సాక్షి, న్యూఢిల్లీ: ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లో కరోనా వైరస్ అదుపులో ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. అయితే పెరుగుతున్న కరోనా కేసులకు అనుగుణంగానే కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఆయన ఆదివారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. గత 24 గంటల్లో 909 కేసులు నమోదు కాగా, 34మంది మృతి చెందినట్లు తెలిపారు. (కరోనా: భారత్ నుంచి 444 మంది స్వదేశాలకు)
దేశవ్యాప్తంగా 8,356 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఇప్పటివరకూ 273 మరణాలు సంభవించినట్లు చెప్పారు. 1.80 లక్షల శాంపిల్స్‌ను టెస్ట్ చేశామని, ప్రతి రోజు 15వేల మందికి రక్త నమునాల పరీక్షలు జరుపుతున్నట్లు లవ్ అగర్వాల్ వెల్లడించారు. అలాగే151 ప్రభుత్వ ల్యాబ్‌ల్లో కరోనా పరీక్షలు చేస్తున్నట్లు తెలిపారు. ఇక ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లో కరోనా నియంత్రణలో ఉందని, కరోనా వచ్చిన వారిని, కలిసిన వారిని గుర్తించే ప్రక్రియ కొనసాగుతోందని ఆయన పేర్కొన్నారు. అందరి సహకారంతో కరోనా మహమ్మారిని ఎదుర్కొంటామని ఆయన తెలిపారు. (కరోనా గండం గట్టెక్కుతోంది..)
కరోనాను అంతం చేసేందుకు అవసరమైన వ్యాక్సిన్ తయారీ పరిశోధనలు కొనసాగుతున్నాయని లవ్ అగర్వాల్ చెప్పారు. ప్రస్తుతం 40కిపైగా వ్యాక్సిన్లు అభివృద్ధి దశలో ఉన్నాయన్నారు. కరోనా బాధితులకు వైద్య సేవలు అందించడానికి 20 వేల రైల్వే కోచ్‌లను ఐసోలేషన్ వార్డులుగా మార్చనున్నట్లు ఉద్ఘాటించారు. తొలి దశలో ఇప్పటికే 5 వేల కోచ్‌లను ఐసోలేషన్ వార్డులుగా మార్చినట్లు తెలిపారు.
ఇక కరోనా సంబంధిత మరణాల్లో మహారాష్ట్ర అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఈ రాష్ట్రంలో ఇప్పటికే 127 మంది బలయ్యారు. మధ్యప్రదేశ్‌లో 36 మంది, గుజరాత్‌లో 22 మంది, ఢిల్లీలో 19, పంజాబ్‌లో 11 మంది, తమిళనాడులో 10 మంది మరణించారు. అత్యధికంగా మహారాష్ట్రలో 1,761 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలో 1,069, తమిళనాడులో 969, రాజస్థాన్‌లో 700, మధ్యప్రదేశ్‌లో 532, ఉత్తరప్రదేశ్‌లో 452, కేరళలో 364, గుజరాత్‌లో 432, కర్ణాటకలో 214, జమ్మూకశ్మీర్‌లో 207, పంజాబ్‌లో 151, పశ్చిమబెంగాల్‌లో 124 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
కాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న (శనివారం) అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన విషయం తెలిసిందే. లాక్‌డౌన్‌ను కనీసం 2 వారాలైనా కొనసాగించేందుకు దాదాపు అన్ని రాష్ట్రాలు ఏకాభిప్రాయం వ్యక్తం చేశాయి. దీంతో ఏప్రిల్ 14వ తేదీ తరువాత కూడా లాక్‌డౌన్‌ను కొనసాగించేందుకు కేంద్రం సిద్ధమవుతోంది.
కరోనా వైరస్ 210 దేశాలకు వ్యాపించగా 17.90 లక్షలకుపైగా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా 1.09 లక్షల మంది ఈ రక్కసి బారినపడి ప్రాణాలు కోల్పోయారు. అలాగే 4.09 లక్షల మంది కరోనా నుంచి కోలుకుంటున్నారు. అమెరికాలో 5.33 లక్షల కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, మృతుల సంఖ్య 20,580కి చేరింది.
- స్పెయిన్‌లో 1,66,019 పాజిటివ్ కేసులు, 16,972 మంది మృతి
- ఇటలీలో 1,52,271 పాజిటివ్ కేసులు, 19,468 మంది మృతి
- ఫ్రాన్స్‌లో 1,29,654 పాజిటివ్ కేసులు, 13,832 మంది మృతి
- జర్మనీలో 1,25,452 పాజిటివ్ కేసులు, 2,871 మంది మృతి
- చైనాలో 82,052 కరోనా కేసులు, 3,339 మంది మృతి
- యూకేలో 78,991 పాజిటివ్ కేసులు, 9,875 మంది మృతి
- ఇరాన్‌లో 70,029 పాజిటివ్ కేసులు, 4,357 మంది మృతి
- టర్కీలో 52,167 పాజిటివ్ కేసులు, 1,101 మంది మృతి
- బెల్జియంలో 29,647 పాజిటివ్ కేసులు, 3,600 మంది మృతి
- స్విట్జర్లాండ్‌లో 25,300 పాజిటివ్ కేసులు, 1,036 మంది మృతి
- నెదర్లాండ్స్‌లో 24,413 పాజిటివ్ కేసులు, 2,643 మంది మృతి
Comments
Please login to add a commentAdd a comment