న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి రోజురోజుకు కోరలు చాస్తోంది. భారత్‌లో కూడా కరోనా కేసుల పెరుగుదల ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. దేశవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులపై కేంద్ర ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. కాగా.. గడిచిన 24 గంటల్లో 51 కరోనా మరణాలు సంభవించాయి. దీంతో ఇప్పటి వరకు కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 324కు చేరింది.
తాజాగా మరో 905 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో.. దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 9,352కు చేరుకున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. వీరిలో 979 మంది కరోనా మహమ్మారి నుంచి కోలుకొని డిశ్చార్జి అయినట్లు తెలిపింది. ఆరోగ్యశాఖ హెల్త్ సెక్రటరీ లవ్ అగర్వాల్ మాట్లాడుతూ.. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 2 లక్షల 6 వేల మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. టెస్టింగ్ కిట్లు కూడా మరో 6 వారాలకు సరిపోయేలా అందుబాటులో ఉన్నట్లు అగర్వాల్ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment