సాక్షి, న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 15,712కి చేరింది. అలాగే గడిచిన 24 గంటల్లో 27 మరణాలు చేటుచేసుకున్నాయి. దీంతో దేశంలో కరోనా మరణాల సంఖ్య 507కి చేరింది. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ హెల్త్ బులిటిన్ విడుదల చేశారు. ఇప్పటి వరకు 3.86 లక్షల మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని ఆయన తెలిపారు. దేశవ్యాప్తంగా కరోనా నుంచి కోలుకున్న 2,230 మంది డిశ్చార్జ్ అయ్యారని వెల్లడించారు. దేశంలో ప్రస్తుతం 12,974 యాక్టివ్ కేసులు ఉన్నాయన్నారు. అలాగే గడిచిన 14 రోజులుగా 43 జిల్లాల్లో కొత్త కరోనా పాజిటివ్ కేసులు లేవని ల వ్‌అగర్వాల్ స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment