జిల్లా వైద్యారోగ్య అధికారులతో సమీక్ష
విశాఖపట్నం: ‘కాకి లెక్కలు చెప్పొద్దు... ఇదే విధంగా పనిచేస్తే తర్వాత బాధపడతారు... ఇప్పటికైనా పద్ధతి మార్చుకోండి’ అంటూ వైద్యారోగ్య శాఖ అధికారులపై వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి లవ్ అగర్వాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో వైద్యారోగ్య శాఖ పనితీరుపై సోమవారం రాత్రి ఆయన సమీక్ష జరిపారు. జిల్లాలో చేపడుతున్న కార్యక్రమాలపై కొందరు అధికారులు పొంతన లేని లెక్కలు చెప్పడంతో ఆయన మండిపడ్డారు. ఇమ్యూనైజేషన్ 90 శాతం పూర్తి చేశామని చెబుతున్నా వాస్తవంగా 60 శాతం కూడా జరగలేదని, అయినా ఎందుకు లెక్కల్లో ఎక్కువ చూపుతున్నారని ప్రశ్నించారు.
మలేరియా, డయేరియా నియంత్రణకు చేపడుతున్న చర్యలపై చర్చించారు. వచ్చే నెల 15 నుంచి దోమల నివారణకు స్ప్రే మొదలుపెట్టాలని ఆదేశించారు. ప్రసవం ప్రమాదం అయ్యే గర్భిణులను ముందుగానే గుర్తించి స్థానిక ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించాలన్నారు. 108, 104, ఆరోగ్యశ్రీ సేవల పనితీరుపైనా ఆయన సమీక్షించారు. ఈ సమావేశంలో వైద్య ఆరోగ్యశాఖ రీజనల్ డెరైక్టర్ ఎన్.వి.సోమరాజు, రీజనల్ మలేరియా అధికారి జి.సావిత్రి, జిల్లా వైద్యారోగ్య అధికారి జె.సరోజిని పాల్గొన్నారు.
కాకి లెక్కలు చెప్పొద్దు
Published Tue, Mar 24 2015 2:53 AM | Last Updated on Sat, Sep 2 2017 11:16 PM
Advertisement
Advertisement