
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. గురువారం నాటికి భారత్‌లో మొత్తం 21,393 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా కొత్తగా 1409 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. మరోవైపు దేశంలో ఇప్పటివరకు 681 మంది మృతి చెందగా.. 4,257 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. (లాక్‌డౌన్ నుంచి పలు షాపులకు మినహాయింపులు)
ఈ మేరకు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ గురువారం మీడియా సమవేశం ద్వారా వివరాలను వెల్లడించారు. దేశంలో ప్రస్తుతం 16,454 యాక్టివ్ కేసులు ఉన్నాయన్నారు.14 రోజులుగా 78 జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదని తెలిపారు. 28 రోజులుగా 12 జిల్లాల్లో ఒక్క కేసూ నమోదు కాలేదని వివరించారు. కంటైన్‌మెంట్ ద్వారానే కరోనా వ్యాప్తిని నియంత్రించగలిగామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment