంపై ప్రణాళికలు రూపొందించనున్నట్లు ఆయన తెలిపారు. కొండగట్టు, వేములవాడ, ధర్మపురి, కాళేశ్వరం, ఇల్లంతకుంట తదితర దేవాలయాలను రూ.200 కోట్లతో టూరిజం కేంద్రాలుగా అభివృద్ధి చేసేందుకు, జిల్లాను విత్తనోత్పత్తి కేంద్రంగా అభివృద్ధి పరిచేందుకు, ప్రతి నియోజకవర్గంలో 200 కిలోమీటర్లకు తగ్గకుండా జిల్లాలోని రెండువేల కిలోమీటర్ల పంచాయతీరాజ్ రోడ్లను ఆర్అండ్బీ ద్వారా డబుల్ రోడ్లుగా మారుస్తామని జిల్లా ప్రణాళిక అంశాలను మంత్రి వివరించారు. కథలాపూర్‌లో ఉద్యానవన విశ్వవిద్యాలయం ఉద్యానవన విశ్వవిద్యాలయాన్ని జిల్లాలోనే ఏర్పాటు చేసేలా చర్యలుతీసుకోవాలని ఎమ్మెల్యేలు, సభ్యులు సూచించారు. కథలాపూర్లోనే హార్టికల్చర్ యూనివర్సిటీని ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ తెలిపారు. ఈ మేరకు హార్టికల్చర్ వర్సిటీని జిల్లాలోనే ఏర్పాటు చేయాలని సమావేశం ప్రతిపాదించింది. -
బడ్జెట్.. ప్చ్
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గురువారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆశించిన మేరకు సంతృప్తినివ్వలేదు. తెలంగాణ అభివృద్ధికి ఎన్డీయే సర్కారు కట్టుబడి ఉందన్న హామీ తప్ప తెలంగాణకు బడ్జెట్లో ఒరిగిందేమీ లేదు. తెలంగాణ రాష్ట్రంలో చేపట్టాల్సిన అభివృ ద్ధి పనులను ఆయా మంత్రిత్వశాఖ లు, అధికార యంత్రాంగం సకాలం లో చేపడుతాయంటూనే, పునర్విభజన బిల్లులోని ఉద్యానవన విశ్వవిద్యాలయం కేటాయిస్తున్నట్లు ప్రకటించి తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారన్న చర్చ జరుగుతోంది. తెలంగాణకు బడ్జెట్లో ద క్కని ప్రాధాన్యం జిల్లాలోని వివిధ రంగాలపై ప్రభావం చూపే అవకా శం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సామాన్య, మధ్యతరగతిపై పన్నుల భారం కేంద్ర బడ్జెట్లో దూరదృష్టి పేరిట, గ్రామీణ ప్రాంతాల ప్రజలకు నిత్యావసరంగా మారిన అనేక వస్తువులు, పరికరాలపై పెంచిన సుంకం ప్రభావం చూపనుంది. పాన్‌మసాలా, గుట్కాల ధరలు ప్రియం కానున్నాయి. సిగరెట్, బీడీ తదితర ధూమపాన ప్రియులు, పొగాకు విని యోగదారులపై ఏటా రూ.10.50 కోట్ల అదనపు భారం పడనున్నట్లు చెప్తున్నారు. రేడియో టాక్సీలపై సేవా పన్ను విధించడంతో మధ్యతరగ తి ప్రజలపై భారం పడనుంది. మ్యూచువల్ ఫండ్స్ బదలాయింపుపై పన్ను పెంపు, శీతల పానీయాలు, పాన్‌మసాలాలు ధరల పెంపు తది తర అంశాలు ప్రజలకు అదనపు భారం కానున్నాయి. కంప్యూటర్లు, ఎ లక్ట్రానిక్ వస్తువుల ధరలు తగ్గే అవకాశం ఉన్నా, గ్రామీణ రైతులు, సా మాన్య ప్రజలకు అంతగా ఉపయోగం ఉండదు. బ్రాండెడ్ దుస్తులు, ప్యాకేజ్డ్ ఫుడ్ ధరలు తగ్గే అవకాశం ఉందని ప్రకటించినా, విదేశీ కంపెనీలకే కలిసొచ్చే అంశంగా విశ్లేషకులు చెబుతున్నారు. నిత్యావసరాలు, పెట్రో ఉత్పత్తుల ధరల పెరుగుదల లేకుండా ప్రజలకు బడ్జెట్ భరోసా ఇవ్వలేకపోయింది. ఉపశమనం ఇవ్వని మినహాయింపులు గ్రామీణ ప్రాంతాలు, ఆ ప్రాంతాల సామాన్య, మధ్యతరగతి ప్రజలకు ప్రయోజనం కల్గించకుండా, మినహాయింపులు, ప్రోత్సాహకాల పేరిట చేర్చిన అంశాలు ఉపశమనం ఇవ్వలేకపోతున్నాయి. విద్యుదుత్పత్తి, పంపిణీ సంస్థలకు పదేళ్ల పాటు పన్ను మినహాయింపులు బడా సంస్థల కే ప్రయోజనం కల్గించే అంశాలు. గాలిమరల విద్యు త్‌కు పన్ను ప్రోత్సాహాకం, సున్నపురాయి, డోలమైట్‌లపై పన్ను రాయితీలు పరిశ్రమలను ప్రోత్సహించే విధంగా ఉన్నా.. ఇప్పటికే ఖాయిలా పడిన చిన్న, మధ్యతరహా పరిశ్రమల పునరుద్ధరణ మాటే ఎత్తలేదు. అయితే, కొద్దిగా తగ్గనున్న ఇనుము ధరలు, పాదరక్షలపై 12 నుంచి 6 శాతానికి తగ్గిన ఎక్సై జ్ సుంకాలు సామాన్యులను సంతృప్తిపరిచే అంశాలే. స్టెయిన్లెస్ స్టీల్ పై దిగుమతి సుంకం తగ్గింపు కూడా అనుకూలాంశం. సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్ రంగాలకు ప్రోత్సాహం నిరుద్యోగులకు ప్రోత్సాహాన్నిస్తుండగా, అ న్ని గ్రామాలను బ్రాడ్బ్రాండ్తో అనుసంధానం, ఉపాధిహామీకి వ్యవసాయంతో అనుసంధానం చేయడం సంతోషకరం కాగా.. ప్రథమ, ద్వి తీయశ్రేణి నగరాల్లో విమానాశ్రయాలు ఏర్పాటు నిర్ణయంతో ఎప్పటి నుంచో ప్రతిపాదనలో ఉన్న జక్రాన్‌పల్లి విమానాశ్రయానికి ఆలస్యంగానైనా మోక్షం కలుగుతుందన్న ఆశాభావం వ్యక్తమవుతోంది. -
రైతుకు ఊరట
జగిత్యాల అగ్రికల్చర్ : తెలంగాణలో రూ.200 కోట్లతో ఉద్యాన(హార్టికల్చర్) విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణలోని ఉద్యానవన పంటలను ఎక్కువగా కరీంనగర్ జిల్లాలోనే సాగు చేస్తారు. దాదాపు 1.75 లక్షల ఎకరాల్లో మామిడి, పసుపు, మిరప, అరటి, బొప్పాయి, వివిధ రకాల కూరగాయలు పండిస్తున్నారు. ఇందులో 80 వేల ఎకరాల్లో మామిడితోటల పెంపకం చేపడుతున్నారు. జగిత్యాల మామిడి మార్కెట్ ద్వారా ఏటా సుమారు రూ.300 కోట్ల వ్యాపారం చేస్తున్నారు. దీంతో ఉద్యాన విశ్వవిద్యాలయం జిల్లాలోనే ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు. కౌలు రైతులకు రుణాలు భూమిలేని రైతులకు బ్యాంకులు రుణాలు ఇవ్వకపోవడంతో కౌలురైతులు వడ్డీవ్యాపారులను ఆశ్రయించి దోపిడీకి గురవుతున్నారు. వారిని ఆదుకునేందుకు నాబార్డు ద్వారా కౌలురైతులందరికీ రుణాలు ఇవ్వాలని సర్కారు నిర్ణయించింది. జిల్లాలో సుమారు 60వేల మంది కౌలు రైతులు ఉండగా, వీరిలే కేవలం 9,413 మందికే రుణ అర్హత కార్డులున్నాయి. అరుునా 90 శాతం మంది రైతులకు రుణాలు అందడంలేదు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయంతో కౌలురైతులకు రుణం లభించే అవకాశముంది. మిగతా రైతులకు సైతం ఎక్కువ స్థాయిలో రుణాలు ఇవ్వాలని నిర్ణయించారు. బ్యాంకుల ద్వారా దాదాపు రూ.8 లక్షల కోట్ల రుణాలు అందివ్వాలని బడ్జెట్లో ప్రతిపాదించారు. స్వల్పకాలంలో తీసుకున్న పంట రుణాలను చెల్లిస్తే వడ్డీలో మూడు శాతం రాయితీ ఇస్తామని చెప్పడం రైతులకు కలిసివచ్చే అంశం. పంటలకు ధరల స్థిరీకరణ నిధి పంట ఉత్పత్తులు చేతికి వచ్చిన తర్వాత ధరలు పతనం కావడంతో రైతులకు పంటకు పెట్టిన పెట్టుబడులు కూడా చేతికందడంలేదు. ఈ నేపథ్యంలో రూ రూ.500 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటును బడ్జెట్లో ప్రకటించారు. ధరలు పతనమైన ప్పుడు ఈ నిధితో రైతులను ఆదుకునే అవకాశముంటుంది. ఫలితంగా జిల్లాలో మొక్కజొన్న, పత్తి, పసుపు, జొన్న, సజ్జ, సోయాబీన్, వరి వంటి పంటలు పండించే రైతులకు లాభం చేకూరనుందని రైతు ప్రతినిధులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయానికి ‘ఉపాధి’ లింకు వ్యవసాయ రంగానికి ఉపాధి హామీ పథకాన్ని వర్తింపజేయాలని కేంద్రం నిర్ణయించింది. జిల్లాలో 3.13 లక్షల చిన్న, సన్నకారు రైతులుండగా.. వ్యవసాయ పనుల్లో వీరికి కూలీలు దొరకక ఇబ్బందులు పడతున్నారు. జిల్లాలో ఆరు లక్షలకు పైగా ఉపాధిహామీ జాబ్‌కార్డులు ఉన్నారుు. ఈ కార్మికులను వ్యవసాయం వైపు మళ్లిస్తే మరింత చేయూతనిచ్చిట్టు అవుతుంది. రైతుల్లో చైతన్యం కోసం కిసాన్ టీవీ వ్యవసాయం, వ్యవసాయూధారిత కార్యక్రమాలు, నీటి పరిరక్షణ, ఎరువుల వినియోగంపై ఎప్పటికప్పుడు రైతుల్లో చైతన్యం నింపేందుకు రూ.100 కోట్లతో కిసాన్ టీవీని ఏర్పాటు చేయనున్నట్టు బడ్జెట్ సందర్భంగా ఆర్థిక మంత్రి ప్రకటించారు. దేశంలోని అన్ని భాషల్లో కిసాన్ టీవీ ప్రసారాలు ఉంటారుు. విత్తనం వేసినప్పటి నుంచి పంట చేతికొచ్చేవరకు రైతు చైతన్య కార్యక్రమాలు కొనసాగుతారు. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో పరిశోధనలు ప్రభుత్వ రంగంలోనే కాకుండా ప్రైవేట్ భాగస్వామ్యంతో వ్యవసాయ పరిశోధనలను మెరుగైన పరిశోధనలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే పుణేలో జాతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ ఉండగా... తాజాగా అస్సోం, జార్ఖండ్‌లో ఏర్పాటు చేసేందుకు బడ్జెట్లో రూ.100 కోట్లు కేటారుుంచారు. దీంతో జిల్లాలోని పొలాస వ్యవ సాయ పరిశోధన స్థానానికీ సహాయ సహకారాలు అందే అవకాశముంది. దీంతోపాటు రూ.56 కోట్లతో భూసార పరీక్ష కేంద్రాలు, రూ.100 కోట్లతో భూనాణ్యత కార్డులు, భూమి లేని 5లక్షల మంది రైతులకు ఆర్థికసాయం, నగరాల్లో రైతు మార్కెట్ల ఏర్పాటు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఖర్చు చేసేందుకు రూ.100 కోట్లు కేటాయించడంపై హర్షం వ్యక్తమవుతోంది. -
జిల్లాకు ఉద్యానవన యూనివర్సిటీ మంజూరు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన తొలి ఆర్థిక బడ్జెట్‌పై మిశ్రమ స్పందన కనిపిస్తోంది. ఆదాయ పన్ను పరిమితి రూ.2 లక్షల నుంచి రూ. 2.5 లక్షలకు పెంచి సగటు ఉద్యోగికి కొంత ఊరట కలిగించినప్పటికీ.. ఇతర అంశాలను పరిగణిస్తే పెద్దగా ఒరిగిందేమీ లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. రాజధాని నగరం చుట్టూ విస్తరించి ఉన్న రంగారెడ్డి జిల్లాలో ఉద్యాన సాగును భారీగా పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన ఆర్థిక బడ్జెట్లో రాష్ట్రానికి ఉద్యానవన యూనివర్సిటీ మంజూరు చేసింది. ఈ క్రమంలో యూనివర్సిటీ ఏర్పాటు ప్రభావంతో జిల్లాలో తలపెట్టాలనుకున్న ప్రత్యేక హార్ట్టీకల్చర్ జోన్‌కు అనుకూల పరిస్థితులు ఏర్పడనున్నాయి. అదేవిధంగా జాతీయ రహదారుల అభివృద్ధికి కేంద్రం భారీగా నిధులను కేటాయించింది. దీంతో రాజధానికి వెళ్లే అన్నీ ప్రధాన రహదారులు జిల్లాలో ఉండడంతో ఆయా రోడ్ల పరిస్థితి మెరుగుపడనుంది. మరోవైపు ఇనుము, సిమెంటు ధరలు తగ్గనున్నాయి. దీంతో జిల్లాలో నిర్మాణరంగం ఊపందుకుని కూలీలకు ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్నాయి. -
సహకారమే డీలా !
మహబూబ్‌నగర్, సాక్షి ప్రతినిధి: అంగట్లో అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శని.. అనే చందంగా మారింది మోజర్ల హార్టికల్చర్ యూనివర్శిటీ పరిస్థితి. పండ్లతోటలు, కూరగాయలు, పూల మొక్కల సాగుపై పరిశోధన, సుగంధ ద్రవ్యాలు, ఔషధ మొక్కలపై పరిశోధనలు చేసేందుకు అ న్ని అవకాశాలు ఉన్నా.. యూనివర్శిటీకి అవసరమైన స్థలం లేకపోవడంతో అందుకు వీలుపడటం లేదు. ఇక్కడి యూనివర్శిటీలో పరిశోధనలు చేసేందుకు అవసరమైన పరికరాలు, ప్రయోగశాలలను ఏర్పాటు చేసి అందుకు తగ్గట్టుగా ప్రభుత్వం శాస్త్రవేత్తలు, ఇతర సిబ్బందిని నియమించింది. వారి సేవలను సద్వినియోగం చేసుకోలేని ప రిస్థితి దాపురించింది. జిల్లాలో ఉన్న వాతావరణ పరిస్థితుల ను బట్టి చూస్తే పండ్లతోటలు, కూరగాయలతో పాటు పూల తోటలు పెంచితే మంచి ఆదాయం వస్తుంది. ఆ విధంగా రై తులు ఆర్థికంగా నిలుదొక్కుకునేందుకు వీలుగా జిల్లాలో ఏ యేరకాల పండ్లతోటలు సాగుచేస్తే బాగుంటుందో పరిశోధనలు చేసేందుకు వీలుగా దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై ఎస్ రాజశేఖరరెడ్డి కొత్తకోట మండలం మోజర్ల సమీపంలో హార్టికల్చర్ యూనివర్శిటీ ఏర్పాటుకు చర్యలు తీసుకున్నా రు. పండ్లతోటలు సాగు చేసేందుకు ముందుకొచ్చే రైతుల కు పూర్తి సహాయ సహకారాలు అందించేందుకు వీలుగా అక్కడ శాస్త్రవేత్తలన కూడా నియమించారు. ఇవే సమస్యలు! యూనివర్శిటీకి 200 నుంచి 250 ఎకరాలు కేటాయిస్తే వాటిలో అవసరమైన పండ్ల మొక్కలు పెంచి వాటిపై పరిశోధనలు చేసేందుకు అవకాశం ఉంటుంది. ప్రస్తుతం 30 ఎకరాలు మాత్రమే కేటాయించడంతో పరిశోధనలకు ఇబ్బందికరంగా మారింది. జిల్లా రైతులకు మేలు చేయాలనే ఉద్దేశంతోనే అవసరమైన భూమిని కేటాయించాలని యూనివర్సిటీ శాస్త్రవేత్తలు జిల్లా అధికారుల చుట్టూ తిరుగుతున్నా అందుకు ప్రజాప్రతినిధులు సహకరించకపోవడంతో అడ్డంకులు ఏర్పడుతున్నాయి. స్థానిక రైతులు పండ్లతోటలను పెంచి మార్కెట్ చేయలేని పరిస్థితుల్లో యూనివర్శిటీలో నిల్వ ఉంచేందుకు వసతుల కల్పనకు రూ.25 లక్షలు మంజూరయ్యాయి. స్థానిక యూనివర్శిటీలో పరిశోధనలు నిర్వహించడానికి అనుకూల పరిస్థితులు లేకపోయినా పోస్టు గ్రాడ్యుయేషన్‌లో చేరేందుకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ (ఐసీఏఆర్) ఆధ్వర్యంలో నిర్వహించిన పరీక్షలో రాష్ట్రంలో ఏ యూనివర్శిటీలో లేని విధంగా ఇక్కడ చదివిన 10 మంది విద్యార్థులు ప్రతిభ కనబరచి ఇతర రాష్ట్రాల్లో సీట్లు సంపాదించుకోవడం విశేషం.. వీరిలో ఎస్.మల్లేశ్ (బాగల్కోట్ యూనివర్శిటీ), బి.అశోక్ కుమార్ (ఇంఫాల్) ఏ.ప్రశాంత్ కుమార్ (అస్సాంలోని జోర్హట్) టి.రఘునంద న్ (ఉత్తర్ ప్రదేశ్), వి.రాకేష్ శర్మ (మీరట్), సీహెచ్ రాకేష్ (బాగల్కోట్), యం.రంజిత్ కుమార్ (గుజరాత్), పి.తనూజ (శిమోగ, కర్ణాటక), జి.అనుష, ఎల్. భీమ్లాల్, తులసీరాం (అకోలా, మహారాష్ట్ర)యూనివర్శిటీల్లో పోస్టు గ్రాడ్యుయేషన్ చేస్తున్నారు. ఈ ఏడాది నుంచి జిల్లాలో ఉన్న హార్టికల్చర్ యూనివర్శిటీలో పీజీ కోర్సును అమలుచేస్తున్నారు. ప్రస్తుతం కూరగాయల సాగుకు సంబంధించి కొత్త వంగడాలను కనుగొనేందుకు పరిశోధనలు ప్రారంభించనునున్నట్లు అసోసియేట్ డీన్ డాక్టర్ రావి చంద్రశేఖర్ వెల్లడించారు. ఈ ఏడాది సీహెచ్ జగదీష్ (శ్రీకాకుళం), ఎన్.ప్రమోద్‌కుమార్ (కరీంనగర్) పీజీ కోర్సులో చేరారు. పండ్ల మొక్కల సాగుపై శిక్షణ ఇవ్వడానికి మేం సిద్ధం పండ్లమొక్కల సాగు విధానం తెలుసుకునేందుకు ముందుకొచ్చే రైతులకు సలహాలతో పాటు శిక్షణ ఇవ్వడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. పండించిన ధాన్యాన్ని విక్రయించేందుకు వ్యవసాయ మార్కెట్ కమిటీకి వచ్చే రైతులు టెక్నాలజీ వినియోగించుకోవాలని ఉత్సాహం చూపితే తమ సిబ్బందే వారి వద్దకు వెళ్లి అవసరమైన సూచనలు, సలహాలు ఇస్తాం.. గ్రామీణప్రాంతాల్లో సాగుచేసిన పంటల పరిస్థితిపై అధ్యయనం చేయడానికి యూనివర్శిటీలో ఫైనల్ ఈయర్ చ దివే విద్యార్థులను నాలుగు నెలల పాటు ఫీల్డ్‌కు పంపుతామన్నారు. జిల్లాలో పండ్లతోటలను రైతులు పెద్దగా సాగు చేయకపోవడంతో విద్యార్థులను రంగారెడ్డి జిల్లాకు పంపాల్సి వచ్చింది. పండ్ల తోటలకు సోకే తెగుళ్లు, వాటి నివారణ తదితర వాటి కోసం రైతులు నేరుగా ఫోన్లో సంప్రదించినా అవసరమైన సూచనలు, సలహాలు అందజేస్తాం. వాటిని నివృత్తి చేసుకునే రైతులు సెల్: 9866558986 లేదా 9866550747 ఫోన్ నెంబర్లను సంప్రదించవచ్చు. - డాక్టర్ రావి చంద్రశేఖర్