సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గురువారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆశించిన మేరకు సంతృప్తినివ్వలేదు. తెలంగాణ అభివృద్ధికి ఎన్డీయే సర్కారు కట్టుబడి ఉందన్న హామీ తప్ప తెలంగాణకు బడ్జెట్‌లో ఒరిగిందేమీ లేదు. తెలంగాణ రాష్ట్రంలో చేపట్టాల్సిన అభివృ ద్ధి పనులను ఆయా మంత్రిత్వశాఖ లు, అధికార యంత్రాంగం సకాలం లో చేపడుతాయంటూనే, పునర్విభజన బిల్లులోని ఉద్యానవన విశ్వవిద్యాలయం కేటాయిస్తున్నట్లు ప్రకటించి తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారన్న చర్చ జరుగుతోంది. తెలంగాణకు బడ్జెట్‌లో ద క్కని ప్రాధాన్యం జిల్లాలోని వివిధ రంగాలపై ప్రభావం చూపే అవకా శం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
సామాన్య, మధ్యతరగతిపై పన్నుల భారం
కేంద్ర బడ్జెట్‌లో దూరదృష్టి పేరిట, గ్రామీణ ప్రాంతాల ప్రజలకు నిత్యావసరంగా మారిన అనేక వస్తువులు, పరికరాలపై పెంచిన సుంకం ప్రభావం చూపనుంది. పాన్‌మసాలా, గుట్కాల ధరలు ప్రియం కానున్నాయి. సిగరెట్, బీడీ తదితర ధూమపాన ప్రియులు, పొగాకు విని యోగదారులపై ఏటా రూ.10.50 కోట్ల అదనపు భారం పడనున్నట్లు చెప్తున్నారు.
రేడియో టాక్సీలపై సేవా పన్ను విధించడంతో మధ్యతరగ తి ప్రజలపై భారం పడనుంది. మ్యూచువల్ ఫండ్స్ బదలాయింపుపై పన్ను పెంపు, శీతల పానీయాలు, పాన్‌మసాలాలు ధరల పెంపు తది తర అంశాలు ప్రజలకు అదనపు భారం కానున్నాయి. కంప్యూటర్లు, ఎ లక్ట్రానిక్ వస్తువుల ధరలు తగ్గే అవకాశం ఉన్నా, గ్రామీణ రైతులు, సా మాన్య ప్రజలకు అంతగా ఉపయోగం ఉండదు. బ్రాండెడ్ దుస్తులు, ప్యాకేజ్‌డ్ ఫుడ్ ధరలు తగ్గే అవకాశం ఉందని ప్రకటించినా, విదేశీ కంపెనీలకే కలిసొచ్చే అంశంగా విశ్లేషకులు చెబుతున్నారు. నిత్యావసరాలు, పెట్రో ఉత్పత్తుల ధరల పెరుగుదల లేకుండా ప్రజలకు బడ్జెట్ భరోసా ఇవ్వలేకపోయింది.
ఉపశమనం ఇవ్వని మినహాయింపులు
గ్రామీణ ప్రాంతాలు, ఆ ప్రాంతాల సామాన్య, మధ్యతరగతి ప్రజలకు ప్రయోజనం కల్గించకుండా, మినహాయింపులు, ప్రోత్సాహకాల పేరిట చేర్చిన అంశాలు ఉపశమనం ఇవ్వలేకపోతున్నాయి. విద్యుదుత్పత్తి, పంపిణీ సంస్థలకు పదేళ్ల పాటు పన్ను మినహాయింపులు బడా సంస్థల కే ప్రయోజనం కల్గించే అంశాలు. గాలిమరల విద్యు త్‌కు పన్ను ప్రోత్సాహాకం, సున్నపురాయి, డోలమైట్‌లపై పన్ను రాయితీలు పరిశ్రమలను ప్రోత్సహించే విధంగా ఉన్నా.. ఇప్పటికే ఖాయిలా పడిన చిన్న, మధ్యతరహా పరిశ్రమల పునరుద్ధరణ మాటే ఎత్తలేదు.
అయితే, కొద్దిగా తగ్గనున్న ఇనుము ధరలు, పాదరక్షలపై 12 నుంచి 6 శాతానికి తగ్గిన ఎక్సై జ్ సుంకాలు సామాన్యులను సంతృప్తిపరిచే అంశాలే. స్టెయిన్‌లెస్ స్టీల్ పై దిగుమతి సుంకం తగ్గింపు కూడా అనుకూలాంశం. సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ రంగాలకు ప్రోత్సాహం నిరుద్యోగులకు ప్రోత్సాహాన్నిస్తుండగా, అ న్ని గ్రామాలను బ్రాడ్‌బ్రాండ్‌తో అనుసంధానం, ఉపాధిహామీకి వ్యవసాయంతో అనుసంధానం చేయడం సంతోషకరం కాగా.. ప్రథమ, ద్వి తీయశ్రేణి నగరాల్లో విమానాశ్రయాలు ఏర్పాటు నిర్ణయంతో ఎప్పటి నుంచో ప్రతిపాదనలో ఉన్న జక్రాన్‌పల్లి విమానాశ్రయానికి ఆలస్యంగానైనా మోక్షం కలుగుతుందన్న ఆశాభావం వ్యక్తమవుతోంది.
బడ్జెట్.. ప్చ్
Published Fri, Jul 11 2014 2:57 AM | Last Updated on Sat, Sep 2 2017 10:06 AM
Advertisement
Advertisement