
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పటి వరకే దేశ వ్యాప్తంగా మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 13,387కి చేరింది. మృతుల సంఖ్య 437కి పెరిగింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,007 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 23 మంది మృతి చెందారు. మరోవైపు ఇప్పటి వరకు వైరస్ నుంచి కోలుకుని 1749 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి లవ్ అగర్వాల్ శుక్రవారం హెల్త్ బులెటిన్ విడుదల చేశారు.
మరోవైపు కరోనా బారిన పడివారిలో దాదాపు 80శాతం మంది కోలుకుంటున్నారని లవ్ అగర్వాల్ తెలిపారు. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 266మందికి పైగా పూర్తిగా కోలుకుని డిశ్చార్జ అయ్యారని వెల్లడించారు. ఇక దేశ వ్యాప్తంగా అమలవుతున్న లాక్‌డౌన్ కారణంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేవని అన్నారు. అన్ని ప్రాంతాల్లో నిత్యావసర వస్తువుల అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. వైరస్ వ్యాప్తి నియంత్రణకు అమలు చేస్తున్న లాక్‌డౌన్ వల్ల సత్ఫలితాలు వస్తున్నాయన్నారు.
Comments
Please login to add a commentAdd a comment