love agarwal
-
ఒమిక్రాన్ వచ్చేసింది.. వ్యాక్సిన్ వేసుకున్నప్పటికీ..
న్యూఢిల్లీ, బెంగుళూరు: అందరూ భయపడుతున్నట్టుగానే జరిగింది. ప్రపంచ దేశాలను కలవరపెడుతున్న కరోనా వేరియెంట్ ఒమిక్రాన్ భారత్‌లోకి వచ్చేసింది. ఇటీవల దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన 66 ఏళ్ల వృద్ధుడు, బెంగళూరుకి చెందిన 46 ఏళ్ల వయసున్న వైద్యుడికి ఒమిక్రాన్ వేరియెంట్ సోకినట్టుగా ఇన్సాకాగ్ నెట్వర్క్ జన్యు విశ్లేషణల్లో తేలిందని కేంద్ర ఆరోగ్య శాఖ గురువారం వెల్లడించింది. వారిద్దరూ రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నారని, వారిలో లక్షణాలు స్వల్పంగా ఉన్నాయని తెలిపింది. కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ గురువారం మీడియాతో మాట్లాడారు. ఒమిక్రాన్ సోకిన వ్యక్తుల్ని కలుసుకున్న వారిలో ప్రైమరీ కాంటాక్ట్, సెకండరీ కాంటాక్ట్ వారిని గుర్తించి ఐసోలేషన్‌లో ఉంచారు. కోవిడ్ నిబంధనలు పాటించాలి కరోనా కొత్త వేరియెంట్ ఒమిక్రాన్ వచ్చేసిందని ప్రజలు ఎలాంటి ఆందోళనలు వద్దని కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ అన్నారు. కోవిడ్ నిబంధనలన్నీ కచ్చితంగా పాటించాలన్నారు. ‘ఒమిక్రాన్‌పై ఎవరూ ఆందోళన చెందవద్దు. కానీ కరోనా నిబంధనలపై కచ్చితంగా అవగాహన ఉండాలి. మాస్కులు ధరించడం, భౌతికదూరం పాటించడం, తరచూ చేతులు శుభ్రం చేసుకోవడం, రద్దీ ప్రాంతాలకు వెళ్లకపోవడం వంటివన్నీ చేస్తే ఒమిక్రాన్ సహా ఏ కరోనా వేరియెంట్‌నైనా ఎదుర్కోగలం’ అని లవ్ అగర్వాల్ చెప్పారు. డెల్టా కంటే ఈ వేరియెంట్ ప్రమాదకరమైనదా? కాదా? అన్నది ఇంత త్వరగా చెప్పలేమన్నారు. దక్షిణాఫ్రికా, యూరప్ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు విమానాశ్రయంలోనే ఆర్టీ– పీసీఆర్ పరీక్షలు నిర్వహించి, నివేదిక వచ్చిన తర్వాతే వారిని బయటకు పంపిస్తున్నామన్నారు. ఇక కరోనా వ్యాక్సిన్ వేసుకోవడంలో ఎలాంటి ఆలస్యం చేయవద్దని ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరామ్ భార్గవ పిలుపునిచ్చారు. మరోవైపు అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాల్లో పకడ్బందీగా స్క్రీనింగ్, కరోనా పరీక్షలు చేయాలని ఆరోగ్య శాఖ మంత్రి మాండవీయ అధికారుల్ని ఆదేశించారు. బూస్టర్ డోస్‌లపై అధ్యయనం ఒమిక్రాన్ రాకతో భారత్‌కు మూడో దశ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో వ్యాక్సినేషన్ బూస్టర్ డోసులపై కేంద్ర ప్రభుత్వం అధ్యయనం చేస్తోంది. ఈ బూస్టర్ డోసులు ఇవ్వడంపై శాస్త్రీయపరమైన కారణాలను విశ్లేషిస్తున్నట్టుగా లవ్ అగర్వాల్ చెప్పారు. ప్రజలందరికీ రెండు డోసులు ఇవ్వడానికి ప్రాధాన్యం ఇస్తామని స్పష్టం చేశారు. కొత్త వేరియెంట్‌ను ఎదుర్కోవడంలోనూ వ్యాక్సినేషనే బ్రహ్మాస్త్రమని నీతి అయోగ్ సభ్యుడు (ఆరోగ్యం) డాక్టర్ వీకే పాల్ చెప్పారు. భారత్ దగ్గర టీకా డోసులు సమృద్ధిగా ఉండడం అదృష్టమని చెప్పారు. అందరూ టీకాలు తీసుకోవడానికి ముందుకు రావాలని చెప్పారు. దేశ జనాభాలోని వయోజనుల్లో 40 శాతం మంది కరోనా టీకాలు రెండు డోసులు తీసుకుంటే, 84.3% మంది ఒక్క డోసు తీసుకున్నారని చెప్పారు. -
కాలుష్యంతో కరోనా ముప్పు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీతోపాటు మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, తమిళనాడు తదితర రాష్ట్రాల ప్రజలు కోవిడ్ బారినపడే అవకాశాలు అధికంగా ఉన్నాయట! ఎందుకంటే అక్కడ కాలుష్యం అధికం కాబట్టి. కాలుష్య సూచి ‘పీఎం(పార్టిక్యులేట్ మ్యాటర్) 2.5’కు ఎక్కువగా గురయ్యేవారికి కరోనా సులువుగా సోకుతున్నట్లు తాజా అధ్యయనంలో తేలింది. ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, కోల్‌కతా, పుణే, అహ్మదాబాద్, వారణాసి, లక్నో, సూరత్ తదితర 16 పెద్ద నగరాల్లో అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు నమోదయ్యాయి. ఈ నగరాల్లో శిలాజ ఇంధనాల వినియోగం అధికం కావడంతో పీఎం 2.5 ఉద్గారాలు భారీస్థాయిలో వెలువడుతున్నాయని, కరోనా వ్యాప్తికి ఇవి కూడా కారణమని అధ్యయనం స్పష్టం చేసింది. కాలుష్యం మనిషిలో రోగ నిరోధక శక్తిని హరిస్తుందన్న విషయం తెలిసిందే. ఉత్కళ్ యూనివర్సిటీ–భువనేశ్వర్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రోపికల్ మెటియోరాలజీ–పుణే, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ–రూర్కెలా, ఐఐటీ–భువనేశ్వర్‌కు చెందిన పరిశోధకులు çకలిసి దేశవ్యాప్తంగా 721 జిల్లాల్లో అధ్యయనం నిర్వహించారు. గత ఏడాది నవంబర్ 5 వరకూ ఆయా నగరాల్లో కాలుష్య ఉద్గారాలు, గాలి నాణ్యత, కోవిడ్–19 పాజిటివ్ కేసులు, మరణాల సమాచారాన్ని క్రోడీకరించారు. పీఎం 2.5 ఉద్గారాలకు, కోవిడ్ ఇన్ఫెక్షన్ ముప్పునకు, తద్వారా మరణాలకు మధ్య బలమైన సంబంధం ఉన్నట్లు గుర్తించారు. ఇళ్లలో వంట, ఇతర అవసరాల కోసం జీవ ఇంధనాలను మండించడం కూడా ఉద్గారాలకు కారణమవుతోందని తెలిపారు. మరో 46,617 పాజిటివ్ కేసులు: దేశంలో 24 గంటల్లో 46,617 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 59,384 మంది కోలుకున్నారని కేంద్రం తెలిపింది. దీంతో రికవరీ రేటు 97.01%కి పెరిగింది. అదే సమయంలో ఒక్క రోజులో 843 మరో మంది మరణించడంతో మొత్తం మరణాలు 4,00,312కు పెరిగాయి. అలాగే, యాక్టివ్ కేసులు మరింత తగ్గి 5,09,637కు చేరాయి. 6 రాష్ట్రాలకు కేంద్ర నిపుణుల బృందాలు: కేరళ, అరుణాచల్‌ప్రదేశ్, త్రిపుర, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, మణిపూర్ రాష్ట్రాల్లో కోవిడ్ ఉధృతి తగ్గకపోవడంతో కేంద్రం అప్రమత్తమయ్యింది. ఆయా రాష్ట్రాలకు నిపుణుల బృందాలను పంపించనున్నట్లు తెలిపింది. ఒక్కో బృందంలో ఇద్దరేసి చొప్పున నిపుణులు ఉంటారంది. ఈ బృందాలు కరోనా నియంత్రణ చర్యల అమల్లో సహకరిస్తాయని తెలిపింది. రెండో వేవ్ ముగిసిపోలేదు దేశంలో కరోనా ఆంక్షలు తొలగించడం, లాక్డౌన్ ఎత్తివేయడంతో క్రమంగా సాధారణ పరిస్థితులు నెలకొంటున్నా, కరోనా సెకండ్ వేవ్ ఇంకా ముగిసిపోలేదని కేంద్ర ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రెటరీ లవ్ అగర్వాల్ హెచ్చరించారు. కరోనా నియంత్రణ చర్యలు కొనసాగించాలని, జాగ్రత్తలు కచ్చితంగా పాటించాలని సూచించారు. ఇప్పుడే అస్త్రసన్యాసం చేస్తే కరోనా వ్యాప్తికి మళ్లీ జీవం పోసినట్లే అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా 71 జిల్లాల్లో జూన్ 23 నుంచి 29 దాకా వారం రోజులపాటు కరోనా పాజిటివిటీ రేటు 10 శాతానికి పైగానే నమోదయ్యిందని గుర్తుచేశారు. కరోనా వ్యాక్సినేషన్లో వేగం పెంచినట్లు తెలిపారు. గర్భిణులూ కోవిడ్ టీకాకు అర్హులే దేశంలో గర్భవతులు కూడా ఇకపై కోవిడ్ టీకా తీసుకోవచ్చు. నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యూనైజేషన్(ఎన్టీఏజీఐ) సిఫారసుల ఆధారంగా గర్భవతులను కూడా టీకాకు అర్హులుగా చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ శుక్రవారం తెలిపింది. గర్భిణులు ఇకపై కోవిన్ యాప్‌లో నమోదు చేసుకుని లేదా నేరుగా వ్యాక్సినేషన్ కేంద్రానికి వెళ్లి కోవిడ్ టీకా వేయించుకోవచ్చని వివరించింది. గర్భం దాల్చిన ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవచ్చని సూచించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సమాచారం అందించినట్లు తెలిపింది. -
దేశంలో సెకండ్ వేవ్ ఉధృతి క్రమంగా తగ్గుతోంది: లవ్ అగర్వాల్
-
ఏపీలో టెలీ మెడిసిన్ విధానం మంచి ఫలితాలు ఇస్తోంది: లవ్ అగర్వాల్
-
24 లక్షలు దాటిన కరోనా కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కొత్తగా 64,553 కేసులు బయట పడటంతో మొత్తం కేసుల సంఖ్య 24,61,190 కు చేరుకుంది. గత 24 గంటల్లో 1,007 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 48,040 కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 16,95,982కు చేరుకోగా, యాక్టివ్ కేసుల సంఖ్య 6,61,595 గా ఉంది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల సంఖ్య 26.88 గా ఉంది. దేశంలో కరోనా రికవరీ రేటు 71.17 శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మరణాల రేటు 1.95 శాతానికి పడిపోయిందని తెలిపింది. తాజా 1,007 మరణాల్లో అత్యధికంగా మహారాష్ట్ర నుంచి 413 మంది మరణించారు. ఆగస్టు 13 వరకు 2,76,94,416 శాంపిళ్లను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. గురువారం రికార్డు స్థాయిలో 8,48,728 శాంపిళ్లను పరీక్షించినట్లు తెలిపింది. రోజుకు 10 లక్షల పరీక్షలు చేయడమే లక్ష్యమని కేంద్రం తెలిపింది. మొత్తం 1,433 ల్యాబ్‌లలో కరోనా పరీక్షలు జరుపుతున్నట్లు తెలిపింది. దేశంలో ప్రతి మిలియన్ మందికి రోజుకు 603 మందికి పరీక్షలు జరుగుతుండగా అత్యధికంగా ఆంధ్రప్రదేశ్‌లో 2,822 మందికి పరీక్షలు చేస్తున్నారు. కోలుకున్న అమిత్‌షా కేంద్ర హోంమంత్రి అమిత్‌షా కరోనా నుంచి కోలుకున్నారు. ఈనెల 2న ఆయనకు కరోనా పాజిటివ్ రాగా గుర్గావ్లోని మేదాంత ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. శుక్రవారం జరిపిన పరీక్షల్లో తనకు నెగెటివ్ వచ్చిందని అమిత్ షా ట్వీట్ చేశారు. ‘దేవుడికి ధన్యవాదాలు. నేను కోలుకోవాలని ఆకాంక్షిస్తూ నా కుటుంబానికి అండగా నిలిచిన అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. డాక్టర్ల సూచన మేరకు కొన్ని రోజులు హోం ఐసోలేషన్‌లో ఉండబోతున్నాను’అని షా వెల్లడించారు. లవ్ అగర్వాల్‌కు కరోనా కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్‌కు కరోనా సోకింది. శుక్రవారం ఈ విషయం ఆయన ట్విట్టర్లో వెల్లడించారు. దేశంలో కోవిడ్–19 వ్యాప్తిపై ఆయన కేంద్రం తరఫున ఏప్రిల్, మే నెలల్లో ప్రతి రోజూ మీడియాకు వివరాలను వెల్లడించారు. ‘నాకు కోవిడ్ పాజిటివ్ వచ్చింది. మార్గదర్శకాల ప్రకారం హోం ఐసోలేషన్‌కు వెళుతున్నాను. త్వరలోనే మిమ్మల్ని అందరినీ కలుస్తానని ఆశిస్తున్నాను’అని లవ్ అగర్వాల్ ట్వీట్ చేశారు. -
తెలంగాణలో ముగిసిన కేంద్ర బృందం పర్యటన
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న కరోనా కట్టడి చర్యలను పర్యవేక్షించడంలో భాగంగా కేంద్రం బృందం సోమవారం హైదరాబాద్‌లో పర్యటించింది. నగరంలోని కోవిడ్ ప్రత్యేక ఆస్పత్రులు టిమ్స్, గాంధీ ఆస్పత్రులను కేంద్ర బృందం సందర్శించింది. అదేవిధంగా దోమల్‌గూడలోని కంటైన్మెంట్ ప్రాంతాన్ని పరిశీలించింది. చెస్ట్ ఆస్పత్రిలో కరోనా పేషెంట్ మృతికి సంబంధించిన వివరాలను ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ అడిగి తెలుసుకున్నారు. (లాక్‌డౌన్‌పై చర్చించనున్న తెలంగాణ కేబినెట్) అంతకు ముందు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, వైద్య శాఖ ఉన్నతాధికారులతో సుమారు ఐదు గంటల పాటు కేంద్ర బృందం చర్చించింది. తెలంగాణలో కరోనా కట్టడికి తీసుకుంటున్నచర్యలను అధికారులు కేంద్ర బృందానికి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. రాష్ట్రంలో సర్వైలెన్స్, కంటైన్మెంట్ చర్యలు, ఆసుపత్రుల సన్నద్దత, వైద్య సంరక్షణ పరికరాల సమీకరణ, వైరెస్ నివారణ చర్యలపై అధికారులు కేంద్ర బృందానికి వివరణ ఇచ్చారు. రాష్ట్రంలో 17081 బెడ్లు ఉన్నాయని మరింత మెరుగైన చికిత్స కోసం 4489 అదనపు సిబ్బందిని రిక్రూట్ చేశామని తెలంగాణ వైద్య,ఆరోగ్య శాఖ తెలిపింది. వైద్య మౌలిక సదుపాయలు మెరుగుపరచడం కోసం రూ.475.74 కోట్లు మంజూరు చేయడం జరిగిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వివరించారు. కేంద్ర బృందం రాష్ట్రంలోని ఆసుపత్రుల నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేసిందని సీఎస్ సోమేశ్ కుమార్ తెలిపారు. రాష్ట్రంలో కరోనా నియత్రణ చర్యలు, వైద్య పరీక్షల సామర్ధ్యం పెంచడం, కాంటాక్ట్ ట్రేసింగ్, క్లినికల్ మేనేజ్మెంట్పై కేంద్ర బృందం పలు సూచనలు చేసిందని చెప్పారు. కేసులు పెరుగుతున్ననేపథ్యంలో వచ్చే రెండు నెలలో చేపట్టవలసిన కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని సీఎస్ అధికారులను అదేశించారు. అనంతరం కేంద్రం బృందం ఢిల్లీ బయలుదేరింది. మంగళవారం కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్రంలోని కరోనా పరిస్థితులపై కేంద్ర బృందం నివేదిక ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. -
కరోనా : రోజుకు లక్షా 20 వేల పరీక్షలు
న్యూఢిల్లీ : కరోనా పరీక్షల సామర్థ్యాన్ని పెంచడానికి స్వదేశీ ప్లాట్‌ఫామ్‌లను వినియోగిస్తున్నట్టు ఐసీఎంఆర్ శాస్త్రవేత్త నివేదిత గుప్తా తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న 681 ల్యాబొరేటరీలలో రోజుకు 1.2 లక్షల కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్టు ఆమె వెల్లడించారు. అందులో 476 ప్రభుత్వ, 205 ప్రైవేటు లాబోరేటరీలు ఉన్నట్టు చెప్పారు. మంగళవారం కరోనాపై మీడియా సమావేశంలో భాగంగా ఆమె మాట్లాడుతూ.. ప్రస్తుతం ట్రూనాట్ స్ర్కీనింగ్, నిర్ధారణ పరీక్షలు ధ్రువీకరించబడ్డాయని చెప్పారు. జిల్లాల్లో, ప్రైమరీ హెల్త్ సెంటర్లలో ఈ సదుపాయం అందుబాటులోకి వస్తే.. టెస్ట్‌ల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని అన్నారు. 73 శాతం మందికి ఇతర ఆరోగ్య సమస్యలు.. : లవ్ అగర్వాల్ దేశంలో ఇప్పటివరకు కరోనా నుంచి 95,527 మంది కోలుకున్నారని ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. భారత్‌లో కరోనా రికవరీ రేటు 48.07 శాతంగా ఉందన్నారు. కరోనాపై మీడియా సమావేశంలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో కరోనా మరణాల రేటు 2.82 శాతంగా ఉందని వెల్లడించారు. ఇది ప్రపంచ దేశాలతో పోల్చినప్పుడు చాలా తక్కువగా ఉందని పేర్కొన్నారు. దేశంలో కరోనాతో మృతిచెందిన వారిలో 73 శాతం మందికి ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నాయని తెలిపారు. రాష్ట్రాల వారీగా కరోనా కేసుల తీవ్రతపై విశ్లేషణ జరపాలని కేంద్ర ఆరోగ్య శాఖ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను కోరినట్టు చెప్పారు. -
73 శాతం మందికి ఇతర ఆరోగ్య సమస్యలు
-
కొత్త కేసులు 5,611
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వ్యాప్తి పెరుగుతోంది. సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు.. 24 గంటల వ్యవధిలో రికార్డుస్థాయిలో ఏకంగా 5,611 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా 140 మంది కోవిడ్‌తో మరణించారు. మొత్తం పాజిటివ్ కేసులు 1,06,750కి, మొత్తం మరణాలు 3,303కి చేరాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం ఇండియాలో యాక్టివ్ కరోనా కేసులు 61,149. ఈ వైరస్ బారినపడిన వారిలో 42,298 మంది చికిత్సతో కోలుకున్నారు. రికవరీ రేటు 39.62 శాతానికి పెరిగిందని ఆరోగ్య శాఖ వెల్లడించింది. 6.39% బాధితులకే ఆస్పత్రి సేవలు అవసరం దేశంలో యాక్టివ్ కేసుల్లో 6.39 శాతం బాధితులకే ఆసుపత్రుల్లో సేవలు అవసరమని కేంద్ర ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రెటరీ లవ్ అగర్వాల్ బుధవారం చెప్పారు. అలాగే 2.94 శాతం బాధితులకు ఆక్సిజన్ సపోర్టు, 3 శాతం మందికి ఐసీయూ సేవలు, 0.45 శాతం మంది బాధితులకు వెంటిలేటర్ సపోర్టు అవసరమని పేర్కొన్నారు. డబ్ల్యూహెచ్‌వో నివేదిక ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ప్రతి లక్ష జనాభాకు 62 మందికి కరోనా సోకిందని తెలిపారు. వలస కూలీల కోసం హెల్ప్‌లైన్ వలస కూలీలు తమ ఇబ్బందులు, ఫిర్యాదులను తెలిపేందుకు దేశవ్యాప్తంగా అందుబాటులో ఉంటే ఒక హెల్ప్‌లైన్ నెంబర్‌ను కేంద్ర ప్రభుత్వం త్వరలో ప్రారంభించనుంది. అయితే, అది టోల్‌ఫ్రీ నెంబర్‌గా ఉండబోదని బుధవారం టెలీకాం విభాగం(డీఓటీ) ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది. -
కరోనా కిట్ల కాంట్రాక్ట్‌లో మతలబు ఏమిటీ?
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్ సోకిన బాధితుల్లో యాంటీ బాడీస్‌ను గుర్తించేందుకు ‘ఎలిసా కిట్’ సాంకేతిక పరిజ్ఞానాన్ని భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) ఆధ్వర్యంలో పుణేలోని ‘నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలాజీ’ ప్రభుత్వ లాబరేటరీ అభివద్ధి చేసింది. ఈ విషయాన్ని ఆదివారం నాడు ఐసీఎంఆర్ విలేకరుల సమావేశంలో వెల్లడించింది. కమర్షియల్‌గా భారీ ఎత్తున ఎలిసా కిట్ల ఉత్పత్తిని అహ్మదాబాద్‌లోని ‘జైడస్ కడీలా’ అనే ఫార్మాస్యూటికల్ కంపెనీకి అప్పగించినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది. దీనికి భారత్ డ్రగ్ కంట్రోలర్ జనరల్ లైసెన్స్ మంజూరు చేసినట్లు పేర్కొంది. (విమానం ఎక్కిందని ఆశ్చర్యపోతున్నారా..) ఎలిసా కిట్ల ఉత్పత్తికి సంబంధించి ఎలాంటి పత్రికా ప్రకటనలు చేయకుండా, కనీసం బిడ్డింగ్‌లను కూడా పిలువకుండా ఏకపక్షంగా ఉత్పత్తి ఉత్తర్వులు ఏమిటని దేశంలోని ఇతర ఫార్మాస్యూటికల్ కంపెనీలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. ఇదివరకు చైనా నుంచి కనీసం దిగుమతి లైసెన్స్ కూడా లేకండా కరోనా కిట్ల సరఫరాకు 30 కోట్ల కాంట్రాక్ట్‌ను ఢిల్లీకి చెందిన ఓ చిన్న ఫార్మాస్యూటికల్ కంపెనీకి బిడ్డింగ్ లేకుండా ఇవ్వడం వల్ల కేంద్ర ప్రభుత్వానికి దాదాపు 12 కోట్ల రూపాయల నష్టం వచ్చిన విషయాన్ని ఫార్మాస్యూటికల్ కంపెనీలు గుర్తు చేస్తున్నాయి. నాడు ‘ఆర్క్ ఫార్మాస్యూటికల్స్’ కంపెనీకి ఎలాంటి బిడ్డింగ్ లేకుండా ఆర్డర్ ఇవ్వడం వల్ల, ఆ కంపెనీకి విదేశాల నుంచి మందులు దిగుమతి చేసుకునే లైసెన్స్ లేక పోవడం వల్ల మరో రెండు ఫార్మాస్యూటికల్ కంపెనీలతో లోపాయికారి ఒప్పందం చేసుకోవాల్సి వచ్చింది. (ఒక్కరోజులో 3,525 కేసులు) ఫలితంగా 245 రూపాయలకు రావాల్సిన కరోనా పరీక్షల కిట్ ప్రభుత్వానికి 600 రూపాయలకు పడింది. ఎలిసా కిట్ల తయారీని కాంట్రాక్ట్‌ను ఏ ప్రాతిపదికన ‘జైడస్ కడిలా’ కంపెనీకి ఇచ్చారని సోమవారం విలేకరులు కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్‌ను ప్రశ్నించగా, రెండు ప్రాతిపదికలపై ఇచ్చినట్లు చెప్పారు. ‘ప్రథమ ప్రాధాన్యత, త్వరతగతి ఉత్పత్తి’ అంశాల ప్రాతిపదికన అని సమాధానం ఇచ్చారు. ఈ ప్రాతిపదికలు మిగతా కంపెనీలకు ఉండవని ప్రభుత్వాధికారులు ఓ అభిప్రాయానికి ఎలా వచ్చారన్నది శేష ప్రశ్న. (పట్టాలెక్కిన రైళ్లు.. ప్రయాణానికి రెడీనా!) -
కొన్ని చోట్ల ఎక్కువ కేసులు
న్యూఢిల్లీ: దేశంలోని కొన్ని ప్రాంతాల్లోనే కరోనా కేసులు పెద్ద సంఖ్యలో బయటపడుతున్నాయనీ, ఈ దశలో వైరస్ సామాజిక వ్యాప్తి చెందకుండా కట్టడి చేయడం కీలకమని కేంద్రం పేర్కొంది. దేశంలో 24 గంటల్లో కరోనా పాజిటివ్ కేసులు రికార్డు స్థాయిలో 4,213కు చేరుకోవడంపై ఈ మేరకు స్పందించింది. ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ మాట్లాడారు. ‘దేశంలోని కొన్ని క్లస్టర్లతోపాటు, కొన్ని నిర్దిష్ట ప్రాంతాల్లోనే పెద్ద సంఖ్యలో కేసులు వెలుగుచూస్తున్నాయి. వీటిని సమర్థంగా కట్టడి చేయకుంటే వైరస్ వ్యాప్తి వేగంగా జరుగుతుంది’అని తెలిపారు. ఆరోగ్య సేతు యాప్ ప్రభుత్వం మత ప్రాతిపదికన కరోనా హాట్స్పాట్లను గుర్తించే ప్రయత్నం చేస్తోందంటూ వస్తున్న వార్తలును కొట్టిపారేశారు. దేశీయంగా రూపొందించిన ఎలిసా టెస్ట్ కిట్ 97 శాతం కచ్చితత్వంతో పనిచేస్తుందని అగర్వాల్ స్పష్టం చేశారు. విమాన ప్రయాణికులకూ ఆరోగ్యసేతు విమాన ప్రయాణికులు కూడా తమ మొబైల్ ఫోన్లలో ఆరోగ్యసేతు యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవడాన్ని తప్పనిసరి చేసే యోచనలో కేంద్రం ఉందని ఓ అధికారి తెలిపారు. ఈ యాప్ లేని ప్రయాణికులను విమానంలోకి అనుమతించబోరని చెప్పారు. పౌర విమాన యాన శాఖ దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. కాగా, కరోనా కేసులు అత్యధికంగా ఉన్న నగరాల్లో రెండో స్థానంలో ఉన్న అహ్మదాబాద్(గుజరాత్)లో వ్యాప్తి కట్టడికి చెల్లింపులను కరెన్సీ నోట్ల రూపంలో కాకుండా డిజిటల్ ద్వారానే జరపాలని నిర్ణయించారు. -
ఆశాజనకంగా కరోనా రికవరీ రేటు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి విజృంభణకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. రోజు రోజుకు పెరుగుతున్న కేసులు సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో 4,213 కరోనా పాజిటివ్ కేసలు నమోదు కాగా, 97 మంది దేశవ్యాప్తంగా మరణించారు. అయితే భారతదేశంలో కరోనా బారిన పడి కోలుకుంటున్న వారి సంఖ్య మాత్రం ఆశాజనకంగా ఉంది. కరోనా పాజిటివ్ వచ్చిన వారిలో కోలుకుంటున్న వారి శాతం 31.15శాతంగా ఉంది. గడిచిన 24 గంటల్లో 1559 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక ఇప్పటి వరకు దేశం మొత్తం మీద 67,125 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా 20,197 మంది కోలుకోగా, 2,206 మంది మరణించారు. ఇక దేశంలో ప్రస్తుతం 44,029 యాక్టివ్ కేసులు ఉన్నట్లు సోమవారం కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో పేర్కొంది. (ముగ్గురిలో ఒకరికి స్వస్థత) కరోనా బాధితులు హాస్పటల్ నుంచి డిశార్జ్ అయ్యాక హోం క్వారంటైన్లో 10 రోజుల పాటు ఉండాలి ఆరోగ్య మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ తెలిపారు. అప్పటికి వారిలో ఎటువంటి లక్షణాలు లేకపోతే క్వారంటైన్ నుంచి బయటకి రావొచ్చని పేర్కొన్నారు. కొత్తగా రూపొందించిన కరోనా డిశార్జ్ పాలసీలో ఈ నిబంధనలు ఉన్నాయన్నారు. హోం ఐసోలేషన్ పూర్తయ్యాక లక్షణాలు లేకుంటే పరీక్షలు చేయాల్సిన అవసరం లేదని లవ్ అగర్వాల్ తెలిపారు. అదేవిధంగా స్వల్ప లక్షణాలు ఉన్న కారణంగా హాస్సటల్లో చేరిన వారిని కూడా ఆసుపత్రిలో ఉంచి మూడు రోజుల పాటు జ్వరం రాకుండా ఉంటే డిశార్జ్ చేస్తామని వారికి డిశార్జ్ చేసే సమయంలో కరోనా పరీక్షలు చేయాల్సిన అవసరం లేదన్నారు. అయితే వారు 10 రోజుల పాటు హోం ఐసోలేషన్‌లో ఉంటే మంచిదని పేర్కొన్నారు. విదేశాల్లో చిక్కుకున్న 4 వేల మందిని స్వదేశానికి తీసుకొచ్చామని తెలిపారు. ఇక దేశంలోని వివిధ రాష్ట్రాల్లో కరోనా కారణంగా చిక్కుకుపోయిన 5 లక్షల మంది వలస కార్మికులను రైళ్ల ద్వారా సొంత రాష్ట్రాలకు తరలిస్తున్నామని వెల్లడించారు. (72 గంటలపాటు పార్శిల్స్ తాకొద్దు!) -
ముగ్గురిలో ఒకరికి స్వస్థత
న్యూఢిల్లీ: దేశంలో కరోనా బాధితుల్లో ఎక్కువ మంది చికిత్సతో క్రమంగా కోలుకుంటుండడం ఊరట కలిగిస్తోంది. రికవరీ రేటు తాజాగా 29.36 శాతానికి పెరిగింది. అంటే ప్రతి ముగ్గురు బాధితుల్లో ఒకరు సంపూర్ణంగా కోలుకుంటున్నట్లు స్పష్టమవుతోంది. భారత్‌లో యాక్టివ్‌కరోనా కేసులు ప్రస్తుతం 37,916 కాగా, 16,539 మంది బాధితులు చికిత్స అనంతరం కోలుకున్నారు. ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. గురువారం నుంచి శుక్రవారం వరకు 24 గంటల వ్యవధిలో 103 మంది కరోనా వల్ల మృతి చెందారు. అలాగే కొత్తగా 3,390 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. భారత్‌లో కరోనా వల్ల ఇప్పటివరకు 1,886 మంది ప్రాణాలు కోల్పోయారని, పాజిటివ్ కేసుల సంఖ్య 56,342కు చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ శుక్రవారం ప్రకటించింది. భారత్‌లో కరోనా బారిన పడిన వారిలో 111 మంది విదేశీయులు ఉన్నారు. భారత్‌లో కరోనా రహిత జిల్లాలు 216 దేశవ్యాప్తంగా 216 జిల్లాల్లో ఇప్పటిదాకా కరోనా పాజిటివ్ కేసు ఒక్కటి కూడా నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. 42 జిల్లాల్లో గత 28 రోజులుగా పాజిటివ్ కేసులేవీ నమోదు కాలేదని పేర్కొంది. మరో 29 జిల్లాల్లో గత 21 రోజులుగా కొత్త కేసులు బయట పడలేదని తెలియజేసింది. 36 జిల్లాల్లో గత 14 రోజులుగా, 46 జిల్లాల్లో గత 7 రోజులుగా కొత్త కేసులేవీ వెలుగు చూడలేదని స్పష్టం చేసింది. ప్రభుత్వ మార్గదర్శకాలను కచ్చితంగా పాటిస్తే కరోనా కేసులు గరిష్ట స్థాయికి చేరడాన్ని నివారించవచ్చని కేంద్ర ఆరోగ్యశాఖ జాయింట్ సెక్రెటరీ లవ్ అగర్వాల్ సూచించారు. కరోనాతో కలిసి బతకడం నేర్చుకోవాలి కరోనా వైరస్ నియంత్రణ చర్యలను జీవితంలో ఒక భాగంగా మార్చుకోవాలని లవ్ అగర్వాల్ అన్నారు. లాక్డౌన్ ఆంక్షల్లో మినహాయింపులు ఇస్తుండడం, వలస కూలీలు సొంత ప్రాంతాలకు తిరిగి వస్తున్న నేపథ్యంలో మన ముందు పెద్ద సవాలు ఉందని, కరోనాతో కలిసి జీవించడం నేర్చుకోక తప్పదని వ్యాఖ్యానించారు. 2.5 లక్షల మంది స్వస్థలాలకు.. లాక్డౌన్ వల్ల ఇతర ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వారిని స్వస్థలాలకు చేర్చడానికి 222 ప్రత్యేక రైళ్లు నడిపినట్లు హోంశాఖ తెలిపింది. ఈ రైళ్లలో 2.5 లక్షలకుపైగా వలస కూలీలు, యాత్రికులు, విద్యార్థులు సొంత ప్రాంతాలకు చేరుకున్నారని వివరించింది. లాక్డౌన్ నిబంధనలకు లోబడి కొన్ని వెసులుబాట్లు కల్పించాలని యోచిస్తున్నట్లు హోంశాఖ జాయింట్ సెక్రెటరీ పుణ్యసలిల శ్రీవాస్తవ చెప్పారు. -
దేశంలో కొత్తగా 3390 పాజిటివ్ కేసులు
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో దేశంలో 3390 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా,103 మంది మృతి చెందారు. దీంతో ఇప్పటివరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 56,342కి చేరింది. ప్రస్తుతం 37,916 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు 16,540 మంది డిశ్చార్జ్ కాగా 1,886 మంది మృతి చెందారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ శుక్రవారం ఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. దేశంలో కరోనా రికవరీ రేటు 29.36 శాతం ఉందన్నారు. భారత్‌లో నమోదవుతున్న కరోనా కేసుల్లో ఎక్కువ భాగం మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీలోనే ఉన్నాయని ఆయన తెలిపారు. (కరోనా: మృతుల్లో నల్ల జాతీయులే అధికం) ఆ మూడు రాష్ట్రాల్లో దాదాపు 31వేల కరోనా కేసులు నమోదు అయ్యాయన్నారు. మహారాష్ట్రలో అత్యధికంగా 17, 974 కేసులు నమోదు కాగా, 694 మంది మృతి చెందారని తెలిపారు. 216 జిల్లాల్లో కొత్తగా కరోనా కేసులు నమోదు కాలేదని తెలిపారు. విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను వెనక్కి రప్పిస్తున్నామని, మాల్దీవుల నుంచి 700 మంది నౌకలో వెనక్కి తెప్పిస్తున్నట్లు చెప్పారు. దీని కొరకు ఇప్పటికే నౌకలు మాల్దీవులకు చేరుకున్నాయని పేర్కొన్నారు. 222 శ్రామిక్ రైళ్లలో 2.5 లక్షల మంది వలసకూలీలను తరలించామని తెలిపారు. (ఈ ఏడాది చివరి వరకు వర్క్ ఫ్రం హోమ్!) గుజరాత్ : 7,012 ఢిల్లీ : 5,980 తమిళనాడు : 5,409 రాజస్తాన్ : 3,427 మధ్యప్రదేశ్ : 3,252 ఉత్తరప్రదేశ్ : 3,071 కరోనా పాజిటివ్ కేసులు వెలుగుచూశాయని లవ్ అగర్వాల్ వెల్లడించారు. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1391284009.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఒక్కరోజులో 1,074 మంది రికవరీ
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ బారిన పడిన వారిలో గత 24 గంటల్లో 1,074 మంది కోలుకున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ జాయింట్ సెక్రెటరీ లవ్ అగర్వాల్ చెప్పారు. ఇప్పటిదాకా ఒక్కరోజులో కోలుకున్న వారిలో ఇదే అత్యధికం. రికవరీ రేటు ప్రస్తుతం 27.52 శాతానికి పెరిగిందన్నారు. ఇప్పటికే 11,706 మంది కరోనా బాధితులు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. కరోనా నిర్ధారణకు టెస్టింగ్ కిట్ల కొరత లేదన్నారు. కరోనా పరీక్షల సామర్థ్యం పెంచుతున్నామన్నారు. దేశంలో కరోనా విజృంభణ ఆగడం లేదు. ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం సాయంత్రం వరకు 24 గంటల వ్యవధిలో 83 మంది కరోనా కాటుతో ప్రాణాలు విడిచారు. అలాగే కొత్తగా 2,573 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటిదాకా ఒక్కరోజులో నమోదైన కేసుల్లో ఇదే గరిష్టం. దీంతో మొత్తం మరణాలు 1,389కు, పాజిటివ్ కేసులు 42,836కు చేరాయి. సరుకు రవాణాలో సమస్యలుండొద్దు్ద దేశవ్యాప్తంగా రాష్ట్రాల మధ్య సరుకు రవాణా విషయంలో ఇబ్బందులు ఎదురు కాకుండా చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచించింది. ఎక్కడైనా ఏమైనా సమస్యలు ఉత్పన్నతమైతే ట్రక్కు డ్రైవర్లు కంట్రోల్ రూమ్ నంబర్ ‘1930’కు ఫోన్ చేయాలని పేర్కొంది. ఈ కంట్రోల్ రూమ్ రోజంతా పనిచేస్తుందని కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రెటరీ పుణ్యసలీల శ్రీవాస్తవ సోమవారం చెప్పారు. డ్రైవర్లు ‘1930’కు ఫోన్ చేసి సాయం పొందవచ్చు. -
రికవరీ రేట్ @ 25%
న్యూఢిల్లీ: కోవిడ్–19 కేసుల సంఖ్య రెట్టింపు అయ్యే కాలం లాక్‌డౌన్‌ను ప్రకటించడానికి ముందు 3.4 రోజులుండగా, ప్రస్తుతం 11 రోజులుగా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే, ప్రస్తుతం కేసులతో పోలిస్తే మరణాల శాతం 3.2గా ఉందని పేర్కొంది. కోలుకుంటున్నవారి శాతం కూడా గత రెండువారాల్లో గణనీయంగా పెరిగిందని, ఆ శాతం రెండు వారాల క్రితం 13.06 ఉండగా, ప్రస్తుతం 25కి పైగా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ వివరించారు. మొత్తం కేసుల్లో 8,324 మంది, అంటే 25.19% కోవిడ్–19 నుంచి కోలుకున్నారన్నారు. ఢిల్లీ, యూపీ, రాజస్తాన్, జమ్మూకశ్మీర్, తమిళనాడుల్లో కేసులు రెట్టింపయ్యే సమయం 11 నుంచి 20 రోజులుగా ఉందని, కర్ణాటక, లద్ధాఖ్, హరియాణా, ఉత్తరాఖండ్, కేరళల్లో అది 20 నుంచి 40 రోజులుగా ఉందని వెల్లడించారు. కోవిడ్‌తో మరణించిన వారిలో 65% పురుషులని, 35% స్త్రీలని తెలిపారు. వయస్సులవారీగా మరణాలను గణిస్తే.. మృతుల్లో 45 ఏళ్లలోపు వయసున్న వారు 14%, 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్నవారు 34.8%, 60 ఏళ్ల పైబడిన వారు 51.2% ఉన్నారని వివరించారు. కరోనా తీవ్రత అధికంగా ఉన్న ఇతర దేశాలతో పోలిస్తే కేసులు రెట్టింపు అయ్యే సమయం భారత్‌లోనే ఎక్కువగా ఉందని ఆరోగ్య శాఖ వర్గాలు వెల్లడించాయి. -
తగ్గని కరోనా ప్రకోపం
న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా మహమ్మారి విజృంభణకు అడ్డుకట్ట పడడం లేదు. దేశంలో కరోనా సంబంధిత మరణాల సంఖ్య వెయ్యికి, పాజిటివ్ కేసుల సంఖ్య 30 వేలకు చేరుకుంటోంది. ఈ వైరస్ బారినపడి సోమవారం సాయంత్రం నుంచి మంగళవారం సాయంత్రం వరకు.. ఒక్కరోజులో 51 మంది కన్నుమూశారు. అలాగే కొత్తగా 1,594 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఇప్పటిదాకా కరోనా సంబంధిత మరణాలు 937కు, పాజిటివ్ కేసులు 29,974కు చేరాయని కేంద్ర ఆరోగ్యశాఖ మంగళవారం ప్రకటించింది. భారత్‌లో యాక్టివ్ కరోనా కేసులు 22,010 కాగా, 7,026 మంది(23.44 శాతం) బాధితులు చికిత్సతో కోలుకున్నారు. దేశంలో కరోనా వైరస్ బాధితుల్లో 111 మంది విదేశీయులు ఉన్నారు. వ్యాపార రంగాన్ని ఆదుకోవాలి: ఎస్.జయశంకర్ కరోనా మహమ్మారి కారణంగా చిన్నాభిన్నమైన ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకునేందుకు వ్యాపార రంగానికి సహకారాన్నందించి, ఎవరూ ఉపాధి అవకాశాలు కోల్పోకుండా చూడాల్సిన అవసరం ఉందని విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జయశంకర్ చెప్పారు. ఆయన బ్రిక్స్ విదేశాంగ శాఖ మంత్రులతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ప్రజల ఆరోగ్యంపై, మానవ సంక్షేమంపై ప్రభావం చూపడమే కాకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను సైతం ఈ మహమ్మారి ప్రభావితం చేస్తోందని, ఫలితంగా ప్రపంచ వాణిజ్యం, వస్తువుల సరఫరాకి తీవ్ర ఆటంకం కలుగుతోందని వెల్లడించారు. సాయుధ దళాల్లో తొలి మరణం కేంద్ర సాయుధ పోలీసు దళాల్లో తొలి కరోనా మరణం నమోదయింది. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(సీఆర్పీఎఫ్)కు చెందిన ఎస్ఐ స్థాయి అధికారి కోవిడ్–19తో మంగళవారం మరణించారని అధికారులు తెలిపారు. అస్సాంలోని బార్పేటకు చెందిన ఈయన ఇప్పటికే రక్తపోటు, మధుమేహంతో బాధపడుతున్నారన్నారు. కోవిడ్–19తో మరో 31 మంది చికిత్స పొందుతున్నారన్నారు. 55ఏళ్లు దాటిన పోలీసులకు సెలవులు 55 ఏళ్లు దాటిన పోలీసులు సెలవులు తీసుకోవాలంటూ మహారాష్ట్ర ప్రభుత్వం సూచించింది. ఇటీవల కోవిడ్ బారిన ముగ్గురు పోలీసుల్లో ఒకరు మరణించారు. ముగ్గురూ 50 ఏళ్లు దాటిన వారే కావడం గమనార్హం. కాగా, పోర్టు ఉద్యోగులు విధినిర్వహణలో ఉండగా కరోనా బారినపడి మరణిస్తే వారి కుటుంబాలకు రూ.50 లక్షల పరిహారాన్ని ఇవ్వనున్నట్టు కేంద్రం ప్రకటించింది. దేశ రాజధానిలో నీతి ఆయోగ్ కార్యాలయంలో పనిచేస్తున్న అధికారికి కరోనా వైరస్ సోకింది. దీంతో నీతి భవన్‌ను 48 గంటల పాటు మూసివేశారు. సుప్రీంకోర్టు ఉద్యోగికి కరోనా సోకడంతో ముందు జాగ్రత్త చర్యగా న్యాయస్థానంలోని 36 మంది భద్రతా సిబ్బందిని అధికారులు క్వారంటైన్‌కు తరలించారు. సనంద్ పారిశ్రామికవాడలో కార్యకలాపాలు గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్‌లోని సనంద్ పారిశ్రామికవాడలో ఆటోమొబైల్, ఫార్మాస్యూటికల్ పరిశ్రమలు కార్యకలాపాలు పున:ప్రారంభించాయని హోంశాఖ కార్యదర్శి పుణ్యసలీల శ్రీవాస్తవ చెప్పారు. ప్రస్తుతం 50 శాతం సామర్థ్యంతో పని చేస్తున్నాయని అన్నారు. ప్లాస్మా థెరపీతో నయంపై ఆధారాల్లేవు కరోనా వైరస్ సోకితే ప్లాస్మా థెరపీతో పూర్తిగా నయమవుతుందంటూ ఇటీవల పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. కానీ, ఇందులో ఏమాత్రం వాస్తవం లేదని కేంద్ర ఆరోగ్యశాఖ మంగళవారం తేల్చిచెప్పింది. ప్లాస్మా థెరపీ ప్రస్తుతం ప్రయోగ దశలోనే ఉందని, కరోనా నివారణకు ఈ థెరపీ పనికొస్తుందనడానికి ఎలాంటి ఆధారాలు లేవని వెల్లడించింది. ఈ చికిత్స శాస్త్రీయంగా నిరూపితమయ్యే వరకూ రీసెర్చ్, క్లినికల్ ట్రయల్స్‌లో తప్ప ఇతరులు ఉపయోగించడం చట్ట రీత్యా నేరమని కేంద్ర ఆరోగ్యశాఖ జాయింట్ సెక్రెటరీ లవ్ అగర్వాల్ పేర్కొన్నారు. కరోనా చికిత్సలో ప్లాస్మా థెరపీ సాధ్యాసాధ్యాలపై భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) జాతీయ స్థాయిలో అధ్యయనం నిర్వహిస్తోందన్నారు. ప్రస్తుతానికి కరోనా నుంచి బయటపడడానికి ధ్రువీకరించిన చికిత్సా విధానాలేవీ లేవని తెలిపారు. గతంలో కరోనా పాజిటివ్ కేసులు బయటపడ్డ 17 జిల్లాల్లో గత 28 రోజులుగా కొత్తగా ఒక్క కేసు కూడా నమోదు కాలేదన్నారు. కరోనా మహమ్మారిపై జరుగుతున్న పోరాటంలో ఇతర దేశాల కంటే భారత్ ముందంజలో ఉందని చెప్పారు. లాక్డౌన్ కంటే ముందు భారత్‌లో కరోనా పాజిటివ్ కేసులు రెట్టింపు కావడానికి 3 నుంచి 2.25 రోజులు పట్టేదని, ప్రస్తుతం 10.2 రోజులు పడుతోందని లవ్ అగర్వాల్ వెల్లడించారు. -
28,380 కేసులు... 886 మరణాలు
న్యూఢిల్లీ: కరోనా వైరస్ బారినపడినప్పటికీ ప్రాణాపాయం ఉన్నట్లు కాదు. కరోనా బాధితులు చికిత్సతో క్రమంగా కోలుకుంటున్నారు. భారత్‌లో ఇప్పటిదాకా 6,361 మంది ఆరోగ్యవంతులయ్యారని కేంద్ర ఆరోగ్య శాఖ సోమవారం ప్రకటించింది. అంటే మొత్తం బాధితుల్లో 22.41 శాతం మంది కోలుకున్నారని వెల్లడించింది. దేశంలో ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం సాయంత్రం వరకు 24 గంటల్లో కొత్తగా 1,463 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే 60 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటిదాకా మొత్తం పాజిటివ్ కేసులు 28,380కు, కరోనా సంబంధిత మరణాలు 886కు చేరాయని కేంద్ర ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రెటరీ లవ్ అగర్వాల్ చెప్పారు. గతంలో కరోనా పాజిటివ్ కేసులు నమోదైన 16 జిల్లాల్లో గత 28 రోజులుగా కొత్తగా ఒక్క కేసు కూడా నమోదు కాలేదని తెలిపారు. 25 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 85 జిల్లాల్లో గత 14 రోజులుగా కేసులేవీ నమోదు కాలేదన్నారు. దేశంలో యాక్టివ్ కరోనా కేసులు 21,132 కాగా, 6,361 మంది(22.41 శాతం) బాధితులు చికిత్స అనంతరం కోలుకున్నారు. చైనా ర్యాపిడ్ కిట్లు వెనక్కి పంపండి కరోనా నిర్ధారణ పరీక్షల నిమిత్తం చైనా నుంచి కొనుగోలు చేసిన ర్యాపిడ్ యాంటీబాడీ టెస్టు కిట్లను ఉపయోగించవద్దని భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు స్పష్టం చేసింది. వాటికి వెనక్కి పంపించాలని సోమవారం సూచించింది. వాటిని తాము చైనాకు తిరిగి పంపుతామని పేర్కొంది. చైనాలోని గాంగ్జౌ వోండ్ఫో బయోటెక్, ఝూజై లివ్సన్ డయాగ్నోస్టిక్స్ అనే రెండు సంస్థల నుంచి ర్యాపిడ్ యాంటీబాడీ టెస్టు కిట్లను భారత్ కొనుగోలు చేసి, రాష్ట్రాలకు పంపిణీ చేసిన సంగతి తెలిసిందే. వాటి నాణ్యత, పనితీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కిట్లు కచ్చితమైన ఫలితాన్ని ఇవ్వలేకపోతున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా కిట్ల వాడకాన్ని వెంటనే నిలిపివేయాలని ఐసీఎంఆర్ నిర్ణయించింది. వాటిని వెనక్కి పంపాలని రాష్ట్రాలను ఆదేశించింది. -
24 గంటల్లో 1409 పాజిటివ్ కేసులు
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. గురువారం నాటికి భారత్‌లో మొత్తం 21,393 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా కొత్తగా 1409 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. మరోవైపు దేశంలో ఇప్పటివరకు 681 మంది మృతి చెందగా.. 4,257 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. (లాక్డౌన్ నుంచి పలు షాపులకు మినహాయింపులు) ఈ మేరకు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ గురువారం మీడియా సమవేశం ద్వారా వివరాలను వెల్లడించారు. దేశంలో ప్రస్తుతం 16,454 యాక్టివ్ కేసులు ఉన్నాయన్నారు.14 రోజులుగా 78 జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదని తెలిపారు. 28 రోజులుగా 12 జిల్లాల్లో ఒక్క కేసూ నమోదు కాలేదని వివరించారు. కంటైన్మెంట్ ద్వారానే కరోనా వ్యాప్తిని నియంత్రించగలిగామని తెలిపారు. -
బ్రేకింగ్ : లాక్డౌన్ నుంచి ఊరట
సాక్షి, న్యూఢిల్లీ : లాక్డౌన్ కారణంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పలు సడలింపులను ప్రకటించింది. ఈ సడలింపులతో ప్రజలకు స్వల్ప ఊరటనిచ్చింది. లాక్డౌన్ ఆంక్షల నుంచి దేశంలోని అర్బన్ ప్రాంతాల్లోని నాన్ హాట్‌స్పాట్ ప్రాంతాల్లో మాత్రమే ఈ మినహాయింపులు వర్తిస్తాయి. మొబైల్ రిచార్జ్, సిమెంట్, పుస్తకాల షాపులు వంటి వాటికి కేంద్రం లాక్డౌన్ నుంచి వెసులుబాటు కల్పించింది. హాట్‌స్పాట్ ప్రాంతాల్లో ఎలాంటి మినహాయింపులు లేవని తెలిపింది. ఈ మేరకు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ గురువారం మీడియా సమవేశం ద్వారా వివరాలను వెల్లడించారు. గ్రామీణ ఆర్ఠిక వ్యవస్థను గాడిలో పడేసేందుకు ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుందని తెలిపారు. దేశంలో వైద్య సిబ్బందికి పూర్తి భద్రతను కల్పిస్తామన్నారు. అలాగే దేశ వ్యాప్తంగా నోడల్ అధికారులను నియమిస్తామని తెలిపారు. వీటికే మినహాయింపులు.. పుస్తకాలు, స్టేషనరీ షాపులు నిర్మాణ రంగానికి సంబంధించిన మెటిరీయల్ షాపులు మొబైల్ రిచార్జ్ షాపులు రోడ్ల నిర్మాణాలపై ఆంక్షలు ఎత్తివేత ఫ్యాన్లు విక్రయించే ఎలక్ట్రికల్ దుకాణాలు సిమెంట్ విక్రయాలకు అనుమతి పిండి మిల్లులకు లాక్డౌన్ నుంచి మినహాయింపు -
దేశంలో 17,265 కరోనా కేసులు
-
కరోనా అలర్ట్ : 24 గంటల్లో 1553 కేసులు
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1553 పాజిటివ్ కేసులు నమోదవగా 36 మంది మరణించారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ 17,265 కేసులు నమోదయ్యాయని, 543 మంది మరణించారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శి లవ్ అగర్వాల్ సోమవారం మీడియా సమావేశంలో వెల్లడించారు. మహమ్మారి బారి నుంచి కోలుకుని 2546 మంది డిశ్చార్జి అయ్యారని తెలిపారు. లాక్డౌన్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని కోరారు. లాక్‌డౌన్‌పై కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు పలు సూచనలు చేసిందని ఆయన గుర్తు చేశారు. ఇక గోవాలో కరోనా కేసులు లేవని, లాక్డౌన్ కారణంగా కరోనా గ్రోత్ రేట్ తగ్గిందని లవ్ అగర్వాల్ పేర్కొన్నారు. ఇక మహారాష్ట్రలో కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. ముంబైలో 53 మంది జర్నలిస్టులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడం కలకలం రేపింది. మహారాష్ట్రలో ఇప్పటివరకూ 4203 కరోనా కేసులు నమోదవగా 223 మంది మరణించారు. మధ్యప్రదేశ్‌లో 1407 కేసులు నమోదవగా 70 మంది మరణించారు. మరోవైపు పశ్చిమబెంగాల్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 339కి పెరగ్గా మృతుల సంఖ్య 12కి చేరింది. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తే వైరస్ వ్యాప్తి మరింత విశృంఖలమవుతుందని ప్రజలు సంయమనంతో నిబంధనలు పాటించి ఇళ్లకే పరిమితం కావాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ కోరింది. చదవండి : గ్లోబల్ విలేజ్‌కు మహమ్మారి తూట్లు.. -
500 దాటిన కరోనా మరణాలు
న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా మహమ్మారి భయోత్పాతం సృష్టిస్తోంది. ప్రజలను బెంబేలెత్తిస్తోంది. కరోనా పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. శనివారం సాయంత్రం నుంచి ఆదివారం సాయంత్రం వరకు.. ఒక్కరోజులో ఏకంగా 1,324 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 31 మంది కరోనాతో పోరాడి కన్నుమూశారు. గుజరాత్లో 10 మంది, మహారాష్ట్రలో 10 మంది, పంజాబ్‌లో ముగ్గురు, ఉత్తరప్రదేశ్‌లో ముగ్గురు, పశ్చిమబెంగాల్లో ఇద్దరు, ఢిల్లీలో ఒకరు, మధ్యప్రదేశ్‌లో ఒకరు, కర్ణాటకలో ఒకరు మృతిచెందారు. దీంతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 16,116కు, మొత్తం మరణాల సంఖ్య 519కు చేరిందని కేంద్ర ఆరోగ్యశాఖ ఆదివారం ప్రకటించింది. యాక్టివ్ కరోనా కేసులు 13,295 కాగా, కరోనా బాధితుల్లో 2,310 మంది చికిత్స అనంతరం పూర్తిగా కోలుకున్నారు. భారత్‌లో మొత్తం కరోనా బాధితుల్లో 77 మంది విదేశీయులున్నారు. అత్యధిక మరణాలు మహారాష్ట్రలోనే.. మొత్తం 519 కరోనా సంబంధిత మరణాల్లో 211 మరణాలు మహారాష్ట్రలోనే చోటుచేసుకున్నాయి. మధ్యప్రదేశ్‌లో 70 మంది, గుజరాత్లో 58, ఢిల్లీలో 43, ఉత్తరప్రదేశ్‌లో 17, పంజాబ్‌లో 16, తమిళనాడులో 15, కర్ణాటకలో 14, పశ్చిమబెంగాల్లో 12, రాజస్తాన్‌లో 11 మంది చనిపోయారు. దేశంలోనే అత్యధికంగా మహారాష్ట్రలో ఇప్పటిదాకా 3,651 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలో 1,893, గుజరాత్లో 1,604, మధ్యప్రదేశ్‌లో 1,407, తమిళనాడులో 1,372, రాజస్తాన్‌లో 1,351, ఉత్తరప్రదేశ్‌లో 1,084, కేరళలో 400, కర్ణాటకలో 384, జమ్మూకశ్మీర్‌లో 341, పశ్చిమబెంగాల్లో 310, హరియాణాలో 233, పంజాబ్‌లో 219 కేసులు బయటపడ్డాయి. వ్యవసాయ రంగంలో అనుమతులు నాన్–కంటైన్మెంట్ ప్రాంతాల్లో ఏప్రిల్ 20వ తేదీ నుంచి లాక్డౌన్ ఆంక్షల్లో కొన్ని సడలింపులు ఇవ్వనున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన సంగతి తెలిసిందే.. హాట్స్పాట్లలో మాత్రం కఠినమైన ఆంక్షలు కొనసాగుతాయని స్పష్టం చేసింది. వ్యవసాయ రంగంతోపాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో కొన్ని కార్యకలాపాలకు అనుమతి ఇవ్వనున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ చెప్పారు. స్థానిక పరిస్థితులు, అవసరాలను బట్టి కరోనా నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వాలు ఆంక్షలు విధించుకోవచ్చని సూచించారు. హాట్స్పాట్లు, రెడ్జోన్లలో కరోనా పాజిటివ్ కేసులు 4 కంటే తక్కువ రోజుల్లోనే రెట్టింపు అవుతున్నాయని లవ్ అగర్వాల్ పేర్కొన్నారు. ఇలాంటి ప్రాంతాల్లో లాక్డౌన్ ఆంక్షల నుంచి ఎలాంటి మినహాయింపులు ఉండవన్నారు. దేశంలో కరోనా నిర్ధారణ పరీక్షలను పెంచుతున్నట్లు భారత వైద్య పరిశోధనా మండలి వెల్లడించింది. ఆదివారం 37,173 పరీక్షలు నిర్వహించామని, ఇప్పటిదాకా 3,86,791 పరీక్షలు నిర్వహించినట్లు తెలిపింది. -
దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు
సాక్షి, న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 15,712కి చేరింది. అలాగే గడిచిన 24 గంటల్లో 27 మరణాలు చేటుచేసుకున్నాయి. దీంతో దేశంలో కరోనా మరణాల సంఖ్య 507కి చేరింది. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ హెల్త్ బులిటిన్ విడుదల చేశారు. ఇప్పటి వరకు 3.86 లక్షల మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని ఆయన తెలిపారు. దేశవ్యాప్తంగా కరోనా నుంచి కోలుకున్న 2,230 మంది డిశ్చార్జ్ అయ్యారని వెల్లడించారు. దేశంలో ప్రస్తుతం 12,974 యాక్టివ్ కేసులు ఉన్నాయన్నారు. అలాగే గడిచిన 14 రోజులుగా 43 జిల్లాల్లో కొత్త కరోనా పాజిటివ్ కేసులు లేవని ల వ్అగర్వాల్ స్పష్టం చేశారు. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1331278836.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
30% కేసులకు మర్కజ్ లింక్
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో ఇప్పటి వరకు నమోదైన 14,792 కరోనా పాజిటివ్ కేసుల్లో మర్కజ్ ఘటనతో సంబంధమున్నవే 4 వేల పైచిలుకు ఉన్నాయని కేంద్రం వెల్లడించింది. మొత్తం 23 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఇలాంటి కేసులున్నట్లు పేర్కొంది. కోవిడ్ పరిస్థితిపై కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ వివరించారు. ఢిల్లీలోని నిజాముద్దీన్‌లో మార్చిలో జరిగిన మత పరమైన కార్యక్రమంతో సంబంధమున్న 4,291 కేసుల్లో అత్యధికంగా తమిళనాడు(84%), తెలంగాణ (79%), ఢిల్లీ(63%), ఉత్తరప్రదేశ్(59%), ఆంధ్రప్రదేశ్(61%)ల్లోనే ఉన్నాయని వివరించారు. మొత్తం కేసుల్లో ఇవి 29.8% వరకు ఉన్నట్లు తెలిపారు. తక్కువ సంఖ్యలో నమోదైన రాష్ట్రాల్లోనూ మర్కజ్ ఘటనతో లింకులున్న కేసులున్నాయన్నారు. అస్సాంలో నమోదైన 35 కేసుల్లో 32, అండమాన్ దీవుల్లోని 12 కేసుల్లో 10 ఈ కార్యక్రమంతో సంబంధమున్నట్లు తేలిందని చెప్పారు. ఇక గడిచిన 14 రోజుల్లో ఒక్క కేసు కూడా నమోదుకాని 47 జిల్లాల్లో ఏపీలోని విశాఖపట్టణం ఉంది. కరోనాతో మరణించిన వారి సంఖ్య శనివారానికి 488కి, పాజిటివ్ కేసులు 14,792కి చేరుకున్నాయి. దేశం మొత్తమ్మీద యాక్టివ్ కేసులు 11,906 కాగా 1,992 మంది ఇప్పటి వరకు కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. గడిచిన 24 గంటల్లో కరోనా కేసులు కొత్తగా 991 నమోదు కాగా, 43 మంది మరణించారని ఆరోగ్య శాఖ పేర్కొంది. వీరిలో అత్యధికంగా మధ్యప్రదేశ్‌లో 12 మంది మృతి చెందారు. ఆ తర్వాత మహారాష్ట్రలో ఏడుగురు, ఢిల్లీలో నలుగురు, గుజరాత్లో ముగ్గురు, జమ్మూకశ్మీర్, బిహార్లలో ఒక్కొక్కరు చొప్పున చనిపోయినట్లు తెలిపింది. మరణాల రేటు 3.3 శాతం దేశంలో కోవిడ్ మరణాల రేటు 3.3%గా ఉందని లవ్ అగర్వాల్ చెప్పారు. ఇందులో 0–45 ఏళ్ల గ్రూపులో 14.4%, 45–60 ఏళ్ల వారు 10.3%, 60–75 ఏళ్ల వారు 33.1%, 75 ఆపైన వయస్సు వారిలో 42.2% అని తెలిపారు. మొత్తంగా కోవిడ్‌తో మృతి చెందిన వారిలో 75.3% మంది 60 ఏళ్లు, ఆపై వారేనన్నారు. 83% మరణాలకు ఇతర ఆరోగ్య సమస్యలూ కారణం. మహారాష్ట్రలో అత్యధికం కరోనా సంబంధిత మరణాలు ఇప్పటిదాకా 488 కాగా, మహారాష్ట్రలో∙201 మరణాలు చోటుచేసుకున్నాయి. ఆ తర్వాతి స్థానాల్లో మధ్యప్రదేశ్ (69), ఢిల్లీ (42), గుజరాత్ (48) ఉన్నాయి. తమిళనాడులో 15 మంది, పంజాబ్‌లో 13 మంది, ఉత్తరప్రదేశ్‌లో 14 మంది, కర్ణాటకలో 13 మంది చనిపోయారు. కరోనా పాజిటివ్ కేసుల్లో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది. ఈ రాష్ట్రంలో 3,323 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా ఢిల్లీ (1,707), తమిళనాడు (1,323), మధ్యప్రదేశ్ (1,310) ఉన్నాయి. మిగతా రాష్ట్రాల్లో 100 లోపే కరోనా కేసులు నమోదయ్యాయి. ► రాజస్తాన్‌లోని కోటాలో చిక్కుకుపోయిన 3 వేల మంది విద్యార్థులను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పంపిన 100 బస్సుల్లో వారి స్వస్థలాకు తరలించే ప్రక్రియ ప్రారంభమైంది. ► కంటైన్మెంట్ ఏరియాగా ప్రకటించిన జహంగీర్‌పూర్‌లో ఒకే కుటుంబానికి చెందిన 26 మందికి కరోనా పాజిటివ్‌గా తేలిందని ఢిల్లీ సీఎం తెలిపారు. ► రాష్ట్రంలోని 12 లక్షల మంది భవన నిర్మాణ నిర్మాణ కార్మికులకు రూ.2వేల చొప్పున అందజేయాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అన్ని రాష్ట్రాల్లోనూ అత్యవసర సహాయ కేంద్రాలు లాక్డౌన్ కారణంగా తలెత్తే ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు అన్ని జిల్లాల్లో అత్యవసర సహాయ కేంద్రాలను ఏర్పాటు చేశాయని హోంశాఖ జాయింట్ సెక్రటరీ శ్రీవాస్తవ తెలిపారు. హోం శాఖ ఏర్పాటు చేసిన 1930, 944 హెల్ప్‌లైన్ నంబర్లు నిరంతరం పనిచేస్తున్నాయన్నారు. గర్భిణులు, వృద్ధులు, ప్రత్యేక అంగవికలురకు అత్యవసర సేవలందించేందుకు 112 నంబర్ అందుబాటులో ఉందని, 112 మొబైల్ యాప్ ద్వారా ఫోన్ కాల్ లొకేషన్ గుర్తించవచ్చని వివరించారు. లాక్‌డౌన్‌పై అమిత్ షా సమీక్ష దేశవ్యాప్తంగా కొనసాగుతున్న లాక్డౌన్, అత్యవసర వస్తువుల అందుబాటుపై హోం మంత్రి అమిత్ షా శనివారం సమీక్ష జరిపారు. వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులకు సాయపడేందుకు తీసుకుంటున్న చర్యలపై చర్చించారు. -
మర్కజ్‌తో లింకైన కరోనా కేసులు ఎన్నో తెలుసా
సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌లో శనివారం నాటికి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 14,378కి చేరింది. గడిచిన 24 గంటల్లో 991 కొత్త కరోనా కేసులు నిర్ధారణ కాగా.. 43 మంది మృతి చెందారు. దీంతో దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 480కి చేరింది. ఇక వైరస్ బారినపడిన వారిలో ఇప్పటి వరకు 1992 మంది కోలుకున్నారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ హెల్త్‌బులిటిన్ విడుదల చేశారు. దేశంలో 22 జిల్లాల్లో 2వారాలుగా కొత్త కేసులు నమోదు కాలేదని తెలిపారు. దేశంలో 73 శాతం కరోనా మరణాలు 60 ఏళ్లు పైబడినవారివే అని వెల్లడించారు. అలాగే దేశంలో కరోనా వైరస్ కారణంగా సంభవించిన మరణాలు రేటు కేవలం 3.3 శాతమని లవ్ అగర్వాల్ తెలిపారు. వయసుల వారిగా మరణాల రేటును ఆయన వెల్లడించారు. 0-45 ఏళ్ల మధ్య ఉన్న వారు 14.4 శాతం, 45-60 ఏళ్ల మధ్య ఉన్న వారు 10.3 శాతం, 60-75 ఏళ్ల మధ్య ఉన్న వారు 33.1 శాతం, 75 ఏళ్లకు పైబడిన వారు 42.2 శాతం మరణిస్తున్నారని అగర్వాల్ చెప్పారు. వైరస్ సంక్రమణ రేటు 83 శాతం ఉన్నట్లు పేర్కొన్నారు. కరోనా కట్టడికి ఏపీ కఠిన చర్యలు.. మరోవైపు వైరస్ అనుమానితులను గుర్తించి వారికి పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం వేగవంతంగా చర్యలు చేపడుతోందని చెప్పారు. దీనిలో భాగంగానే బ్లడ్ శాంపిల్స్ సేకరణకు మొబైల్ బృందాలను ఏర్పాటు చేశామనన్నారు. వైరస్ లక్షణాలు ఉన్న వారు వైద్యుల సూచనలు లేకుండా మందులు వాడొద్దని లవ్ అగర్వాల్ సూచించారు. ఇదిలావుండగా ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో కొత్తగా పాజిటివ్ కేసులు నమోదు కాలేదని తెలిపారు. విశాఖతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా నియంత్రణకు స్థానిక ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోందని ప్రశంసించారు. మర్కజ్ కేసులు.. 4,291 ఇక దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించి ఢిల్లీ మర్కజ్ ప్రార్థనాల గురించి లవ్ అగర్వాల్ పలు వివరాలను వెల్లడించారు. దేశంలో నమోదైన కేసుల్లో 4,291 కరోనా కేసులకు ఢిల్లీ మర్కజ్‌కు సంబంధించినవే అని స్పష్టం చేశారు. అత్యధికంగా తమిళనాడులో 84 శాతం, ఢిల్లీలో 63 శాతం కేసులు, తెలంగాణలో 79 శాతం, యూపీలో 59 శాతం ఏపీలో 50 శాతం కేసులు మర్కజ్‌కు లింక్ ఉన్నవే అని తెలిపారు. వైరస్ కారణంగా మృతి చెందిన వారిలో కూడా ఢిల్లీ మత ప్రార్థనలకు వెళ్లిన వారే ఎక్కువగా ఉన్నారని పేర్కొన్నారు. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1331278836.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1331278836.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
13వేలకు చేరిన కరోనా పాజిటివ్ కేసులు
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పటి వరకే దేశ వ్యాప్తంగా మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 13,387కి చేరింది. మృతుల సంఖ్య 437కి పెరిగింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,007 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 23 మంది మృతి చెందారు. మరోవైపు ఇప్పటి వరకు వైరస్ నుంచి కోలుకుని 1749 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి లవ్ అగర్వాల్ శుక్రవారం హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. మరోవైపు కరోనా బారిన పడివారిలో దాదాపు 80శాతం మంది కోలుకుంటున్నారని లవ్ అగర్వాల్ తెలిపారు. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 266మందికి పైగా పూర్తిగా కోలుకుని డిశ్చార్జ అయ్యారని వెల్లడించారు. ఇక దేశ వ్యాప్తంగా అమలవుతున్న లాక్డౌన్ కారణంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేవని అన్నారు. అన్ని ప్రాంతాల్లో నిత్యావసర వస్తువుల అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. వైరస్ వ్యాప్తి నియంత్రణకు అమలు చేస్తున్న లాక్డౌన్ వల్ల సత్ఫలితాలు వస్తున్నాయన్నారు. -
కరోనా కేసులు పైపైకి...
న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా సంబంధిత మరణాలు, పాజిటివ్ కేసులు నానాటికీ పెరిగిపోతున్నాయి. కేసుల సంఖ్య 12 వేలు దాటింది. దేశంలో బుధవారం సాయంత్రం నుంచి గురువారం సాయంత్రం వరకు 24 గంటల్లో కొత్తగా 826 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే 28 మంది కరోనాతో మృతి చెందారు. మహారాష్ట్రలో 9 మంది, గుజరాత్లో ఆరుగురు, ఆంధ్రప్రదేశ్‌లో ఐదుగురు, ఢిల్లీలో ఇద్దరు, కర్ణాటకలో ఇద్దరు, తమిళనాడులో ఇద్దరు, ఉత్తరప్రదేశ్‌లో ఇద్దరు కన్నుమూశారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 12,759కి, మొత్తం మరణాల సంఖ్య 420కి చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ గురువారం ప్రకటించింది. ఇండియాలో యాక్టివ్‌కరోనా కేసులు 10,824 కాగా, 1,514 మంది చికిత్స అనంతరం కోలుకున్నారు. దేశంలో కరోనా బారిన పడిన వారిలో 76 మంది విదేశీయులు ఉన్నారు. దేశంలో 325 జిల్లాల్లో ఇప్పటిదాకా ఒక కరోనా పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ గురువారం చెప్పారు. ఆయా జిల్లాల్లో అమలు చేస్తున్న పటిష్టమైన నియంత్రణ చర్యల వల్లే ఇది సాధ్యమైందని తెలిపారు. కరోనా సంబంధిత మరణాల్లో మహారాష్ట్రదే తొలిస్థానం. ఈ రాష్ట్రంలో ఇప్పటిదాకా 187 మంది చనిపోయారు. మధ్యప్రదేశ్‌లో 53 మంది, గుజరాత్లో 36, ఢిల్లీలో 32, తమిళనాడులో 14, పంజాబ్‌లో 13, ఉత్తరప్రదేశ్‌లో 13 మంది మృతిచెందారు. దేశంలోనే అత్యధికంగా మహారాష్ట్రలో 2,919 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ధారావిలో పాజిటివ్ కేసులు 86 దేశ ఆర్థిక రాజధాని ముంబైలోని అతిపెద్ద మురికివాడ ధారావిలో ప్రస్తుతం కరోనా వైరస్ విలయ తాండవం చేస్తోంది. ఇక్కడ గురువారం ఒక్కరోజే 26 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 86కు చేరింది. ధారావిలో కరోనాతో ఇప్పటికే 9 మంది మృతిచెందారు. ముస్లిం నగర్, ముకుంద్ నగర్, సోషల్ నగర్, రాజీవ్ నగర్, సాయిరాజ్ నగర్, ట్రాన్సిట్ క్యాంప్, రామ్‌జీ ఛాల్, లక్ష్మీ ఛాల్, జనతా సొసైటీ, శివశక్తి నగర్ తదితర ప్రాంతాల్లో కరోనా తీవ్రత అధికంగా ఉంది. ఇవన్నీ ధారావి మురికివాడలో భాగమే. ఇక్కడ 15 లక్షల మంది నివసిస్తున్నారు. లాక్డౌన్ కఠినంగా అమలు చేయండి: కేంద్ర హోంశాఖ కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేయాలని కేంద్ర హోంశాఖ ఆదేశించింది. ఫేసు మాస్కుల వాడకం, భౌతిక దూరం పాటించడం, ఒకేచోట ఐదుగురి కంటే ఎక్కువమంది గుమికూడకపోవడం వంటి నిబంధనల అమలు విషయంలో ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని స్పష్టం చేసింది. కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రెటరీ పుణ్యసలీల శ్రీవాస్తవ గురువారం మీడియా సమావేశంలో మాట్లాడారు. బహిరంగ ప్రదేశాల్లో ఎవరూ ఉమ్మివేయకుండా చూడాలని చెప్పారు. పని ప్రదేశాల్లో చేతులు తరచుగా శుభ్రం చేసుకోవడానికి శానిటైజర్లను తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. మద్యం, గుట్కా, పొగాకు అమ్మకాలపై ప్రస్తుతం నిషేధం ఉందని, దీన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. 53 దేశాల్లో 3,336 మంది భారతీయులకు కరోనా విదేశాల్లో ఉంటున్న భారతీయులు కరోనా మహమ్మారి బారిన పడుతున్నారు. 53 దేశాల్లో 3,336 మంది భారతీయులకు ఈ వైరస్ సోకిందని, ఇప్పటిదాకా 25 మంది మరణించారని కేంద్ర ప్రభుత్వం గురువారం వెల్లడించింది. ప్రస్తుతం విదేశాల్లో ఉన్న భారతీయులు అక్కడే ఉండాలని, ఇప్పటికిప్పుడు వారందరిని వెనక్కి తీసుకురావడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. కరోనా నియంత్రణ కోసం 55 దేశాలకు హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రలు ఎగుమతి చేయాలని నిర్ణయించినట్లుప్రభుత్వ వర్గాలు తెలిపాయి. -
భారత్‌లో పెరుగుతున్న కరోనా కేసులు
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో గురువారం నాటికి 12,380 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. మృతుల సంఖ్య 414కి చేరింది. గడిచిన 24 గంటల్లో 941 పాజిటివ్ కేసులతో పాటు 37 మరణాలు కూడా సంభవించాయి. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ గురువారం మీడియా సమావేశం ద్వారా వివరాలను వెల్లడించారు. దేశ వ్యాప్తంగా 325 జిల్లాల్లో ఒక్క కరోనా కేసు కూడా (జీరో కరోనా కేసులు) నమోదు కాలేదని ప్రభుత్వ నివేదిక తేలిందన్నారు. అలాగే కరోనా కేసులు నమోదవుతున్న జిల్లాల్లో లాక్డౌన్ కఠినంగా అమలు చేయాలని రాష్ట్రాలను ఆదేశించామని తెలిపారు. మేక్ ఇన్ ఇండియా ద్వారా వైద్య పరికరాల తయారీపై దృష్టి పెడుతున్నట్లు లవ్ అగర్వాల్ చెప్పారు. బహిరంగ ప్రదేశాల్లో ప్రజలంతా మాస్క్‌లు తప్పనిసరిగా ధరించాలని ఆయన సూచించారు. కరోనా నుంచి 1489 మంది బాధితులు కోలుకున్నారని తెలిపారు. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 2,90,401 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామన్నారు. 17 రాష్ర్టాల్లోని 27 జిల్లాల్లో గత 14 రోజుల నుంచి కరోనా కేసులు కొత్తగా నమోదు కాలేదని పేర్కొన్నారు. ఏప్రిల్ 20 తర్వాత గ్రీన్ జోన్ ప్రాంతాల్లో కొన్ని రంగాలకు వెసులుబాటు కల్పించేందుకు అవకాశాలున్నాయని అన్నారు. -
12 వేలకు అడుగు దూరంలో..
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతూనే ఉంది. కరోనా పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య పైపైకి ఎగబాకుతోంది. మంగళవారం నుంచి బుధవారం వరకు.. గత 24 గంటల్లో 39 మంది కన్నుమూశారు. మహారాష్ట్రలో 18 మంది, ఉత్తరప్రదేశ్‌లో ఆరుగురు, గుజరాత్లో నలుగురు, మధ్యప్రదేశ్‌లో ముగ్గురు, ఢిల్లీలో ఇద్దరు, కర్ణాటకలో ఇద్దరు, తెలంగాణలో ఒకరు, తమిళనాడులో ఒకరు, పంజాబ్‌లో ఒకరు, మేఘాలయాలో ఒకరు మృతిచెందారు. కొత్తగా 1,118 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటిదాకా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య ఏకంగా 11,933కు, కరోనా సంబంధిత మరణాల సంఖ్య 392కు చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ మంగళవారం ప్రకటించింది. యాక్టివ్ కరోనా పాజిటవ్ కేసులు 10,197 కాగా, 1,343 మంది చికిత్సతో కోలుకున్నారు. ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. ఇప్పటిదాకా చోటుచేసుకున్న 392 మరణాల్లో 178 మరణాలు మహారాష్ట్రలోనే వెలుగుచూడడం గమనార్హం. మహారాష్ట్రలో ఇప్పటిదాకా 2,687 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలో 1,561, తమిళనాడులో 1,204, రాజస్తాన్‌లో 1,005, మధ్యప్రదేశ్‌లో 987, ఉత్తరప్రదేశ్‌లో 735, గుజరాత్లో 695 కేసులు బయటపడ్డాయి. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 170 జిల్లాలను కరోనా హాట్స్పాట్లుగా, 207 జిల్లాలను నాన్–హాట్స్పాట్లుగా గుర్తించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ బుధవారం చెప్పారు. నాన్–హాట్‌స్పాట్ జిల్లాల్లోనూ కరోనా తీవ్రత పెరిగే అవకాశం(పొటెన్షియల్) ఉన్నందున అక్కడ నియంత్రణ చర్యలను మరింత పకడ్బందీగా అమలు చేయాలని సూచించారు. భారత్‌లో కరోనా వ్యాప్తి ఇంకా సామూహిక సంక్రమణ దశకు చేరుకోలేదని స్పష్టం చేశారు. కంటైన్మెంట్ జోన్లలో పని చేయడానికి ప్రత్యేక సిబ్బందిని నియమించామని, కరోనా అనుమానితులను గుర్తించడానికి వీరంతా ఇంటింటికీ తిరిగి సర్వే చేస్తారని పేర్కొన్నారు. కరోనా నియంత్రణ చర్యలు మరింత పటిష్టం హాట్స్పాట్లుగా గుర్తించిన జిల్లాల్లో కరోనా నియంత్రణ చర్యలను మరింత పటిష్టంగా అమలు చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. కంటైన్మెంట్ జోన్లలో అత్యవసర సేవలను మాత్రమే అనుమతిస్తామని పేర్కొంది. అక్కడ మనుషుల కదలికలపై కఠినమైన ఆంక్షలు అమలవుతాయని స్పష్టం చేసింది. హాట్స్పాట్లలో అన్ని రకాల వైద్య సేవలకు ఎలాంటి ఆటంకాలు ఉండబోవని వెల్లడించింది. కొత్త మార్గదర్శకాల ప్రకారం.. కంటైన్మెంట్ జోన్లలో ఆసుపత్రులు, నర్సింగ్ హోంలు, క్లినిక్‌లు, మందుల దుకాణాలు, ఫార్మసీలు, జన ఔషధీ కేంద్రాలు, వైద్య ఉపకరణాల దుకాణాలు, మెడికల్ ల్యాబ్‌లు, వెటర్నరీ ఆసుపత్రులు యథాతథంగా పని చేస్తాయని తెలిపింది. -
లాక్డౌన్ పై మార్గదర్శకాలు విడుదల చేశాం
-
25 జిల్లాల్లో కొత్త కేసుల్లేవ్
న్యూఢిల్లీ: తొలుత కరోనా పాజిటివ్ కేసులు బయటపడ్డ 15 రాష్ట్రాల్లోని 25 జిల్లాలను కంటైన్మెంట్ చేయడంతో మంచి ఫలితాలు వచ్చాయని కేంద్ర ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ సోమవారం మీడియా సమావేశంలో చెప్పారు. ఆ 25 జిల్లాల్లో గత 14 రోజుల్లో కొత్తగా ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదని తెలిపారు. జిల్లాల్లో అధికార యంత్రాంగం కృషితోనే ఈ ఘనత సాధ్యమైందని ప్రశంసించారు. ఇందులో తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సైతం ఉందన్నారు. ఆయా జిల్లాల్లో భవిష్యత్తులోనూ కొత్త పాజిటివ్ కేసులు నమోదు కాకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలన్నారు. ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన ప్యాకేజీ కింద ఏప్రిల్ 10వ తేదీ నాటికి దేశవ్యాప్తంగా పేదలకు రూ.28,256 కోట్ల ఆర్థిక సహాయం అందజేసినట్లు లవ్ అగర్వాల్ చెప్పారు. అలాగే పీఎం కిసాన్ యోజన కింద రైతులకు రూ.13,855 కోట్లు అందజేశామన్నారు. సామాజిక సాయం కింద వితంతువులు, వయో వృద్ధులు, దివ్యాంగులకు రూ.1,405 కోట్లు బదిలీ చేశామని తెలిపారు. రాష్ట్ర గ్రామీణ జీవనోపాధి పథకం కింద 27 రాష్ట్రాల్లో 78,373 స్వయం సహాయక బృందాల సభ్యులు 1.96 కోట్ల ఫేసు మాస్కులను తయారు చేశారని అన్నారు. ఆరు వారాల పాటు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయడానికి అవసరమైన సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్) వెల్లడించింది. దేశంలో ఇప్పటిదాకా 2,06,212 పరీక్షలు నిర్వహించినట్లు తెలియజేసింది. -
కరోనా: భారత్‌లో 9,352 కేసులు.. 324 మరణాలు
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి రోజురోజుకు కోరలు చాస్తోంది. భారత్‌లో కూడా కరోనా కేసుల పెరుగుదల ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. దేశవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులపై కేంద్ర ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. కాగా.. గడిచిన 24 గంటల్లో 51 కరోనా మరణాలు సంభవించాయి. దీంతో ఇప్పటి వరకు కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 324కు చేరింది. తాజాగా మరో 905 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో.. దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 9,352కు చేరుకున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. వీరిలో 979 మంది కరోనా మహమ్మారి నుంచి కోలుకొని డిశ్చార్జి అయినట్లు తెలిపింది. ఆరోగ్యశాఖ హెల్త్ సెక్రటరీ లవ్ అగర్వాల్ మాట్లాడుతూ.. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 2 లక్షల 6 వేల మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. టెస్టింగ్ కిట్లు కూడా మరో 6 వారాలకు సరిపోయేలా అందుబాటులో ఉన్నట్లు అగర్వాల్ వెల్లడించారు. చదవండి: ఎల్లో మీడియాకు ఇది వినిపిస్తోందా? మహారాష్ట్రలో మంత్రిని కూడా వదల్లేదు.. -
భారత్‌లో 9,152 కేసులు..
-
ఒక్క రోజులో.. 918 కేసులు.. 31 మరణాలు
న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా కరాళ నృత్యం కొనసాగుతూనే ఉంది. శనివారం నుంచి ఆదివారం వరకు.. 24 గంటల్లో దేశంలో కొత్తగా 918 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. అలాగే 31 మంది కరోనా కాటుతో మృతి చెందారని వెల్లడించింది. దీంతో దేశవ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసులు 8,447కు, మొత్తం మరణాలు 273కు చేరాయని కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ ఆదివారం మీడియాతో చెప్పారు. యాక్టివ్ కరోనా కేసులు 7,367 కాగా, 715 మంది బాధితులు చికిత్సతో పూర్తిగా కోలుకుని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారని తెలిపారు. గత 24 గంటల్లో 74 మంది కోలుకున్నారని వివరించారు. కేసులు, మరణాల్లో మహారాష్ట్రదే అగ్రస్థానం కరోనా సంబంధిత మరణాల్లో మహారాష్ట్ర అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఈ రాష్ట్రంలో ఇప్పటికే 127 మంది బలయ్యారు. మధ్యప్రదేశ్‌లో 36 మంది, గుజరాత్లో 22 మంది, ఢిల్లీలో 19, పంజాబ్‌లో 11 మంది, తమిళనాడులో 10 మంది మరణించారు. అత్యధికంగా మహారాష్ట్రలో 1,761 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలో 1,069, తమిళనాడులో 969, రాజస్తాన్‌లో 700, మధ్యప్రదేశ్‌లో 532, ఉత్తరప్రదేశ్‌లో 452, కేరళలో 364, గుజరాత్లో 432, కర్ణాటకలో 214, జమ్మూకశ్మీర్‌లో 207, పంజాబ్‌లో 151, పశ్చిమబెంగాల్లో 124 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అభివృద్ధి దశలో 40కిపైగా వ్యాక్సిన్లు కరోనాను అంతం చేసేందుకు అవసరమైన వ్యాక్సిన్ తయారీ పరిశోధనలు కొనసాగుతున్నాయని లవ్ అగర్వాల్ చెప్పారు. ప్రస్తుతం 40కిపైగా వ్యాక్సిన్లు అభివృద్ధి దశలో ఉన్నాయన్నారు. కరోనా బాధితులకు వైద్య సేవలు అందించడానికి 20 వేల రైల్వే కోచ్‌లను ఐసోలేషన్ వార్డులుగా మార్చనున్నట్లు ఉద్ఘాటించారు. తొలి దశలో ఇప్పటికే 5 వేల కోచ్‌లను ఐసోలేషన్ వార్డులుగా మార్చినట్లు తెలిపారు. రోజుకు సగటున 584 పాజిటివ్ కేసులు దేశంలో ఇప్పటిదాకా 1,86,906 కరోనా నమూనాలను పరీక్షించినట్లు భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్) తెలియజేసింది. వీటిలో 7,953 నమూనాలు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు వెల్లడించింది. ఐదు రోజులుగా రోజుకు సగటున 15,747 నమూనాలను పరీక్షిస్తున్నామని, అందులో సగటున 584 నమూనాలు కరోనా పాజిటివ్‌గా తేలుతున్నాయని స్పష్టం చేసింది. ఆ డాక్టర్ల సేవలను వాడుకోండి కరోనా వైరస్‌పై పోరాటంలో చెవి, ముక్కు, గొంతు(ఈఎన్టీ) డాక్టర్లు, రెసిడెంట్ డాక్టర్ల సేవలను సైతం ఉపయోగించుకోవాలని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచించింది. కరోనా నిర్ధారణ పరీక్షల కోసం ప్రజల నుంచి నమూనాలను సేకరించడానికి వీరిని వాడుకోవాలంది. హాట్స్పాట్లలో ఇళ్ల వద్దకే సరుకులు కోవిడ్–19 హాట్స్పాట్లుగా గుర్తించిన ప్రాంతాల్లో నివసించే ప్రజలకు ఇళ్ల వద్దకే నిత్యావసరాలను సరఫరా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని కేంద్రం తెలిపింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల మధ్య, స్థానికంగానూ అన్ని రకాలైన సరుకు రవాణా వాహనాలను ఎటువంటి ఆటంకం లేకుండా అనుమతించాలని రాష్ట్రాలను తమ శాఖ కోరినట్లు హోం శాఖ జాయింట్ సెక్రటరీ పుణ్యసలిల శ్రీవాస్తవ ఆదివారం మీడియాకు తెలిపారు. ‘హాట్స్పాట్లుగా గుర్తించిన ప్రాంతాల్లోని ప్రజలు ఇల్లు వదిలి బయటకు రావాల్సిన అవసరం లేకుండా అత్యవసర వస్తువులను వారి ఇళ్ల వద్దకే అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నాలు ప్రారంభించాయి. ఇందుకు వలంటీర్లు, స్వచ్ఛంద సంస్థల సహకారం తీసుకుంటున్నాయి’ అని వివరించారు. సైబర్ నేరాలపై తమ శాఖ అందుబాటు లోకి తెచ్చిన ‘సైబర్‌దోస్ట్’ అనే ట్విట్టర్ హ్యాండిల్‌కు ఫిర్యాదు చేయాలన్నారు. కీలక రంగాలకు కొన్ని మినహాయింపులు! కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడమే లక్ష్యంగా కొనసాగుతున్న దేశవ్యాప్త లాక్‌డౌన్‌ను మరో రెండు వారాలైనా పొడిగించాలని పలు రాష్ట్ర ప్రభుత్వాలు కోరుతున్నాయి. కరోనా తీవ్రత అంతగా లేని ప్రాంతాల్లో వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో కార్యకలాపాలు పున:ప్రారంభించేందుకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు. దీంతో టెక్స్టైల్స్, కెమికల్స్, ఎలక్ట్రానిక్స్, స్టీల్, ఫార్మాస్యూటికల్ రంగాల్లో ఉత్పత్తికి షరతులతో అనుమతివ్వాలని కేంద్రం యోచిస్తున్నట్లు సమాచారం. కీలక రంగాలకు ఆంక్షల నుంచి కొన్ని మినహాయింపు ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం. జాతీయ రహదారుల నిర్మాణ పనులను పున:ప్రారంభించాలని యోచిస్తున్నా మని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. పట్టణాలు, నగరాల్లో చిక్కుకుపోయిన వలస కూలీలను ఈ పనుల్లో ఉపయోగించుకుంటామన్నారు. -
భారత్‌లో 273కు పెరిగిన కరోనా మృతుల సంఖ్య
సాక్షి, న్యూఢిల్లీ: ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లో కరోనా వైరస్ అదుపులో ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. అయితే పెరుగుతున్న కరోనా కేసులకు అనుగుణంగానే కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఆయన ఆదివారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. గత 24 గంటల్లో 909 కేసులు నమోదు కాగా, 34మంది మృతి చెందినట్లు తెలిపారు. (కరోనా: భారత్ నుంచి 444 మంది స్వదేశాలకు) దేశవ్యాప్తంగా 8,356 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఇప్పటివరకూ 273 మరణాలు సంభవించినట్లు చెప్పారు. 1.80 లక్షల శాంపిల్స్‌ను టెస్ట్ చేశామని, ప్రతి రోజు 15వేల మందికి రక్త నమునాల పరీక్షలు జరుపుతున్నట్లు లవ్ అగర్వాల్ వెల్లడించారు. అలాగే151 ప్రభుత్వ ల్యాబ్‌ల్లో కరోనా పరీక్షలు చేస్తున్నట్లు తెలిపారు. ఇక ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లో కరోనా నియంత్రణలో ఉందని, కరోనా వచ్చిన వారిని, కలిసిన వారిని గుర్తించే ప్రక్రియ కొనసాగుతోందని ఆయన పేర్కొన్నారు. అందరి సహకారంతో కరోనా మహమ్మారిని ఎదుర్కొంటామని ఆయన తెలిపారు. (కరోనా గండం గట్టెక్కుతోంది..) కరోనాను అంతం చేసేందుకు అవసరమైన వ్యాక్సిన్ తయారీ పరిశోధనలు కొనసాగుతున్నాయని లవ్ అగర్వాల్ చెప్పారు. ప్రస్తుతం 40కిపైగా వ్యాక్సిన్లు అభివృద్ధి దశలో ఉన్నాయన్నారు. కరోనా బాధితులకు వైద్య సేవలు అందించడానికి 20 వేల రైల్వే కోచ్‌లను ఐసోలేషన్ వార్డులుగా మార్చనున్నట్లు ఉద్ఘాటించారు. తొలి దశలో ఇప్పటికే 5 వేల కోచ్‌లను ఐసోలేషన్ వార్డులుగా మార్చినట్లు తెలిపారు. ఇక కరోనా సంబంధిత మరణాల్లో మహారాష్ట్ర అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఈ రాష్ట్రంలో ఇప్పటికే 127 మంది బలయ్యారు. మధ్యప్రదేశ్‌లో 36 మంది, గుజరాత్లో 22 మంది, ఢిల్లీలో 19, పంజాబ్‌లో 11 మంది, తమిళనాడులో 10 మంది మరణించారు. అత్యధికంగా మహారాష్ట్రలో 1,761 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలో 1,069, తమిళనాడులో 969, రాజస్థాన్‌లో 700, మధ్యప్రదేశ్‌లో 532, ఉత్తరప్రదేశ్‌లో 452, కేరళలో 364, గుజరాత్లో 432, కర్ణాటకలో 214, జమ్మూకశ్మీర్‌లో 207, పంజాబ్‌లో 151, పశ్చిమబెంగాల్లో 124 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న (శనివారం) అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన విషయం తెలిసిందే. లాక్‌డౌన్‌ను కనీసం 2 వారాలైనా కొనసాగించేందుకు దాదాపు అన్ని రాష్ట్రాలు ఏకాభిప్రాయం వ్యక్తం చేశాయి. దీంతో ఏప్రిల్ 14వ తేదీ తరువాత కూడా లాక్‌డౌన్‌ను కొనసాగించేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. కరోనా వైరస్ 210 దేశాలకు వ్యాపించగా 17.90 లక్షలకుపైగా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా 1.09 లక్షల మంది ఈ రక్కసి బారినపడి ప్రాణాలు కోల్పోయారు. అలాగే 4.09 లక్షల మంది కరోనా నుంచి కోలుకుంటున్నారు. అమెరికాలో 5.33 లక్షల కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, మృతుల సంఖ్య 20,580కి చేరింది. స్పెయిన్‌లో 1,66,019 పాజిటివ్ కేసులు, 16,972 మంది మృతి ఇటలీలో 1,52,271 పాజిటివ్ కేసులు, 19,468 మంది మృతి ఫ్రాన్స్‌లో 1,29,654 పాజిటివ్ కేసులు, 13,832 మంది మృతి జర్మనీలో 1,25,452 పాజిటివ్ కేసులు, 2,871 మంది మృతి చైనాలో 82,052 కరోనా కేసులు, 3,339 మంది మృతి యూకేలో 78,991 పాజిటివ్ కేసులు, 9,875 మంది మృతి ఇరాన్లో 70,029 పాజిటివ్ కేసులు, 4,357 మంది మృతి టర్కీలో 52,167 పాజిటివ్ కేసులు, 1,101 మంది మృతి బెల్జియంలో 29,647 పాజిటివ్ కేసులు, 3,600 మంది మృతి స్విట్జర్లాండ్‌లో 25,300 పాజిటివ్ కేసులు, 1,036 మంది మృతి నెదర్లాండ్స్‌లో 24,413 పాజిటివ్ కేసులు, 2,643 మంది మృతి -
24 గంటల్లో 1035 కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా ప్రకోపానికి జనం బలవుతూనే ఉన్నారు. గత 24 గంటల్లో ఏకంగా 1,035 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కాటుతో తాజాగా 40 మంది కన్నుమూశారు. దీంతో మృతుల సంఖ్య 242కు, పాజిటివ్ కేసుల సంఖ్య 7,529కు చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ శనివారం ప్రకటించింది. యాక్టివ్ కరోనా కేసులు 6,634 కాగా, 652 మంది బాధితులు చికిత్సతో పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్రాల వారీగా గణాంకాలను పరిశీలిస్తే..కరోనా దేశవ్యాప్తంగా 261 మంది మృతి చెందినట్లు. 8,016 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు స్పష్టమవుతోంది. నియంత్రణ చర్యలు లేకుంటే.. కరోనా కట్టడికి ప్రభుత్వం ముందుగానే చర్యలు ప్రారంభించిందని కేంద్ర ఆరోగ్య శాఖ సంయక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ మీడియాతో అన్నారు. లాక్డౌన్, ఇతర నియంత్రణ చర్యలు చేపట్టకపోతే కరోనా కేసుల సంఖ్య ఇప్పటికే 2.08 లక్షలకు, ఈనెల 15 నాటికి ఏకంగా 8.2 లక్షలకు చేరేదని అన్నారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల కేసుల సంఖ్య ఇప్పటిదాకా 7,447కే పరిమితమైందన్నారు. 586 ఆసుపత్రుల్లో వైద్య సేవలు దేశవ్యాప్తంగా 586 ఆసుపత్రుల్లో కరోనా వైరస్ బాధితులకు వైద్య సేవలు అందిస్తున్నట్లు లవ్ అగర్వాల్ వెల్లడించారు. ఈ హాస్పిటళ్లలో లక్షకుపైగా ఐసోలేషన్ పడకలు, 11,836 ఐసీయూ పడకలను కేటాయించినట్లు తెలిపారు. దేశంలో ప్రస్తుతం యాంటీ మలేరియా ఔషధం హైడ్రాక్సీ క్లోరోక్విన్ కొరత లేదని స్పష్టం చేశారు. కాగా, ఢిల్లీ స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్(డీఎస్‌సీఐ)లో సేవలను తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ ఆసుపత్రిలో ఒక డాక్టర్, 9 మంది పారామెడికల్ సిబ్బందితోపాటు 11 మందికి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. వారిని ప్రభుత్వ ఆసుపత్రులకు, ఇతర రోగులను సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో చేర్చారు. మొత్తం ఆసుపత్రిని శానిటైజ్ చేశారు. దేశంలో 80 శాతం కరోనా పాజిటివ్ కేసులు 17 రాష్ట్రాల్లోని 71 జిల్లాల్లోనే నమోదయ్యాయని ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్థన్ తెలిపారు. కరోనా వైరస్ కట్టడిలో కువైట్‌కు భారత్ అన్ని విధాలా సహకారం అందిస్తోందని విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ చెప్పారు. లాక్డౌన్ కారణంగా ఇళ్లకే పరిమితమైన కేంద్రమంత్రులు సోమవారం నుంచి విధుల్లో చేరనున్నారు. కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు వారు విధులు పున:ప్రారంభించనున్నారు. వైద్య బృందంపై దాడి కరోనా వైరస్ లక్షణాలున్న వ్యక్తిని ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నిస్తుండగా కొందరు దుండగులు వైద్య సిబ్బందిపై రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మీరట్‌లో జరిగింది. ఈ వ్యవహారంతో సంబంధమున్న ఓ ఇమామ్‌తో సహా నలుగురిని అరెస్టు చేసి, జాతీయ భద్రతా చట్టం కింద కేసు నమోదు చేసినట్లు అధికారులు చెప్పారు. తబ్లిగీల ఆచూకీ చెప్తే 5,000 రివార్డు తబ్లిగీ జమాత్ సభ్యుల ఆచూకీ కనిపెట్టడంలో సహకరించిన వారికి రివార్డు ఇస్తామని ఉత్తరప్రదేశ్ పోలీసు శాఖ ప్రకటించింది. గత నెలలో ఢిల్లీ నిజాముద్దీన్‌లో జరిగిన మత సమ్మేళనంలో పాల్గొని, తిరిగి వచ్చిన వారిలో కొందరు ఇప్పటికీ ఆజ్ఞాతంలోనే ఉన్నారని పోలీసులు చెబుతున్నారు. కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకునేందుకు ముందుకు రావడం లేదని అంటున్నారు. వీరి ఆచూకీ చెప్పినవారికి రూ.5,000 రివార్డు అందజేస్తామని తాజాగా ప్రకటించారు. మహారాష్ట్ర, కర్ణాటకల్లోనూ 30దాకా లాక్‌డౌన్‌ను 30వ తేదీ వరకు కొనసాగించాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రధాని మోదీతో వీడియో కాన్ఫెరెన్స్ అనంతరం ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఏప్రిల్ 14 తరువాత కొన్ని ప్రాంతాల్లో ఆంక్షల సడలింపు ఉంటుందని, వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మరింత కఠిన ఆంక్షలు ఉంటాయన్నారు. కర్ణాటకలో కూడా లాక్డౌన్ మరో రెండు వారాలు కొనసాగుతుందని, సంబంధిత విధివిధానాలను కేంద్రం ప్రకటిస్తుందని సీఎం యడ్యూరప్ప శనివారం చెప్పారు. -
ఇవాళ ఒక్కరోజే 40మంది మృత్యవాత..
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో లాక్డౌన్ లేకుంటే కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉండేదని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి లవ్ అగర్వాల్ పేర్కొన్నారు. ఆయన శనివారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కరోనా ధాటికి ఇప్పటి వరకు దేశంలో 239 మంది ప్రాణాలు కోల్పోయారన్నారు. భారత్‌లో మొత్తం 7,447 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయన్నారు. గత 24 గంటల్లో 1,035 కొత్త కేసులు నమోదు కాగా, ఇవాళ ఒక్కరోజే 40మంది మృత్యువాత పడ్డారు. ఇక కరోనాతో కోలుకుని ఇప్పటివరకూ 642మంది డిశ్చార్జ్ అయినట్లు లవ్ అగర్వాల్ తెలిపారు. ఇక దేశవ్యాప్తంగా 586 కరోనా ఆస్పత్రులు, లక్షకు పైగా ఐసోలేషన్ బెడ్స్ సిద్ధంగా ఉన్నాయన్నారు. లాక్‌డౌన్‌తో పాటు ఎలాంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకుంటే రెండు లక్షలకు పైగా కేసులు నమోదు అయ్యేవని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా మహారాష్ట్రలో కరోనా బారిన పడి అత్యధికంగా 110మంది మృతి చెందారు. (ప్రధానితో కాన్ఫరెన్స్: అందరి నోట అదే మాట!) మరోవైపు ముఖ్యమంత్రులుతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ వీడియో కాన్పరెన్స్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పలు రాష్ట్రాలు లాక్‌డౌన్‌ను మరో రెండు వారాలు పొడిగించాలని ప్రధానిని కోరాయి. దీంతో రాష్ట్రాల విజ్ఞాపనలతో కేంద్ర ప్రభుత్వం కూడా లాక్‌డౌన్‌ను పొడిగించాలని యోచిస్తోంది. కాగా ఈ నెల 14తో లాక్డౌన్ ముగియనుంది. రాష్ట్రాల అభ్యర్థలతో ఈ నెల 30 వరకూ లాక్డౌన్ పొడిగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే పంజాబ్, ఒడిశా రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ను ఏప్రిల్ 30 వరకూ పొడిగించింది. (కరోనా మృతదేహాలు: మహారాష్ట్ర కీలక నిర్ణయం!) -
దేశవ్యాప్తంగా 166కు చేరిన కరోనా మరణాలు
-
5,274 కేసులు.. 149 మరణాలు
న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా వైరస్ విశ్వరూపం ప్రదర్శిస్తోంది. ఈ మహమ్మారి బారినపడి కేవలం కేవలం ఒక్కరోజులో 32 మంది కన్నుమూశారు. మంగళవారం ఉదయం 9 గంటల నుంచి బుధవారం ఉదయం 9 గంటల వరకు కొత్తగా 485 మందికి కరోనా వైరస్ సోకినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ బుధవారం ప్రకటించింది. దేశంలో కరోనా వల్ల ఇప్పటిదాకా 149 మరణాలు సంభవించాయని, మొత్తం పాజిటివ్ కేసులు 5,274కు చేరాయని కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ మీడియా సమావేశంలో వెల్లడించారు. కేసుల తీవ్రత నానాటికీ పెరుగుతుండడంతో కరోనాను ఎదుర్కొనే విషయంలో కేంద్ర ప్రభుత్వం సైతం అదేస్థాయిలో సన్నద్ధమవుతున్నట్లు తెలిపారు. ఆసుపత్రుల్లో వైద్యులు, నర్సులకు కరోనా సోకకుండా పటిష్టమైన చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. కరోనా బాధితులను కలిసిన వారందరినీ గుర్తించాలని, తాత్కాలిక ఆసుపత్రుల నిర్మాణంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలను ఆదేశించిందన్నారు. దేశంలో హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఔషధ నిల్వలు సరిపడా ఉన్నాయని స్పష్టం చేశారు. కరోనాపై విజయం సాధించాలంటే ప్రజల సహకారం తప్పనిసరి అని చెప్పారు. ఇప్పటిదాకా 1,21,271 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్)లో ఎడిడెమోలజీ విభాగం అధిపతి రామన్ ఆర్ గంగాఖేడ్కర్ చెప్పారు. ఇందులో 13,345 పరీక్షలు మంగళవారం నిర్వహించామన్నారు. ప్రస్తుతం ఐసీఎంఆర్ ఆధ్వర్యంలో 139 ల్యాబ్‌లు పని చేస్తున్నాయని అన్నారు. అలాగే 65 ప్రైవేట్ ల్యాబ్‌లకు అనుమతి ఇచ్చామని వెల్లడించారు. కరోనా కట్టడికి కొత్త ఉద్యోగులు దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. కరోనాపై పోరాటంలో భాగంగా వైద్యులు, నర్సులు, పారిశుధ్య సిబ్బంది, స్వచ్ఛంద సేవకులు, పోలీసులు నిర్విరామంగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారికి కొంత విశ్రాంతి కల్పిస్తూ వారి స్థానంలో భారీ స్థాయిలో కొత్త ఉద్యోగులను నియమించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర సిబ్బంది శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా బాధితులకు వైద్య సేవలందించేందుకు, వైరస్ నియంత్రణ చర్యలు అమలు చేసేందుకు ఈ కొత్త ఉద్యోగులను నియమిస్తారు. ఈ ఉద్యోగులకు అవసరమైన శిక్షణను ఆన్లైన్ ద్వారా ఇస్తారు. ఇందుకోసం ఇంటిగ్రేటెడ్ గవర్నమెంట్ ఆన్లైన్ ట్రైనింగ్(ఐజీవోటీ) అనే వేదికను సిద్ధం చేశారు. డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, పారిశుధ్య సిబ్బంది, సాంకేతిక నిపుణులు, ఏఎన్ఎంలు, రాష్ట్ర ప్రభుత్వాల అధికారులు, పౌర రక్షణ సిబ్బందికి ఈ ఆన్లైన్ శిక్షణ ఉంటుంది. -
కరోనా పాజిటివ్‌గా తేలినవారిలో...
-
కరోనా.. 24 గంటల్లో 32 మంది మృతి
సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 773 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టుగా కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి వెల్లడించారు. దీంతో ఇప్పటివరకు మొత్తం 5,194 కరోనా కేసులు నమోదయ్యాయని తెలిపారు. కరోనా హెల్త్ బులిటెన్‌కు సంబంధించి బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గడిచిన 24 గంటల్లో 32 మంది కరోనా బాధితులు మృతిచెందారని చెప్పారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య 149కి చేరిందన్నారు. అయితే కరోనా పాజిటివ్‌గా తేలినవారిలో 80 శాతం మంది ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు. ఇప్పటివరకు 402 మంది కరోనా బారి నుంచి కోలుకున్నారని తెలిపారు. -
ఒక్కొక్కరి ద్వారా 406 మందికి కరోనా
సాక్షి, న్యూఢిల్లీ: భౌతిక దూరం పాటించకపోతే ఒక్కో కోవిడ్ రోగి నెల రోజుల్లో కనీసం 406 మందికి వ్యాధిని అంటిస్తాడని తాజా అధ్యయనం ఒకటి చెబుతున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ తెలిపారు. కోవిడ్–19 నియంత్రణ చర్యలపై మంగళవారం నాటి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఒక రోగి నుంచి ఎంతమందికి రోగం వ్యాప్తి చెందుతుందనేదాన్ని ఆర్–నాట్‌గా వ్యవహరిస్తారని, కోవిడ్–19 విషయంలో ఆర్–నాట్ 1.5 నుంచి 4.0 మధ్య ఉన్నట్లు ఒక అధ్యయనంలో తేల్చారని వివరించారు. ఆర్–నాట్ 2.5 మాత్రమే ఉందని అనుకున్నా భౌతిక దూరం పాటించకపోతే ఒక్కో రోగి నెల రోజుల్లో 406 మందికి వ్యాధిని వ్యాపింపజేస్తాడని ఆయన లెక్కకట్టారు. భౌతిక దూరాన్ని కచ్చితంగా పాటించి రోగి కదలికలను 75 శాతం వరకూ నియంత్రించగలిగితే మాత్రం ఒక్కో రోగి నుంచి మరో 2.5 మందికి మాత్రమే వ్యాప్తి చెందుతుందని అన్నారు. ఈ కారణంగానే దేశంలో భౌతిక దూరం పాటించడం అత్యవసరమని ఆయన తెలిపారు. దేశంలో మొత్తం 4,789 కేసులు... దేశవ్యాప్తంగా మంగళవారం నాటికి కోవిడ్ బారిన పడ్డ వారి సంఖ్య 4,789కు చేరుకుందని, మొత్తం 124 మంది ప్రాణాలు కోల్పోయారని ఆరోగ్యశాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ తెలిపారు. సోమవారం రాత్రి నుంచి 24 గంటల్లో దేశవ్యాప్తంగా 508 కొత్త కేసులు బయటపడ్డాయని చెప్పారు. మరణాల సంఖ్య పది అని అన్నారు. మరో 352 మంది చికిత్స తరువాత ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కావడం లేదా వలస వెళ్లడం జరిగిందని ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 4,312గా ఉందని చెప్పింది. మొత్తం కేసుల్లో 66 మంది విదేశీయులు.గా తెలిపింది. గత 24 గంటల్లో మరణించిన ఎనిమిది మందిలో నలుగురు మధ్యప్రదేశ్‌కు చెందిన వారు కాగా, ముగ్గురు మహారాష్ట్ర వారని, గుజరాత్, ఒడిశా, పంజాబ్‌ల నుంచి ఒకొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారని వివరించారు. కోవిడ్–19 ప్రభావం ఎక్కువగా ఉన్న క్లస్టర్లలో వ్యాధి నియంత్రణకు చేపడుతున్న చర్యలు అనుకున్న ఫలితాలిస్తున్నాయని వివరించారు. పేషెంట్ల స్థితిని బట్టి చికిత్స అందించేందుకు మూడు రకాలుగా చికిత్స కేంద్రాలను వర్గీకరించామని లవ్ అగర్వాల్ తెలిపారు. వ్యాధి లక్షణాల తీవ్రత ఒక మోస్తరుగా మాత్రమే ఉన్న వారిని కోవిడ్ కేర్ కేంద్రాలకు తరలిస్తామని, హాస్టళ్లు, క్రీడా మైదానాలు, పాఠశాలల వంటి ప్రభుత్వ, ప్రైవేట్ భవనాలను కేర్ సెంటర్లుగా ఉపయోగించుకుంటామని, ఇప్పటివరకూ క్వారంటైన్ కేంద్రాలుగా పనిచేస్తున్న వాటిని కూడా కేర్ సెంటర్లుగా ఉపయోగించుకుంటామని వివరించారు. వ్యాధి లక్షణాలు తీవ్రత ఎక్కువగా ఉంటే ఆరోగ్య కేంద్రాలకు రోగిని తరలిస్తామని, తీవ్రస్థాయిలో ఉండే కేసులను అత్యవసర సేవలందించే ఆసుపత్రుల్లో ఉంచుతామని ఆయన వివరించారు. -
రైల్వేకోచ్‌ల్లో ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు
-
కరోనా మృత్యుఘోష
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కాటేస్తోంది. దేశంలో ఇప్పటిదాకా 111 మందిని బలి తీసుకుంది. గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో 704 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, 28 మంది మృతి చెందారని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఏకంగా 4,281కి చేరింది. బాధితుల్లో ఇప్పటిదాకా 318 మంది స్వస్థత పొందారు. కరోనా వల్ల గత 24 గంటల్లో మహారాష్ట్రలో 21 మంది, ఆంధ్రప్రదేశ్‌లో ఇద్దరు, తమిళనాడులో ఇద్దరు, పంజాబ్‌లో ఒకరు, గుజరాత్లో ఒకరు, ఉత్తరప్రదేశ్‌లో ఒకరు మృత్యువాత పడ్డారు. కరోనా మరణాల్లో మహారాష్ట్ర మొదటి స్థానంలో నిలుస్తోంది. ఈ రాష్ట్రంలో ఇప్పటికే 45 మంది బలయ్యారు. గుజరాత్లో 12 మంది, మధ్యప్రదేశ్‌లో 9 మంది, తెలంగాణలో ఏడుగురు, ఢిల్లీలో ఏడుగురు, పంజాబ్‌లో ఆరుగురు, తమిళనాడులో ఐదుగురు, కర్ణాటకలో నలుగురు మరణించారు. ఇతర రాష్ట్రాల్లోన మరణాలు చోటుచేసుకున్నాయి. రాష్ట్రాల వారీగా గణాంకాలను బట్టి చూస్తే కరోనాతో దేశవ్యాప్తంగా 137 మంది కన్ను మూసినట్లు, 4,678 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. ఇప్పటిదాకా వెలుగుచూసిన 4,281 కరోనా పాజిటివ్ కేసుల్లో 1,445 కేసులు తబ్లిగీ జమాత్‌కు సంబంధం ఉన్నవేనని గుర్తించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. యువతలోనూ ముప్పు అధికమే.. మొత్తం కరోనా పాజిటివ్ కేసుల్లో పురుషుల వాటా 76 శాతం, మహిళల వాటా 24 శాతమని కేంద్ర ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ సోమవారం తెలిపారు. మొత్తం కేసుల్లో 40 ఏళ్లలోపు వారి వాటా 47 శాతం, 40 నుంచి 60 ఏళ్లలోపు వారి వాటా 34 శాతం, 60 ఏళ్లకుపైగా వయసున్న వారు 19 శాతమని పేర్కొన్నారు. మృతుల్లో పురుషులు 73 శాతం, మహిళలు 27 శాతమని చెప్పారు. మరణాల్లో 60 ఏళ్లలోపు వారు 63 శాతం, 40 నుంచి 60 ఏళ్లలోపు వారు 30 శాతం, 40 ఏళ్లలోపు వారు 7 శాతమని వెల్లడించారు. కరోనా 2–3 దశల మధ్య భారత్ కొన్ని ప్రాంతాల్లో కరోనా పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతున్నాయని, దీన్నిబట్టి వైరస్ వ్యాప్తి విషయంలో దేశం రెండు, మూడు దశల మధ్య ఉన్నట్లు స్పష్టమవుతోందని ఆరోగ్య శాఖ వెల్లడించింది.. దేశంలో కొన్ని ప్రాంతాల్లో కరోనా వైరస్ సామూహికంగా సంక్రమిస్తున్నట్లు తెలుస్తోందని ‘ఎయిమ్స్’ డైరెక్టర్ రణదీప్ గులేరియా చెప్పారు. -
కరోనా బాధితుల్లో 76 శాతం పురుషులే
సాక్షి, న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా సోమవారం సాయంత్రం నాటికి కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 4,067కి చేరింది. గడిచిన 24 గంటల్లో 693 పాజిటివ్ కేసులు నమోదు అవ్వడంతో పాటు 30 మంది వైరస్ బాధితులు మృతి చెందారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ ఓ ప్రకటక విడుదల చేశారు. ఇక ఢిల్లీలోని మర్కజ్‌కు వెళ్లి వచ్చిన వారిలో 1445 మందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు వెల్లడించారు. ఇప్పటి వరకు దేశంలో నమోదైన కేసుల్లో 76శాతం పురుషులే ఉన్నారని లవ్ అగర్వాల్ పేర్కొన్నారు. మరోవైపు దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకు జాతీయ ఆరోగ్య మిషన్ కింద ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రూ.1100 కోట్లు విడుదల చేసినట్లు ప్రకటించారు. మరో మూడువేల కోట్లు రాష్ట్రాలకు కేటాయిస్తామని తెలిపారు. (మూడోదశకు కరోనా వైరస్ : ఎయిమ్స్ ) -
కరోనా కేసుల్లో 76శాతం మంది పురుషులు
-
ఒక్కరోజులో... 505 కేసులు, 7 మరణాలు
న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా మహమ్మారి బాధితుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా 505 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, ఏడుగురు మరణించారని కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం ప్రకటించింది. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,577, మొత్తం మరణాల సంఖ్య 83కి చేరిందని వెల్లడించింది. కానీ, రాష్ట్రాల వారీగా గణాంకాలు చూస్తే కరోనా వల్ల దేశవ్యాప్తంగా 110 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. పాజిటివ్ కేసుల సంఖ్య 3,959కు చేరినట్లు స్పష్టమవుతోంది. వీరిలో 306 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొంది, ఆరోగ్యవంతులుగా మారి, ఇళ్లకు చేరారు. దేశవ్యాప్తంగా కరోనా కేసులు, మరణాల గణాంకాలను మదింపు చేయడంలో జరుగుతున్న జాప్యం వల్లే లెక్కల్లో వ్యత్యాసం కనిపిస్తున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. 4.1 రోజుల్లో కేసులు రెట్టింపు దేశంలో కరోనా పాజిటివ్ కేసులు రెట్టింపు కావడానికి ప్రస్తుతం 4.1 రోజులు పడుతోంది. ఢిల్లీలో జరిగిన తబ్లిగీ జమాత్‌కు సంబంధించిన కేసులు గనుక లేకపోయినట్లయితే, ఇందుకు 7.4 రోజులు పట్టేదని కేంద్ర ఆరోగ్యశాఖ జాయింట్ సెక్రెటరీ లవ్ అగర్వాల్ ఆదివారం తెలిపారు. దేశంలో 274 జిల్లాల్లో కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూశాయని పేర్కొన్నారు. కరోనా విషయంలో తాజా పరిస్థితిపై కేంద్ర కేబినెట్ సెక్రెటరీ రాజీవ్ గౌబా ఆదివారం అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, ఆరోగ్య శాఖ కార్యదర్శులు, జిల్లా ఆరోగ్య శాఖ అధికారులు, ఎస్పీలతో చర్చించారని వివరించారు. కరోనా నేపథ్యంలో ఆధునిక రక్షణ పరికరాలను రాష్ట్రాలకు పంపిణీ చేస్తున్నామని చెప్పారు. అగ్రస్థానంలో మహారాష్ట్ర మృతుల విషయంలో మహారాష్ట్ర అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఈ రాష్ట్రంలో ఇప్పటిదాకా 24 మంది ప్రాణాలు కోల్పోయారు. పాజిటివ్ కేసుల్లో ఢిల్లీ మొదటిస్థానం. ఇక్కడ 503 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా వైరస్ గాలి ద్వారా వ్యాప్తి చెందుతుందనడానికి ఎలాంటి ఆధారాలు లేవని భారత వైద్య పరిశోధనా మండలి స్పష్టం చేసింది. ఢిల్లీలో 8 మంది మలేషియన్ల పట్టివేత ఢిల్లీలోని నిజాముద్దీన్‌లో తబ్లిగీ జమాత్‌కు హాజరై, సొంత దేశం మలేషియాకు తిరిగి వెళ్లేందుకు ప్రయత్నించిన 8 మంది మలేషియన్లను ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. ఇండియాలో చిక్కుకుపోయిన తమ దేశ పౌరులను సొంత దేశానికి తీసుకెళ్లడానికి మలేషియన్ హైకమిషన్ ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేసింది. ఈ విమానం ఆదివారం ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరింది. అయితే, తబ్లిగీ జమాత్‌కు హాజరైనవారు కూడా ఈ విమానంలో మలేషియాకు తిరిగి వెళ్లేందుకు సిద్ధమైనట్లు సమాచారం అందడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మొత్తం 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరంతా ఇప్పటిదాకా ఢిల్లీలోనే తలదాచుకున్నారు. వ్యక్తిగత రక్షణ పరికరాలు అందరికీ అక్కర్లేదు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ కరోనా అనుమానిత లక్షణాలు ఉన్నవారు, ఆసుపత్రుల్లో రోగులకు వైద్య సేవలందించేవారు మినహా ఇతరులు పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్(పీపీఈ) ఉపయోగించా ల్సిన అవసరం లేదని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ చెప్పారు. ఆయన ఆదివారం హరియాణా రాష్ట్రం ఝాజర్‌లోని ఎయిమ్స్‌లోని కరోనా చికిత్సా కేంద్రాన్ని సందర్శించారు. -
ఆందోళన వద్దు
న్యూఢిల్లీ: దేశంలో వెలుగుచూసిన కోవిడ్–19 నిర్థారిత కేసుల్లో 30 శాతం వరకు ఒక ప్రాంతానికి సంబంధించినవే కాబట్టి, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. తబ్లిగీలో పాల్గొని వ్యాధి బారిన పడిన వారిని, వారి ద్వారా సోకిన 22 వేల మందిని క్వారంటైన్లో ఉంచగా మిగతా వారిని కూడా గుర్తించేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నట్లు తెలిపింది. కేంద్ర ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ శనివారం మీడియాతో మాట్లాడుతూ.. తబ్లిగీ జమాత్ కార్యక్రమంలో పాల్గొన్న వారి కారణంగా 17 రాష్ట్రాల్లో 1,023 కోవిడ్ పాజిటివ్ కేసులు వెలుగుచూశాయన్నారు. మొత్తం నిర్ధారిత కేసుల్లో ఇవి 30 శాతం వరకు ఉంటాయని పేర్కొన్నారు. తబ్లిగీలో పాల్గొని వ్యాధి బారిన పడిన వారిని, వారి ద్వారా సోకిన ఇతరులను గుర్తించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశామన్నారు. తబ్లిగీ జమాత్ సభ్యులతోపాటు వారితో సంబంధం ఉన్న తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాలకు చెందిన 22 వేల మందిని ఇప్పటివరకు క్వారంటైన్‌కు తరలించామన్నారు. ‘గత 24 గంటల్లో 601 కొత్త కేసులతోపాటు 12 మరణాలు చోటుచేసుకున్నాయి. దీంతో బాధితుల సంఖ్య 3,072కు, మృతుల సంఖ్య 75కు చేరుకుంది. కేరళ, ఢిల్లీ, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో 58 మందిæ బాధితుల పరిస్థితి విషమంగా ఉండగా, ఈ వ్యాధి నుంచి 183 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు’అని తెలిపారు. దేశంలోని 211 జిల్లాల్లో కరోనా కేసులు నమోదయ్యాయనీ, దీనిని కట్టడి చేయకుంటే మరింతగా విస్తరించే ప్రమాదముందన్నారు. బాధితుల్లో అత్యధికంగా 42 శాతం 21–40 ఏళ్లలోపు వారు కాగా, 33 శాతం 41–60, 17 శాతం 60 ఏళ్లకుపైబడినవారు, 9శాతం 0–20 ఏళ్లలోపు వారేనని ఆయన వివరించారు. ‘రోజుకు 10వేల చొప్పున నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నాం. ప్రతి 25 పరీక్షల్లో ఒక పాజిటివ్ కేసు బయట పడుతుండగా ప్రతి 30 పాజిటివ్ కేసుల్లో ఒక్కరు కంటే తక్కువగా మాత్రమే చనిపోతున్నారు’అని వెల్లడించారు. అదేవిధంగా, ఈ వ్యాధి బాధితుల్లో వైరస్‌పై యుద్ధంలో గెలుపు కోసం లాక్డౌన్ నిబంధనలను, ముఖ్యంగా వ్యక్తిగత దూరాన్ని పాటించాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఇంట్లోనే ఫేస్ మాస్కులు తయారు చేసుకుని ధరించాలంటూ ఇచ్చిన సలహా.. ప్రజలందరూ వ్యక్తిగత పరిశుభ్రతా చర్యలను పాటించేందుకేనని వివరించారు. పీటీఐ అంచనా ప్రకారం.. దేశవ్యాప్తంగా కోవిడ్ కారణంగా 94 మంది చనిపోగా శనివారం సాయంత్రానికి నిర్ధారిత కేసుల సంఖ్య 3,473గా ఉంది. ఇందులో 275 మంది కోలుకుని, ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రాల వివరాలతో పోలిస్తే కేంద్రం వెలువరించిన గణాంకాలు వెనకబడి ఉండటానికి.. విధానపరమైన ప్రక్రియలో ఆలస్యమే కారణమని భావిస్తున్నారు. ఇలా ఉండగా, దేశవ్యాప్త లాక్‌డౌన్‌కు సంబంధించిన అన్ని అంశాలపై హోం శాఖ ఆధ్వర్యంలోని కంట్రోల్ రూం ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోందని హోం శాఖ జాయింట్ సెక్రటరీ పుణ్యసలిల శ్రీవాస్తవ మీడియాకు తెలిపారు. ఇందుకోసం నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్(ఎన్డీఆర్ఎఫ్), కేంద్ర సాయుధ బలగాల(సీఏపీఎఫ్)కు చెందిన 200 మంది సిబ్బంది పని చేస్తున్నారన్నారు. కోవిడ్‌తో మహారాష్ట్రలో 19, గుజరాత్ 10, మధ్యప్రదేశ్, ఢిల్లీలో ఆరుగురు చొప్పున, పంజాబ్‌లో ఐదుగురు మరణించారన్నారు. నిర్థారిత కేసులు మహారాష్ట్రలో 490,∙ఢిల్లీ 445, తమిళనాడు 411, కేరళ 295, రాజస్తాన్ 220, ఉత్తరప్రదేశ్ 174 ఉన్నాయి. -
కేసులు 3,041.. మరణాలు 90
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య శుక్రవారానికి 3041కి, మరణాల సంఖ్య 90కి చేరింది. రాష్ట్రాలవారీగా ప్రకటించిన గణాంకాల మేరకు శుక్రవారం ఒక్కరోజే 534 కొత్త కేసులు, 14 మరణాలు నమోదయ్యాయి. ఇప్పటివరకు మహారాష్ట్రలో అత్యధిక సంఖ్యలో మరణాలు చోటు చేసుకున్నాయి. ఇక్కడ కోవిడ్–19తో 26 మంది మరణించగా, గుజరాత్(8), మధ్యప్రదేశ్(6), పంజాబ్(5), ఢిల్లీ(6), కర్నాటక(3), పశ్చిమబెంగాల్(3), జమ్మూకశ్మీర్(2), ఉత్తరప్రదేశ్(2), కేరళ(2) తదితర రాష్ట్రాల్లోనూ మరణాలు చోటు చేసుకున్నాయి. అయితే, కేంద్రం పేర్కొంటున్న గణాంకాలకు, రాష్ట్రాలు ప్రకటిస్తున్న వివరాలకు మధ్య అంతరం ఉంటోంది. మహారాష్ట్రలో కేసుల సంఖ్య కూడా భారీగానే ఉంది. అక్కడ మొత్తం 490 కేసులు నమోదయ్యాయి. ఆ తరువాత స్థానంలో తమిళనాడు(411) ఉంది. ఢిల్లీలో శుక్రవారానికి కేసుల సంఖ్య 386కి చేరింది. వీటిలో శుక్రవారం ఒక్కరోజులోనే 93 కొత్త కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా 211 మంది కరోనా నుంచి కోలుకున్నారని శుక్రవారం సాయంత్రం కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. కరోనా బాధితుల్లో 55 మంది విదేశీయులున్నారని తెలిపింది. శుక్రవారం నాటికి ఉత్తరప్రదేశ్‌లో 172, తమిళనాడులో 309, రాజస్తాన్‌లో 167, కర్నాటకలో 124, మధ్యప్రదేశ్‌లో 104, గుజరాత్లో 95, జమ్మూకశ్మీర్‌లో 75, పశ్చిమబెంగాల్లో 63, బిహార్‌లో 29 కేసులు నమోదయ్యాయి. కాగా, కరోనా హాట్‌స్పాట్స్‌గా గుర్తించిన ప్రాంతాలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక ఐసోలేషన్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. అలాగే, అక్కడి అనుమానితులపై కరోనా నిర్ధారణ పరీక్షలు జరపడాన్ని వేగవంతం చేశారు. గత రెండు రోజులుగా దేశవ్యాప్తంగా నమోదైన కేసుల్లో 647 కేసులు ఢిల్లీలో జరిగిన తబ్లిగి జమాత్ మత కార్యక్రమంలో పాల్గొన్నవారికి సంబంధించినవేనని ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ వెల్లడించారు. -
మహమ్మారి కోరల్లో 724 మంది
న్యూఢిల్లీ: దేశంలో శుక్రవారం నాటికి కరోనా మహమ్మారి బారిన పడ్డ వారి సంఖ్య 724కు పెరిగిపోయింది. గత 24 గంటల్లో మరో ఏడుగురు కోవిడ్ కారణంగా ప్రాణాలు కోల్పోవడంతో మృతుల సంఖ్య 17కు చేరుకుందని కేంద్రం తెలిపింది. మహారాష్ట్రలో గత 24 గంటల్లో నలుగురు ప్రాణాలు కోల్పోయారని ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ విలేకరులతో అన్నారు. కర్ణాటకలో ఇప్పటివరకూ ఇద్దరు మరణించగా మధ్యప్రదేశ్, తమిళనాడు, బిహార్, పంజాబ్, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, జమ్మూకశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్‌లలో ఒకొక్కరు చొప్పున కరోనాకు బలైన విషయం తెలిసిందే. వ్యాధి బాధితుల్లో 47 మంది విదేశీయులు కాగా, 66 మందికి నయమై డిశ్చార్జ్ అయ్యారు. ఒక్క వ్యక్తి ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయాడని, దీంతో దేశం మొత్తమ్మీద చికిత్స పొందుతున్న కరోనా బాధితుల సంఖ్య 640 అయ్యిందని ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ వ్యాధి చికిత్సకు మందులు అభివృద్ధి చేసేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ చేపట్టనున్న సాలిడారిటీ ట్రయల్‌లో భారత్ కూడా భాగస్వామి కానుందని లవ్ అగర్వాల్ తెలిపారు. కరోనా బాధితుల సంఖ్య అనూహ్యంగా పెరిగిపోయినా వైద్య పరికరాల కొరత రాకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు లవ్ అగర్వాల్ తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థ నుంచి 10వేల వెంటిలేటర్ల కొనుగోలుకు ఆర్డర్లు ఇచ్చామని, వీటికి అదనంగా మరో 30 వేల వెంటిలేటర్లను రానున్న ఒకట్రెండు రోజుల్లో తయారు చేయాల్సిందిగా భారత్ ఎలక్ట్రానిక్స్‌ను కోరామన్నారు. వలస కార్మికులకు ఆహారం, నీరు, పారిశుధ్య సౌకర్యాలు అందించేందుకు అన్ని చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాలను అభ్యర్థించామని, హోటళ్లు, హాస్టళ్ల వంటివి తెరిచే ఉండాలని, తమ కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉండాలని హోం శాఖ జాయింట్ సెక్రటరీ పుణ్యసలిల శ్రీవాస్తవ తెలిపారు. వలస కార్మికులను రాష్ట్రాల నుంచి వారి స్వస్థలాలకు తరలించే ఆలోచన ఏదీ లేదని ఆమె స్పష్టం చేశారు. రోగులకు వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం టెలీమెడిసిన్ వినియోగంపై మార్గదర్శకాలను రూపొందించిందన్నారు. గడచిన రెండు నెలల్లో విదేశాల నుంచి భారత్‌కు వచ్చిన వారు సుమారు 15 లక్షల మంది ఉన్నారని కేంద్ర కేబినెట్ సెక్రటరీ రాజీవ్ గాబా తెలిపారు. కరోనా నేపథ్యంలో వీరందరినీ కచ్చితంగా పరిశీలించేందుకు నిఘా వ్యవస్థలను పటిష్టీకరించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులకు రాసిన లేఖలో స్పష్టం చేశారు. కరోనా వైరస్ కట్టడి విషయంలో సార్క్ దేశాలన్నింటికీ ఒక ఉమ్మడి ఎలక్ట్రానిక్ వేదికను ఏర్పాటు చేయాలని భారత్ ప్రతిపాదించింది. సార్క్ దేశాల ఆరోగ్య శాఖల ఉన్నతాధికారులతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఈ ప్రతిపాదన చేసింది. అతిక్రమించిన అధికారులపై చర్యలు.. లాక్డౌన్ నిబంధనలను అతిక్రమిస్తున్న అధికారులపై ప్రభుత్వాలు కొరడా ఝళిపిస్తున్నాయి. తెలంగాణలో తన కుమారుడి అంతర్జాతీయ ప్రయాణ వివరాలను దాచి ఉంచినందుకు ఓ డీఎస్పీపై చర్యలు తీసుకున్నట్టుగానే కేరళలో ఓ ఐఏఎస్ అధికారిపై, ఢిల్లీలో ఓ పోలీస్ అధికారిపై ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి. ఇటీవలే విదేశాల్లో హనీమూన్ జరుపుకుని వచ్చిన యువ ఐఏఎస్ అధికారి, కొల్లం సబ్ కలెక్టర్ అనుపమ్ మిశ్రాపై నిబంధనల ఉల్లంఘనకు గాను పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అలాగే, వలస కార్మికులను వారి స్వస్థలాలకు తరలించేందుకు ప్రయత్నించిన రైల్వే పోలీస్ అధికారిని అధికారులు సస్పెండ్ చేశారు. పంజాబ్‌లోని మొహాలీలో మాస్కులు, శానిటైజర్లను అధిక ధరలకు అమ్ముతున్న ఓ కెమిస్టును విజిలెన్స్ అధికారులు అరెస్టు చేశారు. మా విమానాలు వాడుకోండి... భారతీయ పౌరులను దేశంలోకి తిరిగి తీసుకొచ్చేందుకు, అత్యవసర సేవల కోసం తమ విమానాలు, సిబ్బంది, విమానాశ్రయ ఉద్యోగులను వాడుకోవచ్చునని ప్రైవేట్ విమానయాన సంస్థ గో ఎయిర్ శుక్రవారం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదించింది. ఇండిగో కూడా ఇటీవలే ఇలాంటి ప్రతిపాదన చేసిన విషయం తెలిసిందే. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రయాణికుల విమాన సర్వీసులపై నిషేధం ఉండగా.. సరుకుల రవాణా చేసేవి మాత్రం యథావిధిగా చేయవచ్చు. అయితే ఇండిగో, గో ఎయిర్ లాంటి దేశీ విమానయాన సంస్థలు ప్రయాణికుల్లేకుండా, కేవలం సరుకులు మాత్రమే రవాణా చేసేందుకు కేంద్రం అనుమతులు ఇవ్వాల్సి ఉంది. ఉపరాష్ట్రపతి ఒక నెల వేతనం సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడంతోపాటు, లాక్డౌన్ సందర్భంగా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న సహాయ కార్యక్రమాలకు మద్దతుగా ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు తన ఒక నెల వేతనాన్ని ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధికి విరాళంగా ప్రకటించారు. షిర్డీ సాయి సంస్థాన్ రూ.51 కోట్ల విరాళం సాక్షి ముంబై: కరోనా వైరస్‌పై పోరాటంలో మహారాష్ట్ర సర్కారును ఆదుకునేందుకు షిర్డీ సాయి సంస్థాన్ ముందుకు వచ్చింది. ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.51 కోట్ల విరాళం ప్రకటించింది. ‘రాష్ట్రంలో కరోనా వైరస్ తీవ్ర రూపం దాలుస్తోంది. ఇప్పటికే అయిదుగురు మృతి చెందగా, 120 మందికిపైగా బాధితులున్నారు. ఈ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు షిర్డీ సాయి సంస్థాన్ సీఈఓ అరుణ్ డోంగరే పేర్కొన్నారు. గవర్నర్లతో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి వీడియో కాన్ఫరెన్స్ సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వ్యాధి విస్తరిస్తున్న విపత్కర పరిస్థితుల్లో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ప్రథమ పౌరులుగా ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయడంలో, రాష్ట్ర ప్రభుత్వాలకు సరైన మార్గదర్శనం చేయడంలో గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లు పోషించే పాత్ర కీలకమని రాష్ట్రపతి కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. శుక్రవారం వారు సంయుక్తంగా గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. కరోనా మహమ్మారిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న పోరాటంలో భాగంగా చేపడుతున్న కార్యక్రమాలు, ప్రజలను చైతన్య పరిచే విషయాల్లో చొరవతీసుకోవాలని సూచించారు. ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటుచేసిన ఆహారపంపిణీ కేంద్రం వద్ద కొట్లాడుతున్న నిరాశ్రయులు నిర్మానుష్యంగా మారిన కేరళలోని మెప్పుయుర్ రోడ్డుపై పునుగుపిల్లి -
నిలకడగా వైరస్ వేగం
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారికి దేశంలో మరో నలుగురు బలయ్యారు. కేవలం ఒక్క రోజులోనే తాజాగా 82 కొత్త కేసులు నమోదవడంతో దేశవ్యాప్తంగా కోవిడ్–19 బాధితుల సంఖ్య 694కు చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. భారత్‌లో కేసుల పెరుగుదల ఇతర దేశాలతో పోలిస్తే నిలకడగా ఉందని స్పష్టం చేసింది. దేశంలో వైరస్ వ్యాప్తి ఇప్పటికీ రెండో దశలోనే ఉందని, మూడో దశలో మాదిరిగా సామాజిక వ్యాప్తి జరుగుతోందనేందుకు ఎలాంటి ఆధారాలు లేవని కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. ఇదిలా ఉండగా కరోనా వైరస్ కొత్త కొత్త ప్రాంతాలకు విస్తరిస్తున్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలు పలు చర్యలు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాయి. దేశంలో రోజు రోజుకూ కేసుల సంఖ్య పెరుగుతున్న మాట నిజమే అయినప్పటికీ వేగం మాత్రం కొంచెం నిలకడగా ఉందని.. కొంతమేరకు తగ్గిందని కూడా చెప్పవచ్చునని లవ్ అగర్వాల్ తెలిపారు. అయినప్పటికీ సామాజిక దూరం పాటించడం, వ్యాధి బారిన పడ్డ వారు సన్నిహితంగా మెలిగిన వారిని గుర్తించడం, ప్రజలందరూ ఇళ్లలోనే క్వారంటైన్లో ఉండటం చాలా కీలకమని స్పష్టం చేశారు. ఈ పద్ధతులను కచ్చితంగా కొనసాగిస్తేనే కరోనాపై విజయం సాధించవచ్చునని అన్నారు. ఇప్పటివరకూ 16 మరణాలు.. కరోనా కారణంగా దేశం మొత్తమ్మీద ఇప్పటివరకూ 16 మరణాలు సంభవించాయి. మొత్తం కేసులు 694 కాగా ఇందులో 42 మందికి వ్యాధి నయమైపోయిందని, ఒక్కరు ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారని అధికారులు చెప్పారు. మొత్తం కేసుల్లో 47 మంది విదేశీయులు కూడా ఉన్నారు. మహారాష్ట్రలో అత్యధికంగా 124 కేసులు ఉండగా వీరిలో ముగ్గురు విదేశీయులు. కేరళలో 8 మంది విదేశీయులతో కలిపి కరోనా బాధితుల సంఖ్య 118కి చేరుకుంది. కర్ణాటకలో 41 కేసులు ఉన్నాయి. గుజరాత్ విషయానికి వస్తే ఒక విదేశీయుడితో కలిపి 38 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీలో రెండు రోజుల పాటు ఏ కేసులు నమోదుకానప్పటికీ బుధవారం కొన్ని కొత్త కేసులు బయటపడటంతో ఒక విదేశీయుడితో కలిసి 35 మంది వ్యాధి బారిన పడినట్లు తెలుస్తోంది. పంజాబ్‌లో మొత్తం 33 కేసులు నమోదు కాగా, హరియాణాలో 30 కేసులు ఉన్నాయి. ఒడిశాలో రెండు కేసులు బయటపడ్డాయి. 17 రాష్ట్రాల్లో ప్రత్యేక ఆసుపత్రులు కరోనా వైరస్ బాధితులను ఎదుర్కొనేందుకు దేశంలోని పదిహేడు రాష్ట్రాల్లో ప్రత్యేకంగా ఆసుపత్రులను కేటాయిస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ గురువారం ప్రకటించింది. దేశంలో సామాజిక కరోనా వ్యాప్తిపై ఇప్పటివరకూ ఎలాంటి ఆధారాలు లేవని ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. దోమల ద్వారా ఈ వైరస్ వ్యాప్తి చెందుతుందన్నదాంట్లోనూ వాస్తవం లేదని స్పష్టం చేశారు. ఇంటివద్దకే మందులు... కోవిడ్–19 వ్యాధి వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రజల కదలికలను నియంత్రించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఇంటివద్దకే మందులు సరఫరా అయ్యేందుకు అవకాశం కల్పించింది. ఈమేరకు ఆరోగ్య శాఖ మెడికల్ రీటెయిలర్లకు ఒక నోటిఫికేషన్‌ను జారీ చేసింది. మందులకు సంబంధించిన బిల్లులను ఈమెయిల్ ద్వారా లైసెన్సుదారుడు పంపాల్సి ఉంటుందని తెలిపింది. విమానాలపై 14 వరకూ నిషేధం అన్ని అంతర్జాతీయ ప్యాసింజర్ విమానాలపై విధించిన నిషేధాన్ని ఏప్రిల్ 14 వరకూ పొడిగిస్తూ పౌరవిమానయాన శాఖ డైరెక్టర్ జనరల్ ఆదేశాలు జారీ చేశారు. అయితే, సరుకు రవాణా విమానాలకు ఈ నిషేధం వర్తించదని స్పష్టం చేసింది. కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో అంతర్జాతీయ విమానాలపై మార్చి 23వ తేదీ నుంచి మార్చి 29వ తేదీ వరకూ నిషేధించిన విషయం తెలిసిందే. -
కరోనాతో జాగ్రత్త...
-
కేంద్ర సర్వీసులకు గిరిధర్, లవ్ అగర్వాల్
-కేంద్ర కేబినెట్ సెక్రటేరియట్లో సంయుక్త కార్యదర్శిగా గిరిధర్ నియామకం -రిలీవ్ చేయమని సీఎస్‌కు గిరిధర్ దరఖాస్తు సాక్షి, హైదరాబాద్ రాష్ట్ర సర్వీసు నుంచి ఇద్దరు సీనియర్ ఐఏఎస్ అధికారులు కేంద్ర సర్వీసుకు వెళ్లిపోతున్నారు. ప్రస్తుతం రాష్ర్ట పబ్లిక్ సర్వీసు కమిషన్ కార్యదర్శిగా పనిచేస్తున్న 1988 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన ఎ. గిరిధర్‌ను కేంద్ర కేబినెట్ సెక్రటేరియట్లో సంయుక్త కార్యదర్శిగా కేంద్ర ప్రభుత్వం నియమించింది. దీంతో రాష్ట్ర సర్వీసు నుంచి రిలీవ్ అయ్యి కేంద్ర సర్వీసుకు వెళ్లిపోవాలని గిరిధర్ నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగానే రాష్ట్ర సర్వీసు నుంచి రిలీవ్ చేయాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సోమవారం గిరిధర్ దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్ర విభజన సమయంలో గిరిధర్ కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖలో సంయుక్త కార్యదర్శిగా పనిచేస్తున్నారు. అయితే రాష్ట్రం విడిపోయిన నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరిక మేరకు కేంద్ర సర్వీసు నుంచి ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేసేందుకు రాష్ట్ర సర్వీసుకు గిరిధర్ వచ్చారు. విభజన క్లిష్ట సమయంలో గిరిధర్ ముఖ్యమంత్రి ముఖ్యకార్యదర్శిగా కీలక బాధ్యతలను నిర్వహించారు. రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడి పనిచేశారు. అయితే చెప్పుడు మాటలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి గిరిధర్‌ను మున్సిపల్ శాఖకు బదిలీ చేశారు. మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శిగా కూడా గిరిధర్ సింగపూర్ ప్రభుత్వం, అక్కడ కంపెనీలతో రాజధాని మాస్టర్ ప్రణాళిక రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు. అయితే సింగపూర్ ప్రైవేట్ కంపెనీలు చెప్పినట్లు చేసేందుకు, ముఖ్యంగా మున్సిపల్ మంత్రి నారాయణ చెప్పినట్లు చేసేందుకు గిరిధర్ అంగీకరించలేదు. ఇక మున్సిపల్ శాఖలో పనిచేసే వాతావరణం లేదని గిరిధర్ అక్కడి నుంచి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఆయనను పబ్లిక్ సర్వీసు కమిషన్ కార్యదర్శిగా బదిలీ చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి గిరిధర్ కేంద్ర సర్వీసుకు వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు. ఇప్పుడు మార్గం సుగమమైంది. మరో సీనియర్ ఐఏఎస్ అధికారి 1996 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన లవ్ అగర్వాల్ కూడా కేంద్ర సర్వీసుకు వెళ్లిపోతున్నారు. అగర్వాల్ ప్రస్తుతం విపత్తుల శాఖ కమిషనర్‌గా పనిచేస్తున్నారు. ఇంతకు ముందు అగర్వాల్ గృహ నిర్మాణ శాఖ ముఖ్యకార్యదర్శిగా పనిచేశారు. ప్రభుత్వం ఇటీవల ఆయనను విపత్తుల శాఖ కమిషనర్‌గా బదిలీ చేసింది. లవ్ అగర్వాల్‌ను కేంద్ర ప్రభుత్వం వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ సంయుక్త కార్యదర్శిగా నియమించింది. దీంతో అగర్వాల్ కూడా రాష్ట్ర సర్వీసు నుంచి కేంద్ర సర్వీసుకు వెళ్లిపోనున్నారు. -
కాకి లెక్కలు చెప్పొద్దు
జిల్లా వైద్యారోగ్య అధికారులతో సమీక్ష విశాఖపట్నం: ‘కాకి లెక్కలు చెప్పొద్దు... ఇదే విధంగా పనిచేస్తే తర్వాత బాధపడతారు... ఇప్పటికైనా పద్ధతి మార్చుకోండి’ అంటూ వైద్యారోగ్య శాఖ అధికారులపై వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి లవ్ అగర్వాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో వైద్యారోగ్య శాఖ పనితీరుపై సోమవారం రాత్రి ఆయన సమీక్ష జరిపారు. జిల్లాలో చేపడుతున్న కార్యక్రమాలపై కొందరు అధికారులు పొంతన లేని లెక్కలు చెప్పడంతో ఆయన మండిపడ్డారు. ఇమ్యూనైజేషన్ 90 శాతం పూర్తి చేశామని చెబుతున్నా వాస్తవంగా 60 శాతం కూడా జరగలేదని, అయినా ఎందుకు లెక్కల్లో ఎక్కువ చూపుతున్నారని ప్రశ్నించారు. మలేరియా, డయేరియా నియంత్రణకు చేపడుతున్న చర్యలపై చర్చించారు. వచ్చే నెల 15 నుంచి దోమల నివారణకు స్ప్రే మొదలుపెట్టాలని ఆదేశించారు. ప్రసవం ప్రమాదం అయ్యే గర్భిణులను ముందుగానే గుర్తించి స్థానిక ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించాలన్నారు. 108, 104, ఆరోగ్యశ్రీ సేవల పనితీరుపైనా ఆయన సమీక్షించారు. ఈ సమావేశంలో వైద్య ఆరోగ్యశాఖ రీజనల్ డెరైక్టర్ ఎన్.వి.సోమరాజు, రీజనల్ మలేరియా అధికారి జి.సావిత్రి, జిల్లా వైద్యారోగ్య అధికారి జె.సరోజిని పాల్గొన్నారు. -
‘టి’ బడ్జెట్లో క్రీడలకు పెద్దపీట: లవ్ అగర్వాల్
ఎల్బీ స్టేడియం: తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో క్రీడలకు పెద్దపీట వేయనున్నట్లు క్రీడలు, యువజన సర్వీసుల శాఖ ముఖ్య కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. శుక్రవారం సచివాలయంలో తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ (టీఎస్ఏ) అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. బడ్జెట్లో క్రీడలకు కేటాయింపులు, పలు ప్రతిపాదనలపై ఆయన ఈ సందర్భంగా చర్చించారు. రాష్ట్రంలో అమలవుతున్న క్రీడ పథకాలు, నూతనంగా నిర్మించనున్న స్పోర్ట్స్ హాస్టళ్లు, ఆధునిక క్రీడా సామాగ్రి కొనుగోలుకు కావాల్సిన బడ్జెట్ సిద్ధం చేయాలని అధికారులను లవ్ అగర్వాల్ ఆదేశించారు. వచ్చే రాష్ట్ర బడ్జెట్లో హైదరాబాద్‌లో వాటర్ స్పోర్ట్స్ కోసం ఆధునిక వాటర్ బోట్స్, షూటింగ్ రే ంజ్లో కొత్త ఆయుధాల కోసం సంబంధిత అధికారులు ప్రతిపాదనలు పంపాలని ఆయన సూచించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు స్వప్నమైన ‘బంగారు తెలంగాణ’లో భాగంగా రాష్ట్రంలో అత్యున్నత ప్రమాణాలతో, అధునాతన సదుపాయాలతో తెలంగాణ క్రీడా విశ్వవిద్యాలయం ఏర్పాటుకు అవసరమైన ప్రతిపాదనలు కూడా సిద్ధం చేయాలని లవ్ అగర్వాల్ క్రీడాధికారులను ఆదేశించారు. మన ఊరు-మన ప్రణాళికనూ రూపొందించాలన్నారు. ఇందులో భాగంగా జిల్లాల్లో మెరుగైన మౌలిక సదుపాయాలు, రాణించిన క్రీడాకారులకు నగదు ప్రోత్సాహకాలు ఇవ్వడం, కొత్తగా కోచ్‌లు, ఉద్యోగుల నియామకాలు, క్రీడాసంఘాలకు నిధుల కేటాయింపులో ప్రాధాన్యత ఇస్తామని ఆయన చెప్పారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు పక్కదారి పట్టకుండా సమర్థంగా అమలు చేయాలని సూచించారు.